Tuesday, December 7, 2010

ఏ పుస్తకమైనా ఏ గ్రంథమైనా నాకు

ఏ పుస్తకమైనా ఏ గ్రంథమైనా నాకు ఓ ఆలోచనతో లేదా ఓ భావనతో సమానం
ఏ పుస్తకాన్ని ఏ గ్రంధాన్ని పూర్తిగా చదవలేము వాటి భావాలను తెలుసుకోలేము
కొన్ని సందర్భాలలో కొన్ని పుస్తకాలను సులువుగా ఉండేవి పూర్తిగా చదవలము
శాస్త్రీయ భాషకు సంబంధించిన పుస్తకాలను పూర్తిగా చదవలేము అర్థం చేసుకోలేము
నేడు గ్రంథాలయాలలో కొన్ని ఇండ్లలో ఎన్నో వేల లక్షల కోట్ల పుస్తకాలు ఉన్నాయి
ఏ పుస్తకాలలో ఏ విజ్ఞాన శాస్త్రీయ సిద్దాంతాలున్నాయో ఏ మేధస్సుకు ఎరుకనో
సృష్టిలో ఆనాటి నుండి ఈ నాటి వరకు ప్రతి పుస్తక గ్రంథాన్ని నాలో ఆలోచనగా ఉంచా
ప్రతి శాస్త్రీయ సూత్ర సిద్దాంతాల గ్రంధాలను భావాలుగా నా మేధస్సులో దాచుకున్నా
శరీర మేధస్సు నశించినా ఆత్మ ఎరుకలో చేరే విధంగా విశ్వ ధ్యాసతో ఉన్నాను
రాబోయే భవిష్య కాల యుగాల విశ్వ విజ్ఞాన పుస్తకాలను ఆత్మాలోచనలతో స్వీకరిస్తాను

No comments:

Post a Comment