ఆలయాన్ని దర్శించిన పరిశుద్ధమైన భక్తున్ని చూసి భగవంతుడు [మహాత్ముడు] ఇలా తలిచాడు
శిల్పమై నేను మహాత్ముని రూపంలో నిశ్చలమై ఎంతో కాలంగా ఎన్నో యుగాలుగా ఆలయ గర్భంలోనే ఒదిగివున్నాను
నాలో ఎటువంటి కదలికలు లేక భావ తత్వములు కూడా కలగని విధంగా అనంత భక్తులకు అవతార విగ్రహ స్వరూపమై దర్శనమిస్తూ అర్చకుల మంత్రములను మేధస్సులోని పై పై పొరలలో గమనిస్తూ సుధీర్ఘంగా నిలిచిపోయాను
నేను జీవించుటలో సృష్టించుకున్న విశ్వ నిర్మాణములను ప్రయాణించిన ప్రదేశాలను దర్శించలేక పోతున్నాను
నాతో జీవించిన వారి జీవుల బంధాలను చూడలేకపోతున్నాను పలకరించలేకపోతున్నాను
విశ్వ బ్రంహాండంలో ఉన్న అన్నింటిని సరిచేయుటకు పరిశుద్ధంగా పవిత్రంగా మార్చుటకు జీవుల బంధాలను ఆరోగ్యాంగా ఉంచుటకు విగ్రహ రూపమైన నాకు అవకాశం లేకున్నది
ప్రకృతిని అభివృద్ధి చేయుటకు మహోన్నతమైన కార్యాలతో పరిశుద్ధమైన వాతావరణాన్ని పర్యావరణాన్ని పత్రహరితాన్ని ప్రతి జీవికి అందేలా చూసుకోవాలి
** నా కోసం ఒక్క రోజు నీవు నాలా విగ్రహ రూపంలో నిమగ్నమై నా స్వరూపంతోనే ఉండగలవా అని మహాత్ముడు పరిశుద్ధమైన భక్తునికి ఒక భావన కలిగించాడు
పరిశుద్ధమైన భక్తులకు అంతమైన భావ తత్వాల విజ్ఞాన అవగాహన విచక్షణ ఉండడంతో ఓ మహా భక్తుడు మహాత్ముని భావాన్ని గమనించాడు తత్వాన్ని అవగాహన చేసుకున్నాడు
** భక్తుడు కూడా ఇలా భావించుకున్నాడు - సరే మహాత్మా! నేను నీలాగే ఒక రోజు సమయం నీ రూపాన్ని ధరించి ధన్యుడినై నీ జ్ఞాపకాల భావ తత్వాలతో జీవిస్తాను
** ఎవరు లేని సమయాన మహా మూహూర్తంలో బ్రంహ కాల సమయాన మహాత్ముని భక్తుని ఆత్మ బంధాలు దైవ తత్వంతో కలిసిపోయి పరమాత్మ భావ తత్వాలతో ఇరువురి ఆత్మలు మారిపోయి మహాత్ముడు భక్తుని రూపం అలాగే భక్తుడు మహాత్ముని రూపం ధరించారు
ఆ సమయం నుండి ఇద్దరికీ ఇతర విధాలుగా కాల సమయం సాగిపోతున్నది ఎవరన్నది జ్ఞాపకానికి తెలియకున్నది
భక్తుడు మహాత్ముని స్వరూపంతో నిశ్చలమై పర ధ్యాసతో దైవ ధ్యానంలో లీనమై దర్శనమిస్తున్నాడు
మహాత్ముడు భక్తుని స్వరూపంతో ఆలయ దర్శనంతో సాగుతూ భక్తుని ఇంటి (గృహం) వైపు ప్రయాణాన్ని సాగించాడు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment