ఆనాడు నీడ కోసం వృక్షాన్ని ఆశ్రయించు దానినే వసతిగా ఏర్పాటు చేసుకొని జీవితాన్ని సాగించావు
ఈనాడు [నేడు] నీడ కోసం గృహాన్ని నిర్మించుకొని అనేక వసతులను అందులోనే ఏర్పాటు చేసుకొని జీవితాన్ని సాగిస్తున్నావు
ఆనాడు వృక్షాన్ని వసతిగా ఏర్పాటు చేసుకొని ఆరోగ్యాంగా ప్రకృతి ప్రభావంతో శ్రమిస్తూ సమృద్ధితో జీవించావు
ఈనాడు గృహాన్ని వసతిగా ఏర్పాటు చేసుకొని అనారోగ్యంతో కృత్రిమ ప్రభావంతో శ్రమిస్తూ అసామర్థ్యంతో జీవిస్తున్నావు
ఆనాడు ప్రకృతి సౌకర్యాలతో ఆరోగ్యవంతమైన ఆయుస్సుతో శాతబ్దాలుగా సాగుతూ జీవితాలను సాగించేవారు
ఈనాడు కృత్రిమ సౌకర్యాలతో అనారోగ్యవంతమైన ఆయుస్సుతో దశాబ్దాలుగా సాగుతూ జీవితాలను సాగిస్తున్నారు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment