Friday, May 30, 2025

ప్రయాణించుటలో ప్రతి రోజు ప్రతి క్షణం ఎన్నో మార్గాలలో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో ప్రమాదాలు తప్పిపోతున్నాయి

ప్రయాణించుటలో ప్రతి రోజు ప్రతి క్షణం ఎన్నో మార్గాలలో [రహదారులలో] ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో ప్రమాదాలు తప్పిపోతున్నాయి 

వాహనాల చోదకుల కనుసైగలతోనే ఎన్నో ప్రమాదాలు ఎన్నో వాహనాల నుండి ఎన్నో రకాలుగా తప్పిపోతున్నాయి  

సమాజంలో ప్రయాణ విధానాలకు రహదారి నిర్మాణములకు ఒక విధమైన వ్యవస్థ పధ్ధతి సిద్ధాంతం సమృద్ధిగా పరిశుద్ధంగా లేదు  

కొన్ని ప్రమాదాలు జరుగుతూనే [వేగం మరుపు అజ్ఞానం అజాగ్రత్త ఆర్భాటం] ఉన్నాయి ప్రాణాలు పోతూనే ఉన్నాయి శరీర భాగాలు పోతూనే ఉన్నాయి ప్రమాదాలతో కలిగిన అవయవాల లోపాలతో అనారోగ్యంతో జీవిస్తూ కుటంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఎందరో జీవిస్తూనే ఉన్నారు 

ప్రమాదాలకు గురైన వారికి సరైన వైద్యం అందకపోవడం వల్ల ఎందరో మరణించారు అలాగే అంగవైకల్యంతో వివిధ రకాల ఇబ్బందులతో జీవిస్తున్నారు 

ప్రయాణించుటలో ఎదుటివారిని చుట్టుపక్కల వారిని రహదారిని వాతావరణాన్ని వినికిడిని చాలా విధాలుగా శ్రద్ధగా గమనిస్తూ జాగ్రత్తగా నెమ్మదిగా ఉత్తేజంతో విజ్ఞానంతో ఎవరికీ ఏ అపాయం కలగకుండా రహదారి సూచనలను పాటిస్తూ సాగిపోండి  

ప్రశాంతమైన ప్రయాణాన్ని సాగించండి ప్రయాణాన్ని కాస్త ముందుగా ప్రారంభించి శాంతంగా నిదానంగా వాహనాలను నడపండి సరైన సమయానికి సురక్షితంగా ప్రశాంతంగా గమ్యాన్ని చేరుకోండి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment