ప్రయాణించుటలో ఎంత జాగ్రత్త వహించినా చోదకుడు వాహనం నడిపే తీరు పైననే మనం గమ్యాన్ని చేరుకునే విధానం ఉంటుంది
వాహనం యొక్క యంత్ర స్థితి పైనను మనం గమ్యాన్ని చేరుకునే విధానం ఆధారపడి ఉంటుంది
రహదారిలో మనతో పాటు ప్రయాణిస్తూ వాహనాలను నడిపే చోదకుల విధానం [తీరు, రీతి] ద్వారా కూడా మనం గమ్యాన్ని చేరుకునే విధానం ఉంటుంది
వాతావరణ పరిస్థితి కూడా మనం గమ్యాన్ని చేరుకునేందుకు అనుకూలించాలి
ఏ వాహనానికి ఏ [మరో] వాహనం తగలకుండా అంటకుండా చోదకులు జాగ్రత్త వహించాలి [వాహనాన్ని నడిపే విధానం సురక్షితంగా ఉండాలి] - ప్రయాణిస్తున్నప్పుడు ప్రశాంతత, మెళకువ, సంతోషం, విజ్ఞానం, నమ్మకం, ఉత్తేజం, అవగాహన, ధైర్యం ఉండాలి
ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యంగా రహదారి నియమాలను తప్పకుండా పాటించాలి
ప్రయాణించుటలో రక్షక భటులను చూస్తే భయపడకూడదు [భయపడితే గుండే వేగం పెరిగి వాహనం అదుపు తప్పుతుంది ప్రమాదానికి గురి చేస్తుంది]
రక్షక భటులు అనవసరంగా వాహనాలను ఆపుతూ అనవసరమైన ధనాన్ని వసూలు చేస్తారు అందుకే వాహనాన్ని నడిపే చోదకులకు భయం వేస్తుంది
వాహనాలను నడిపేటప్పుడు ముఖ్యంగా ఎక్కువ వేగంతో ప్రయాణించరాదు
వాహనానికి తగ్గ మనుషులు లేదా సరుకులు వీలుగా ఉండే బరువుతో ప్రయాణాన్ని సాగించాలి
వాహనానికి తగ్గ ఇంధనం యంత్ర పరిస్థితిని ప్రయాణానికి ముందే చూసుకోవాలి అవసరమైన యంత్ర పరికరాలను ఉంచుకోవాలి
వీలైతే ప్రథమ చికిత్సకు లేదా భద్రత కోసం కావలసిన వాటిని వాహనంలో ఉంచుకోవచ్చు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment