సమస్యల పట్టికలను తయారు చేసుకుంటేనే కదా సమస్యల హెచ్చు తగ్గులు తెలుస్తాయి
సమస్యలు పెరగవచ్చు తగ్గవచ్చు సమస్యలు పరిష్కారం ఉండవచ్చు లేకపోవచ్చు
ఏ సమస్యనైనా ఎలాగైనా పరిష్కారించే మేధస్సు విజ్ఞానం మానవ మేధస్సుల ఆలోచనలలో పరిశోధనలలో ఉంటాయి
కొన్ని సమస్యలను నీవే పరిస్కారించవచ్చు కొన్నింటిని మరికొందరు తీర్చవచ్చు కొన్ని జీవిత కాలంలో తీరకుండా ఉండిపోవచ్చు మరి కొన్ని నీ తరాలవారు పరిష్కారించవచ్చు
ఎవరి నుండి సమస్యలు తగ్గుతాయో ఎవరి నుండి సమస్యలు పెరుగుతాయి ఎవరి నుండి సమస్యలు తీరిపోతాయి ఎవరి నుండి సమస్యలు అలాగే మిగిలిపోతాయో ఏ సమస్యకు ఎంత కాలం పడుతుందో ఏ సమస్యకు ఎవరు అవసరమో కాలంతో పాటు మానవ ప్రయత్నం ఉండాలి సులోచనల భావ తత్వాలతో సంభాషణలతో ప్రజ్ఞానంతో పరిష్కారించుకోవాలి
ఏ సమస్యను ఎప్పుడు పరిష్కరించుకోవాలో వాటి ప్రాధాన్యతలను తెలుసుకోవాలి ముఖ్యమైన వాటిని త్వరగా సాధించుకోవాలి
సమస్యల పరిష్కారానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా దృఢ నిశ్చయంతో శక్తి సామర్థ్యాలతో వాటిని జాగ్రత్తగా అధిగమించాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment