Friday, May 30, 2025

ప్రయాణించుటలో ప్రతి రోజు ప్రతి క్షణం ఎన్నో మార్గాలలో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో ప్రమాదాలు తప్పిపోతున్నాయి

ప్రయాణించుటలో ప్రతి రోజు ప్రతి క్షణం ఎన్నో మార్గాలలో [రహదారులలో] ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో ప్రమాదాలు తప్పిపోతున్నాయి 

వాహనాల చోదకుల కనుసైగలతోనే ఎన్నో ప్రమాదాలు ఎన్నో వాహనాల నుండి ఎన్నో రకాలుగా తప్పిపోతున్నాయి  

సమాజంలో ప్రయాణ విధానాలకు రహదారి నిర్మాణములకు ఒక విధమైన వ్యవస్థ పధ్ధతి సిద్ధాంతం సమృద్ధిగా పరిశుద్ధంగా లేదు  

కొన్ని ప్రమాదాలు జరుగుతూనే [వేగం మరుపు అజ్ఞానం అజాగ్రత్త ఆర్భాటం] ఉన్నాయి ప్రాణాలు పోతూనే ఉన్నాయి శరీర భాగాలు పోతూనే ఉన్నాయి ప్రమాదాలతో కలిగిన అవయవాల లోపాలతో అనారోగ్యంతో జీవిస్తూ కుటంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఎందరో జీవిస్తూనే ఉన్నారు 

ప్రమాదాలకు గురైన వారికి సరైన వైద్యం అందకపోవడం వల్ల ఎందరో మరణించారు అలాగే అంగవైకల్యంతో వివిధ రకాల ఇబ్బందులతో జీవిస్తున్నారు 

ప్రయాణించుటలో ఎదుటివారిని చుట్టుపక్కల వారిని రహదారిని వాతావరణాన్ని వినికిడిని చాలా విధాలుగా శ్రద్ధగా గమనిస్తూ జాగ్రత్తగా నెమ్మదిగా ఉత్తేజంతో విజ్ఞానంతో ఎవరికీ ఏ అపాయం కలగకుండా రహదారి సూచనలను పాటిస్తూ సాగిపోండి  

ప్రశాంతమైన ప్రయాణాన్ని సాగించండి ప్రయాణాన్ని కాస్త ముందుగా ప్రారంభించి శాంతంగా నిదానంగా వాహనాలను నడపండి సరైన సమయానికి సురక్షితంగా ప్రశాంతంగా గమ్యాన్ని చేరుకోండి 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రకృతిలో అమూల్యమైన ఆహార పదార్థాలు ఎన్నో వృధా అవుతున్నాయి

ప్రకృతిలో అమూల్యమైన ఆహార పదార్థాలు ఎన్నో వృధా అవుతున్నాయి 

మానవుడు సంచరించలేని ప్రాంతాలలో ప్రకృతి సృష్టించే [ప్రకృతిలో ఎదిగిన లేదా పండిన] ఆహార పదార్థాలు వృధా అవుతున్నాయి  
ఋతువుల కాల పరిధిలో ప్రకృతి సృష్టించే ఎన్నో రకాల అద్భుతమైన రుచికరమైన ఆహార పదార్థాలు [ఫలాలు,  వాసములు (పొడి పండ్లు, విత్తనాలు)] ఎన్నో రకాలుగా ప్రతి సంవత్సరం వృధా అవుతున్నాయి 

మానవునికి అందుబాటులో ఉన్నా ఎన్నో ఆహార పదార్థాలు ప్రతి రోజు వృధా అవుతూనే ఉన్నాయి 

ఆహార పదార్థాలు చాలా రకాలుగా అధిక ధరలతో, ఎగుమతి దిగుమతి ప్రయాణాలతో, సరిగ్గా నిల్వ ఉంచక పోవడం వల్ల, సరైన సమయానికి అమ్మక పోవడం వల్ల, సరైన సమయానికి తినక పోవడం వల్ల, సరైన ప్రాంతంలో ఉంచకపోవడం వల్ల కూడా వృధా అవుతున్నాయి  
ముఖ్యంగా వ్యాపారం చేసే బజారులలో క్రయ విక్రయాల ప్రాంతాలలో వివిధ శాలలో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఎంతో పరిణామాలలో వృధా అవుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

సుఖించుటకు అవకాశం కలగనవసరం లేదు శ్రమించుటకు అవకాశం కలిగేందుకు అవసరమున్నది

సుఖించుటకు అవకాశం కలగనవసరం లేదు శ్రమించుటకు అవకాశం కలిగేందుకు చాలా అవసరమున్నది  

సుఖించుటకు ఖాళి సమయం ఎలాగైనా కలుగుతుంది 

శ్రమించుటకు ఎన్ని విధాలైన ఏ సందర్భమైనను ముఖ్య అవసరం ఉన్నది 
సమయాన్ని శ్రమించుటకు ఉపయోగించుకొనుటలోనే విజ్ఞానం నవ ప్రజ్ఞాన పరిశోధన ఉత్తేజం ఉన్నది  

శ్రమించుటలో విజ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఆరోగ్యం గౌరవం అనుభవం అభివృద్ధి ఉన్నది 

శ్రమించుటలో కొత్త విజ్ఞానం కలగడంతో పాటు సమస్యలు వివిధ నైపుణ్యాలతో వివిధ అనుభవాలతో పరిష్కారమౌతాయి 

శ్రమించుటలో ఎన్నో విధానాలు ఉన్నాయి - నిరంతరం చదవడం నేర్చుకోవడం జ్ఞాపకశక్తిని పెంచుకోవడం అనుభవాల నుండి కొత్త పరిశోధన విజ్ఞానాన్ని సేకరించడం అజ్ఞానాన్ని వదిలించుకోవడం ఇలా ఇన్నో కలుగుతాయి 
అలాగే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి - జీవిత లక్ష్యాన్ని చేరుకోవచ్చు  - అందరికి సమాజానికి విజ్ఞాన జీవన విధాన మార్గదర్శకం కావచ్చు 

సమాజంలో కలిగే అజ్ఞానాన్ని కూడా గుర్తించి భవిష్యత్లో కలగకుండా మార్పు తీసుకురావచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!


Thursday, May 29, 2025

యుద్ధంలో పోరాటం చేయకున్నను శత్రువులకు ఎదురుగా ధైర్యంగా నిలిచి ఉండడమే విజయం

యుద్ధంలో పోరాటం చేయకున్నను శత్రువులకు ఎదురుగా ధైర్యంగా నిలిచి ఉండడమే విజయం వీరుని లక్షణం  

యుద్ధంలో ఎందరున్నా ఎదురుగా నిలిచి ధైర్యంగా ముందుకు సాగిపోయేవాడే వీరుడు 

యుద్ధాన్ని ఆపగలిగేవాడు కూడా వీరుడు అపారమైన అనుభవ ప్రజ్ఞానుడు ప్రశాంత రూపుడు ధైర్యవంతుడు 

ధైర్యం పోరాటానికే కాదు ప్రశాంతతకు కూడా చాలా అవసరం 

ఇద్దరు వ్యక్తుల మధ్య పొందిక లేకున్నా ఇరువురు ప్రాంతాలవారి మధ్య పొందిక లేకున్నా పోరాటాలు ఏర్పడుతాయి 
పోరాటాలు అధికమైతే యుద్దాలు అవతరిస్తాయి ఆయుధాలు సృష్టించబడుతాయి ప్రాణ నష్టాలు జరిగిపోతాయి 

ఇద్దరు వ్యక్తుల మధ్యగాని ఇరువురి ప్రాంతాలవారి మధ్యగాని అనుభవమైన విజ్ఞానం అపూర్వమైన ప్రశాంతత సుద్దీర్ఘ కాలపు హిత స్నేహితం శాంతి తత్వం ఉండాలి తరతరాలుగా అర్థం చేసుకుంటూ అనుభవాలతో ఆరోగ్యంతో ప్రకృతి అభివృద్ధితో సాగిపోవాలి 

ఆయుధాలు కార్యాలకు [యంత్రాలకు] పనిముట్లుగా ఉపయోగకరంగా ఉండాలి కానీ ప్రాణాలకు హాని కలిగించరాదు 

హాని కలిగించే ఆయుధాలు అజ్ఞానవంతమైనవి జీవించుటకు ప్రయోజనం లేనివి 


-- వివరణ ఇంకా ఉంది!

సూర్యోదయంతో మొదలయ్యే నీ కార్యాలు సూర్యాస్తమయంతో ముగిసిపోవు

సూర్యోదయంతో మొదలయ్యే నీ కార్యాలు సూర్యాస్తమయంతో ముగిసిపోవు 

సూర్యోదయంతో మొదలయ్యే కార్యాలు సూర్యాస్తమయానికి ముగిసిపోతే కార్యములలో స్పష్టత పవిత్రత పరిశుద్ధత ప్రజ్ఞాన నైపుణ్యం ఉత్తేజవంతమైన చాతుర్యం సంఘటిత శ్రమ సద్గుణాల పరిశోధన అవగాహనతో కూడిన అపారమైన అనుభవాలు సహాయ విధానాలు అభివృద్ధి నియమాలు అనుకూలతతో నిర్ణయించుకునేలా ఉంటాయి  


-- వివరణ ఇంకా ఉంది!

ఉచితమైన విద్యా బోధనం సంస్కారవంతమైనది

ఉచితమైన విద్యా బోధనం సంస్కారవంతమైనది 

నేటి విద్యాభ్యాసం అధికమైన రుసుముతో కూడినది [అలాగే] మరియు విలాసవంతమైన వస్త్రాధారణతో కూడినది 

కొన్ని విద్యాలయాలు ప్రతి సంవత్సరం వస్త్రాధారణను మారుస్తూనే ఉంటుంది ప్రజల నుండి అనవసరమైన ఖర్చులతో ఇతరులకు వ్యాపారాన్ని కొనసాగిస్తుంది 
మళ్ళి ఏవో పరీక్షలంటూ ఉత్సవాలంటూ విరాళాల సేకరణ అంటూ పర్యటన అంటూ అదనపు రూములను ఎన్నో విధాలుగా వసూలు చేస్తుంది 
పాఠశాలలకు రావడానికి తిరిగి వెళ్లిపోవడానికి అదనపు రవాణ ఖర్చులను వసూలు చేస్తుంది 

అందరికి అన్ని విధాలా అన్ని రకాల అన్ని వేళలా అన్నీ సహకరించకపోవచ్చు అలాగే అందరికి ఐశ్వర్యం తగినంతగా ఉండకపోవచ్చు [ప్రతి జీవికి ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు కలుగుతూనే ఉంటాయి - అందరికి కుటుంబమంతా ఆరోగ్యం కుటుంబంలో సౌకర్యాలు అన్ని వేళలా ఉండకపోవచ్చు ]


ఒక దేశంలో [ప్రాంతంలో] చదివే వారందరికీ ఒకే విధమైన వస్త్రాధారణ చదువు పూర్తయ్యే వరకు [పదవ తరగతి వరకు] ఉండాలి 
ఎటువంటి వస్త్రాధారణ [వర్ణములు] కావాలో ముందుగానే నిర్ణయించాలి దానినే తరతరాలుగా సాగించాలి ఎల్లప్పుడూ శరీరానికి సౌకర్యముగా ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది!

 

విత్తనం విశ్వం కన్నా గొప్పది

విత్తనం విశ్వం కన్నా గొప్పది 

నాణ్యమైన విత్తనాన్ని వృధా చేయకుండా నాటి పెంచితే వృక్షమై మరెన్నో పండ్లను విత్తనాలను అందిస్తూ ఎంతో వృక్ష సంపద కలిగిస్తూ ఎందరికో తరతరాలుగా ఉపయోగపడుతుంది  సహజమైన ప్రాణవాయువును అందిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తుంది రుచికరమైన ఫల ఆహారాన్ని అందిస్తుంది 

ప్రతి విత్తనం ఒక విశ్వంతో సమానం 



-- వివరణ ఇంకా ఉంది!

Friday, May 23, 2025

మేధస్సులో సర్వాంతర విశ్వ విజ్ఞానం కలిగివున్నా సమాజంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు అజ్ఞానంతోనే సాగుతున్నాయి

మేధస్సులో సర్వాంతర విశ్వ విజ్ఞానం కలిగివున్నా సమాజంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు అజ్ఞానంతోనే సాగుతున్నాయి  

ఉదాహరణ: ఆరోగ్య బీమా తంత్ర విధానాలతో ఎందరో ఎన్నో రకాలుగా మోసపోతున్నారు 

తల్లి తండ్రులకు ఒక బీమా, కుటుంబానికి [కుటుంబం : ఉద్యోగి/కార్మికుడు, భార్య, పిల్లలు] ఒక బీమా వేరు వేరుగా బీమాకిస్తీలతో ధనాన్ని దోచుకుంటున్నారు 

కుటుంబం అంటే తల్లి తండ్రులు, భార్య/భర్త, పిల్లలు [ఒకే బీమా]

కొన్ని [కంటిపొర శస్త్ర వైద్యము/వ్రణ చికిత్స] బీమా తంత్ర విధానాలకు పునరుద్ధరణ [రెండు సంవత్సరాలు] బీమాకిస్తీని చెలిస్తేనే అర్హత కలుగుతుందంటా 

రెండు సంవత్సరాల బీమాకిస్తీ కడితే నాకు వచ్చేది కట్టిన దానికంటే తక్కువ అలాంటప్పుడు ఎందుకు రెండు సంవత్సరాల బీమాకిస్తీలను కట్టాలి 

ఒక బీమాకిస్తీని కట్టిన ద్వారా వచ్చే రుసుమే కాస్త/అల్పంగా అదనంగా వస్తుంది [రెండు సార్లు కడితే నష్టం వస్తుంది]
 
అవసరానికి అగత్యానికి చేయుంచుకున్న శస్త్రవైద్యంతో ఒక సారి కట్టే బీమాకిస్తీయే అర్హత కలిగించాలి 

ఇలాంటి వాటిని ఎవర పట్టించుకుంటారు ఎలా అదుపులోకి పేద ప్రజలకై అమలుపరుస్తారు [ఒక సంవత్సరం కట్టే బీమాకిస్తీయే అర్హతగా కంటిపొర శస్త్రచికిత్సకు కలగాలి - ఇలా ఏ బీమా కైనా వర్తించాలి] 

పునరుద్ధరణ ఉంటేనే అర్హత అనే బీమాను చట్టబద్ధంగా న్యాయంగా నీతి స్వరూపంగా తొలగించాలి 

మనిషి నిరంతరం శ్రమించి తన సంపాదనను వసతులకు సౌకర్యాలకు పిల్లల చదువులకు ఖర్చు చేయకుండా ఆరోగ్యం కోసం చేసేదే బీమా - దీని నుండి కూడా మోసపోతే సహాయం కలగకపోతే కుటుంబం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది విజ్ఞాన సమాజం ఎప్పుడు కనబడుతుంది జీవితంలో ఆశయాలు ఎప్పుడు ఉద్భవిస్తాయి దేశం ఎప్పుడు ముందుకు సాగుతుంది 

ఇలా ఎన్నో వివరించగలను 


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, May 20, 2025

మరుపు లేనివాడే మేధావుడు

మరుపు లేనివాడే మేధావుడు 

అజ్ఞానాన్ని వదులుకోవాలి విజ్ఞానాన్ని మరచిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి అవసరానికి గుర్తుకు చేసుకోవాలి అప్పుడే విజ్ఞాన ప్రయోజనం ఎదుగుదల సంపూర్ణమైన అభివృద్ధి కలుగుతుంది 

జ్ఞాపకాలతోనే పునర్విమర్శ చేసుకోవడమే మేధావుల లక్షణ సాధనం 

జ్ఞాపకాలతోనే పునర్విమర్శ చేసుకోవడంతో పాటు గుర్తు పెట్టుకోవడం ద్వారా విజ్ఞానంతో పాటు అనుభవాలను కలిగిస్తుంది 
 
మేధావులు శ్రమించ గలిగితేనే విజయాలను సాధించగలరు సమాజానికి విజ్ఞాన ప్రయోజనాలను అందించగలరు 


-- వివరణ ఇంకా ఉంది!

ఎవరిని ఎలా ఎప్పుడు ఎందుకు ప్రార్థించినా పూజించినా స్మరించినా నీలో మరుపు కలగకుండా ఆలోచించాలి

ఎవరిని ఎలా ఎప్పుడు ఎందుకు ప్రార్థించినా పూజించినా స్మరించినా నీలో మరుపు కలగకుండా ఆలోచించాలి 

ప్రతిదీ జ్ఞాపకంలో ఉంచుకొని అవసరానికి అవసరమైనవన్నీ గుర్తుకు తెచ్చుకొని క్రియాశీలతో కార్యాన్ని జయించాలి  



-- వివరణ ఇంకా ఉంది!

Monday, May 5, 2025

నీవు జన్మించక ముందే పూర్వమే ప్రధానమైన జీవన ఆధారమైన జీవిత శాస్త్రీయ సిద్ధాంతాలు అవతరించాయి

నీవు జన్మించక ముందే పూర్వమే ప్రధానమైన జీవన ఆధారమైన జీవిత శాస్త్రీయ సిద్ధాంతాలు అవతరించాయి 

నీవు జన్మించక ముందే పూర్వమే ప్రధానమైన జీవన ఆధారమైన జీవిత శాస్త్రీయ సిద్ధాంతాలను కనుగొని తరతరాల వారు ఆచరించేలా విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేలా ఆనాటి మేధావులు ఎన్నో ప్రయోజనాలను అందిస్తూ వచ్చారు 

నేడు నీవు సాధిస్తున్నవన్నీ ఆనాటి ప్రధాన విజ్ఞాన శాస్త్రీయ సిద్ధాంతాలే పూర్వీకుల బోధనల ప్రతిరూప ప్రయోజన ఫలితాలు 

నేటి నీ విజ్ఞానం కూడా తరతరాల వారికి సద్గుణాలుగా సత్ప్రవర్తనలతో ఆరోగ్యాంగా గౌరవంగా సాంప్రదాయాలతో ఎదిగేలా ప్రకృతి అభివృద్ధితో స్వచ్చతతో ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది!

దుమ్ములో కూడా సుగుణాలు మరియు దుర్గుణాల కణాలు సంచరిస్తుంటాయి

దుమ్ములో కూడా సుగుణాలు మరియు దుర్గుణాల కణాలు సంచరిస్తుంటాయి  

సూర్య రశ్మితో కూడిన ప్రకృతి దుమ్ములో సహజమైన సుగుణాల ఆరోగ్య కణాలు సంచరిస్తుంటాయి 

మానవ జీవిన విధాన నిర్మాణ ప్రయాణాలలో కృత్రిమమైన దుర్గుణాల అనారోగ్య కలుసుషిత కణాలు సంచరిస్తుంటాయి 

జీవన విధాన కార్యాలలో మరియు ప్రయాణించుటలో కృత్రిమమైన దుర్గుణాల కణాలు అకస్మాత్తుగా నేత్రాలలో చొచ్చుకొనిపోతుంటాయి అనారోగ్యానికి గురిచేస్తాయి 
 

-- వివరణ ఇంకా ఉంది!

ఆనాడు నీడ కోసం వృక్షాన్ని ఆశ్రయించు దానినే వసతిగా ఏర్పాటు చేసుకొని జీవితాన్ని సాగించావు

ఆనాడు నీడ కోసం వృక్షాన్ని ఆశ్రయించు దానినే వసతిగా ఏర్పాటు చేసుకొని జీవితాన్ని సాగించావు  
ఈనాడు [నేడు] నీడ కోసం గృహాన్ని నిర్మించుకొని అనేక వసతులను అందులోనే ఏర్పాటు చేసుకొని జీవితాన్ని సాగిస్తున్నావు 

ఆనాడు వృక్షాన్ని వసతిగా ఏర్పాటు చేసుకొని ఆరోగ్యాంగా ప్రకృతి ప్రభావంతో శ్రమిస్తూ సమృద్ధితో జీవించావు 
ఈనాడు గృహాన్ని వసతిగా ఏర్పాటు చేసుకొని అనారోగ్యంతో కృత్రిమ ప్రభావంతో శ్రమిస్తూ అసామర్థ్యంతో జీవిస్తున్నావు 

ఆనాడు ప్రకృతి సౌకర్యాలతో ఆరోగ్యవంతమైన ఆయుస్సుతో శాతబ్దాలుగా సాగుతూ జీవితాలను సాగించేవారు 
ఈనాడు కృత్రిమ సౌకర్యాలతో అనారోగ్యవంతమైన ఆయుస్సుతో దశాబ్దాలుగా సాగుతూ జీవితాలను సాగిస్తున్నారు 


-- వివరణ ఇంకా ఉంది!

Sunday, May 4, 2025

మేధస్సులోని మరుపుకు మేధస్సును ఎలా శిక్షించాలో ఎలా శిక్షణ ఇవ్వాలో తెలియుటలేదు

మేధస్సులోని మరుపుకు మేధస్సును ఎలా శిక్షించాలో ఎలా శిక్షణ ఇవ్వాలో తెలియుటలేదు 

మేధస్సులోని ఉన్న మరుపుకు లేదా మేధస్సుకు కలిగే మరుపుకు మేధస్సును ఎలా శిక్షించాలో మరియు మేధస్సుకు ఎలా శిక్షణ ఇవ్వాలో విజ్ఞాన ఆలోచనలకు తెలియుటలేదు 

మరుపుతో విజ్ఞానం ఉపయోగపడటం లేదు అలాగే ఎన్నో విధాలా ఎన్నో నష్టాలను తమకు మరియు ఎందరికో గురిచేస్తున్నది 


-- వివరణ ఇంకా ఉంది! 

జీవిగా జీవించాలంటే ప్రకృతి ఆహారాన్ని ఆరగిస్తూ ఉండాలి

జీవిగా జీవించాలంటే ప్రకృతి ఆహారాన్ని ఆరగిస్తూ ఉండాలి  


-- వివరణ ఇంకా ఉంది!

సమాజంలో స్థిరంగా ఉన్నవారు వ్యాపారం చేసుకుంటారు స్థిరంగా లేనివారు ప్రయాణిస్తూనే ఉంటారు

సమాజంలో స్థిరంగా ఉన్నవారు వ్యాపారం చేసుకుంటారు స్థిరంగా లేనివారు ప్రయాణిస్తూనే ఉంటారు 

సమాజంలో స్థిరంగా లేనివారు స్థిరత్వం కోసం ప్రయాణిస్తూనే ఉంటారు 


-- వివరణ ఇంకా ఉంది! 

సమాజంలో నీకు కావలసిన జ్ఞానం లేకపోతే నీలోని జ్ఞానాన్ని సమాజానికి అందించవచ్చు

సమాజంలో నీకు కావలసిన జ్ఞానం లేకపోతే నీలోని జ్ఞానాన్ని సమాజానికి అందించవచ్చు  

-- వివరణ ఇంకా ఉంది!