Tuesday, June 27, 2017

విశ్వమే శ్వాసగా వేదమే ధ్యాసగా

విశ్వమే శ్వాసగా వేదమే ధ్యాసగా
జగమే జీవంగా విజ్ఞానమే ధ్యానంగా

స్వరమే సత్యంగా రాగమే ధర్మంగా
దైవమే దేహంగా గాత్రమే ప్రాణంగా

మేధస్సులో కలిగే భావాలకు ఆలోచనలో అనుభవాలు
మదిలో కలిగే మోహములకు మనస్సులో మధురములు   || విశ్వమే ||

జీవమై ఏ రూపం ఉన్నా శ్వాసగా ప్రాణం జీవిస్తున్నదే
భావమై ఏ జ్ఞానం ఉన్నా ధ్యాసగా మోహం తపిస్తున్నదే

స్వరములో తపనం ఉన్నా మౌనం మహోన్నతమైనదే
జీవములో అదరం ఉన్నా ప్రాణం అభియోగ్యతమైనదే   || విశ్వమే ||

విజ్ఞానం ఎవరితో ఉన్నా స్వధ్యాసతో సత్యమైనదే
వేదాంతం ఎవరిలో ఉన్నా  ధ్యానంతో నిత్యమైనదే

ధర్మం ఎక్కడ ఉన్నా దైవం అన్వేషిస్తున్నదే
జీవం ఎక్కడ ఉన్నా రూపం ఆవహిస్తున్నదే      || విశ్వమే || 

పదములు పలికినా పలుకుల పులకరింతలు

పదములు పలికినా పలుకుల పులకరింతలు
వేదములు చదివినా వర్ణముల పలకరింతలు
అచ్చులు తెలిసినా అక్షరముల అల్లికలు
హల్లులు వ్రాసినా పదముల వాక్యములు
భాషలు నేర్చినా చంధస్సుల వ్యాకరణములు 

Monday, June 19, 2017

శూన్యము నుండే ఉదయించాను కాలమై సాగుతువున్నాను

శూన్యము నుండే ఉదయించాను కాలమై సాగుతువున్నాను
శూన్యము నుండే ఎదిగాను ప్రదేశమై విస్తరించివున్నాను
శూన్యము నుండే తలిచాను భావమై ప్రజ్వలించివున్నాను
శూన్యము నుండే ఒదిగాను ఆలోచనై ఆరంభమైవున్నాను

ఓ మాతా! నీవే నా శ్వాసకు పరమాత్మ

ఓ మాతా! నీవే నా శ్వాసకు పరమాత్మ
ఓ అమ్మా! నీవే నా ధ్యాసకు అన్నపూర్ణ
ఓ ధాత్రి! నీవే నా ప్రయాసకు మాతృక
ఓ జనని! నీవే నా ఉచ్చ్వాసకు జగన్మాత 

అంతలో నచ్చేశావా ఇంతలో మెచ్చేశావా

అంతలో నచ్చేశావా ఇంతలో మెచ్చేశావా
అంతలో వచ్చేశావా ఇంతలో ఇచ్చేశావా
అంతలో దాచేశావా ఇంతలో మార్చేశావా
 
ప్రతి క్షణం నాతో ఉండాలని గమనించావా
ప్రతి సమయం నాతో ఉంటావని గుర్తించావా    || అంతలో ||

ఎప్పటికైనా నీవు నాతో రావాలని తెలుసుకున్నావా
ఏనాడైనా నీవు నాతో నడవాలని మలుచుకున్నావా
ఎంతవరకైనా నీవు నాతో కలవాలని మార్చుకున్నావా  
ఏదేమైనా నీవు నాతో మెలగాలని నడుచుకున్నావా    || అంతలో ||

ఎప్పటికైనా ఎలాగైనా నీవు నాతో జీవించాలని అనుకున్నావా
ఏనాడైనా ఎందాకైనా నీవు నాతో సవరించాలని అందుకున్నావా
ఎంతవరకైనా ఎక్కడైనా నీవు నాతో సాగించాలని తెలుపుకున్నావా
ఏదేమైనా ఎంతటిదైనా నీవు నాతో భాగించాలని ఆదుకున్నావా     || అంతలో || 

ఏనాడు లేని ఆలోచన కలిగేను ఈనాడే నాలో

ఏనాడు లేని ఆలోచన కలిగేను ఈనాడే నాలో
ఎక్కడ ఎవరికి లేని భావన తోచేను ఈనాడే నాలో

యదలోన కదిలే మదిలోన మొదిలే అనురాగ వేదం
తపించిపోతున్నది నేడే నా మనసున్న మేధస్సులో   ||  ఏనాడు ||

హృదయానికే దూరం కంటికే చేరువై కనిపిస్తున్నదే నవ భావ దృశ్యం
మేధస్సుకే ఊహా చిత్రం ఆలోచనకే అలంకార రూపం నవ రస భరితం

ప్రకృతిలో పరవశించిపోయే జీవామృతం తపనంతో విహరిస్తున్నది
విశ్వ జగతిలో ఉప్పొంగిపోయే నాదామృతం విరహంతో గాలిస్తున్నది    ||  ఏనాడు ||

విజ్ఞానమైన జీవన విధానం వేదాంతమైన జీవిత సవరణగా సాగుతున్నది
శాస్త్రీయమైన జీవన కవచం సిద్ధాంతమైన జీవిత రహస్యంగా వెళ్ళుతున్నది

వినయం ఎంతటి భావమో ఆలోచనకు అంతటి వేదనగా కలుగుతున్నది
పరువం ఎంతటి మోహమో వయస్సుకు అంతటి ఆత్రతగా తెలుస్తున్నది  ||  ఏనాడు ||

Friday, June 16, 2017

విశ్వమే శ్వాసగా జగమే జీవముగా

విశ్వమే శ్వాసగా జగమే జీవముగా
ప్రకృతియే ప్రాణంగా ధరణియే ధ్యాసగా
దైవమే దేహంగా ప్రదేశమే పరమాత్మగా
కాలం బ్రంహాండాన్నే సాగించును బాధ్యతగా  || విశ్వమే ||

విశ్వమే శ్వాసతో భావమై జగమే జీవంతో తత్వమై
ప్రకృతియే ప్రాణంతో లీనమై ధరణియే ధ్యాసతో దివ్యమై
దైవమే దేహంతో ఏకమై ప్రదేశమే పరమాత్మతో పరిచయమై
కాలమే బ్రంహాండంతో బంధమై బాధ్యతగా సాగుతున్నది వరమై   || విశ్వమే ||

విశ్వమే మన శ్వాస భావమే మన ధ్యాస జగమే మన ప్రయాసం
ప్రకృతియే మన ప్రాణం ధరణియే మన ఆధారం జీవమే మన లోకం
దైవమే మన దేహం ప్రదేశమే మన రూపం పరమాత్మమే మన ప్రతిబింబం
కాలమే మన గమనం బ్రంహాండమే మన భువనం బాధ్యతయే మన కార్యం   || విశ్వమే ||