Showing posts with label అమ్మమ్మ. Show all posts
Showing posts with label అమ్మమ్మ. Show all posts

Monday, January 9, 2017

అమ్మవై జీవించవా అమ్మమ్మవై జీవించవా

అమ్మవై జీవించవా అమ్మమ్మవై జీవించవా
తరతరాల యుగాలకు తల్లివై వందేళ్ళు జీవించవా
తల్లిగా నీవే ప్రతి క్షణం మమకారంతో ఆరాటం చెందవా  || అమ్మవై ||

విశ్వ జగతికే నీవు మాతృ మూర్తిగా అవతరించావుగా
లోకానికే నీవు సృష్టి తత్వాన్ని అమ్మగా నింపుకున్నావుగా

నీ సేవకు పర బ్రంహయే కరుణించగా దైవత్వమే ఉప్పొంగేనుగా
నీ ప్రేమకు పరమాత్మయే ఆత్మగా నీలో దర్శించి జన్మించేనుగా

తల్లిగా జన్మనే ఇచ్చి ఎన్నో బంధాలనే ఇచ్చావుగా
మహా తల్లిగా జీవించి ఎన్నో అనురాగాలనే తెలిపావుగా

బంధాలతో సమాజంలో గౌరవాన్ని కల్పించావుగా
సంబంధాలతో కుటుంబంలో బాధ్యతనే చూపావుగా   || అమ్మవై ||

మాతగా నిన్నే కొలిచేలా మహా దైవ శక్తిని పంచావుగా
మహాత్మగా నిన్నే ఆదరించేలా విజ్ఞానాన్ని నేర్పావుగా

మాతృత్వంతో మానవ హృదయాన్ని విశ్వానికే చాటావుగా
మహా భావత్వంతో మానవ దేహాన్ని జగతికే అర్పించావుగా  

ప్రకృతియే నీ పర భావ తత్వమని పరిశోధన కలిగించావుగా
జీవమే నీ పర దేహ స్వరూపమని లోకానికే చూపించావుగా  

ఎప్పటి నుండో అమ్మగా ఒదిగిపోయి అమ్మమ్మగా ఎదిగావుగా
ఎప్పటి నుండో ఎప్పటి వరకో అమ్మగా కాలంతో సాగుతున్నావుగా  || అమ్మవై ||

Wednesday, July 27, 2016

అమ్మగా దీవించు అమ్మమ్మగా ఆశీర్వదించు

అమ్మగా దీవించు అమ్మమ్మగా ఆశీర్వదించు
నీ జీవ రూపానికే ధీర్ఘ ఆయుస్సును కలిపించు  || అమ్మగా ||

నా రూపం విశ్వానికే తపనం తపించుటలో నవ జీవనం
నా భావం జగతికే తన్మయం తలచుటలో నవ వసంతం

విజ్ఞానంతో సాగే ఆలోచన మేధస్సులో అన్వేషణగా వీక్షించే
అనుభవంతో సాగే విజ్ఞానం లోకంలో పరిశోధనగా పరీక్షించే

నా జీవిత కాలం ఒక యుగమై సాగగా నే తెలుపుకుంటాను విశ్వ భావాలను
నా జీవన సమయం ఒక శతమై సాగగా తెలుసుకుంటాను ఆత్మ తత్వాలను  || అమ్మగా ||

నీ ఒడిలోనే నేర్చుకున్నా మహాత్ముల వేద స్వభావ తత్వం
నీ నీడలోనే ఓర్చుకున్నా మహర్షుల కఠిన జీవన మనస్తత్వం

తల్లిగా నా హృదయంలో లీనమై దేవతగా వెలిశావు
అమ్మగా నా మేధస్సులో భావమై మహాత్మగా నిలిచావు

ఆయుస్సుతోనే నా జీవితం ఓ చరిత్రగా సాగే గ్రంథం
కాలంతో సాగే నా జీవనం ఓ చరణముగా సాగే గమకం  || అమ్మగా ||

అమ్మగా వచ్చాను ఈ లోకానికి అమ్మమ్మగా ఉన్నాను ఈ జగతికి

అమ్మగా వచ్చాను ఈ లోకానికి అమ్మమ్మగా ఉన్నాను ఈ జగతికి
తల్లిగా ఒదిగాను ఈ భువనానికి మహాత్మగా ఎదిగాను ఈ విశ్వానికి  || అమ్మగా ||

జీవమే శ్వాసగా ప్రాణమే ఊపిరిగా ఉచ్చ్వాస నిచ్చ్వాసాలే ధ్యాసగా సాగేను
ఆత్మయే దైవంగా తత్వమే వేదంగా స్వభావాలే నాలో ఆలోచనగా కలిగేను

జీవత్వములోనే దైవత్వమై నేనుగా జీవిస్తున్నా
ఆత్మ తత్వములోనే మహాత్మనై నాలోనే ఒదిగున్నా

ఏనాటి నా భావ తత్వములు ఈ జగతికి ప్రాణమై కొనసాగేను
ఎప్పటి జీవ బంధములు ఈ లోకానికి ఊపిరిగా సాగిపోయేను  || అమ్మగా ||

మౌనమై ఉన్నాను ఆకాశంతో ధ్యానమై ఉన్నాను ప్రకృతిలో
దేహమై ఉన్నాను శిఖరంతో లీనమై ఉంటాను భవ సృష్టిలో

మరణమైనను నాలో నిలిచే మౌనం శ్వాసే ఆగేపోయే తరుణం
శరీరం క్షీణిస్తూ మట్టిలో కలిసి శూన్యమై కదలిక లేని కణజాలం

జన్మతోనే నేను అవతరిస్తూ మరో జన్మనే ప్రసాదిస్తూ మిగిలిపోయాను
జీవులకై అనుగ్రహిస్తూ జన్మలతోనే ప్రేమామృతత్వమై ఉండిపోయాను  || అమ్మగా || 

Monday, July 25, 2016

అమ్మవు నీవే తల్లివి నీవే

అమ్మవు నీవే తల్లివి నీవే
అమ్మమ్మవు నీవే అమ్మకు అమ్మవు నీవే
నీ ఒడిలో ఒదిగి ఎదిగే అమ్మకు అమ్మమ్మవు నీవే   || అమ్మవు ||

తల్లిగా నీవు సృష్టించే జీవమే జగతిలో కలిగే మహా కార్యము
అమ్మగా నీవు పెంచే ప్రేమే విశ్వానికి కలిగే మహా స్వభావము

ప్రతి అమ్మకు అమ్మగా నీలాగే ప్రతి స్త్రీకి తల్లిలా నీవే మార్గ దర్శకము
ప్రతి అమ్మలో ప్రేమగా నీలాగే ప్రతి అమ్మకు నీవే జీవన మార్గ సూత్రము

అమ్మవై ఉదయించే నీ భావన అమరమైన అమృత అమోఘమే
తల్లివై జీవించే నీ తపన ప్రతి జీవికి కలిగే సౌభాగ్య సుందరమే    || అమ్మవు ||

జన్మనిచ్చే నీ భావనలో ప్రతి స్పందన నీ జీవ బంధమే
అమ్మవై జీవించే నీ వేదనలో ప్రతి క్షణం నీ జీవ గమనమే

ప్రతి ధ్యాస ప్రతి శ్వాస అమ్మగా నీకు కలిగే ప్రత్యూష
ప్రతి ఉచ్చ్వాస నిచ్ఛ్వాస తల్లిగా నీకు కలిగే మెళకువ

అమ్మగా నీవు నడిచే మార్గమే ప్రతి జీవికి విజ్ఞానము
తల్లిగా నీవు చూపించే విశ్వమే ప్రతి జీవికి నిలయము  || అమ్మవు || 

Friday, July 8, 2016

అమ్మ అంటే జీవమని మాతృ భావన

అమ్మ అంటే జీవమని మాతృ భావన
తల్లి అంటే దైవమని జగతి తత్వము
విశ్వమంతా జీవమై జగతి మాతృ తత్వమే ఐనది   || అమ్మ అంటే ||

శ్వాసతోనే శ్వాసను సృష్టించే జీవమే అమ్మ
శ్వాసలోన శ్వాసకు ఉచ్చ్వాస నిచ్చ్వాసే అమ్మ

తన ఆత్మ యందే మరో ఆత్మను జత చేర్చుకునే భావనయే అమ్మ
ద్వి ఆత్మల ద్వి జీవముల చతుర శ్వాసయే తల్లి ఉచ్చ్వాస నిచ్ఛ్వాస

రెండు ప్రాణాలతో ఒక మనస్సుతో జీవించే దైవమే అమ్మ
రెండు జీవములతో ఒకే స్వభావంతో జీవించే భావనయే అమ్మ    || అమ్మ అంటే ||

తన జీవము నుండే మరో తన ప్రతి రూపాన్ని ఇచ్చే హృదయమే అమ్మ
తన దేహములోనే మరో దేహాన్ని అన్ని అవయవాలతో సృష్టించేదే అమ్మ

అమ్మ అంటే దైవమని అమ్మమ్మ అంటే మాతృత్వమని కొలిచేదే మాతృదేవోభవ
తల్లి అంటే జీవమని మాత అంటే ఆత్మ పరమాత్మ అని తలిచేదే మహాత్మదేవోభవ

అమ్మతోనే జన్మిస్తూ అమ్మతోనే ఎదుగుతూ అమ్మనే మహా దైవమని గౌరవించాలి
అమ్మతోనే విజ్ఞానం అమ్మతోనే నడవడి నేర్చుకుంటూ అమ్మమ్మనే సత్కరించాలి  || అమ్మ అంటే ||