Showing posts with label అవివేకం. Show all posts
Showing posts with label అవివేకం. Show all posts

Tuesday, July 12, 2016

ఏనాటికి నాలో దాగిన భావాలు శూన్యమైపోయేను

ఏనాటికి నాలో దాగిన భావాలు శూన్యమైపోయేను
ఏనాడు నాలో కలిగే ఆలోచనలు నిలిచిపోయేను
నాలో భావనాలోచనలు ఎంతవరకు సాగిపోయేను  || ఏనాటికి ||

భావనయే ఆలోచనగా నాకు తెలుపుతున్నది అర్థమైన విజ్ఞానం
ఆలోచనగా నాకు తెలుస్తున్నది పరమార్థమైన స్వభావ తత్వం

భావమే శూన్యమైతే ఆలోచనే నిలిచిపోతే మేధస్సులో నిశ్శబ్దం
దేహమే కదలక హృదయమే ఆగిపోతే మరణమే సుఖాంతరం    || ఏనాటికి ||

మేధస్సులో భావనలేని కాల జీవనం మందమతిగా మారే అజ్ఞానం
ఆలోచనలో అర్థంలేని కాల జీవితం మతి స్థిమితం లేని అవివేకం  

భావనతోనే జీవించే జీవుల మేధస్సులలో ప్రతి రోజు కార్య గమనం
ఆలోచనతో జీవించే జీవుల మేధస్సులలో ప్రతి క్షణం కార్య గమకం  || ఏనాటికి ||