Showing posts with label గమ్యం. Show all posts
Showing posts with label గమ్యం. Show all posts

Tuesday, February 7, 2017

విధిగా జీవించు విధినే అధిరోహించు

విధిగా జీవించు విధినే అధిరోహించు
విధిగా ప్రేమించు విధినే జయించు

నీ విజ్ఞానంతో విధినే తప్పించు
నీ అనుభవంతో విధినే వదిలించు  || విధిగా ||

ఏనాటి విధితత్వ జీవితమో మన కార్యాల శ్రమ సాధన సమస్యలతో సాగే జీవన విధానం
ఏనాటి బహు బంధమో మన భావాలు స్నేహితుల అనురాగాల ప్రేమతో సాగే అనుబంధం

ఎప్పటికీ తెలియని వేదాంత సారాంశం మన జీవితంలో సుఖ దుఃఖాలను కలిగిస్తుంది
ఎప్పటికీ తోచని భావోదయ వేదాంతం మన జీవనంలో బహు బంధాలను చేరుస్తుంది    || విధిగా ||

ఏమిటో కాల ప్రభావం ఎప్పటికో కార్య విరమణం
ఏమిటో జీవ ప్రభావితం ఎప్పటికో వేద విజ్ఞానం

ఏదో అనుభవం ఎక్కడికో గమ్యం సాధనలో ఎరుకే మహా గొప్ప మార్గం
ఏదో కొత్త విజ్ఞానం ఎక్కడికో ప్రయాణం శ్రమలో సాధన మహా ఆయుధం

అనుభవ విజ్ఞానమే శాంతి మార్గాన్ని సాగించే కాల ప్రయాణం
వేద ప్రభావమే విధిని తొలగించే ప్రేమ ప్రశాంత జీవన గమ్యం   || విధిగా || 

Monday, February 6, 2017

కోరిన ఆశకు తీరని వాంఛ

కోరిన ఆశకు తీరని వాంఛ
పలికిన మాటకు తెలియని అర్థం
తెలియని ప్రయాణం చేరని గమ్యం
వండిన ఆహారానికి ఆకలి లేకపోవడం
జరిపిన కార్యానికి సమస్యలు ఎదురవ్వడం
భావం లేని తత్వం శూన్యం లేని నిరాకారం 

Friday, February 3, 2017

గాలి వీచిన గీతం

గాలి వీచిన గీతం
గాలి పలికిన గేయం
గాలి నేర్పిన గమకం
గాలి తెలిపిన గాత్రం
గాలి తపించిన గానం
గాలి నడిచిన గమనం

గాలి తిరిగిన గోళం
గాలి చేరిన గమ్యం
గాలి సోకిన గంధం
గాలి నిలిచిన గడియం
గాలి ఓదార్చిన గ్రంధం
గాలి తలచిన గంధర్వం 

Monday, January 23, 2017

ఉదయించే తేజమా నడిపించు నా మార్గాన్ని నీ వెలుగుతో సౌఖ్యంగా

ఉదయించే తేజమా నడిపించు నా మార్గాన్ని నీ వెలుగుతో సౌఖ్యంగా
కదిలే సూర్య కిరణమా చూపించు నా గమ్యాన్ని నీ కాంతితో భాగ్యంగా     || ఉదయించే ||

ప్రతి మార్గం నీవు సూచించే దివిటితోనే నా రహదారి సూటిగా మహా గొప్పతనంగా సాగాలి
ప్రతి ప్రయాణం నీవు తెలిపే దిక్సూచితోనే నా నడక సక్రమంగా మహా ఘనంగా వెళ్ళాలి

ప్రకాశించే ప్రజ్వల జ్యోతిగా విశ్వసించే ఉజ్వల కాంతిగా దివిటివై నా రహదారినే చూపాలి
మెరిసే మహా కిరణంగా తపించే మహోజ్వల వర్ణంగా దిక్సూచివై నా మార్గమునే చూపాలి  || ఉదయించే ||

గమనించే గమనంతోనే ఆలోచించే ఆలోచనలతోనే నా మార్గం గమ్యం ఒకటిగా సాగాలి
సూచించే సూచనతోనే చూపించే చూపులతోనే నా ప్రయాణం స్థానం చేరువగా ఉండాలి

ప్రతి క్షణం నీ కాంతి వెలుగులో ప్రతి సమయం నీ వర్ణ తేజస్సులోనే నేను ప్రయాణిస్తున్నా
ప్రతి భావనం నీ జ్యోతి ప్రకాశంలో ప్రతి తత్వం నీ అగ్ని జ్వాలలలోనే నేను అన్వేషిస్తున్నా  || ఉదయించే || 

Tuesday, August 2, 2016

అటు ఇటు తిరిగే ప్రయాణం ఎక్కడికో

అటు ఇటు తిరిగే ప్రయాణం ఎక్కడికో
ఇటు అటు నిలిచే గమ్యం ఎందులకో ఏమో
ఎక్కడికో తెలియని ప్రయాణం ఎవరికో తెలియని గమ్యం ఎందులకో ఏమో  || అటు ఇటు ||

ప్రయాణంతో సాగే జీవితం గమ్యాన్ని చేరే స్థానం మన జీవన కార్యమేగా
ప్రతి అడుగు ఒక మెట్టుగా ప్రతి సాధన ఒక విజ్ఞాన వేదనగా సాగే వేదికయే

సూర్యునితో సాగే ఉదయం సంధ్య వేళ సూర్యాస్తమయమయ్యే కాల ప్రయాణమే
చీకటిని తొలిచే వెలుగు సూర్యోదయానికి మహోత్తర స్వాగతమయ్యే భ్రమణమే   || అటు ఇటు ||

అన్వేషణగా సాగే విజ్ఞానం అనుభవమయ్యే పరిజ్ఞానం పరిశోధనగా పరిశీలించుటయే
ఆవేదనతో సాగే వేదాంతం అనుబంధాలకు తెలిపే జీవన సూత్రాన్ని భోధించుటయే

కాలంతో కలిగే భ్రమణం మనలో తోచే జ్ఞాపకాల ఆలోచనలు జీవితంలో ఒక ప్రయాణమే
క్షణంతో మొదలయ్యే జీవితం మన ఎదుగుదల ప్రారంభాన్ని చివరిగా సాగించే గమ్యమే || అటు ఇటు || 

Friday, July 29, 2016

ఏది నీ వచనం ఏది నీ గమనం

ఏది నీ వచనం ఏది నీ గమనం
ఆలోచనలోనే ఉన్నది నీ గమకం
ధ్యాసతోనే సాగుతున్నది నీ గమ్యం  || ఏది ||

విజ్ఞానంతో సాగే నీ వచనం గమనమైతే
అనుభవంతో సాగే గమనం గమకమైతే
కాలంతో సాగిపోయే గమ్యం నీకు గళం అగును

ప్రతి సమయం నీకు ఒక నిర్వచనమై
ప్రతి క్షణం నీలో ఓ జ్ఞాపకాల నిరీక్షణమై
ప్రత్యక్ష కాలం నీకు నిర్వేదమగునులే       || ఏది ||

వచనంతో వదనం మహా భాగ్యమైతే
వదనంతో వాలకం గొప్ప తత్వమైతే
విలాపం వలసపోయే దివ్యత్వం వచ్చేనులే

భావాలతో బంధం నీకు సమీపపై
సంబంధాలతో అనురాగం నీతో చేరువై
అనుబంధాలతో ఆప్యాయత నీ చెంత చేరునులే   || ఏది || 

Thursday, June 2, 2016

ఓ బాటసారి... నీవు నడిచే మార్గం నాదే నీవు తెలిపే రహదారి నాదే

ఓ బాటసారి...
నీవు నడిచే మార్గం నాదే
నీవు తెలిపే రహదారి నాదే
నీవు ఎక్కడ నిలిచినా ఏ గమ్యం చేరినా నా ప్రయాణం సాగిపోవునే  || ఓ బాటసారి... ||

విశ్వమంతా నా రహదారి మార్గమే కనిపిస్తున్నది
నీవు ఉన్న చోట నా స్థానమే నీకు సూచిస్తున్నది

ఏ దారి లేని చోట నీవు నడచినా అదే నా రహదారిగా మారేను
ఏ మార్గాన్ని నీవు విడచినా ఆ దారిలోనే నడిచే వారు ఎందరో

ఎడారిలో కనిపించదు నా దారి ఆకాశం చూపదు నా మార్గము
నీటిలో తోచదు నా మార్గం నీకు ఏ దిక్కున ఎలా వెళ్ళిపోవాలో  || ఓ బాటసారి... ||

విజ్ఞానంతో సాగిపోతే దిక్సూచిలా నా మార్గం నీకు తెలిసేను
అనుభవంతో సాగిపోతే మరో మార్గం నా రహదారిలో కలిసేను

జన్మించిన స్థానము నుండి మార్గాన్ని సాగించే మరణ గమ్యాన్ని చేరేవు
ఎందరో సాగించిన ఈ మార్గాలే సృష్టిలో రహదారులుగా సాగి పోయేను

తెలియని మార్గాన్ని అన్వేషిస్తే సూచనలెన్నో తెలిసేను
సూచనలతో మార్గాన్ని సాగిస్తే అనుభవమే నీకు కలిగేను

ఇదే నా ప్రయాణం ఇదే నా మార్గం ఇదే నా దారి రహదారి
ఇదే నా లోకం ఇదే నా రహస్యం ఇంతే నీ ప్రయాణ జీవితం  || ఓ బాటసారి... ||