Showing posts with label అమ్మా. Show all posts
Showing posts with label అమ్మా. Show all posts

Tuesday, July 12, 2016

అమ్మా అనే పిలుపులో కమ్మని రాగమే తేనీయం

అమ్మా అనే పిలుపులో కమ్మని రాగమే తేనీయం
అమ్మా అనే తొలి పలుకులో మధురమే సుగంధం  || అమ్మా ||

నీ భావనతోనే నేను ఉదయించాను ఓ రూప వర్ణమై
నీ ఆలోచనతోనే నేను ఎదిగాను ఓ ఆకార స్వర జీవమై

నీవు పలికే పిలుపులలో నాలో కలిగేను ఓ ఉత్తేజం
నీవు తెలిపే పలుకులలో నాలో తెలిసేను ఓ కర్తవ్యం  || అమ్మా ||

నీ మాటల తరంగాలు నన్ను పిలిచేను వేణు గానంలా
నీ బాటల మార్గాలే నన్ను నడిపించేను ఓ బాటసారిలా

నీవే నా ఆశయమై నీ కోసమే నేను జీవిస్తున్నా ఆయుస్సునై
నీవే నా జీవన జీవమై నీ కోసమే నేను ఉదయిస్తా మరో జన్మనై  || అమ్మా || 

Monday, July 11, 2016

అమ్మా! - నీవే నా తొలి జీవం నీవే నా తొలి ప్రాణం

అమ్మా!
నీవే నా తొలి జీవం నీవే నా తొలి ప్రాణం
నీవే నా తొలి శ్వాస నీవే నా తొలి ధ్యాస    || అమ్మా! ||

నీవే నా తొలి రూపం నీవే నా తొలి ఆకారం
నీవే నా తొలి ప్రదేశం నీవే నా తొలి అణువు
నీవే నా తొలి ఉచ్చ్వాస నిచ్ఛ్వాస చలనం
నీవే నా తొలి నేత్రం నీవే నా తొలి రాగ తరంగం
నీవే నా తొలి అవయవం నీవే నా తొలి హృదయం

నీవే నా తొలి స్పర్శ నీవే నా తొలి ఎరుక
నీవే నా తొలి బంధం నీవే నా తొలి భావన
నీవే నా తొలి ఆలోచన నీవే నా తొలి అర్థం
నీవే నా తొలి స్వభావం నీవే నా తొలి తత్వం
నీవే నా తొలి ఆత్మ నీవే నా తొలి అంతరాత్మ  || అమ్మా! ||

నీవే నా జన్మకు ప్రతి రూపం
నీవే నా జీవితానికి ప్రేమామృతం
నీవే నా ఊపిరికై వెలసిన విశ్వ జగతి బ్రహ్మాండం

నీవే నా దైవం నీవే నా సర్వస్వం
నీవే నా విజ్ఞానం నీవే నా అభినయం
నీవే నా మాతృదేవోభవ నీవే నా మహాత్మదేవోభవ
నీవే నాకు మహా అద్భుతం నీవే సృష్టికి జీవ ధాత్రి  || అమ్మా! ||

నీవే నా తొలి వెలుగు నీవే నా తొలి చీకటి
నీవే నా తొలి ఉష్ణం నీవే నా తొలి అలుపు
నీవే నా తొలి పలుకు నీవే నా తొలి పిలుపు
నీవే నా తొలి వణుకు నీవే నా తొలి కునుకు

నీవే నా తొలి స్వప్నం నీవే నా తొలి ఊహ
నీవే నా తొలి స్నేహం నీవే నా తొలి హితం
నీవే నా తొలి జ్ఞాపకం నీవే నా తొలి చిహ్నం
నీవే నా తొలి శ్రేయోభిలాషివి నీవే నా తొలి విధేయతవు  || అమ్మా! ||

నీవే నా తొలి ఆకలి నీవే నా తొలి దాహం
నీవే నా తొలి స్ఫూర్తి నీవే నా తొలి ధైర్యం
నీవే నా తొలి కార్యం నీవే నా తొలి కర్తవ్యం
నీవే నా తొలి ఓర్పు నీవే నా తొలి సహనం
నీవే నా తొలి పరిచయం నీవే నా తొలి పరిశోధన

నీవే నాకు స్పందన నీవే నాకు తరుణం
నీవే నాకు సంతోషం నీవే నాకు ఉత్సాహం
నీవే నాకు ఆనందం నీవే నాకు మహా వరం
నీవే నాకు దివ్యత్వం నీవే నాకు పరిమళం
నీవే నాకు శ్రేష్టం నీవే నాకు పరిశుద్ధ పరిపూర్ణం || అమ్మా! ||