Wednesday, February 28, 2018

ఏనాటిదో ఈ జీవితం ఏనాటికో ఈ జీవనం

ఏనాటిదో ఈ జీవితం ఏనాటికో ఈ జీవనం
ఎప్పటిదో ఈ దేహాత్మం ఎప్పటికో ఈ జీవాత్మం

ఎన్నడు లేని విధం నేడు సాగే జీవ ప్రయాణం   || ఏనాటిదో || 

ఎన్నో ఆలోచనల కార్యాలతో సాగే అపురూపమైనది జీవితం 
ఎన్నో భావాల తత్వాలతో సాగే ఆదర్శనీయమైనది జీవనం

నిత్యం జనన మరణ బంధాలతో సాగే భావాల చరితం
సర్వం సుఖ దుఃఖాల కార్యాలతో సాగే వేదాల చరణం   || ఏనాటిదో ||

ఉచ్చ్వాసలోని శ్వాస దేహానికే పరిశుద్ధమైన పరమాత్మం
నిచ్చ్వాసలోని ధ్యాస జీవానికే పరిశోధనమైన పరమార్థం

జీవించుటలోనే ధ్యానం దేహానికి సంభోగమైన శాంతం ప్రశాంతం 
మరణించుటలోనే దైవం ఆత్మకు సంయోగమైన శాంతం ప్రశాంతం   || ఏనాటిదో || 

నడిచి రావాలి ప్రతి రోజు ఉదయం ఆరోగ్యం కోసం

నడిచి రావాలి ప్రతి రోజు ఉదయం ఆరోగ్యం కోసం
నడిచి పోవాలి ప్రతి రోజు సాయంత్రం ఆనందం కోసం

నడవడమే జీవిత లక్ష్యమని ప్రతి రోజు ఆయుస్సుకై నడవాలి  || నడిచి ||

ఉదయించుటలో ఉన్నది సూర్య తేజ శక్తి ప్రభావ స్వరూపం
అస్తమించుటలో ఉన్నది సూర్య కిరణ శక్తి ప్రభాత సందేశం 

సూర్యోదయమే మేధాశక్తికి అనంత కార్యాల ఉత్తేజం
సూర్యాస్తమమే దేహశక్తికి ఆనంద కార్యాల ప్రశాంతం   || నడిచి ||

ప్రకృతిలోనే దేహాశక్తి పరిశోధనం జీవశక్తి ప్రభావం
ప్రకృతిలోనే దైవశక్తి పరిపూర్ణం జీర్ణశక్తి ప్రమేయం

నడిచేవేళ నవ నాడుల చలనం ఆరోగ్యానికి ఔషధం
నడిచేవేళ నవ రంధ్రాల చలనం ఆరోగ్యానికి ఔన్నత్యం  || నడిచి || 

Tuesday, February 27, 2018

మరణిస్తానని తెలిసిందా మరణమే వస్తుందని తెలిసేనా

మరణిస్తానని తెలిసిందా మరణమే వస్తుందని తెలిసేనా
మరణిస్తావని తెలిపేనా మరణమే ఆవహించేనని తోచేనా

మరణమంటే భయమని తలిచేవా మరణమే భారమని తపించావా
మరణమంటే అంతమని గమనించావా మరణమే వద్దని నిలిచావా   || మరణిస్తానని ||

మరణం ఎప్పుడోనని కార్యాలతో సాగుతున్నావా
మరణం ఎనాడోనని కాలంతో ప్రయాణిస్తున్నావా

మరణం నేడు లేదని మనస్సుతో జీవిస్తున్నావా
మరణం నేడు కాదని మేధస్సుతో ఆలోచిస్తున్నావా   || మరణిస్తానని ||

మరణమే మరచిపోయేలా ఆరోగ్యంతో ఉంటావా
మరణమే మరలిపోయేలా ఆనందంతో ఉన్నావా 

మరణమే తపించిపోయేలా శతాబ్దాల ఆయుస్సుతో సాగేవా
మరణమే తరించిపోయేలా దశాబ్దాల వయస్సుతో సాగేదవా   || మరణిస్తానని ||

మరణానికి మంత్రం ఉన్నదా మార్గం ఉన్నదా

మరణానికి మంత్రం ఉన్నదా మార్గం ఉన్నదా
మరణానికి మనస్సు ఉన్నదా వయస్సు ఉన్నదా

మరణానికి జీవం ఉన్నదా దేహం ఉన్నదా
మరణానికి రూపం ఉన్నదా దైవం ఉన్నదా

మరణమే మర్మమై మేధస్సులో మంత్రమైనదా   || మరణానికి ||

మరణమన్నది జన్మకు అంతమేనని
మరణమన్నది మేధస్సుకు విశ్రాంతేనని

మరణమన్నది దేహాలకు ప్రముఖమని
మరణమన్నది బంధాలకు ఏకాంతామని

మరణమన్నది మనస్సుకు ఆద్యంతమని
మరణమన్నది ఆయుస్సుకు అత్యంతమని   || మరణానికి ||

మరణమే మౌనమై వయస్సుతో ఆగిపోయేనా
మరణమే లీనమై మనస్సుతో నిలిచిపోయేనా

మరణమే నిర్జీవమై దివ్యంగా అదృశ్యమైపోయేనా
మరణమే తటస్థమై నవ్యంగా అంతరించిపోయేనా

మరణమే పరిపూర్ణమై జన్మతో జీవించిపోయేనా
మరణమే పరిశుద్ధమై ఆత్మతో ఆర్జించిపోయేనా   || మరణానికి || 

Monday, February 26, 2018

ఓం నమో సూర్య తేజం నమో సూర్య కాంతం

ఓం నమో సూర్య తేజం నమో సూర్య కాంతం
ఓం నమో సూర్య భావం నమో సూర్య తత్వం

ఓం నమో సూర్య గీతం నమో సూర్య నాదం
ఓం నమో సూర్య దేహం నమో సూర్య దైవం

ఓం నమో సూర్య స్నేహం నమో సూర్య ప్రేమం
ఓం నమో సూర్య ధ్యానం నమో సూర్య ధ్యేయం

ఓం నమో సూర్య వర్ణం నమో సూర్య గంధం
ఓం నమో సూర్య పత్రం నమో సూర్య పుష్పం

ఓం నమో సూర్య ప్రాణం నమో సూర్య జీవం
ఓం నమో సూర్య చిత్రం నమో సూర్య చైత్రం

ఓం నమో సూర్య రూపం నమో సూర్య దివ్యం
ఓం నమో సూర్య పుత్రం నమో సూర్య బంధం

ఓం నమో సూర్య సత్యం నమో సూర్య సర్వం
ఓం నమో సూర్య నిత్యం నమో సూర్య ధర్మం

ఓం నమో సూర్య అందం నమో సూర్య చందం
ఓం నమో సూర్య బింబం నమో సూర్య చంద్రం

ఓం నమో సూర్య కిరణం నమో సూర్య అరుణం
ఓం నమో సూర్య ప్రాంతం నమో సూర్య శాంతం

ఓం నమో సూర్య కాలం నమో సూర్య కార్యం
ఓం నమో సూర్య దేశం నమో సూర్య ప్రదేశం

ఓం నమో సూర్య సంగం నమో సూర్య రంగం
ఓం నమో సూర్య క్షేత్రం నమో సూర్య ఘాత్రం

ఓం నమో సూర్య సుగుణం నమో సూర్య సుఫలం
ఓం నమో సూర్య సుందరం నమో సూర్య సునందం

ఓం నమో సూర్య దర్శనం నమో సూర్య దైవికం
ఓం నమో సూర్య చరణం నమో సూర్య తరుణం

ఓం నమో సూర్య కణం నమో సూర్య గణం
ఓం నమో సూర్య జనం నమో సూర్య సైతం

ఓం నమో సూర్య సుద్ధం నమో సూర్య శుద్ధం
ఓం నమో సూర్య భోగం నమో సూర్య యోగం

ఓం నమో సూర్య వచనం నమో సూర్య వదనం
ఓం నమో సూర్య గమనం నమో సూర్య చలనం

ఓం నమో సూర్య కమలం నమో సూర్య కథనం
ఓం నమో సూర్య కుమారం నమో సూర్య కౌమారం 

Tuesday, February 20, 2018

శ్వాసపై ధ్యాసనే వహిస్తూ ఆయుస్సుతో నిత్యం జీవించాలి

శ్వాసపై ధ్యాసనే వహిస్తూ ఆయుస్సుతో నిత్యం జీవించాలి
ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను మనస్సుతో సర్వం గమనించాలి
(ఉచ్చ్వాస నిచ్చ్వాసాలనే గమనిస్తూ మనస్సుతో సర్వం గమనించాలి)

ఉచ్చ్వాస నిచ్చ్వాసాల హృదయ చలనాన్ని శాంతంతో సర్వం గ్రహించాలి
శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసాల కార్య తీవ్రతను ధ్యాసతో నిత్యం ధ్యానించాలి   || శ్వాసపై ||

శ్వాసపై స్వధ్యాస గమనంతోనే ఆరోగ్యాన్ని పరిశోధించాలి
ఉచ్చ్వాసపై కార్య మననంతోనే ఆనందాన్ని పరిశుద్దించాలి

ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రశాంతమే దేహనికి ఆరోగ్యం సాగాలి
ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రమేయమే దేహానికి ఆనందం కలగాలి   || శ్వాసపై ||

శ్వాసపై ధ్యాసను వహిస్తూనే శతాబ్దాల ఆయుస్సును అందుకోవాలి
ఉచ్చాసపై ధ్యానం చేస్తూనే దశాబ్దాల మనస్సును సాగించుకోవాలి

శ్వాసపై స్వధ్యాస ప్రశాంతమే యుగయుగాలకు చేరుకోవాలి
ఉచ్చ్వాసపై స్వధ్యాన గమనమే తరతరాలకు సమీపించాలి    || శ్వాసపై ||

Saturday, February 17, 2018

సృష్టినే ఇచ్చావు జీవులకు

సృష్టినే ఇచ్చావు జీవులకు
సృష్టిస్తూనే ఉన్నావు జీవులకు

సర్వమే ఇచ్చావు జీవులకు
సర్వస్వమే ఉంటావు జీవులకు 

నిత్యం ఉదయిస్తూనే అస్తమిస్తావు జీవులకు
సర్వం సమయంతోనే ప్రయాణిస్తావు జీవులకు   || సృష్టినే ||

అందమైన ఆకృతిని ఇచ్చావు విశ్వతికి
స్వచ్ఛమైన ప్రకృతిని ఇచ్చావు జగతికి

దివ్యమైన రూపతిని ఇచ్చావు దేహతికి
వేదమైన సంస్కృతిని ఇచ్చావు జనతికి   || సృష్టినే ||

సౌభాగ్యమైన సాహితిని ఇచ్చావు శ్రీమతికి
సుందరమైన మాలతిని ఇచ్చావు పుష్పతికి

పురాతనమైన జాగృతిని ఇచ్చావు ప్రగతికి
నూతనమైన బహుమతిని ఇచ్చావు జయంతికి   || సృష్టినే ||

Friday, February 16, 2018

ఉచ్చ్వాసతో శ్వాసనే గమనించు ధ్యాసతో ఆయుస్సునే అనుగ్రహించు

ఉచ్చ్వాసతో శ్వాసనే గమనించు ధ్యాసతో ఆయుస్సునే అనుగ్రహించు
ఉచ్చ్వాసతో దేహాన్నే పరిశోధించు స్వధ్యాసతో మనస్సునే పరిశుద్ధించు

ఉచ్చ్వాస నిచ్చ్వాసాల నిర్ణీత కాలాన్ని నిత్యం సమన్వయంగా శాంత పరచు
ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో దేహాన్ని సర్వం అనంత కార్యాలతో ప్రశాంత పరచు  || ఉచ్చ్వాసతో ||

ఏ క్షణం ప్రయాసతో సాగినా దేహాన్ని సమన్వయంగా ఉచ్చ్వాసతో సాగించు
ఏ సమయం దీక్షతో ఉండినా దేహాన్ని నిర్ణీత కాలంతో ఉచ్చ్వాసతో నడిపించు 

ఏ క్షణమైనా దేహానికి ఉచ్చ్వాస నిచ్ఛ్వాస కాల పరిమితిని సంభోగ పరచు
ఏ సమయమైనా శ్వాసకు ఉచ్చ్వాస నిచ్ఛ్వాస పరిమాణాన్ని సంయోగ పరచు   || ఉచ్చ్వాసతో ||

ఏ కార్యమందు లీనమైనా ఉచ్చ్వాస నిచ్చ్వాసాలపై స్వధ్యాసనే కేంద్రీకరించు
ఏ స్వభావమందు లయించినా స్వధ్యాస శ్వాసపై ఆలోచనతో ఏకాగ్రత వహించు

ఏ భావంతో సాగుతున్నా ఉచ్చ్వాస నిచ్చ్వాసాల గమనంతో ఆయుస్సును ఆనందపరచు 
ఏ తత్వంతో ఆవహిస్తున్నా శ్వాసపై ధ్యాసను ధ్యాన మననంతో మనస్సును సంతృప్తిపరచు  || ఉచ్చ్వాసతో ||

Wednesday, February 14, 2018

ఏనాటిదో జననాల తరంతరం ఎంతవరకో జీవితాల తత్సంబంధం

ఏనాటిదో జననాల తరంతరం ఎంతవరకో జీవితాల తత్సంబంధం
ఎక్కడిదో జననాల ఉత్పన్నం ఎప్పటివరకో జీవితాల ఆత్మ బంధం 

జీవన విధానంతో సాగే పరిణామమే జీవుల తత్సంగాల కాల పరిమాణం  || ఏనాటిదో ||

ఉదయిస్తూనే జీవిస్తున్నాము అస్తమిస్తూనే ప్రయాణిస్తున్నాము
కార్యాలతో నిత్యం సాగుతున్నాము కాలంతో సర్వం శ్రమిస్తున్నాము

విజ్ఞాన వేదాలతో పరిశోధనం చేస్తూనే పరమార్థాన్ని గ్రహిస్తున్నాము
బంధాల భావాలతో అధ్యాయనం చేస్తూనే అర్థాన్ని గమనిస్తున్నాము  || ఏనాటిదో ||

సాధనతో సాధించిన విజయాలను చాలకనే ఎన్నో నవ విషయాలను అన్వేషిస్తున్నాము
సాంకేతిక ప్రగతినే అధిరోహించినా సూక్ష్మ రూపాల కదలికలనే దివ్యంగా పరీక్షిస్తున్నాము

అనంతమైన విశ్వాన్ని అణువణువులుగా రకరకాలుగా ఉపయోగిస్తున్నాము
అపురూపమైన ప్రాంతాన్ని నిర్మాణాలతో ఎన్నో విధాలుగా ఆవహిస్తున్నాము  || ఏనాటిదో ||

ఓ దేవా మహా దేవా మేధస్సే మహా మర్మం

ఓ దేవా మహా దేవా మేధస్సే మహా మర్మం
ఓ దేవా మహా దేవా మేధస్సే మహా మంత్రం

ఓ దేవా మహా దేవా మేధస్సే మహా తంత్రం
ఓ దేవా మహా దేవా మేధస్సే మహా యంత్రం  || ఓ దేవా ||

మేధస్సులోనే మహా జీవం
మేధస్సులోనే మహా తేజం
మేధస్సులోనే మహా దైవం
మేధస్సులోనే మహా భావం

మేధస్సులోనే మహా వేదం
మేధస్సులోనే మహా జ్ఞానం
మేధస్సులోనే మహా రూపం
మేధస్సులోనే మహా తత్వం  || ఓ దేవా ||

మేధస్సులోనే మహా లోకం
మేధస్సులోనే మహా విశ్వం
మేధస్సులోనే మహా బంధం
మేధస్సులోనే మహా ప్రదేశం

మేధస్సులోనే మహా గమ్యం
మేధస్సులోనే మహా ధ్యానం 
మేధస్సులోనే మహా శాంతం
మేధస్సులోనే మహా ప్రాంతం  || ఓ దేవా ||

నీవే నా జీవం జీవేశ్వరా

నీవే నా జీవం జీవేశ్వరా
నీవే నా దైవం దైవేశ్వరా
నీవే నా రూపం రూపేశ్వరా
నీవే నా ప్రాణం ప్రాణేశ్వరా

నీవే నా వేదం వేదేశ్వరా
నీవే నా భావం భావేశ్వరా
నీవే నా జ్ఞానం జ్ఞానేశ్వరా
నీవే నా తత్వం తత్వేశ్వరా

నీవే నా హితం హితేశ్వరా
నీవే నా ఆత్మం ఆత్మేశ్వరా
నీవే నా ప్రేమం ప్రేమేశ్వరా
నీవే నా స్నేహం స్నేహేశ్వరా

నీవే నా సర్వం సర్వేశ్వరా
నీవే నా నిత్యం నిత్యేశ్వరా
నీవే నా శాంతం శాంతేశ్వరా
నీవే నా అంతం అంతేశ్వరా

మహారాత్రి మహేశ్వరా

మహారాత్రి మహేశ్వరా
శివరాత్రి శివేశ్వరా
శుభరాత్రి శుభేశ్వరా
గుణరాత్రి గుణేశ్వరా
భవరాత్రి భవేశ్వరా
జీవరాత్రి జీవేశ్వరా
నవరాత్రి నవేశ్వరా
విశ్వరాత్రి విశ్వేశ్వరా
దివ్యరాత్రి దివ్యేశ్వరా
విద్యరాత్రి విద్యేశ్వరా
పరరాత్రి పరేశ్వరా
ప్రజరాత్రి ప్రజేశ్వరా
జనరాత్రి జనేశ్వరా
యోగరాత్రి యోగేశ్వరా
భోగరాత్రి భోగేశ్వరా
వరరాత్రి వరేశ్వరా
వర్ణరాత్రి వర్ణేశ్వరా
జలరాత్రి జలేశ్వరా
వనరాత్రి వనేశ్వరా
స్వరరాత్రి స్వరేశ్వరా
గానరాత్రి గానేశ్వరా
పూర్ణరాత్రి పూర్ణేశ్వరా
చంద్రరాత్రి చంద్రేశ్వరా
వాయురాత్రి వాయేశ్వరా
కాలరాత్రి కాలేశ్వరా
క్షణరాత్రి క్షణేశ్వరా
ముక్తిరాత్రి ముక్తేశ్వరా
లోకరాత్రి లోకేశ్వరా
హరరాత్రి హరేశ్వరా
బ్రంహరాత్రి బ్రంహేశ్వరా
మౌనరాత్రి మౌనేశ్వరా
మూలరాత్రి మూలేశ్వరా
తొలిరాత్రి తొలీశ్వరా 
మోహరాత్రి మోహేశ్వరా
దీపరాత్రి దీపేశ్వరా
చలిరాత్రి చలేశ్వరా
హిమరాత్రి హిమేశ్వరా
కాంతిరాత్రి కాంతేశ్వరా
పుణ్యరాత్రి పుణ్యేశ్వరా
ధన్యరాత్రి ధన్యేశ్వరా
భాగ్యరాత్రి భాగ్యేశ్వరా
శుద్ధరాత్రి శుద్ధేశ్వరా
ఆత్మరాత్రి ఆత్మేశ్వరా
హితరాత్రి హితేశ్వరా