Friday, December 28, 2018

నా వాక్యం ఒక కావ్యం నా పదం ఒక భావం

నా వాక్యం ఒక కావ్యం నా పదం ఒక భావం
నా అర్థం ఒక గేయం నా వేదం ఒక తత్వం

నా అక్షరం ఒక అంకుశం నా సమాసం ఒక సామర్థ్యం
నా పఠనం ఒక వేదాంతం నా అధ్యాయం ఒక విజ్ఞానం   || నా వాక్యం ||

నా వాక్యమునే అడిగెదను పదముల వరుస అర్థమగునని
నా పదములనే కలిపెదను స్వభావాల మధ్యస తెలుసునని

నా అక్షరమునే చేర్చెదను పదముగా పధ్ధతి తెలియునని
నా కావ్యమునే పలికెదను వేదముగా జాగృతి తెలుపునని   || నా వాక్యం ||

నా గేయమునే కోరెదను వాక్యముగా లక్ష్యం తోచునని
నా పాఠమునే చదివెదను కథముగా న్యాయం చేయునని

నా నిఘంటువునే అన్వేషించెదను పదాల అర్థాలు తెలిసేనని
నా సంపుటమునే పఠించెదను గ్రంధాల పరమార్థాలు కలుగునని   || నా వాక్యం ||

ఏనాటి ప్రకృతివో ఏనాటి ఆకృతివో నీవు

ఏనాటి ప్రకృతివో ఏనాటి ఆకృతివో నీవు
ఎంతటి విశ్వతివో ఎంతటి జగతివో నీవు

జీవతికే రక్షతివై జగతికే ప్రకృతివై జన్మతికే జాగృతివై దైవంతో వెలిశావు   || ఏనాటి ||

ఆకృతిగా విశ్వతిని అక్షతించే ఆకారవరణం నీవే
జాగృతిగా ప్రకృతిని రక్షతించే పర్యావరణం నీవే

ప్రకృతిగా విశ్వతిని ప్రణతించే దర్శతి రూపం నీవే
ఆకృతిగా జగతిని మాలతించే హారతి స్వరూపం నీవే   || ఏనాటి ||

స్రవంతిగా జీవతిని జాగృతించే ఆద్యంతి భావం నీవే
ప్రశాంతిగా దైవతిని ఆధ్రతించే ధీరతి స్వభావం నీవే

విశ్రాంతిగా అమరావతిని సమ్మతించే సుమతి వేదం నీవే
అవంతిగా అరుంధతిని మోహతించే సుకృతి వేదాంతం నీవే   || ఏనాటి || 

Wednesday, December 26, 2018

ఏనాటి ధృవ తారవో నీవు ఎంతటి ధృవ తారవో నీవు

ఏనాటి ధృవ తారవో నీవు ఎంతటి ధృవ తారవో నీవు
గగనంలోనే వెలిశావు అంతరిక్షంలోనే ప్రకాశించావు

ఏనాటి నవ తేజానివో నీవు ఎంతటి మహా వర్ణానివో నీవు
గగనంలోనే ఉదయించావు అంతరిక్షంలోనే జన్మించావు

మెరిసే నీ రూపమే మౌనం ఒదిగే నీ వర్ణమే మోహం
విరిసే నీ తేజమే అఖిలం ఎదిగే నీ కాంతమే అమోఘం   || ఏనాటి ||

సూర్య తేజముతో ఎదిగే నీ వైనం ఆకాశంలో నీవే అపురూపం
చంద్ర కాంతముతో ఒదిగే నీ విధం అంతరిక్షంలో నీవే అపూర్వం

విశ్వ తేజస్సుతో వికసించే నీ కిరణం అరుణోదయ ఆనందం
దివ్య రజస్సుతో విహరించే నీ చలనం ఉషోదయ ఉదయం   || ఏనాటి || 

Tuesday, December 25, 2018

జై అనరా జై జై అనరా

జై అనరా జై జై అనరా
సై అనరా సై సై అనరా

విశ్వానికి సై అనరా జగానికి జై అనరా
లోకానికి సై అనరా ప్రకృతికి జై అనరా 

సమరానికి సై విజయానికి జై మనదే రా
సత్యానికి సైసై ధర్మానికి జైజై మనదే రా

శాంతతకు సై ప్రశాంతకు జై మనమే రా 

నిత్యం సై సై సర్వం జై జై మనమే రా మనదే రా   || జై అనరా ||

అనంత సంతోషానికి సైరా శాంత సమరానికి సైరా
మహా సాహసానికి సైరా ప్రశాంత సంబరానికి సైరా 

విజయాల ఉత్సవాలకు వినోదాల విందులకు సైరా
నవోదయ స్వభావాలకు ఉషోదయ తత్వాలకు సైరా   || జై అనరా ||

వేదాల ఉపనిషత్తులకు జైరా చరిత్రాల పురాణాలకు జైరా
శాస్త్రాల సిద్ధాంతాలకు జైరా పరిశుద్ధ పరిశోధనాలకు జైరా

అనంత జీవుల బంధాలకు జీవన కార్యాల జీవితాలకు జైరా
మహా ఆకారాల రూపాలకు అఖండ కాలాల తరాలకు జైజైరా   || జై అనరా ||

Sunday, December 23, 2018

సరిగమ స్వరముల పదనిస పదముల

సరిగమ స్వరముల పదనిస పదముల
సరిగమ చదువుల పదనిస పలుకుల

సరిగమ మధువుల పదనిస మనువుల
సరిగమ తలుపుల పదనిస వలపుల

తపనమే గీతం తరుణమే సంగీతం
చలనమే గాత్రం గమనమే సంకేతం

సాధనమే సాహిత్యం సాగరమే సాంగత్యం
సాహసమే సందర్భం సద్భావమే సంపూర్ణం   || సరిగమ ||

అవకాశమే అంకుశం అవధానమే అపురూపం
అనుభవమే ఆదర్శం ఆభరణమే అలంకారం

ఆరోగ్యమే అనుబంధం అనురాగమే అమరత్వం
అధ్యాయమే అనుగ్రం అనూహ్యమే అపరిచిత్వం

ఆకారమే అమృతం ఆద్యంతమే అమోఘం
ఆకర్షణమే ఆకృతం ఆచరణమే ఆస్వాదనం   || సరిగమ ||

సరిగమలే స్వరముల సాహిత్య సంగీతం
పదనిసలే పదముల పలుకుల ప్రశంసం

గమకాల గమనమే గాత్రముల గాంధర్వం
గీతముల గానములే గేయముల గాంగేయం

చిత్రముల వర్ణనలే సంగీత వర్ణాల సోయగం
కళముల కళకళలే మాధుర్య కవితల కమనం  || సరిగమ ||

ఏదో మార్చెను ఎంతో మారెను ఈ లోకం

ఏదో మార్చెను ఎంతో మారెను ఈ లోకం
ఏదో చూపెను ఎంతో చెప్పెను ఈ విశ్వం

ఏదో తలిచెను ఎంతో తెలిపెను ఈ జీవం
ఏదో ఒదిగెను ఎంతో ఎదిగెను ఈ విజ్ఞానం     || ఏదో ||

నడిచే కాలం వెళ్ళిపోతుందా
కొలిచే భావం తప్పిపోతుందా
పిలిచే రాగం మర్చిపోతుందా
గెలిచే ప్రాణం వచ్చిపోతుందా

ఎగిరే వైనం జారిపోతుందా
నడిపే కార్యం వీడిపోతుందా
కుదిరే బంధం ఆగిపోతుందా    || ఏదో ||

ఎదిగే భావం కరిగిపోతుందా
కలిగే లాభం విరిగిపోతుందా
ఒదిగే తత్వం తరిగిపోతుందా
అడిగే భాగ్యం అరిగిపోతుందా

చదివే జ్ఞానం పెరిగిపోతుందా
కలిసే స్నేహం అలిగిపోతుందా
మురిసే రూపం తొలగిపోతుందా     || ఏదో || 

ఆకాశం అద్భుతం ఆకారం ఆశ్చర్యం

ఆకాశం అద్భుతం ఆకారం ఆశ్చర్యం
ఆరోగ్యం ఆదర్శం ఆధారం ఆభరణం

ఆనందం అంకుశం అధ్యాయం ఆదేశం
అనంతం అదృశ్యం ఆశీర్వాదం అతిశయం   || ఆకాశం ||

మరణం మహనీయం మంగళం మమకారం
మాధుర్యం మృదంగం మకరందం మహాశయం

ప్రతేజం ప్రదేశం ప్రశాంతం పట్టాభిషేకం
పరిశోధనం పరిమళం ప్రకృతం పర్యావరణం   || ఆకాశం ||

నిర్మాణం నిదర్శనం నిర్ణయం నిమిషం
నిర్వచనం నిపుణం నిర్విఘ్నం నీరాజనం

సమయం సందర్భం సమరం సమాప్తం
సంకల్పం సంతోషం సద్భావం సంకీర్తనం   || ఆకాశం || 

Friday, December 21, 2018

విశ్వంలో ఉన్నావని ప్రకృతిలో ఉంటావని ఆలోచన చేసెదవా

విశ్వంలో ఉన్నావని ప్రకృతిలో ఉంటావని ఆలోచన చేసెదవా
వేదంతో ఉన్నావని జ్ఞానంతో ఉంటావని పరిశోధన చేసెదవా

జీవంతో జీవిస్తావని భావంతో నడిచేవని విజ్ఞానం తలిచెదవా
సత్యంతో జీవిస్తావని తత్వంతో నడిచేవని వేదాంతం తలిచెదవా  || విశ్వంలో ||

మేధస్సులోనే జగతిని ఊహిస్తూ బ్రంహాండం చూసెదవా
మనస్సులోనే ఆకృతిని వర్ణిస్తూ బృందావనం చూసెదవా

ప్రకృతిలోని విశ్వాన్ని తిలకిస్తూ పర్యావరణం చేసెదవా
విశ్వతిలోనే జీవాన్ని ఆస్వాదిస్తూ పరిపూర్ణం చేసెదవా   || విశ్వంలో ||

విజ్ఞానంతో దైవాన్ని స్మరిస్తూ అనుభవం కలిగించేవా
వేదంతో ధర్మాన్ని ధ్యానిస్తూ అనూహ్యం కలిగించేవా

స్నేహంతో లోకాన్ని పలికిస్తూ అనుబంధం సృష్టించేవా
ప్రేమంతో కాళాన్ని నడిపిస్తూ అపురూపం సృష్టించేవా   || విశ్వంలో || 

Wednesday, December 12, 2018

జ్ఞానమే ఆత్మ పరమాత్మగా ఉదయించేనా

జ్ఞానమే ఆత్మ పరమాత్మగా ఉదయించేనా
వేదమే జ్యోతి పరంజ్యోతిగా అధిరోహించేనా

మేధస్సులో ఆత్మ జ్యోతియే ఉజ్జ్వల తేజస్సుతో ప్రకాశించేనా   || జ్ఞానమే ||

విశ్వ విజ్ఞానమే అన్వేషించగా ఆత్మ జ్ఞానమే ఉదయించేనా
దైవ వేదాంతమే పరిశోధించగా జ్యోతి జ్ఞానమే ఉదయించేనా

సర్వ వేదములు పఠించగా పర జ్ఞానమే అధిరోహించేనా
సర్వ జీవములు జీవించగా సర్వ జ్ఞానమే అధిరోహించేనా   || జ్ఞానమే ||

అనంత భావాల స్వభావాలే విశ్వ వేదాలై జగతిలో అవతరించేనా
అనంత తత్వాల జీవత్వాలే వేద జ్ఞానమై ప్రకృతిలో అవతరించేనా

విజ్ఞాన జ్యోతులు అనంత ప్రకాశవంతమై మేధస్సులలో ప్రకాశించేనా
విజ్ఞాన కాంతులు అనంత ప్రతేజవంతమై శిరస్స్సులలో ప్రకాశించేనా   || జ్ఞానమే ||