Showing posts with label వర్ణం. Show all posts
Showing posts with label వర్ణం. Show all posts

Wednesday, August 23, 2017

నిద్రించలేదు ఎన్నడూ మరవలేదు ఎప్పుడూ

నిద్రించలేదు ఎన్నడూ మరవలేదు ఎప్పుడూ
మరణించలేదు ఎన్నడూ అస్తమించలేదు ఎప్పుడూ

భావాలతోనే స్మరిస్తున్నా జ్ఞాపకాలతోనే  జీవిస్తున్నా ఎల్లప్పుడూ
తత్వాలతోనే స్పర్శిస్తున్నా వేదాలతోనే గమనిస్తున్నా ఎల్లప్పుడూ   || నిద్రించలేదు ||

రూపంతోనే ఉదయిస్తున్నా దేహంతోనే ధ్యానిస్తున్నా
జ్ఞానంతోనే విశ్వసిస్తున్నా దైవంతోనే ప్రయాణిస్తున్నా

శ్వాసతోనే తపిస్తున్నా ధ్యాసతోనే పరిశోధిస్తున్నా
కోరికతోనే శ్రమిస్తున్నా ఎరుకతోనే విలపిస్తున్నా   || నిద్రించలేదు ||

కాలంతోనే సమర్పిస్తున్నా జీవంతోనే అర్పిస్తున్నా
వర్ణంతోనే నివసిస్తున్నా ప్రాయంతోనే వచ్చేస్తున్నా

విశ్వతితోనే గడిపేస్తున్నా జగతితోనే విహరిస్తున్నా
జనతితోనే పనిచేస్తున్నా ప్రకృతితోనే ఎదిగేస్తున్నా  || నిద్రించలేదు ||

Monday, August 21, 2017

భావమా అపురూపమా బంధమా అనురాగమా

భావమా అపురూపమా బంధమా అనురాగమా
రూపమా అనుబంధమా వర్ణమా అతిశయమా

జీవులకే స్వభావమా మేధస్సులకే మోహమా
వేదాలకే సువర్ణమా బంధాలకే స్వరూపమా   || భావమా ||

ఎవరో మలచిన శిల్పం ఎవరో తిలకించిన వర్ణం
ఎందరో దాల్చిన వర్ణం ఎందరో వర్ణించిన శిల్పం

ఎవరికో కలిగిన స్వప్నం ఎవరో మలచిన రూపం
ఎవరికో తెలిసిన భావం ఎవరో వహించిన దేహం  || భావమా ||

ఏమని కలిగిన భావం ఎవరికో తోచిన స్వరూపం
ఏమని తెలిసిన రూపం ఎవరికో కోరిన సుందరం  

ఎంతని వర్ణించిన దేహం ఏదని తపించిన భావం
ఎంతని వహించిన రూపం ఏదని ధరించిన వర్ణం  || భావమా || 

Tuesday, July 4, 2017

ఏమని నన్ను మెప్పించావు

ఏమని నన్ను మెప్పించావు
ఏమని నన్ను ఒప్పించావు
ఏమని నన్ను రప్పించావు

తెలియకనే తెలియని కాలంతో మెప్పించి ఒప్పించి రప్పించావు  || ఏమని ||

మెచ్చిన రూపం ఒప్పిన అందం జతకై రప్పించేనా
తలచిన భావం తపించిన తత్వం మనకై ఒప్పించేనా
కలసిన స్నేహం చేరిన ప్రేమం మదికై మెప్పించేనా   || ఏమని ||

చూసిన సమయం ఆగని తరుణం కాలంతో రప్పించిన తపనం
కోరిన శృంగారం మీరిన వయ్యారం దేహంతో ఒప్పించిన సోయగం
మెరిసిన తేజం విరిసిన కాంతం వర్ణంతో మెప్పించిన కమనీయం   || ఏమని || 

Thursday, December 8, 2016

వేదంలోనే లీనమైపోయా భావంతోనే నిలిచిపోయా

వేదంలోనే లీనమైపోయా భావంతోనే నిలిచిపోయా
రూపంతోనే ఉండిపోయా వర్ణంలోనే ఒదిగిపోయా
దైవంలోనే ఆగిపోయా తత్వంతోనే మరచిపోయా  
బంధంతోనే సాగిపోయా దేహంతోనే వెళ్ళిపోయా   || వేదంలోనే ||

జీవత్వమైనా దైవత్వమైనా మన దేహంలోని దాగివుంది
అద్వైత్వమైనా పరతత్వమైనా మన జీవంలోని దాగివుంది

వేదత్వమైనా భావత్వమైనా మన మేధస్సులోనే దాగివుంది
గుణత్వమైన వర్ణత్వమైనా మన ఆలోచనలలోనే దాగివుంది  || వేదంలోనే ||

పరతత్వ భావం  రూపం
పరభావ తత్వం పరమాత్మ దేహం

పరరూప వేదం పరజీవ తత్వం
పరదేహ మోహం పరధాత భావం

జీవం నిలయం దేహం ఆలయం
కాలం శాంతం సమయం క్షేత్రం

విశ్వంలోనే వేద సత్యం జగంలోనే వేదాంత ధర్మం
మౌనంలోనే మోహ బంధం శూన్యంలోనే సర్వ శాంతం  || వేదంలోనే ||

Tuesday, December 6, 2016

హృదయం మధురం కిరణం అరుణం

హృదయం మధురం కిరణం అరుణం
సమయం తరుణం తపనం చరితం
ప్రేమం ప్రాణం ప్రియం నేస్తం
మౌనం భావం మోహం వేదం
గానం గీతం రాగం గాత్రం                         || హృదయం ||

యుగమే తరమై లయమే లీనమై పోయేనా
నిత్యం సత్యం అనుకున్నా ధర్మం దైవం తలచేనా
దేహం జీవం ఒకటైనా శరీరం ఆకారం ఒకటైపోవునా

సంగీతం సంతోషం ఆనందం అదృష్టం వరించేనా
రూపం భావం దేహం జీవం ఒకటిగా కలిసిపోయేనా   || హృదయం ||

తేజం వర్ణం పత్రం గంధం సుందరమై మెరిసిపోయేనా
స్వరమే వరమై నేత్రమే చిత్రమై కనిపించి వినిపించేనా
మార్గం గమ్యం కాలం క్షణమై కరిగిపోతూ ప్రయాణించేనా

మేఘం వర్షం కదిలిపోయి తరిగిపోతూ ప్రవహించేనా
బంధం భాష్పం ముడిపడిపోయి సంబంధమయ్యేనా  || హృదయం || 

Friday, September 23, 2016

సిరిమల్లె పువ్వా సింధూర పువ్వా సిరి వెన్నెలలో నవ్వవా

సిరిమల్లె పువ్వా సింధూర పువ్వా సిరి వెన్నెలలో నవ్వవా
చామంతి పువ్వా చిన్నారి పువ్వా చిరు గాలితో సిగ్గు పడవా

విరబూసే పువ్వులా విల విలమంటూ నవ్వుతూ పూయవా
కల కలమంటూ గల గలమంటూ సుగంధంతో పూయవా  || సిరిమల్లె ||

పువ్వులా విరబూసే నీ నవ్వులో సుగంధాల సుమధురమే దాగున్నదా
పుష్పంలా వికసించే నీ రంగులో సువర్ణాల మేలిమి వర్ణం దాగున్నదా

మొక్కలలోనే మొగ్గవై ప్రతి రోజూ పూల తోటలో పదిలంగా పూసెదవా
మొక్కలలోనే మక్కువై ప్రేమికులకు నీవే ప్రశాంతతను పంచెదవా   || సిరిమల్లె ||

ప్రతి గాలి శ్వాసలో నీవే పుష్పాల సుగంధమై మనస్సునే దాచెయ్యవా
ప్రతి చోట గాలితో నీవే మధురమైన సుగంధాన్ని శ్వాసకు అందించవా

సిరి జల్లుల తోటి  కురిసే వేళ పూచే నీ లేత సువాసనతో మైమరిపించావా
ప్రాణ వాయువును నీవే సువాసనలతో స్వచ్ఛంగా ప్రతి జీవికి అందించవా  || సిరిమల్లె ||

Friday, July 8, 2016

వర్ణమే తేజమై విశ్వమే వెలుగై జీవమే ఉత్తేజమై జీవితమే కొనసాగేను

వర్ణమే తేజమై విశ్వమే వెలుగై జీవమే ఉత్తేజమై జీవితమే కొనసాగేను
ఆలోచనలలో వర్ణ భావమే ఉత్తేజమై విజ్ఞాన అన్వేషణ కొనసాగించేను
మేధస్సే మహా విజ్ఞాన ప్రదేశమై అర్థాను గుణ ప్రద భావాలను గమనించేను
సూర్యని వర్ణ తేజస్సులలో ఎన్నో ఉత్తేజ విజ్ఞాన గుణ భావాలు దాగివుండేను
వర్ణం లేని వెలుగు సూర్యుడు లేని ఉత్తేజము అల్పజ్ఞానమై మేధస్సుకు సోకేను

Wednesday, June 15, 2016

ఆకాశం సృష్టికి నిలయం

ఆకాశం సృష్టికి నిలయం
ఆకాశం జగతికి సంపూర్ణం
ఆకాశం లోకానికి మందిరం
ఆకాశం మేధస్సుకే ఉత్తేజం
ఆకాశం విశ్వానికి సంయోగం
ఆకాశం మేఘానికి రూప వర్ణం
ఆకాశం సూర్యునికి మహా తేజం
ఆకాశం కిరణానికి దివ్య దర్శనం
ఆకాశం ఇంద్రధనస్సుకే పదిలం