Wednesday, September 10, 2025

ఎంత చదివినా ఎంత నేర్చినా

ఎంత చదివినా ఎంత నేర్చినా 
ఎంత తెలిసినా ఎంత తెలిపినా 

ఎంత కాలం శ్రమించినా ఎంత కాలం జీవించినా
చివరికి అలసితినీ ... ! మరణానికి సిద్ధమై వేచితిని (నీ ... !)   || ఎంత చదివినా || 

ఎన్నో విధాలుగా ఎన్నో కార్యాలతో ఏంతో కాలం ఎన్నో చేసితిని (నీ ... !)
ఎన్నో రకాలుగా ఎన్నో భావాలతో ఏంతో కాలం ఎన్నో చూసితిని (నీ ... !)

ఎన్నో విధాలుగా ఎన్నో మార్పులతో ఎంతో సమయం ఓర్చితిని (నీ ... !)
ఎన్నో రకాలుగా ఎన్నో తత్వాలతో ఎంతో సమయం ధరించితిని  (నీ ... !)

ఎన్నో బంధాలతో ఎన్నో పరిచయాలతో ఎంతో కాలం గడిచితిని (నీ ... !)
ఎన్నో స్వరాలతో ఎన్నో ప్రయాణాలతో ఏంతో కాలం సాగించితిని (నీ ... !)

ఎన్నో రూపాలతో ఎన్నో పరిశోధనలతో ఎంతో సమయం అన్వేషించితిని (నీ ... !)
ఎన్నో జీవాలతో ఎన్నో పరిణామాలతో ఎంతో సమయం పరిభ్రమించితిని (నీ ... !)

ఉండాలని మేధస్సు తెలిపినా పోవాలని మనస్సు తలచినా వెళ్ళిపోవాలని దేహస్సు తపిస్తున్నది (దీ ... ! )
ఓ మహా దేవా ... 1 

జీవం పోసి దేహం నిలిపి రూపం దాల్చి శరీరాన్ని నడిపించి ఎన్నో బంధాలతో ఎన్నో కార్యాలతో విశ్వమంతా తిరిగించి అలసట కలిగించి జగతి నుండి నీ అహం తరిమేస్తున్నది (దీ ... ! )

జీవం నిలుచుటకు ఏ విజ్ఞానం ఏ మంత్రాన్ని కనుగొనలేదు 
రూపం సాగించుటకు ఏ వయస్సు ఈ దేహాన్ని ఓర్చుటలేదు  

ప్రశాంతంగా మరణించేందుకు పరిశుద్ధమైన మనస్సును స్వచ్ఛమైన ప్రదేశంలో నా శరీరాన్ని పంచభూతాలకు ఆత్మ సాక్షిగా అర్పించెదవా  || ఎంత చదివినా || 

జీవం నిలుపుకొనుటకు శ్వాసనే ఎంతో కాలం శాంతంగా గమనించితిని (నీ ... !)
రూపం సాగించుకొనుటకు ధ్యాసనే ఎంతో కాలం జాగ్రత్తగా స్మరించితిని (నీ ... !) 

నిత్యం తెలుసుకొనుటకు ఎన్నో బంధాలతో ఎంతో కాలం సాగుతూ మరణం ఉందని మరచితిని (నీ ... !)
సర్వం దాచుకొనుటకు ఎన్నో కార్యాలతో ఎంతో కాలం శ్రమిస్తూ మరణం లేదని భ్రమించితిని (నీ ... !)

యోగం కలిగేందుకు ఎన్నో ప్రయత్నాలతో ఎంతో సమయం గడిపేస్తూ మరణం ఉందని సహించితిని (నీ ... !) 
భాగ్యం వరించేందుకు ఎన్నో పరిశోధనలతో ఎంతో సమయం ప్రయాణిస్తూ మరణం లేదని కలగంటితిని (నీ ... !)

ఉండేదెవరో మేధస్సుకు తెలియదా పోయేదెవరో మనస్సుకు తెలియదా వచ్చిపోయేవారెవరో దేహస్సుకు తెలిసేనా (నా .. !)


జీవం అందించి దేహం జోడించి రూపం కల్పించి ఎన్నో బంధాలతో ఎన్నో కార్యాలతో జగమంతా శ్రమించి ఓర్చుట  స్తభించి  విశ్వతి నుండి నీ స్థైర్యం విశ్రమిస్తున్నది (దీ ... ! )

జీవం నిలుచుటకు ఏ విజ్ఞానం ఏ ఔషధాన్ని కనుగొనలేదు 
రూపం సాగించుటకు ఏ వయస్సు ఈ బంధాన్ని ఓర్చుటలేదు

ప్రశాంతంగా మరణించేందుకు పరిశుద్ధమైన మనస్సును స్వచ్ఛమైన ప్రదేశంలో నా శరీరాన్ని పంచభూతాలకు ఆత్మ సాక్షిగా అర్పించెదవా  || ఎంత చదివినా || 


-- మరణానికి నేను ఎప్పుడు తలవంచితినో అప్పుడే నా సర్వ భావాల తత్వాలు దేహం నుండి వదిలిపోయి విశ్వ ప్రకృతిలో లీనమై పంచభూతాలుగా చిగురిస్తూ జగమంతా నిరంతరం అభివృద్ధి చెందుతూ బ్రంహాండాన్ని విజ్ఞానంతో పరిశోధిస్తూ ఉంటాయి 

-- మరణానికి వేచి ఉన్నవారికి కోరికలు ఉండవు 
-- ఆరోగ్యం ఉన్నవారికి విజ్ఞాన పరిశోధనలు ఉండాలి 

No comments:

Post a Comment