Monday, March 30, 2015

ఒక క్షణముకై జీవితమంతయు వేచినా

ఒక క్షణముకై జీవితమంతయు వేచినా ఆ క్షణ భావన నా మేధస్సులోనే మిగిలిపోయింది
విజయానందము కలిగించే భావన నా జీవితంలో కలుగలేక నా ఊహలోనే ఉండిపోయింది 
ఊహించిన ఆలోచనల భావాలన్నియు తీరలేని కోరికలతో మనలోనే నిలిచిపోతున్నాయి 
మనం ఊహించే భావాలకు నిజ జీవిత భావాలకు మన ఆలోచనలు ఏ కోణంలో ఉన్నాయి
భావాలతో కూడిన కోరికలకై మన ఆలోచనలు సరైన దారిలో దృడంగా వెళ్లుతున్నాయా
కోరికలు తీరుటకై మన ప్రయత్నాలు ఎటువంటి అనుభవాలతో ఎంత కాలం సాగుతున్నాయి
ప్రయత్నాలలో లోపాలు విజ్ఞాన కొరత అలసట అయిష్టత భావాలు ఎన్నో కలుగుతుంటాయి
జీవన విధానాన్ని కొన సాగిస్తూ కోరికలకై కొంత సమయం కేటాయిస్తూ ప్రయత్నిస్తూ సాగాలి
ఎన్ని సార్లు విఫలమౌతున్నా కోరికలను జయించుటలో సరి లేని నిద్రలు కూడా సాగవచ్చు
విజయానందము కలిగే వరకు పోరాడుటలో మరణము కూడా ఎలాగైనా సంభవించవచ్చు
అంతులేని కోరికలతో జీవితాన్ని వృధా చేయక నిత్యవసరాలను తీర్చుకోవడమే మిన్న
ఉన్నతమైన భావాలతో సరైన కోరికలతో జీవితాన్ని అర్థవంతంగా మార్గ దర్శకంతో సాగించండి
కలగలేని క్షణము కంటిలోనే దాగున్నా ఊహలోని భావానంద విజయము నీ మేధస్సునకేలే

Monday, March 16, 2015

ఆలోచనకారి మనస్సుకారి మేధస్సుకారి

ఆలోచనకారి మనస్సుకారి మేధస్సుకారి మన భావాలే
ఆలోచన ఏదైనా మేధస్సు గ్రహిస్తుంది లేదా తెలుపుతుంది
మేధస్సులోని ఆలోచనను మనస్సు వేర్వేరుగా చేస్తుంది
మనస్సు ఒక ఆలోచనను రెండు అర్థాలతో లేదా ఎక్కువ అర్థాలతో గ్రహిస్తుంది
రెండు అర్థాలు రెండు ఆలోచనలుగా కూడా అనుకోవచ్చు
రెండు అర్థాలు మంచివి లేదా రెండు వేరే అర్థాలు కావచ్చు
ఓకే కార్యాన్ని రెండు రకాలుగా ఆలోచిస్తూ ఒక దానిని ఎన్నుకోవచ్చు
ఒక విధంగా చేస్తే ఒక విధమైన ఫలితం మరోలా చేస్తే ఇంకోలా ఫలితం
ఒక కార్యానికి ఎక్కువ సమయం కేటాయిస్తే మరొకటి తక్కువ కావచ్చు
ఒక కార్యం లాభ ధాయకమైతె మరొకటి నష్టాన్ని కలిగించవచ్చు
ఒక ఆలోచనను లేదా ఒక కార్యాన్ని మరెన్నో రకాలుగా గ్రహించవచ్చు
గ్రహించిన వాటిలో అనుభవంతో ఒక దానిని మనమే నిర్ణయించు కోవాలి
మనం తీసుకునే నిర్ణయం పైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది
ఎన్నో ఆలోచనలతో ఎన్నో గ్రహిస్తూ ఎన్నో చేసుకుంటూ సాగిపోతాం
మనం ఎలా సాగిపోతున్నామో మన ఎదుగుదలపై ఆధారపడి ఉంటుంది
ఒక కార్యాని మనం చేస్తే నష్టం వాటిల్లితే అదే కార్యం మరొకరి లాభ దాయకం కావచ్చు
ఒక కార్యాలోచనలో అనంతమైన ఆలోచన రీతులు దాగి ఉంటాయి
ఒక్కొక్కరి మేధస్సులో ఒక్కో రకంగా అనంతమైన ఆలోచన రీతులు కలుగుతుంటాయి
అందుకే ఒక్కొకరికి ఒక్కో విధమైన కార్య ఫలితాలు లభిస్తాయి
ప్రతి కార్యం లాభదాయకం కావాలంటే మనస్సును ఏకాగ్రత పరచాలి
ఏకాగ్రతలో మనస్సు ఒకే విధమైన ఆలోచన రీతిని కలిగి ఉంటుంది లేదా ఎన్నుకొంటుంది
ఆలోచనకారి మనస్సుకారి మేధస్సుకారి మూడు సమ భావాలతో సాగాలి 
ఆలోచనను మేధస్సు అర్థవంతంగా గ్రహిస్తే మనస్సు మరో ఆలోచనతో పోల్చుకుంటూ ఒక దానితో ఏకీభవిస్తుంది
మనస్సు ఒక దానిని ఎకీభవించడంలో మేధస్సే సరైన దానిని మనస్సుకు అందించాలి
మేధస్సుకు అనుభవం ఉంటుంది గాని మనస్సుకు అనుభవం ఉండదు
మేధస్సు అనుభవంతో ఆలోచనలను కూడా మనకు కావలసిన రీతిలో కలిగించుకోవచ్చు ఆలోచించుకోవచ్చు
మేధస్సుకు ఆలోచన యొక్క గుణ భావం తెలిస్తే మనస్సుకు అనుభవమైన దానిని ఎన్నుకునేలా చేయొచ్చు
మన మేధస్సు యొక్క ఎరుక లేదా చురుకుదనం తోనే మన ఆలోచన విజ్ఞాన రీతితో సాగుతుంది

సమస్యలు ఉన్నాయని సతమతమైతే

సమస్యలు ఉన్నాయని సతమతమైతే మనస్సు భారమవుతుంది
సమస్యలు లేవని ఖాళీగా ఉంటే మేధస్సు మలినమవుతుంది
సమస్యలు రావడం మన కోసమే నని ఎదురిస్తూ తీర్చు కోవాలి
సమస్యలు లేకున్నా అన్వేషణతో విజ్ఞానాన్ని గ్రహిస్తూ సాగాలి  

విశ్వ విజ్ఞాన ఆత్మ జ్ఞానమే విశ్వ భోగం

విశ్వ విజ్ఞాన ఆత్మ జ్ఞానమే విశ్వ భోగం ప్రభూ!
విశ్వ జీవుల ఆత్మ వేదనయే విశ్వ వేదాంతం!
విశ్వ జనుల ఆత్మ స్పందనయే విశ్వ సంగ్రామం!
విశ్వ ప్రాణుల ఆత్మ బంధమే విశ్వ జీవనం మహా ప్రభూ!

Friday, March 13, 2015

నా మరణంతో నా మేధస్సు విశ్వానికి



నా మరణంతో నా మేధస్సు విశ్వానికి అంకితమవుతుంది
విశ్వ కార్యాలకు నా మేధస్సు సహకరిస్తూనే ఉంటుంది
మీ మేధస్సులలో నా ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి
భవిష్య విశ్వ విజ్ఞానానికి నా ఆలోచనలు ఎంతో అవసరం
పరిశుభ్రమైనా సాంకేతిక పురోగాభివృద్దిని అవరోధించాలి

Thursday, March 12, 2015

విశ్వ జనుల కోరికలు ఎప్పుడు తీరుతాయో


విశ్వ జనుల కోరికలు ఎప్పుడు తీరుతాయో ఏమో
వేచి వేచి కష్ట నష్టాల ఒడి దుడుకులతో సాగుతున్నారు
కాలం సాగుతుందేగాని కోరికలు పెరుగుతూనే ఉన్నాయి
కోరికలు తీరే సమయం వచ్చినా ఏదో తెలియని ఆవేదన
కోరికలతో సతమవుతూ సుఖ సంతోషాలను వదిలేస్తున్నారు
ధీర్ఘంగా ఆలోచిస్తూ కోరికలతో అనారోగ్యం చెందుతున్నారు   
ఆరోగ్యంతో జీవనోపాదిని గురించి ఆలోచించక కోరికలతో జీవిస్తున్నారు
అధిక కోరికలు ఖర్చులకే గాని సరైన జీవిత గమ్యాన్ని చేరుకోలేరు

Tuesday, March 10, 2015

ఆత్మ లేని జీవితం ఆకారం లేనిది

ఆత్మ లేని జీవితం ఆకారం లేనిది
ఆకారం లేని శూన్యత్వం జీవం లేనిది
శూన్యం లేని మాట ఏదో తెలియనిది
తెలియనిది ఏదో అంతు చిక్కనిది

Thursday, March 5, 2015

మేధస్సులోని ఆలోచనలు సృష్టికి నిర్వచనములు

మేధస్సులోని ఆలోచనలు సృష్టికి నిర్వచనములు
మనస్సులోని ఆలోచనలు ఆశకు నిదర్శనములు
మర్మములోని ఆలోచనలు విశ్వానికి సంకేతములు
మంత్రములోని ఆలోచనలు మన సందేహములు 

Wednesday, March 4, 2015

ఆహారమందు ఆరోగ్యం ఆలోచనయందు పని

ఆహారమందు ఆరోగ్యం ఆలోచనయందు  పని
అలసటయందు నిద్ర ఆకలియందు ఆహారం
ఆరోగ్యమందు శక్తి శక్తియందు కార్యం
కార్యమందు సుఖ దుఃఖ్హాల జీవితం

ఏ జీవిలో తొలి శ్వాస మొదలైనదో

ఏ జీవిలో తొలి శ్వాస మొదలైనదో
ఆ జీవి శ్వాసయే సృష్టికి మూలం
తొలి శ్వాసతో జీవించిన జీవి జీవిత కాలం ఎంతటిదో
తొలి శ్వాస ఆగక ముందే ఏ జీవిలో ఆ శ్వాస కొనసాగిందో
తొలి జీవి శ్వాస నుండి మానవ జీవి శ్వాస వరకు ఎలా సాగుతూ వచ్చిందో
ఆగిపోయే శ్వాసలు ఎన్నున్నా సాగిపోయే శ్వాసలు మరెన్నో ఉన్నాయి

Tuesday, March 3, 2015

ఆత్మ యందు కలదు ఆత్మీయత


ఆత్మ యందు కలదు ఆత్మీయత
ఆత్మ యందు కలదు అంతరాత్మ
ఆత్మ యందు కలదు అంతర్భావన
ఆత్మ యందు కలదు అంతర్లీనం  
ఆత్మ యందు కలదు ఆత్మానందం

ఎవరైనా వింటారా ఆనాటి మాటలను

ఎవరైనా వింటారా ఆనాటి మాటలను
వింటూనే ఆరాదిస్తారా ఆనాటి భావాలను
భావాల అర్థాలతో బంధాలను కలుపుకుంటారా
బంధాలతో జీవితాలను సంతోషంగా సాగిస్తారా
అర్థంలో పరమార్థం బంధంతో జీవితం మనకేలే