Tuesday, May 31, 2016

ఓ బాటసారి .....

ఓ బాటసారి .....
ఇది నవ్వుతూ నడిచే రహదారి కాదయ్యా
ఇది అనుభవంతో నడక నేర్చే మహాదారయ్యా  || ఓ బాటసారి .....  ||

ఎందరో అడుగులు వేస్తూ ఉంటారు పడి పడి పోతూ లేస్తారు
ఎన్నో సార్లు పడి  పడి లేచినా సాగించే ప్రయాణమే ఈ దారి

జీవితమంతా ప్రయాణించినా అనుభవం చాలదయ్యా
జీవనమే మార్గమని తలచినా అడుగులు తప్పి పోవునయ్యా

ఏనాటికి తెలియని పరిమాణమే దారిలో తెలియని నవ సూత్రాలు
ఏనాటికి తెలియని పరిశోధనమే మార్గంలో తెలియని  విధానాలు   || ఓ బాటసారి .....  ||

భావంతో నడిచినా భాష్పంతో సాగించినా
జ్ఞానంతో నడిచినా విజ్ఞానంతో సాగించినా

మనిషికే తెలియని అన్వేషణ
మేధస్సుకే తెలియని ప్రతి ఘటన

ఏ సమయంలో నీవు మరణిస్తావో నీ గమ్యం ఎక్కడని తెలియదుగా
ఏ క్షణంలో నీవు జన్మించావో నీ స్థానమే ఏదని గమనించ లేదుగా   || ఓ బాటసారి .....  || 

నీలోనే నేనున్నాను నాలోనే నీవున్నావు

నీలోనే నేనున్నాను నాలోనే నీవున్నావు
నీతోనే నేనున్నాను నాతోనే నీవున్నావు

నీవు నేను ఒకరికి ఒకరు కలిసే జీవిస్తాము
నీవు నేను ఒకరికి ఒకరై కలిసే ప్రయాణిస్తాము  || నీలోనే ||

ఏనాటికైనా అనుబంధంతోనే ముందుకు సాగాలి
ఎప్పటికైనా అనురాగంతోనే ముందడుగు వేయాలి

ఎవరికి ఎవరు తెలియకున్నా పరిచయంతోనే కలవాలి
ఎవరికి ఎవరు లేకున్నా సంబంధంతోనే కలిసి పోవాలి  

ఎవరితో ఎవరు జీవిస్తారో జగతికే తెలియాలి
ఎవరితో ఎవరు ఉంటారో లోకమే తెలపాలి  || నీలోనే ||

నీవు లేనిదే నాలో కలిగెనే మౌనం
నీవు లేకనే నాలో సాగెనే శోకం

నీవు లేని క్షణం మనస్సులో కలహం
నీవు లేని నిమిషం యదలో విషాదం

నీవే నాలో జీవించే మధుర స్వప్నం
నీవే నాలో స్మరించే సుగంధ పుష్పం    || నీలోనే ||

ఏనాటి దేవకన్యవో నీవు శిలగా మిగిలిపోయినావు ఈ జగతికి

ఏనాటి దేవకన్యవో నీవు శిలగా మిగిలిపోయినావు ఈ జగతికి
ఏనాటి శిల్పానివో నీవు అపురూపమై నిలిచావు ఈ లోకానికి

సృష్టిలోని అందాలలో నీవే అతి మధురమైనావు ఈ విశ్వానికి
ఆకార రూపాలలో నీవు శృంగార సౌందర్యమైనావు ఈ ద్వీపానికి  || ఏనాటి ||

నీలోని భావాలు నీలోనే మౌనమై శిలగా మారిపోయినాయి
నీలోని పదాలు నీలోనే లీనమై శిల్పంలో దాగి ఉన్నాయి

ఏనాటి సుందర సౌందర్యవతివో నీ చూపులే తెలుపుతున్నాయి
ఏనాటి సుగంధ సరసానివో నీ వయ్యారములే చూపుతున్నాయి

ఎవరికి నీవు బంధానివో అనుబంధమే కలిసిపోవాలి
ఎవరికి నీవు చిత్రానివో అభినయ వర్ణమే మెరిసిపోవాలి  || ఏనాటి ||

ఎంతటి గుణ సుందరివో సువర్ణ సౌందర్యమే దాగినది
ఎంతటి రాగ తరంగిణివో సప్తస్వర సంగీతమే ఒదిగినది

ఎంతటి దివ్య మోహానివో ముఖ బింభమే ఆకాశాన్ని చూస్తున్నది
ఎంతటి వర్ణ తేజస్వినివో సూర్య ప్రకాషమే నిన్ను కాంక్షిస్తున్నది  

ఎక్కడ నీవు ఉదయించావో అమరావతిలో శిలై ఉన్నావు
ఎక్కడ నీవు అస్తమించావో ఇక్కడే నీవు కొలువై ఉన్నావు   || ఏనాటి || 

Monday, May 30, 2016

ఏదో సంతోషం ఎంతో ఉల్లాసం ఏమో విశేషం నీలో

ఏదో సంతోషం ఎంతో ఉల్లాసం ఏమో విశేషం నీలో
ఏదో సందేహం ఎంతో ఆరాటం ఏమో సందిగ్దం నాలో
తీరని అనుభవం వీడని అనుబంధం మనలో సాగే అనురాగం ఎందుకో ఈ వేళ || ఏదో సంతోషం ||

మనస్సులో ఆనందం హృదయంలో కలిగే సంతోషం
యదలో అనురాగం మేధస్సులో కలిగే అనుబంధం

మాటలతో సాగే ప్రయాణం మమతై కోరినది మమకారం
భావాలతో సాగే కాలం మధురమై వచ్చినది మకరందం

ఏనాటి భావాలో నేడు నీ కోసమే వస్తున్న మధురిమలు
ఏనాటి స్వప్నాలో నీ చెంతకే చేరుతున్న పదనిసలు    || ఏదో సంతోషం ||

జీవనమే హాయిగా నీతో సాగే జీవితమే మన ప్రేమ
జీవమే స్వేచ్ఛగా నీతో కలిసే మదియే మన జన్మ

పుష్పాలు వికసించే పరిమళాలు నాలోనే దాగున్నాయి
తేనీయం కవ్వించే సుమ గంధాలు నీతోనే వస్తున్నాయి

తెలియనిది ఏదైనా ఉంటే సందేహమే
తెలుసుకోవాలని ఎంతైనా ఉంటే ఆరాటమే
తెలుసుకున్నా తోచకపోతే సందిగ్ధమే

భావాలతో జీవిస్తే జీవితం ఎంతో సంతోషం
బంధాలతో జీవిస్తే జీవనమే ఎంతో ఉల్లాసం  || ఏదో సంతోషం ||

నాలోని భావాలను తెలుపుటకు నేటి కాల చక్రము నాకు సరిపోవుట లేదు


నాలోని భావాలను తెలుపుటకు నేటి కాల చక్రము నాకు సరిపోవుట లేదు
నాలోని అనంత భావాలను గ్రహించుటకు నేటి సమయం సరిపోవుట లేదు
నాకు నేనుగా అనంత భావాలకై సృష్టించుకున్నా నేనే మరెన్నో లోకాలను
నాలోన నేనే తెలుపుకుంటున్నా మరెన్నో లోకాలలో ఎన్నెన్నో భావాలను
ఒకే సమయంలో ఎన్నో విశ్వ భావాలను మరెన్నో లోకాలలో తెలుపుకుంటున్నా
అనంతమైన భావాలతో జీవిస్తూనే విశ్వ స్వభావ తత్వాలను నేనే గ్రహిస్తూ ఉన్నా
క్షణములోన నాలో కలిగే భావాలను తెలుపుటకు ఒక యుగమైన పట్టునులే 
యుగానికి ఉన్న క్షణాలే నాలో ఏక కాలమై లోకాలుగా సాగుతున్నాయిలే
భావాలలో దాగిన మహా విజ్ఞానమునకే నాలో మహా అన్వేషణ సాగుతున్నదిలే
విశ్వ భావ తత్వాలనే తెలుపాలని నా మేధస్సులో ఒక భావన మొలచినదిలే
ఆలోచనలోని భావనను గుర్తించుటలోనే నాకు తెలిసినది విశ్వ భావ తత్వమే
విశ్వ తత్వము తెలిసిన నాటి నుండి నాలో అన్వేషణ ఏనాడు ఆగిపోలేదులే
భావన కలుగుటకే నేను విశ్వ తత్వాలతో జీవిస్తూ కాలంతో సాగిపోతున్నానులే

Sunday, May 29, 2016

నీ నీడలో గురువునై ఉన్నాను నీకు తోడుగా

నీ నీడలో గురువునై ఉన్నాను నీకు తోడుగా
నీ శ్వాసలో శిలనై ఉన్నాను నీకు మిత్రుడిగా || నీ నీడలో ||

నీతోనే ఉంటాను నీ విజ్ఞానమునకై
నీలోనే ఉంటాను నీ భావములకై

నీ ఆలోచనలలో దాగిన హిత జ్ఞానమును నేనే
నీ జ్ఞానములో దాగిన అర్థ పరమార్థాన్ని నేనే

నీలోని భావ స్వభావాలతో ఉంటాను సద్భావంతో
నీలోని విశ్వ తత్వాలతో ఉంటాను సమయోచితంతో  || నీ నీడలో ||

ఆత్మగా వచ్చాను నీ కోసం ఈ లోకానికి
దైవమై ఉంటాను నీ కోసం ఈ జగతికి

నీవు చేసే సాధనలో సామర్థ్యాన్ని నేనే
నీవు సాగే అన్వేషణలో దిక్సూచిని నేనే

నీ మేధస్సుకు భోధించే భోది వృక్షాన్ని నేనే
నీ ఆలోచనకు కలిగించే విజ్ఞానాన్ని నేనే   || నీ నీడలో ||

ఊపిరి ఆగి పోయిందా ఊహ నిలిచి పోయిందా ప్రభూ!

ఊపిరి ఆగి పోయిందా ఊహ నిలిచి పోయిందా ప్రభూ!
శ్వాస ఆగి పోయిందా ధ్యాస నిలిచి పోయిందా ప్రభూ!

నీ నామ ధ్యేయములోనే వినిపిస్తున్నది ఓంకార శబ్దము ప్రభూ!
నీ ధ్యాన భావములోనే తెలుస్తున్నది ఓం నమః శివాయ ప్రభూ!   || ఊపిరి ||

నీవు నిలిచిన రూపమే విశ్వానికి ప్రతి రూపం
నీవు వెలిసిన స్థానమే జగతికి పుణ్య క్షేత్రం

నీవు లేని శ్వాస ఏ జీవికి నిలవదుగా దేహం
నీవు లేని ధ్యాస ఏ జీవికి కలగదుగా భావం

నీవు తలచిన దైవమే ఈ లోకం
నీవు నడచిన ధర్మమే ఈ సత్యం  || ఊపిరి ||


నీవు లేని లోకము మాకు ఓ శూన్యము
నీవు లేని జగతి మాకు దుఃఖ సాగరము


నీవు లేనిదే కాలము క్షణమైనా సాగదు
నీవు లేనిదే కార్యము విజ్ఞానమై సాగదు


నీవు చూపే దారిలోనే వెలుగును చూస్తున్నాము
నీవు తెలిపే భావనలోనే విజ్ఞానాన్ని గ్రహించాము  || ఊపిరి ||

సంగీతంలో సరిగమ సంతోషంలో పదనిస

సంగీతంలో సరిగమ సంతోషంలో పదనిస
ఆట పాటలతో మాటలు కలిపితే పదాలలోనే సద్భావం 
మాటలతోనే బంధాలన్నీ అనువైన ఆనందం
ఆనందంతోనే అనుబంధాలన్నీ సంబంధాలుగా కలిసేను  || సంగీతంలో ||

ఏనాటికైనా బంధాలన్నీ కలిసే వేళ వస్తుంది ఉత్సవంలా
బంధాలతో కొత్త సంభందాలు కలిసినప్పుడే మహోత్సవం
ఊరు వాడ అందరు కలిస్తేనే జరుపుకుంటారు రథోత్సవం
నగరాలన్నీ దేశాలుగా కలిసి జరిగేను మహా బ్రంహోత్సవం  || సంగీతంలో ||

మనస్సు మనస్సు కలిసినప్పుడే కల్యాణోత్సవం
దశాబ్దాలుగా కలిసి జీవిస్తేనే దశ దిక్కులా దశోత్సవం
శతాబ్దాలుగా కలిసి జీవించినప్పుడే మధురమైన శతోత్సవం
ఎన్నాళ్ళైనా ఎక్కడైనా ఎప్పుడైనా అందరు కలిసి చేసుకుంటే వజ్రోత్సవం  || సంగీతంలో ||

ఉత్సవాలను జరుపుకుంటూ పోతే ఎన్నైనా మనకు కలిగే సంగీతాల సంతోషం
అలా చెప్పుకుంటూ పొతే 25 ఏళ్ళ రజతోత్సవం 50 ఏళ్ళ మహోదయ సువర్ణోత్సవం
జరుపుకునే వార్షికోత్సవాలన్నీ ఆనందంగా ఎక్కువ కాలం అందరు జీవించాలనే
కొత్త పాత అందరు నవ భావాలతో నూరేళ్ళు జీవించాలనే ఈ మాటల ఉత్సవాలు  || సంగీతంలో ||

Friday, May 27, 2016

మళ్ళీ మళ్ళీ చెప్పాలని ఉంది

మళ్ళీ మళ్ళీ చెప్పాలని ఉంది
మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది
చెప్పినదే చెప్పాలని మళ్ళీ మళ్ళీ రావాలని ఉంది
చూసినదే చూడాలని మళ్ళీ మళ్ళీ కలవాలని ఉంది    || మళ్ళీ మళ్ళీ ||

మళ్ళీ మళ్ళీ ఏ రోజు వస్తుందో ఎదురు చూడాలని ఉంది
మళ్ళీ మళ్ళీ అదే రోజు అలాగే వస్తుందని కలగానే ఉంది

మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే సమయమే తెలియకున్నది
మళ్ళీ మళ్ళీ గుర్తే లేకపోతే ఏదీ తెలియనట్లే ఉంటున్నది

మళ్ళీ మళ్ళీ కలిసే కాలమే రావాలని ఉంది
మళ్ళీ మళ్ళీ కలిసే ఉండాలని ఆశగా ఉంది   || మళ్ళీ మళ్ళీ ||

మళ్ళీ మళ్ళీ కలసిన క్షణం మరల రాని మరో క్షణం
మళ్ళీ మళ్ళీ కలిసిన రోజు మరవలేని మధుర క్షణం

మళ్ళీ మళ్ళీ జీవించే జన్మ ఉందంటే మళ్ళీ ఉదయిస్తాం
మళ్ళీ మళ్ళీ మనమే జతగా ఉంటే మళ్ళీ కలిసే జీవిస్తాం

మళ్ళీ మళ్ళీ ఇదే జగతి మనదైతే తరతరాలు వస్తుంటాం
మళ్ళీ మళ్ళీ ఇదే మన లోక మైతే కలిసి మెలసి ఉంటాం  || మళ్ళీ మళ్ళీ || 

జీవము నీవే విశ్వము నీవే భావానివి నీవే

జీవము నీవే విశ్వము నీవే భావానివి నీవే
మేము కోరినవన్నీ తీర్చే అనంత శక్తివి నీవే
జగతికి జగదేశ్వరుడు నీవే లోకానికి లోకేశ్వరుడు నీవే
గంగా జలానికి గంగాధరుడు నీవే సృష్టికి మూలం నీవే || జీవము ||

మేధస్సున కలిగే ఆలోచనలో అర్థానివి నీవే
ఆలోచనలో దాగిన భావ పరమార్థానివి నీవే

కాలంతో సాగే ఆలోచనలలో కలిగే కోరికలు తీర్చుకునే సమయం నీవే
కోరికలను తీర్చుకునేందుకు కావలసిన విజ్ఞాన సామర్థ్యాని కలిగించేది నీవే

కోరికలతో పాటు ఎన్నో సంతోషాలను కలిగించే విశ్వ చైతన్య మూర్తివి నీవే
సుఖ సంతోషాల ఆనందాలతో మానవ హృదయాలను నడిపించేది నీవే    || జీవము ||

జగతికి జీవము నీవై ఎన్నో జీవరాసులకు ప్రాణమిచ్చే దాతవు నీవే
విశ్వానికి శ్వాసవు నీవై ఎన్నో జీవులకు జనన మరణ కర్త క్రియ నీవే

ఆకలి నుండి అనంతమైన కోరికలను తీర్చే ఆది పరాశక్తివి నీవే
క్షణము నుండి యుగాలుగా సాగే కాల చక్రానికి భైరవుడవు నీవే

లోకాన్ని శాసించే మహా పంచభూత పరంజ్యోతివి నీవే
బ్రంహాండాన్ని నడిపించే లోకాలకు జగద్గురువు నీవే   || జీవము || 

నా ఊపిరి నీవే ఊహవు నీవే ఊగిసలాడే జీవము నీవే

నా ఊపిరి నీవే ఊహవు నీవే ఊగిసలాడే జీవము నీవే
శ్వాసలో ఉన్న ఉచ్చ్వాస నిచ్చ్వాసాల జిజ్ఞాసవు నీవే
దేహంలో దాగిన దైవత్వం విశ్వ భావాల తత్త్వం నీవే
జగతిలో జనన మరణ వ్యవధిలో జీవికి ప్రాణము నీవే
హృదయముతో సాగించే భావ బంధాల కోరికవు నీవే
మనస్సుతో మేధస్సుకు మంత్రాన్ని కలిగించే గారడి నీవే

జ్యోతియే మేధస్సుపై మహా కమలమై జ్వలిస్తున్నది

జ్యోతియే మేధస్సుపై మహా కమలమై జ్వలిస్తున్నది
కమలమే విశ్వ విజ్ఞానమై శిరస్సున ఉదయిస్తున్నది  
శిరస్సులోని మేధస్సే మహా విజ్ఞాన క్షేత్రమై నిలిచింది
మేధస్సులోని విజ్ఞానమే ధ్యానమై బ్రంహ జ్ఞానంతో వెలిసింది 

నుదిటి పైననే ఉన్నది ఓ జ్యోతి

నుదిటి పైననే ఉన్నది ఓ జ్యోతి
విశ్వానికి ఇదే జన జీవన జ్యోతి
జగతికి ప్రజ్వలమైన అఖండ జ్యోతి
అది జగతిలో నిలిచిన విజ్ఞాన జ్యోతి 

మాతృ దేవోభవ ఏనాటికైనా నిత్యమని ఎప్పటికీ సత్యమని

మాతృ దేవోభవ ఏనాటికైనా నిత్యమని ఎప్పటికీ సత్యమని
జగతిలో జీవించే జగన్మాతవు నీవేనని జన్మభూమి నీదేనని
జగమంతా తిలకించినా నీ రూపమే అపురూప వర్ణ తేజమని
నీ భావాలే విశ్వానికి అమరమైన అద్వితీయ అభియోగమని

Thursday, May 26, 2016

సర్వం విజ్ఞానం సరస్వతి దేవి

సర్వం విజ్ఞానం సరస్వతి దేవి
శుద్ధం పరిశుద్ధం శ్రీ శారదా దేవి
పూర్ణం పరిపూర్ణం అన్నపూర్ణ దేవి
సర్వం సంపూర్ణం మేధావిని దేవి

ఏది నీ ధ్యేయం ఏది నీ లక్ష్యం ఏది నీకు సాధ్యం తెలుసుకో ఓ మిత్రమా

ఏది నీ ధ్యేయం ఏది నీ లక్ష్యం ఏది నీకు సాధ్యం తెలుసుకో ఓ మిత్రమా
తెలిసినది విజ్ఞానం తెలియనిది అనుభవం సాధన చేసుకో ఓ భావమా    || ఏది నీ ధ్యేయం ||

అన్నీ తెలిసి ఉన్నా తెలియనిది మరో కొత్తగా కాలంతో వస్తూనే ఉంటుంది
కాలంతో మారిపోయే అలవాట్లతో వచ్చి పోయేవి ఎన్నో మేధస్సుకే తెలియాలి

విజ్ఞానం సౌందర్యం అలంకారం అనుభవించడం ఇవేనా మన సౌకర్యం
సృష్టించడం సుధీర్గ కాలం శ్రమించడం ఇవేలే మనకు అసలు సిసలు

విజ్ఞానానికి కొదవ లేదు అనుభవానికి తావు లేదు ఎక్కడైనా తెలియని విధమేలే
అందరికి అన్నీ అందక పోయినా అవసరమయ్యేవి అందించాలి ఓ మిత్రమా  || ఏది నీ ధ్యేయం ||

సాధనతో  సాధ్యం చేసుకోవడమే మన కర్తవ్యం
దీక్షతో శ్రమించడమే మన జీవిత పర మార్థం

అన్వేషించడంలోనే ఉన్నది నవ జీవన విజ్ఞానం
నీవుగా ఎదిగి ఎందరికో దారి చూపడమే సంపూర్ణం

నీతో ఉన్నది నలుగురికి చెప్పడమే విజ్ఞాన సోపానం
నీకు మరల కొత్త అనుభవం కలగడమే కాల తత్త్వం

నీ ధ్యేయం ఓ విజ్ఞాన విశ్వ గ్రంథం
నీ లక్ష్యం నవ జీవన విధాన సంపూర్ణత్వం
నీ సాధన ప్రతి క్షణం అనుభవంతో జీవించడం || ఏది నీ ధ్యేయం ||

శివాయ విశ్వరూపాయా ఓంకార నమః శివాయా

శివాయ విశ్వరూపాయా ఓంకార నమః శివాయా
శివాయ దివ్య రూపాయా ఓంకార పంచ భూతాయా
శివాయ మహా రూపాయా  ఓంకార సర్వ రూపాయా
శివాయ దైవ రూపాయా ఓంకార జీవ రూపాయా
శివాయ కరుణ రూపాయా ఓంకార కర్త కర్మ క్రియ రూపాయా 

Wednesday, May 25, 2016

మరణమో హృదయ భావమో కాలానికే తెలిసిన సమయమో

మరణమో హృదయ భావమో కాలానికే తెలిసిన సమయమో
క్షణముతో ఆగిపోయే మరణం కాలమే పంపిన కబురు యేమో
సమయమే తెలియని కాలము మౌనమైనది మరణ క్షణమున
జీవమే వెళ్లి పోయిన దేహము ఏమీ తెలుపని నిదుర మైకమో

హృదయం ఒక లక్ష్య సాధన కోసమే జీవిస్తున్నది

హృదయం ఒక లక్ష్య సాధన కోసమే జీవిస్తున్నది
మేధస్సు ఒక అద్భుత విజయం కోసమే ఆలోచిస్తున్నది
దేహం ఒక మహా జీవితాన్ని అనుభవించుటకే సాగుతున్నది
భావం ఒక అంతిమ ఆనందం కొరకే ఉరకలు వేస్తున్నది
బంధం ఒక అనుబంధాన్ని కలుపుకొనుటకే కాంక్షిస్తున్నది
శ్వాస ఒక ధ్యాసతో ధ్యానిస్తూ దైవాన్ని కోరుకుంటున్నది
మరణం విశ్వంలో చేరిపోవుటకే మౌనంతో వేచి ఉన్నది 

అక్షరాన్ని వదులుకోను

అక్షరాన్ని వదులుకోను
పదాన్ని మరచిపోను
వాక్యాన్ని విడిచిపోను
వాక్య సముదాయాన్ని తప్పుకోను
పాఠాన్ని  మార్చుకోను
పుస్తకాన్ని అమ్ముకోను
గ్రంథాన్ని ఇచ్చుకోను 

జీవమే నదిగా సాగేను యదలో ఎందుకో తెలియదులే

జీవమే నదిగా సాగేను యదలో ఎందుకో తెలియదులే
ఉచ్చ్వాస నిచ్చ్వాసలే అలలుగా సాగేను ఓ శ్వాసలో
తీరం చేరే మనస్సు హృదయానికి తెలిసిన వయస్సు
పొంగిపోయే కెరటం ఆలోచనలో ఉన్న ఉప్పెన భావం
నదిగా సాగే జీవితానికి సముద్రమంతటి అనుభవం చాలదులే
మనం ఒదిగే ఉన్నా ఎదురుగా వచ్చే వరదలో ఈదుకుంటూ వెళ్లాలే
విధిగా వచ్చేది ఏదైనా మనకన్నా మహా శక్తివంతమైనదిలే
ఏనాడు ఎవరికి తెలియని అనుభవం కాలమే చూపుతూ తెలిపేనులే
నిర్భయంగా ఉంటూ కాలంతో సాగుతూ విశ్వ ప్రళయాన్ని చూడవోయ్

ఓ బాటసారి .....

ఓ బాటసారి .....
నీటితో ప్రయాణమా నావతో చెలగాటమా
ఇది జీవిత పోరాటమా జీవన చదరంగమా || ఓ బాటసారి ..... ||

గాలి వానతో సుడిగుండమై ప్రయాణమే మారిపోయేను
ప్రయాణము సాగని నావ చిందర వందరమై పోయేను

మార్గం తెలియని నీటిలో నావ లేక మిగిలిపోయేవు
ఒడ్డుకు చేరుకోలేక నీటిలోనే మునిగి తేలి పోయేవు

ఏ దిక్కున ప్రయాణించాలో దిక్సూచి కూడా లేకపోయే
దిక్కులన్ని ఒకటై నీటి చుట్టూ తిరుగుతూ ఉండిపోయే || ఓ బాటసారి ..... ||

ఏ వైపు చూసిన ఒకటే దూరం ఎటూ వెళ్ళినా అన్ని వైపులా అంతంతే దూరం
ఏ వైపు వెళ్ళినా దూరం తగ్గని విధంగా దిక్కు తోచని దూరంతో దిక్కులదూరం

ఆగి పోవాలని లేదు ప్రయాణించాలని తెలియుట లేదు
ఆగినా ఉండలేను సాగినా ఎటు వెళ్ళాలో ఏదీ తోచట్లేదు

ఇది జీవన పోరాటమో జీవిత చదరంగమో తెలియని ప్రయాణం
ఏది తెలిసినా ఏది తెలియక పోయినా ప్రయాణంతో సాగి పోవాలి || ఓ బాటసారి ..... || 

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మంచి మనుషులోయ్

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మంచి మనుషులోయ్
దేశమంతా మంచి ఉందోయ్ ప్రపంచమంతా సాగిపోవునోయ్
దేశమంటే స్నేహమోయ్ విదేశమంటే గౌరవమోయ్
దేశాన్ని ప్రేమించవోయ్ ప్రపంచాని తిలకించవోయ్
దేశమంటే విజ్ఞానమోయ్ ప్రపంచమంటే అనుభవమోయ్
దేశమంటే యుద్ధం కాదోయ్ విదేశమంటే విధ్వంసం కాదోయ్
దేశమంటే చరిత్రయేనని ప్రపంచమంటే మహా గ్రంథమోయ్

దేశాన్ని దత్తత తీసుకోనా ప్రపంచాన్ని దత్తత తీసుకోనా

దేశాన్ని దత్తత తీసుకోనా ప్రపంచాన్ని దత్తత తీసుకోనా
దేశాన్ని దత్తత తీసుకొని ప్రపంచాన్ని నేను మార్చుకోనా
ఒక ఊరిని దత్తత తీసుకుంటే పక్క ఊరితో చెద పట్టేనా
ఒక ఊరు మారిపోతే పక్క ఊరిలో సమస్యలు పెరిగేనా
ఒకరికి ఒకరు సరికాకపోతే ఏ ఊరు చక్కగా మారిపోదు
అందరు మారిపోతేనే మన దేశంతో అన్ని దేశాలు మారేను
అన్ని కార్య క్రమాలు మంచి భావంతో సాగిపోతేనే చైతన్యం
ఈర్షా అసూయ ద్వేషం ఉన్నంతవరకు ఏది సరికాదు
మంచి గుణాలతో జీవిస్తేనే దేశమంతా మంచి ప్రాకుతుంది
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మంచి మనుషులోయ్
దేశమంతా మంచి ఉందోయ్ ప్రపంచమంతా సాగిపోవునోయ్
దేశమంటే స్నేహమోయ్ విదేశమంటే గౌరవమోయ్
దేశాన్ని ప్రేమించవోయ్ ప్రపంచాని తిలకించవోయ్
దేశమంటే విజ్ఞానమోయ్ ప్రపంచమంటే అనుభవమోయ్
దేశమంటే యుద్ధం కాదోయ్ విదేశమంటే విధ్వంసం కాదోయ్
దేశమంటే చరిత్రయేనని ప్రపంచమంటే మహా గ్రంథమోయ్ 

Tuesday, May 24, 2016

ఓ బాటసారి .....

ఓ బాటసారి .....
చివరికి లెక్క తేల్చి వెళ్ళగలవా
లెక్క తేల్చకుండా వెళ్ళలేవా
ప్రతి ఒక్కరు లెక్క తేల్చి వెళ్ళాలనుకున్నా తేల్చకుండానే వెళ్ళిపోయారు || ఓ బాటసారి ..... ||

అసలు ఎంతో అప్పు ఎంతో
ఎవరు నీకు ఎంత అప్పో నీవు ఎవరికి ఎంత అసలో
ఎవరెవరు తిరిగి ఇస్తారో ఎవరెవరికి నీవు ఇచ్చావో

కాలంతో సాగే ధన జీవనం సమయానికి తేలని జీవిత మూలం
సమయంతో సాగే లెక్కింపులో చిక్కులు ఎన్నో తేలని రోజులే  || ఓ బాటసారి ..... ||

లెక్కలు వేసే ప్రతి లెక్కకు ఏవో చిక్కులు ఉంటాయి
లెక్కలు తేలని ప్రతి లెక్కకు సమస్యలే వస్తుంటాయి

లెక్క ఎంత చక్కగా వేసినా తీరని లెక్కలు ఎన్నో ఉంటాయి
లెక్కలు తేలినా అవి తీర్చని లెక్కలుగానే మిగిలి పోతాయి

ఉన్నవారు కూడా లేనివారిగా మాటలు చెప్పుతూ తప్పుకుంటారు
లేనివారు ఎంతో శ్రమించి అప్పుడప్పుడు కాస్త తీరుస్తూ ఉంటారు || ఓ బాటసారి ..... ||

చినుకు చినుకు కలిసిపోయినప్పుడే నీరుగా మారేను

చినుకు చినుకు కలిసిపోయినప్పుడే నీరుగా మారేను
నీరు నీరు కలిసినప్పుడే పట్టనన్ని నీళ్ళుగా మారేను
నీళ్ళు నీళ్ళు కలిసినప్పుడే వాగులాగా ప్రవహించేను
వాగు వాగు కలిసినప్పుడే చెరువులోనే చేరిపోవును
చెరువు చెరువు కలిసి ప్రవహించినప్పుడే నదిలో కలిసేను
నది నది కలిసి వరదై పొంగినప్పుడే సముద్రంలో కలిసేను
సముద్రం సముద్రం కలిసి పోటేత్తినప్పుడే ప్రళయం వచ్చేను
జలముతోనే పరిశుద్ధమైన పవిత్రమైన వర్ష జలపాతము
నేల తాకిన వర్షమే చినుకు నుండి నీరుగా సముద్రానికి మరలిపోయేను
సముద్రం నుండే సూర్య ప్రభావంతో మేఘమై ఆకాశం నుండి వర్షం కురిసేను

Monday, May 23, 2016

సూర్యోదయమే మధురం శుభోదయమే మధురం

సూర్యోదయమే మధురం శుభోదయమే మధురం
తేజోదయమే మధురం చంద్రోదయమే మధురం
మేఘ వర్ణమే మధురం ఆకాశ రూపమే మధురం
విశ్వ భావమే మధురం మాతృ స్వభావమే మధురం

ఓ బాటసారి ....

ఓ బాటసారి ....
నీటిలో ప్రయాణమా రహదారిలో ప్రమాదమా
రహదారిలో అడుగు వేస్తే నడవడి మారిపోవునా
నీటిలో అలలు వస్తే నావ తిరగబడి పోవునా  || ఓ బాటసారి .... ||

వర్షం వస్తే రహదారి చిందర వందర అగునా
నదిలో నావ చీటికిమాటికి అటుఇటు తిరుగునా

రహదారిలో దిక్కులు తోచినా అడుగులు వేయలేవా
నీటిలో దిక్కులు తోచకున్నా ఏ దిక్కున సాగి పోలేవా

ఇది జీవన ప్రయాణంతో సాగే జీవిత పోరాటం
ఇది మౌనంతో సాగే హృదయ వేదన సాగరం || ఓ బాటసారి .... ||

అలలతో సాగే నావ ఆగిపోతే అడుగులు వేసే రహదారి తీరం చేరుకోవా
కలలతో సాగే జీవితం కలతతో ఆగితే మరో కొత్త ప్రయాణం చేయలేవా

మారిపోయే కాలంతో మనిషే మారకపోతే ఏ జీవి నిన్ను మార్చునో
ప్రతి జీవిలో ఉన్న పరమార్థమే నీ మేధస్సుకు అనుభవమైనదేమో

సాగించే ప్రయాణం ఏదైనా ఓర్పుతో ధైర్యంగా సాగిపోవాలి
కాలంతో ప్రమాదం అనుకున్నా అజ్ఞానాన్ని వదులుకోవాలి || ఓ బాటసారి .... ||

ఎంత ఎదిగినా సామర్థ్యం అవసరం

ఎంత ఎదిగినా సామర్థ్యం అవసరం
ఎంత ఒదిగినా ఓర్పుగా ఉండడం
ఎంత నేర్చినా వినయంతో అడగడం
ఎంత తెలిసినా నిలకడగా చెప్పడం 

Sunday, May 22, 2016

మధురం మధురం విశ్వమే మధురం

మధురం మధురం విశ్వమే మధురం
మధురం మధురం జగతియే మధురం
మధురం మధురం అమ్మే మధురం
మధురం మధురం స్త్రీ యే మధురం
మధురం మధురం శ్రీ శ్రీ మధురం
మధురం మధురం శ్రీమతి మధురం || మధురం ||

హృదయమే మధురం మనస్సే మధురం
శ్వాసే మధురం ధ్యాసే మధురం
దేహమే మధురం ధ్యానమే మధురం
భావం మధురం బంధం మధురం
జీవం మధురం జీవితం మధురం

శయనం భువనం లలితం కమలం
ఉదయం నయనం శ్రావణం సంధ్యావనం

ప్రకృతి మధురం పుష్పం మధురం
అమృతం మధురం అభినయం మధురం
ఆహారం మధురం ఆరోగ్యం మధురం
సత్యం మధురం ధర్మం మధురం

తిలకం త్రిగుణం తరుణం తన్మయం
అధరం అమరం వందనం వసంతం
నాట్యం శిల్పం శృంగారం సుందరం
గళం గమనం వచనం వేదం వేదాంతం  || మధురం ||

ప్రతి జీవిలో జీవించే శ్వాసే మధురం
ప్రతి జీవిని ప్రేమించే మనిషే మధురం

ప్రతి జీవిలో కలిగే భావం మధురం
భావాన్ని తెలిపే మేధస్సే మధురం

సమయం నీతో నడిచే కాలం మధురం
సమయానికి తోడుగా వచ్చే క్షణమే మధురం

మనిషిని కలిపే కల్యాణం మధురం
కళ్యాణంతో సాగే నూతన జీవితం మధురం

భాషతో సాగే సంస్కృతి మధురం
విజ్ఞానముతో సాగే అద్భుత విజయం మధురం

సృష్టిలోని రూపాలే జగతికి మధురం
జగతిలో వెలిసిన శిఖరం పర్వతం మధురం   || మధురం ||

సరస్సు సముద్రం మధురం ద్వీపం ఖండం మధురం    
లోకం శాంతం మధురం అందం ఆనందం మధురం

వర్ణం రూపం ఆకారం సూర్య చంద్రుల ఆకాశ తేజం
మేఘం వర్షం ఋతు పవనాల ఉనికితో సాగే జీవనం

బంధం అనుబంధం సుఖం సంతోషం మధురం
జననం మరణం జీవుల దృశ్యం కావ్యం మధురం

పుష్పం పత్రం దీపం కర్పూరం
గంధం సుగంధం మందారం మకరందం తేనీయం
ఉదకం తీర్థం పాయసం పంచామృతం
శ్లోకం పద్యం చరణం స్మరణం జ్ఞాపకం
అలంకారం వైభోగం కళ్యాణం బ్రంహోత్సవం
మోక్షం మార్గం స్వర్గం వైకుంఠం ప్రయాణం

మధురం మధురం మాధుర్యం మధురం
మధురం మధురం మనోహరం మధురం

పఠనం జ్ఞానం ప్రతిభం విజ్ఞానం
విజయం జయం ఫలితం పతాకం
త్యాగం కరుణం గుణం విశేషణం
దీక్ష కృషి ఓర్పు సహనం సమయోచితం
గాత్రం తపనం భ్రమణం నిశబ్ధం
హితం స్నేహం పూజ్యం ఆరాధ్యం అనంతం  || మధురం ||

Friday, May 20, 2016

కాలము ఎవరికి ఎంతో ఎవరికి తెలియదు

కాలము ఎవరికి ఎంతో ఎవరికి తెలియదు
ఎంత కాలం మనం ఉంటామో ఎరుక లేదు
నేడు ఉన్న సమయమే మనకు తెలియును
ఉన్న సమయాన్నే ఉపయోగించుకోవాలి
సమయమే దైవమని భావిస్తూ విజ్ఞాంగా ఎదగాలి
కార్యమే కర్తవ్యంగా ఆలోచిస్తూ ముందుకు సాగాలి
కాలమే మనకు తోడుగా సహకరించునని వెళ్ళాలి
మనకు మనమే ఎందరికో స్నేహమై నిలకడ నివ్వాలి 

నీలోనే ఉండి పోనా నీతోనే ఉండి పోనా నీకై నేనే

నీలోనే ఉండి పోనా నీతోనే ఉండి పోనా నీకై నేనే
నీలోనే ఉంటాను ఊహాగా నీతోనే ఉంటాను జతగా
నీ నిర్ణయం నా కోరికగా తెలుపగలవని వేచివున్నా
నీ మాటతో నేను నీతో ఉండి పోతాను ఓ భావనగా 

Monday, May 16, 2016

మనిషిగా నేను జీవిస్తున్నా నాలోని శ్వాస భావనతోనే జీవిస్తున్నది

మనిషిగా నేను జీవిస్తున్నా నాలోని శ్వాస భావనతోనే జీవిస్తున్నది
జీవం ఉన్నా లేకున్నా ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు నాలోని భావములే
భావాలతో ఆలోచిస్తూ ఆలోచనలను అర్థాలతో విజ్ఞానంగా గ్రహిస్తున్నా
నాలోని ప్రతి కదలిక చలనం స్పర్శ జ్ఞానేంద్రియ క్రియలు భావనలే
భావాలే నా జీవనం విశ్వ భావాల అన్వేషణకే నా జీవితం అంకితం 

ఓం గణపతి మహా మహా మహొదయ గణపతి

ఓం గణపతి మహా మహా మహొదయ గణపతి
విశ్వ విజ్ఞాన వేద ఏక దంత ఏకాగ్రత గజపతి
మహారాజ మహావీర మహోన్నత మహేంద్రపతి
ఆది దేవ సూర్య నామ ఆలోచన భావ బృహస్పతి
గ్రహ దోష సర్ప దోష విముక్తి ముక్తేశ్వర వీరపతి
దైవ రూప జ్ఞాన రూప మహా రూప పరమేశ్వర పతి
విశ్వ మంగళ శుభంకర స్వయంభువాలయ భోదపతి
సర్వ జన నమస్కార వందే కృప కాటాక్ష విజయపతి
అభయ హస్త విజ్ఞాన ప్రతిష్ట ప్రజ్ఞాన సంపూర్ణ సరస్వతి
లోకనాధ నటరాజ పుత్ర మహా ప్రధమ మహా గణపతి
ఓం శాంతి శాంతి శాంతి శాంతిహి లక్ష్మి సరస్వతి గణపతి 

హృదయం ఎక్కడ నిలిచింది చూడూ

హృదయం ఎక్కడ నిలిచింది చూడూ
భావనగా ఆలోచన లేక మాటతో మౌనమాయనే ...
హృదయం ఎక్కడ ఆగింది చూడూ
అలజడి లేక అలవోకగా నిలిచిపోయేనే ...

మనస్సు లేని భావన ప్రేమ లేని వేదన ఆవేదన
హృదయం లేని వాదన జీవం లేని అనువాదన

మనిషిగా మరణమే తలచినా హృదయమే నిలిచిపోయేను
మనస్సుతో మౌనమే వహించినా నా ప్రాణమే ఆగిపోయేను

శ్వాసలో ధ్యాస కూడా గమనం లేక మేధస్సు మందగించిపోయేను  
ఊపిరితో ఉన్న జీవం ఊహకు అందని విధంగానే వెళ్ళిపోయేను  || హృదయం ||

హృదయమే జీవితం అనుకున్నా మనస్సు మేధస్సునే మోసగించేను
మనస్సే మధురం అనుకున్నా మోహం హృదయాన్ని మరచిపోయేను

కాలం ఎంత దూరం ఉన్నా మోసం వెంబడిస్తూ వెంటబడి పోయేను
మోసమే హృదయాన్ని వెంబడిస్తూ మరణ కాలాన్ని దగ్గరకు చేర్చేను

మనషికి ఎంత విజ్ఞానం ఉన్నా మనస్సుకు ఒదిగే భావన లేకపోయేను
మేధావిగా ఎంత అనుభవం ఉన్నా మోహానికి హృదయం ఆగలేకపోయేను  || హృదయం ||  

బ్రంహోత్సవం జరిగే వేళ వస్తున్నది

బ్రంహోత్సవం జరిగే వేళ వస్తున్నది
బ్రంహే దిగి వస్తున్న వేళ ఆసన్నమైంది
బ్రంహ రథాన్ని లాగేందుకు మహా ప్రజలే వస్తున్నారు
బ్రంహ ముహూర్తంకై ఎందరో ఎదురు చూస్తున్నారు
బ్రంహే వచ్చి చెయ్యి పట్టగా రథమే కదలగా ప్రజలే జేజేలు పలికారు
రథ మహోత్సవం ముగిసిన వేళ బ్రంహే ఆకాశం వైపు బయలుదేరినారు
రథోత్సవం సందర్భంగా జగతిలో బ్రంహోత్సవమే మహా పర్వంగా జరిగింది
బ్రంహోత్సవం ప్రజలు సంతోషాలతో జీవించేందుకే జరుపుకున్నారు
దాన్యం ఆరోగ్యం ఆయుస్సు పచ్చదనం సంతోషం ఆనందం కోరుకున్నారు
సంస్కృతి సమయస్పూర్తి సద్భావన ప్రతి జీవిలో విజ్ఞానమై వెలగాలన్నారు
విశ్వ సంతోషమే జీవులకు శాంతి సమన్వయం సంపూర్ణ జీవన విధానం
బ్రంహోత్సవం మళ్ళీ జరగాలి సంవత్సరం మళ్ళీ గడవాలి బ్రంహే రావాలి
బ్రంహోత్సవం ఆడుతూ పాడుతూ సంభరం చేసుకునే ఇఖ్యత మహోత్సవం
శతాబ్దాలు గడిచినా యుగాలు వెళ్ళిపోయినా బ్రంహోత్సవాలు జరుగుతుంటాయి

శ్రీ విధ్యా దేవి కృపా సరస్వతి

శ్రీ విధ్యా దేవి కృపా సరస్వతి
విశ్వ విజ్ఞాన మూర్తి శారదా దేవి
భావ పరిపూర్ణ జ్ఞాన విధాత వాగ్ధేవి
సర్వ జన పద ప్రజ్ఞాన విశాలాక్షి
దైవ సంపూర్ణ విశ్వ జ్ఞాన తేజస్విని
వేద వేదాంత సర్వ మంగళ కాత్యాయిని
హంస ధ్వని వాహన ప్రగతి పరిశోధిని
వందే శుభకర నమో శృతి సరస్వతి
స్వర వీణ విజ్ఞాన ప్రజ్వల ఉజ్వల భవిష్యతి
ఓంకార లయ గాన గంధర్వ మహా మధుమతి
శ్రీ సరస్వతి నామ ధ్యేయ లక్ష్మీ గణపతి
ఓం శాంతి శాంతి శాంతి శాంతిహి సరస్వతి 

Friday, May 13, 2016

అరె ఏమైందీ ..... ఒక మనిషికి ఈనాడే జీవితం ముగిసిందీ

అరె ఏమైందీ ..... ఒక మనిషికి ఈనాడే జీవితం ముగిసిందీ
అరె ఏమైందీ ..... ఒక హృదయం నేడే భావనతో నిలిచిందీ

ఏనాడు ఏమౌతుందో ఏ క్షణం ఏమౌతుందో ఏ జీవికి తెలియదుగా
ఏ భావంతో ఏ జీవితం ఎప్పుడు ఆగి పోతుందో ఎవరికి తెలియదుగా

భావాలతో జీవిస్తున్నా మౌనంతో సాగే హృదయం ఆగిపోయేనుగా
బంధాలతో జీవితాలు అల్లుకున్నా ఒంటరిగానే వదిలి వెళ్ళేనుగా

శిఖరమై ఎదిగినా పర్వతమై నిలిచినా ఏనాటికైనా ఒంటరియేగా
వృక్షమై ఒదిగినా ఆకాశమై విస్తరించినా ఎప్పటికైనా ఒకరేగా       || అరె ఏమైందీ ..... ||

భావాలతో బంధాలు సాగుతున్నా జీవితాలు ఆగిపోయేనుగా
బంధాలతో జీవితాలు ఎదుగుతున్నా భావాలతో నిలిచేనుగా

జీవితాలు ఏవైనా అనుభవంతో సాగే భావాలే అనుబంధమయ్యేనుగా
అనురాగాల సంబంధాలే అనుబంధంతో జీవితాలు ఆకట్టుకొనెనుగా

విశ్వమంతా ఎదిగినా జగమంతా నిలిచినా మరణం ఓనాడు సంభవించేనుగా
లోకమంతా ఉదయించినా ఆకాశంతో ప్రయాణించినా జీవం అస్తమించేనుగా || అరె ఏమైందీ ..... ||

Thursday, May 12, 2016

చినుకు పడ్డ నేల మీదే పుష్పం వికసించేను

చినుకు పడ్డ నేల మీదే పుష్పం వికసించేను
చినుకు పడ్డ నది పైన రూపం కలిసిపోయేను
చినుకు పడ్డ రాయి పైన ఊష్ణమే మారిపోయేను
చినుకు పడ్డ చెట్టు పైన స్థానమే వదిలిపోయేను

ఇది ఎవరికి తెలియని హృదయ జీవన రాగం

ఇది ఎవరికి తెలియని హృదయ జీవన రాగం
ఎన్నో యుగాలుగా సాగే నవ జీవిత వసంతం
మదిలో దాగిన అఖండ సాధన యోగ వనం
యదలో నిలిచిన వినూతన వేద సారాంశం 

Monday, May 9, 2016

భావమే జీవమై జీవించు మేధస్సు మనలోనే

భావమే జీవమై జీవించు మేధస్సు మనలోనే
హృదయమే భావమై మనస్సుతో మౌనమాయే
భావాలతో జీవిస్తున్నందుకే మేధస్సులో ఎన్నో స్వభావాలు
మనస్సుతో స్వభావాలు అనర్థాలుగా మేధస్సులో అనేకమే
అనర్థాల చర్చలు సరిదిద్దుకోలేక ఒకరిపై ఒకరికి ద్వేషాలు
ద్వేషాలతో మాటలు లేక మనస్సు మౌనమై మూగబోయే
జరిగినది ఏదైనా అర్థాన్ని గ్రహించినప్పుడే పరమార్థము
పరమార్థము నుండే పరమాత్మ స్వభావాన్ని గ్రహించెదము
విజ్ఞానము కన్నా మంచి మనస్సుతో ఆలోచిస్తే అంతా అర్థమే
ఒకరి అజ్ఞానాన్ని మనము అర్థంగా గమనిస్తే ఎవరిది వారికే చెందును
అందరితో కలిసిపోతూ సమన్వయముతో మాట్లాడుతూ సరిచేసుకోండి
భావాలు ఎంత గొప్పగా ఉంటే అంతటి హుందత్వంతో జీవిస్తారు 

నా భావాలు విశ్వమంతా ప్రయాణించుటకు ఎంత కాలం పట్టునో

నా భావాలు విశ్వమంతా ప్రయాణించుటకు ఎంత కాలం పట్టునో
ఏనాడు ఎవరు నా భావాలతో మాటలుగా కబుర్లు చెప్పుకుందురో
హృదయమే మధురమై మేధస్సే విజ్ఞానమయ్యే వేళ ఎప్పటికో
ఎందరిలో నిలిచిన భావాలు విశ్వమున సాగించు క్షణాలు ఏవో
ఒకరి పలుకులతో వినిపించే భావాలు నన్ను ఎలా చేరేదెప్పుడో
నా భావాలు సర్వ జనులకు జ్ఞానమై తెలిసే ప్రచారణ ఏనాటికో
ప్రకటన లేని విధమే భావాలుగా అందరికి అందేది ఎప్పుడో
విశ్వముకే నా భావాలు చేరి పోయేనని ఆకాశమే నేడు తెలిపేను
ప్రతి రోజు నాలోని భావాలను మేఘ వర్ణాలతో విశ్వానికి ఆకాశమే చూపేను
కాల చరిత్రలోనే నా భావాలు నిక్షిప్తమై ఛాయా చిత్రమయ్యేనులే

విశ్వము నీదని ఆకాశమే నీతో పలికిన వేళ

విశ్వము నీదని ఆకాశమే నీతో పలికిన వేళ
హృదయము నీలోనే భావనగా తెలిసిన వేళ
జీవము నీకై విశ్వమున జీవించే శుభ వేళ
కాలమే నీతో ప్రయాణిస్తూ నడిపిస్తున్న వేళ
విశ్వ మందిరమే నీకు కళ్యాణ భోగమయ్యేను ఈ వేళ 

Friday, May 6, 2016

వేద మంత్రమో దివ్య తంత్రమో మహా యంత్రమో

వేద మంత్రమో దివ్య తంత్రమో మహా యంత్రమో
మేధస్సులో మనస్సే మహా యోగ వేదాంతము
మనస్సే మంత్రమై వయస్సే తంత్రమై భావమే యంత్రమాయే
ఆలోచనే రూపమై జ్ఞానమే ఆకారమై విజ్ఞానమే వేదాంతమాయే
మనస్సే భావమై భ్రమలో మంత్రమై కల్పనతో తంత్రమాయే
మనస్సే ఆలోచనై ఏకాగ్రతలో యంత్రమై విజ్ఞానంతో రూపమాయే
మేధస్సే ఆది కేంద్రమై మనస్సే విశ్వాంతరమై విజ్ఞానముకై సంచరించును 

మేధస్సులో మరుపే ఉన్నా నిద్రించడం ఎందుకో

మేధస్సులో మరుపే ఉన్నా నిద్రించడం ఎందుకో
నిద్రలేని మేధస్సు విశ్రాంతి లేని బలహీనతతోనే
మరుపే లేని మేధస్సు మానవ జీవికి మైమరుపే
మైమరుపులోనే నిద్ర ఆసన్నమై మరుపే కలిగేనే
ఏకాగ్రత లేని మేధస్సు విజ్ఞానం లేని మరుపుతోనే
మరుపు ఉన్నా లేకున్నా శక్తి కోసం నిద్రించడమే
విశ్రాంతితో సామర్థ్యం కలిగి ఏకాగ్రతతో మరుపు తరిగేనే
మరుపు తరిగినచో విజ్ఞానం అధికమై ఉత్తేజమగునే
ఉత్తేజముతో జీవితం అద్భుతమై మేధస్సు జ్వలించునే

మేధస్సులో ఆలోచననై భావనగా పలుకుతున్నా

మేధస్సులో ఆలోచననై భావనగా పలుకుతున్నా
ఆలోచనలలో అర్థాన్నై జ్ఞానమునే తెలుపుతున్నా
మేధస్సులో ఎరుకనై విజ్ఞానముగా ఎదుగుతున్నా
ఎరుకతో అనుభవమునై జీవితాన్నే పరిశోధిస్తున్నా

ఈ జీవితం ఏనాటిదో మేధస్సుకే తెలియని ఆలోచన

ఈ జీవితం ఏనాటిదో మేధస్సుకే తెలియని ఆలోచన
ఆలోచనలలో అన్వేషణ మొదలైనా తోచని భావన  
జీవిస్తున్న విధానము ఎలా ఉన్నా ఏదో తెలియనిదే
జీవనం స్వర్గమైనా దుఃఖమైనా ఈ జీవితం ఎందుకో
కాలంతో సాగుతున్న జీవితం విజ్ఞానం ఎరుగని యోచన

మేఘమే నా దేశం వర్ణమే నా లోకం ఆకాశమే నా రూపం

మేఘమే నా దేశం వర్ణమే నా లోకం ఆకాశమే నా రూపం
కిరణమే నా దైవం తేజమే నా స్వర్గం కాలమే నా జీవితం
ఉదయిస్తూ అస్తమించడమే నా జీవన దిన చర్య కార్యం
అస్తమిస్తూ ఉదయించడమే నా జీవిత విశ్వ కార్య గమనం 

Wednesday, May 4, 2016

విశ్వములో కలిగే మరుపు విశ్వ కాలంతో సాగే భావన

విశ్వములో కలిగే మరుపు విశ్వ కాలంతో సాగే భావన
భావనతో సాగే ఆలోచన మేధస్సులో దాగిన సద్భావన
భావాలతో సాగే మేధస్సు విశ్వ కాలంతో కలిగే మరుపే
అనంతమైన ఆలోచనలలో జ్ఞాపకము లేనివే మరుపు
కాస్త మరుపుతో మరెన్నో ఆలోచనలు మేధస్సులో కలిగే
మరుపుతో మరెన్నో కొత్త ఆలోచనల అన్వేషణ  ఆరంభం
ఆలోచనలలోని మరుపు విశ్వ కాలంతో సాగే అజ్ఞానము
మరుపులోని అజ్ఞానము జ్ఞాపకములోని విజ్ఞానము 

కెరటము అలసిపోయినా ఆగని ఆధ్రత మనలో సాగేనా

కెరటము అలసిపోయినా ఆగని ఆధ్రత మనలో సాగేనా
శిఖరము ఎదిగిపోయినా తరగని ఆశ మనలో నిలిచేనా
ఆలయం ఒదిగిపోయినా ఆరని తేజము మనలో వెలిగేనా
వృక్షం నిలిచిపోయినా తలవని ఆకలి మనలో కలిగేనా 

ఉదయించిన సూర్యోదయమే మేధస్సులో ఆలోచన తేజము

ఉదయించిన సూర్యోదయమే మేధస్సులో ఆలోచన తేజము
ఆలోచన భావమే ఆలయ శిఖరపు అమర శిల్పకల గాత్రము
సూర్య తేజో భావమే విజ్ఞాన కార్య త్రిపుర త్రికరణ సౌలభ్యము
విశ్వ తేజమే సూర్య పరి పూర్ణ ఉజ్వల భవిష్య దేహ ధామము

Tuesday, May 3, 2016

మౌనం ఎంత గానమో మోహం ఎంత గీతమో

మౌనం ఎంత గానమో మోహం ఎంత గీతమో
భావ బంధాలు రాగ తాళాలుగా సాగనేలా
జీవం ఎంత గాత్రమో దేహం ఎంత వాయిద్యమో
స్వర గీతాలు సరిగమలై సిరులుగా పలుకనేలా 

మేఘం అంటే మేఘం తల తల మెరిసే మేఘం

మేఘం అంటే మేఘం తల తల మెరిసే మేఘం
మౌనం అంటే మౌనం మాట రాని మహా భావం
రాగం అంటే రాగం స్వరాలను పాడించే సంగీతం
ప్రేమ అంటే ప్రేమ హృదయాన్ని పలికించే ప్రాణం

జీవా! నీవు ఉన్నంత వరకే దేహం దగ దగమంటూ మండుతుంది

జీవా! నీవు ఉన్నంత వరకే దేహం దగ దగమంటూ మండుతుంది
జీవం ఉన్నంత వరకే ఆత్మ తహ తహలాడుతూ తపిస్తుంది
శ్వాస ఉన్నంత వరకే శరీరం చర చరమంటూ కాలిపోతుంది
ఊపిరి ఉన్నంత వరకే ఉచ్చ్వాస నిచ్చ్వాసతో సాగిపోతుంది
ప్రాణం ఉన్నంత వరకే ప్రేమ కలాపాలు కట కటమంటూ సాగుతాయి

గుండెలో భావనగా శ్వాసలో జతగా సాగే ప్రేమయే అమ్మ అని

గుండెలో భావనగా శ్వాసలో జతగా సాగే ప్రేమయే అమ్మ అని
అమ్మగా మనకు అడుగులు పలుకులు నేర్పుతూ లాలిస్తుంది
మేధస్సులో ఆలోచన కలిగేలా భావాలతో అర్థాన్ని తెలుపుతుంది
నిద్రలో హాయిని కలిగిస్తూ తను నిత్యం మెలకువతోనే నిద్రిస్తుంది
ఎదిగే వరకు సేవ చేస్తూనే ఎప్పుడూ కరుణామృతాన్ని అందిస్తుంది
హృదయంలో మన హృదయాన్ని మేధస్సులో మన భావనను ఆలోచిస్తూ
శ్వాసలో జీవత్వాన్ని దేహంలో దైవత్వాన్ని కలిగి విధిగా జీవిస్తుంది