Showing posts with label విచక్షణ. Show all posts
Showing posts with label విచక్షణ. Show all posts

Tuesday, October 4, 2016

జగతికే తెలపాలి నాలోని భావాలను

జగతికే తెలపాలి నాలోని భావాలను
లోకానికే తెలపాలి నాలోని స్వభావాలను
విశ్వానికే తెలపాలి నాలోని తత్వాలను
ఏనాటి భావ స్వభావ తత్వాలో నాలోనే కలుగుతున్నాయి  || జగతికే ||

ఆకాశ మేఘ వర్ణాలలో ప్రతి క్షణం ఎన్నెన్నో భావాలు
సూర్య కాంతి కిరణాల తేజస్సులో ఎన్నెన్నో స్వభావాలు
మహా జీవుల జీవన విధానాలలో ఎన్నెన్నో తత్వాలు       || జగతికే ||

ప్రతి భావన ఓ మహా స్వభావంతో కూడిన తత్వం
ప్రతి స్వభావం ఓ విజ్ఞాన విచక్షణ కలిగిన సహజత్వం
ప్రతి తత్వం ఓ శ్రద్ధ ధ్యాసతో కూడిన మహా గుణత్వం  || జగతికే || 

Monday, September 19, 2016

ఆలోచనలోనే సర్వస్వము ఆలోచనలోనే అనంతం

ఆలోచనలోనే సర్వస్వము ఆలోచనలోనే అనంతం
ఆలోచనతోనే అర్థము ఆలోచనలతోనే పరమార్థము

ఆలోచనల అర్థ సారాంశములే అజ్ఞాన విజ్ఞానములు
ఆలోచనల ఇంద్రియ విచక్షణములే జ్ఞాన లక్షణములు
ఆలోచనల ఇంద్రియ నిగ్రహము లేనిచో అజ్ఞాన అనర్థములు
ఆలోచనల జీవన సిద్ధాంతము జీవుల విజ్ఞాన సారాంశ మార్గములు
ఆలోచనల భావ స్వభావాలే మన మనస్సులో కలిగే గుణ విశేషణములు

ఆలోచనల కార్యాలను అర్థవంతంగా విజ్ఞానంతో మనమే సాగించుకోవాలి
ఆలోచనల అనర్థాలను విజ్ఞాన జ్ఞాన విచక్షణతో మనమే వదిలించుకోవాలి

ఆలోచనలతోనే అపారమైన విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించవచ్చు
ఆలోచనలతోనే నూతన విజ్ఞానాన్ని మహా గొప్పగా సృష్టించవచ్చు

ఆలోచనల కార్యాల నుండి ఎవరికి బాధ దుఃఖము కల్పించరాదు
ఆలోచనల కార్యాల నుండి ప్రగతిని సాధిస్తూ ముందుకు సాగాలి

ఆలోచనల నుండే నేటి జీవన నిర్మాణ పరిస్థితులు మారిపోయాయి
ఆలోచనల నుండే నేటి జీవన జీవిత సమస్యలు ఏర్పడుతున్నాయి  

Monday, August 8, 2016

జీవం ఒక్కటే శ్వాసలో ఊపిరి ఒక్కటే

జీవం ఒక్కటే శ్వాసలో ఊపిరి ఒక్కటే
ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ధ్యాస ఒక్కటే
ప్రతి జీవిలో జీవించే శ్వాస భాష ఒక్కటే  || జీవం ||

దైవంతో సాగే దేహానికి శ్వాస ప్రాణమే
జీవంతో సాగే శరీరానికి ధ్యాస ధ్యానమే

స్వరముతో ఎదిగే శ్వాసకు ఆకలి ఒక్కటే
జ్ఞానంతో పెరిగే మేధస్సుకు భావన ఒక్కటే

ఆలోచనలలో విచక్షణ మాటలలో ఉచ్ఛరణ విజ్ఞానమే
ధ్యాసలో గమనం శ్వాసలో తపనం సద్గుణమైన జ్ఞానమే  || జీవం ||

ఎరుకతో సాగే జీవికి సాధన విజయమే
వచనంతో సాగే ప్రాణికి జ్ఞానం సత్యమే

నిత్యం ధ్యానించే శ్వాసకు ధ్యాస ఎప్పటికి ఒక్కటే
నిరంతరం శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు ఒక్కటే

సమయానికి కాలానికి కలిగే క్షణం ఒక్కటే
జన్మకు మరణంకు జీవించే జీవం ఒక్కటే   || జీవం || 

Thursday, August 4, 2016

నిశ్శబ్దమే సత్యమై ఏకాగ్రతయే మౌనమై మేధస్సుకే మహా విజ్ఞానమవుతుంది

నిశ్శబ్దమే సత్యమై ఏకాగ్రతయే మౌనమై మేధస్సుకే మహా విజ్ఞానమవుతుంది
ఆలోచనే భావమై జ్ఞాపకమే తత్వమై మేధస్సుకు మహా గుణ విచక్షణవుతుంది || నిశ్శబ్దమే ||

సత్యాన్ని జయించుటకే మహా విజ్ఞానం మనలో చేరుతుంది
విచక్షణతో మెలగుట కొరకే మనలో ఓ సద్భావన చిగురిస్తుంది
దైవత్వంతో నడుచుటకై సత్య ధర్మం మనలో నిలిచిపోతుంది

నిశ్శబ్దంగా ప్రశాంతతో చేసే సాధన ఓ గొప్ప విజయమై నీలో చేరుతుంది
ఏకాగ్రతతో మౌనంగా చేసే అధ్యాయం మహా వేదమై నీలో నిలిచిపోతుంది
భావాలతో ఆలోచన చేసే తీరులోనే నీకై ఓ గొప్ప వేదాంతం ఉదయిస్తుంది || నిశ్శబ్దమే ||

పరిశోధనతో పరిజ్ఞానం పరిశీలనతో పరిపూర్ణత ప్రయోగంతో పరమార్థం
ప్రకృతిలో పర్యవేక్షణ పరిశుద్దత తత్వం సహచర ధర్మం సద్గుణ భావం

విజ్ఞానంతో వైభోగం వసంతాల వైశాఖం వర్ణాల సువర్ణోత్సవం శుభోదయం
వేదంతో వేదాంతం వేదాల సంకల్పం విశ్వాంతర వేదన వచనం వదనం || నిశ్శబ్దమే ||

Thursday, July 28, 2016

నా హృదయం ప్రతి క్షణం ఉదయిస్తూనే మేధస్సులో కిరణాలుగా స్పర్శను అందిస్తుంది

నా హృదయం ప్రతి క్షణం ఉదయిస్తూనే మేధస్సులో కిరణాలుగా స్పర్శలను అందిస్తుంది
కిరణాలతో ప్రతి కణం ఉత్తేజవంతమై మేధస్సులో విజ్ఞాన అన్వేషణను దివ్యంగా సాగిస్తుంది  || నా హృదయం ||

హృదయంలో ప్రతి స్పందన ప్రతిసారి పరిచయమై స్పర్శలనే కలిగిస్తుంది
ప్రతి క్షణం స్పందనలతో నా జీవానికి అంతర్భావ కార్యాలను నెరవేరుస్తుంది

మేధస్సులో విజ్ఞానాన్ని దేహంలో ఆరోగ్యాన్ని రూపంలో తేజాన్ని హృదయమే సరిచేస్తుంది
జీవంలో భావాన్ని ఆత్మలో తత్వాన్ని శ్వాసలో స్వభావాన్ని మేధస్సే లీనమై ఆలోచిస్తుంది   || నా హృదయం ||

ప్రతి సూర్యోదయం హృదయానికి మేధస్సుకు మహా దివ్యమైన ఆరోగ్య తత్వాన్నిస్తుంది
ప్రతి సూర్యాస్తమయం దేహానికి విశ్రాంతి మేధస్సుకు తాత్కాళిక నిద్రను సమర్పిస్తుంది

ప్రతి సూర్య కిరణం ప్రతి జీవికి ఉత్తేజం ఆరోగ్యంతో విజ్ఞాన కార్యాలపై గమనాన్ని కలిగిస్తుంది
ప్రతి సూర్య తేజం ప్రతి జీవికి భావ స్వభావాల తత్వాలతో మహా విచక్షణను తెలియజేస్తుంది  || నా హృదయం || 

Wednesday, July 6, 2016

నా బంధానివి నీవే నా స్నేహానివి నీవే

నా బంధానివి నీవే నా స్నేహానివి నీవే
నీవే మరణిస్తే నాతో నడిచేది ఎవరూ   || నా బంధానివి ||

నీలోనే నా శ్వాస నీతోనే నా ధ్యాస
నీ యందే నా ఉచ్చ్వాస నిచ్ఛ్వాస

నీవు లేనిదే క్షణమైనా ఆగని శ్వాస
నీవు లేక నా ఊపిరైనా నిలువదులే

జీవంతో ఉదయించి మరణంతో వెళ్ళేదవా
ఆత్మతో జీవించి పరమాత్మతో నడిచెదవా    || నా బంధానివి ||

హితమునే తెలిపి విజ్ఞానాన్ని పంచావు
విశ్వ జ్ఞానంతోనే అనుభవాన్ని ఇచ్చావు

అరిషడ్వార్గాలనే జయించి విచక్షణనే నేర్పావు
ఇంద్రియాల నిగ్రహంతోనే గమనాన్ని గుర్తించావు

విశ్వంతో నడిపించి అనుభవాన్ని తెలిపావు
లోకంతో పలకరించి విజ్ఞానాన్ని అందించావు   || నా బంధానివి ||