Showing posts with label ఆరాధించు. Show all posts
Showing posts with label ఆరాధించు. Show all posts

Thursday, July 6, 2017

నీలోన నీవే ఆత్మ జ్యోతిని వెలిగించు

నీలోన నీవే ఆత్మ జ్యోతిని వెలిగించు
నీలోన నీవే ఆత్మ జ్ఞానాన్ని సంబోధించు
నీలోన నీవే ఆత్మ బంధాన్ని నడిపించు
నీలోన నీవే ఆత్మ తత్వాన్ని అధిరోహించు   || నీలోన ||

యుగ యుగాలుగా వెలుగునిచ్చే ప్రజ్వల కాంతిని సంఘటించు
తర తరాలుగా విజ్ఞానాన్నిచ్చే మహోదయ మతిని సంగతించు

ఇహపర లోక ఆత్మ జ్ఞానాన్ని విశ్వమంతా వేదవిద్యగా పరిగణించు
మహాపర లోక ఆత్మ జ్యోతిని జగమంతా దైవకాంతిగా పరిమాణించు  || నీలోన ||

జీవ భావ బంధాల స్వభావాలతో సమతుల్యతను పరిశోధించు
జ్ఞాన వేద భావాల బంధాలతో సమయత్వమును పరిశీలించు

పరమాత్మము పరమార్థమేనని మనకై అనువదించు
ప్రకృతి పర్యావరణమేనని సహ జీవులకై ఆరాధించు  || నీలోన ||