Showing posts with label యుగాలు. Show all posts
Showing posts with label యుగాలు. Show all posts

Friday, September 30, 2016

ప్రకృతిలో ప్రతి నిత్యం ఎన్నో తెలియని అద్భుతాల ఆశ్చర్యపు సంఘటనలు జరిగేను

ప్రకృతిలో ప్రతి నిత్యం ఎన్నో తెలియని అద్భుతాల ఆశ్చర్యపు సంఘటనలు జరిగేను
ప్రతి నిమిషం అన్వేషణలో విశ్వ జగతి ఎంతటిదో బ్రహ్మాండ లోకమంటే ఏమిటో తెలిసేను || ప్రకృతిలో ||

విశ్వం ఎంత విశాలమైనదో ఆకాశపు ఎత్తున ప్రయాణిస్తూ అంచులను చేరేస్తే తెలిసేనా
జగతి ఎంత మహోత్తరమైనదో ఉదయిస్తూ అస్తమించే రోజుల యుగాలు గడిస్తే తెలిసేనా

లోకం ఎంత గొప్పదైనదో అంతరిక్షాన ఉన్న గ్రహాల నక్షత్రాల కూటమిని దర్శిస్తే తెలిసేనా
బ్రహ్మాండం ఎంత మహత్యమైనదో మానవ మేధస్సే నిత్యం దైవత్వంతో అన్వేషిస్తే తెలిసేనా || ప్రకృతిలో ||

మన విశ్వం మన విజ్ఞానం మన ప్రకృతి మన కుటీర ఆరోగ్య వాతావరణ స్థావరం
మన జగతి మన చరిత్ర మన గ్రంథం మన జ్ఞాపకాల మహాత్ముల రహస్య నిదర్శనం

మన భావం మన స్వభావం మన తత్వం మహా జీవులలో దాగిన ప్రతి రూప దర్పణం
మన సాహసం మన నిర్మాణం మన ప్రగతి అపురూపమైన యంత్ర భాషలకే మహా నిర్వచనం || ప్రకృతిలో ||

Wednesday, September 7, 2016

ప్రకృతియే సాగాలి యుగ యుగాలుగా మన కోసం

ప్రకృతియే సాగాలి యుగ యుగాలుగా మన కోసం
ప్రకృతియే పెరగాలి తర తరాలుగా జీవుల కోసం
ప్రకృతియే జగతికి విశ్వ భావ మహా ప్రాణ వాయువు  || ప్రకృతియే ||

ప్రకృతియే సూర్యోదయాన హరితత్వమై ప్రపంచమంతా సుకుమారత్వమై వ్యాపించును
ప్రకృతియే వర్షోదయాన పరిపక్వతమై విశ్వమంతా పచ్చని లేత తత్వంతో ఆవహించును

ప్రకృతియే మన మాతృ భావాల మహా తత్త్వం పరభావ స్వభావ జీవత్వం
ప్రకృతియే మన దైవ కాలానికి అసంభోదిత ఆయుర్వేద ఆయురారోగ్యత్వం || ప్రకృతియే ||  

ప్రకృతియే మహా విజ్ఞానం విశ్వ విజ్ఞాన జ్ఞానోదయం పరిశోధనకే వేద కుటీరం
ప్రకృతియే మహా క్షేత్రం మహా మహర్షులకు మహాత్ములకు మహా మందిరం

ప్రకృతియే జీవం అందించునే మాతృత్వం అదే మధురమైన జీవత్వం
ప్రకృతియే సర్వం అందించునే సర్వాంతం అదే అమోఘమైన వేదత్వం  || ప్రకృతియే ||  

Tuesday, July 5, 2016

సాహసమే శ్వాస సాగించునా సంతోషమే శ్వాసతో సాగిపోవునా

సాహసమే శ్వాస సాగించునా సంతోషమే శ్వాసతో సాగిపోవునా
శ్వాసయే సాహసమై జీవితాలను యుగ యుగాలుగా సాగించునా  || సాహసమే  ||

శ్వాసలోని జీవమే ఆయుధమై జీవిత సాహసాన్ని సాగించునా
శ్వాసలోని భావమే ఊపిరై జీవన సాహస కార్యాలను సాగించునా

శ్వాసలో స్వర జీవమే ఉచ్చ్వాస నిచ్ఛ్వాసాలతో సాగునా
శ్వాసలో స్వర బీజమే మహా ప్రాణ వాయువై సాగిపోవునా

శ్వాసలో ఏ శక్తి ఉన్నదో ధ్యాసలో ఏ మర్మం ఉన్నదో
శ్వాసలో ఏ ధీక్ష ఉన్నదో ధ్యాసలో ఏ సాధన ఉన్నదో   || సాహసమే  ||

శ్వాసలోని శ్వాసయే జీవమై మరో జీవాన్ని సృస్టించునా
శ్వాసలోని జీవమే మరో శ్వాసగా జీవమై అలాగే సాగునా

శ్వాసలోని సృష్టి తత్వమే యుగ యుగాలుగా  గడిచిపోవునా
శ్వాసలోని భావమే జీవమై సాహసంతో జీవితాన్ని సాగించునా

శ్వాసలోనే దైవం ఉన్నది అందులోనే మర్మం ఉన్నది
శ్వాసలోనే ధ్యానం ఉన్నది అందులోనే బంధం ఉన్నది  || సాహసమే  ||