Showing posts with label అతడు. Show all posts
Showing posts with label అతడు. Show all posts

Wednesday, July 6, 2016

అరెరే అరెరే అతడు ఆమె అక్కడ అదిరే

అరెరే అరెరే అతడు ఆమె అక్కడ అదిరే
ఇదిరే ఇదిరే ఇతడు ఈమె ఇక్కడ కుదిరే
అంతా అఆ ఇఈ ల మాటల సంభాషణలే
ఎంతైనా కాస్తంతా దూరం దగ్గరపు బంధాలే   || అరెరే ||

ఎవరికి ఎవరో తోడు ఎంతవరకో తెలియని తీరు
ఎవరికి వారే జోడు ఎంతవరకైనా జీవించే తీరు

అనుకున్న ఆనాటి అఆ ఇఈ ల మాటలే వేరు
అనువైన ఈనాటి మాటల విధానాల తీరే వేరు   || అరెరే ||

అంతా కలుసుకోవాలని కలిసే ఉండాలని మాటల తీరు
అందరు అనుకున్నా తీరిక లేని జీవన కార్య క్రమాల తీరు

ఏనాటికైనా కలుసుకోవాలని భావాలతో జీవిస్తూ ఎదురు చూసే తీరు
ఎప్పటికైనా కలుసుకుంటామని దూరపు దగ్గరపు ఆలోచనల తీరు      || అరెరే ||