Showing posts with label కాంతి. Show all posts
Showing posts with label కాంతి. Show all posts

Wednesday, December 7, 2016

ఆత్మవు నీవే జ్యోతివి నీవే

ఆత్మవు నీవే జ్యోతివి నీవే
పరంజ్యోతివి నీవే పరకాంతవు నీవే
పరమాత్మవైనా మంగళ జ్యోతివి నీవే    || ఆత్మవు ||

విశ్వ జ్యోతివై వెలుగును ఇచ్చే సూర్య కాంతివి నీవే
మహా జ్యోతివై వెలుగును ఇచ్చే తేజస్సు కాంతివి నీవే
మంగళ జ్యోతివై వెలుగును ఇచ్చే ప్రజ్వల కాంతివి నీవే

అఖండ జ్యోతివై జగతికి దారిని చూపే మహా కాంతివి నీవే
ధర్మ జ్యోతివై జీవులకు విజ్ఞానాన్ని పంచే వేద కాంతివి నీవే
వర్ణ జ్యోతివై రూపాలకు ఆకారాన్ని ధరించే సువర్ణ కాంతివి నీవే   || ఆత్మవు ||

జ్యోతిగా వెలిగే ఆత్మ కాంతివి నీవే
పరంజ్యోతిగా వెలిగే సూర్య కాంతివి నీవే
ఆరంజ్యోతిగా వెలిగే మకర కాంతివి నీవే

విశ్వానికే ప్రకాశమై ఆకాశానికే తేజమై జగతికే రూపమై వెలిగే సర్వాంతర జ్యోతివి నీవే
దేహానికి దైవమై శ్వాసకే ధ్యానమై మనస్సుకే మోహమై జీవించే నిత్యాంతర జ్యోతివి నీవే
లోకానికే భావమై సృష్టికే తత్వమై మేధస్సుకే బంధమై తపించే సత్యాంతర జ్యోతివి నీవే  || ఆత్మవు ||

Monday, July 18, 2016

సూర్యనితో జీవించే కాలం నా మేధస్సులో మొదలైనది

సూర్యనితో జీవించే కాలం నా మేధస్సులో మొదలైనది
సూర్యునితో నడిచే కాలం నా ఆలోచనలో ఆరంభమైనది
సూర్యునితోనే జీవిస్తూ సాగే కాలం నాలోనే ఉదయించినది  || సూర్యనితో ||

సూర్యోదయమే నాకు తెలిపెను నాతో మేల్కొని నడచిరా అని
సూర్య కిరణమే నాకు తెలిపెను నాతో మెలకువగా సాగరా అని

సూర్య తేజస్సుతో వర్ణములయందు సాగగా నాలో సువర్ణ భావమే
సూర్య ప్రజ్వలంతో కాంతి కిరణాలయందు సాగగా నాలో ప్రకాశమే

సూర్య క్రాంతి భ్రమణమే గ్రహాల స్థితి కాల ప్రయాణమని
సూర్య భ్రమణ కిరణమే విశ్వ ప్రదేశాల సకాల గమనమని   || సూర్యనితో ||

సూర్యునితో నా దేహం కాంతి కిరణమై జగతికే ప్రకాశమైనది
సూర్యునిలో నా శ్వాస క్రాంతి జీవమై విశ్వానికే సువర్ణమైనది

సూర్యుని లోకమే నవ ఉత్తేజమైన విశ్వ జీవన లోకమని
సూర్యని వర్ణమే నవ తేజమైన కాంతి జీవన ప్రపంచమని

యుగాలుగా సాగే కాలంలో ప్రతి క్షణం నేను ఒక భావమై సాగుతున్నాను
క్షణాలుగా సాగే సమయంలో ప్రతి స్థానంలో ఒక వర్ణమై వెలుగుతున్నాను  || సూర్యనితో ||

Thursday, June 16, 2016

నీవే లేవని నేనే లేనని

నీవే లేవని నేనే లేనని
నీవే లేవని నాతోనే వచ్చింది నీ భావన
నేనే లేనని నాలోనే నిలిచింది నా ఆలోచన  || నీవే లేవని ||

నీవే లేని నాకు ఏదీ తోచని భావనగా నిలిచింది
నీవే లేవని నాలో శూన్యమే అంతరించి పోయింది

నీవే లేని నాలో ఏదో సందేహమే కలుగుతున్నది
నీవే లేవని నాలో శ్వాసే కర్పూరమై కరుగుతున్నది  || నీవే లేవని ||

నీవే లేని నాలో ఎన్నో చిత్రములు కనిపిస్తూ ఉన్నాయి
నీవే లేవని నాలో దిక్కులు అన్నీ ఒకటిగానే నిలిచాయి

నీవే లేని నా దేహములో కాంతి లేని మేఘ వర్ణాలు కమ్ముకున్నాయి
నీవే లేవని నా యదలో స్వప్త స్వరములన్నీ మౌనామై పోతున్నాయి  || నీవే లేవని ||