Showing posts with label కార్యము. Show all posts
Showing posts with label కార్యము. Show all posts

Thursday, November 10, 2016

నా ఆలోచనలే అన్వేషణగా విశ్వమంతా సాగిపోతున్నాయి

నా ఆలోచనలే అన్వేషణగా విశ్వమంతా సాగిపోతున్నాయి
నాలోని భావాలే వేదంగా జగమంతా వ్యాపించిపోతున్నాయి
నా మేధస్సులోని తత్వాలే విశ్వ విజ్ఞానాన్ని సేకరిస్తున్నాయి  || నా ఆలోచనలే ||

ఒక క్షణమైనా చాలు ఒక విశ్వ భావన కలిగేను నా ఆలోచనలలో
కాస్త సమయమైనా చాలు ఒక వేద జ్ఞానం తోచేను నా మేధస్సులో

ఎన్నెన్నో ఆలోచనలతో ఎన్నో భావాలు నాలోనే కలిగేను ఎప్పటికైనా
ఎన్నెన్నో భావాలతో ఎన్నో తత్వాలు తోచేను నాలో నిత్యం ఏనాటికైనా  || నా ఆలోచనలే ||

ప్రతి క్షణం ఒక విశ్వ భావమే నాలో కలిగే నవ ఆలోచన
ప్రతి సమయం ఒక వేద తత్వమే నాలో తోచే మహాలోచన

ఏ కార్యములో ఉన్నా నా మేధస్సులో అన్వేషణ ఒక ప్రయాణమే
ఏ సాధనలో ఉన్నా నా మనస్సులో నవ భావన ఒక కాల తత్వమే  || నా ఆలోచనలే || 

Tuesday, July 5, 2016

సృష్టి కర్తవు నీవే సృష్టి వినాశానివి నీవే

సృష్టి కర్తవు నీవే సృష్టి వినాశానివి నీవే
సృష్టిలోని జీవితాన్ని నడిపించేది నీవే
సృష్టి క్రియలలో దాగిన సృష్టి కర్మవు నీవే
కర్త కర్మ క్రియల ప్రతిఫలాన్ని అందించేది నీవే
ప్రతి కార్యము నీ భావ స్వభావాన్నే తెలుపుతున్నది 

Saturday, December 19, 2009

జగతిని నడిపించు శక్తి విశ్వ భావ తత్వమైన కాలమే నిదర్శనము

జగతిని నడిపించు శక్తి విశ్వ భావ తత్వమైన కాలమే నిదర్శనము
ప్రతి క్షణమున జరిగే ఏ కార్యములకైనా కాలమే సరితూగుతున్నది
కాలమును నిలుపు శక్తి భ్రమయే గాని సత్యం నిత్యం అతిశయోక్తియే
కాలము కన్న గొప్పది విశ్వ భావాలయందు ఉన్నా కాల ప్రభావమేగా