Showing posts with label ప్రాయం. Show all posts
Showing posts with label ప్రాయం. Show all posts

Monday, August 14, 2017

ఏమిటో నీ ధ్యాస ఏమిటో నీ శ్వాస

ఏమిటో నీ ధ్యాస ఏమిటో నీ శ్వాస
తెలియని తొలి ఉచ్చ్వాస తెలుపని తొలి నిచ్ఛ్వాస
తరతరాలుగా సాగే జీవ భావ దేహ ధ్యాన మంత్రమే   || ఏమిటో ||

వేదమై వచ్చిందో విజ్ఞానమై సాగిందో మర్మమై దాగినది మేధస్సులో
గానమై పలికిందో స్వరమై పిలిచిందో భావమై వచ్చినది దేహములో

ఉచ్చ్వాసగా సాగినా నిచ్చ్వాసగా నిలిపినా శ్వాసగా సాగుతున్నది ప్రతి జీవిలో
ఊపిరిగా ఉంటున్నా స్వధ్యాసగా వస్తున్నా శ్వాసగా ఆడుతున్నది ప్రతి జీవిలో  || ఏమిటో ||

భావమై వచ్చిందో స్వభావమై నిలిచిందో మంత్రమై స్మరిస్తున్నది దేహములో
జీవమై వెలసిందో దైవమై ఒదిగిందో తంత్రమై విస్మరిస్తున్నది హృదయములో

ప్రాణంగా ఎదిగినా కాలంతో ఒదిగినా శ్వాసగా జీవిస్తున్నది ప్రతి అణువులో
ప్రాయంగా సాగినా సమయంతో వచ్చినా శ్వాసగా వరిస్తున్నది ప్రతి అణువులో  || ఏమిటో || 

Wednesday, October 19, 2016

ప్రేమం ప్రియం సంగీతం సంతోషం

ప్రేమం ప్రియం సంగీతం సంతోషం
ప్రాణం ప్రయాణం జీవితం ఉల్లాసం
ప్రాయం వసంతం జీవనం ఉత్తేజం  || ప్రేమం ||

ప్రేమతో సాగే ప్రయాణమే మన లోకం
ప్రాణంతో కలిగే శ్వాసే మన గమనం
ప్రాయంతో వెలిగే మన ధ్యాసే జీవితం
కాలంతో సాగే మన సంతోషమే ఆనందం

భావం ఓ జీవిత గీతం
తత్వం ఓ జీవన రాగం
వేదం ఓ శరీర స్వరం
గుణం ఓ ఆకార నాదం  || ప్రేమం ||

ప్రేమించే ప్రాణమే ప్రయాణిస్తూ చేరుతున్నది
ప్రాణంతో ప్రాయమే చిగురిస్తూ సాగిపోతున్నది
ప్రాయంతో పద్మమే వికసిస్తూ ఎదుగుతున్నది

భావంతో బంధాలెన్నో ప్రేమంగా సాగుతున్నాయి
వేదంతో గుణాలెన్నో ప్రాణంగా వచ్చేస్తున్నాయి
స్నేహంతో పరిచయాలెన్నో శాంతంగా కలుస్తున్నాయి  || ప్రేమం ||