Showing posts with label ఆకలి. Show all posts
Showing posts with label ఆకలి. Show all posts

Monday, February 6, 2017

కోరిన ఆశకు తీరని వాంఛ

కోరిన ఆశకు తీరని వాంఛ
పలికిన మాటకు తెలియని అర్థం
తెలియని ప్రయాణం చేరని గమ్యం
వండిన ఆహారానికి ఆకలి లేకపోవడం
జరిపిన కార్యానికి సమస్యలు ఎదురవ్వడం
భావం లేని తత్వం శూన్యం లేని నిరాకారం 

Monday, August 8, 2016

జీవం ఒక్కటే శ్వాసలో ఊపిరి ఒక్కటే

జీవం ఒక్కటే శ్వాసలో ఊపిరి ఒక్కటే
ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ధ్యాస ఒక్కటే
ప్రతి జీవిలో జీవించే శ్వాస భాష ఒక్కటే  || జీవం ||

దైవంతో సాగే దేహానికి శ్వాస ప్రాణమే
జీవంతో సాగే శరీరానికి ధ్యాస ధ్యానమే

స్వరముతో ఎదిగే శ్వాసకు ఆకలి ఒక్కటే
జ్ఞానంతో పెరిగే మేధస్సుకు భావన ఒక్కటే

ఆలోచనలలో విచక్షణ మాటలలో ఉచ్ఛరణ విజ్ఞానమే
ధ్యాసలో గమనం శ్వాసలో తపనం సద్గుణమైన జ్ఞానమే  || జీవం ||

ఎరుకతో సాగే జీవికి సాధన విజయమే
వచనంతో సాగే ప్రాణికి జ్ఞానం సత్యమే

నిత్యం ధ్యానించే శ్వాసకు ధ్యాస ఎప్పటికి ఒక్కటే
నిరంతరం శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు ఒక్కటే

సమయానికి కాలానికి కలిగే క్షణం ఒక్కటే
జన్మకు మరణంకు జీవించే జీవం ఒక్కటే   || జీవం || 

Wednesday, May 4, 2016

కెరటము అలసిపోయినా ఆగని ఆధ్రత మనలో సాగేనా

కెరటము అలసిపోయినా ఆగని ఆధ్రత మనలో సాగేనా
శిఖరము ఎదిగిపోయినా తరగని ఆశ మనలో నిలిచేనా
ఆలయం ఒదిగిపోయినా ఆరని తేజము మనలో వెలిగేనా
వృక్షం నిలిచిపోయినా తలవని ఆకలి మనలో కలిగేనా 

Thursday, April 28, 2016

ఆకలితో జీవిస్తున్నావా మేధస్సుతో జీవిస్తున్నావా

ఆకలితో జీవిస్తున్నావా మేధస్సుతో జీవిస్తున్నావా
ఆకలితో ఉన్నప్పుడే ఆహార భావాలను వెతికెదవా
ఆలోచనలు కలిగినప్పుడే భావార్థాన్ని గ్రహించెదవా
ఆలోచనలు కలగాలంటే మేధస్సుకు శక్తి కావాలి
మేధస్సు జీవించేందుకు దేహానికి ఆహారం కావాలి
ఆహారం ఆలోచనలతోనే ప్రతి జీవి జీవితాన్ని సాగించాలి
ఆకలి తీరిన తర్వాతనే ఎన్నో కార్యాలను చేసుకోవాలి
ప్రతి కార్యం విజ్ఞానంగా సాగేందుకే భావార్థం కావాలి
ఓ విశ్వ మానవా! విశ్వమున జీవిస్తూ నా విశ్వ భావనను గ్రహించు మిత్రమా!