Showing posts with label అద్వితీయం. Show all posts
Showing posts with label అద్వితీయం. Show all posts

Tuesday, July 26, 2016

నా భావాలను చదువుటలోనే మీలో జ్ఞాన విజ్ఞానమే తెలుస్తుంది

నా భావాలను చదువుటలోనే మీలో జ్ఞాన విజ్ఞానమే తెలుస్తుంది
నా స్వభావాలను తెలుసుకొనుటలోనే మీలో తత్వమే వస్తుంది  || నా భావాలను ||

నాలోని భావ స్వభావ తత్వాలు ఆత్మ మహాత్ముల వేద వేదాంతం
నాలోని ఋషి మహర్షుల అద్వైత్వ దైవత్వపు దైవం అద్వితీయం

భావ స్వభావాలు విశ్వ ప్రకృతిలో అనంతమై పరిశీలనగా ఉన్నాయి
ఆత్మ తత్వములు జగతి నిర్మాణములలోనే పరిశోధనగా మిగిలాయి  || నా భావాలను ||

విజ్ఞానం మేధస్సులో అన్వేషణగా కొనసాగి అనుభవమై వరిస్తుంది
వేదాంతం ఆలోచనలలో పరిశోధనమై మరో జీవితాన్ని చూపిస్తుంది

ఎప్పటి వరకో తెలియని జీవ స్వభావాలు కాలంతో మహా కొత్తగానే కలుగుతున్నాయి
ఏనాటి వరకో తెలియని ఆత్మ తత్వాలు యుగాలతో నవీనమై పునరావృతమవుతాయి  || నా భావాలను ||