Friday, April 22, 2011

విశ్వమే లేని జీవితం భావన లేని

విశ్వమే లేని జీవితం భావన లేని శూన్యత్వమే
మర్మమే దాగిన కాలమే తెలియని భావ పరిశోధనయే
భావాల అర్థం తెలిసిన అర క్షణమే మహా శక్తి శూన్యమే
శూన్యారంభమే విశ్వ కాల నిర్మాణ రూప జీవ జీవన జీవితం

విశ్వ విజ్ఞానం ఏ లోకాన ఉన్నదో

విశ్వ విజ్ఞానం ఏ లోకాన ఉన్నదో అన్వేషించే గ్రహిస్తున్నా
ప్రతి లోకాన్ని దర్శిస్తూ ప్రతీది విశ్వ విజ్ఞానంగా సేకరిస్తున్నా
ఏది లేదనే భావన లేకుండా అన్నీ విశ్వ విజ్ఞానంలో చేరుస్తున్నా
ప్రతి క్షణ కాల విశ్వ కార్యాలు విశ్వ విజ్ఞానమేనని అన్వేషిస్తున్నా

దాచుకోండి నా విజ్ఞాన భావాలను

దాచుకోండి నా విజ్ఞాన భావాలను అన్వేషించినా దొరకదేమో
ఎప్పుడు ఏం జరుగుతుందో దొరికినప్పుడే మేధస్సులో దాచుకోండి
కావాలనుకున్నప్పుడు దొరకకపోతే మేధస్సు చలించినా అన్వేషణ ఆగిపోతుందేమో
నా కాల భావాలకు అర్థపు స్వభావాలు తెలియుటకు అనుభవ విజ్ఞానం అవసరమే
యుగాలుగా జీవిస్తూ అన్వేషించినా లభించని మేధస్సుకు తెలియని విశ్వ స్వభావాలెన్నో
విశ్వ విజ్ఞాన సంపూర్ణం అనంత శూన్య ఆరంభం కాల విజ్ఞాన పరిశోధన పరిపూర్ణ తత్వం

ఏనాటికి లేని మర్మ విచక్షణలు

ఏనాటికి లేని మర్మ విచక్షణలు నా మేధస్సులో ఉన్నాయేమో
ఏ లోకాల నుండి ఏ కాలంతో నా మేధస్సును చేరాయో
ఏ భావ స్వభావాలతో ఎంత కాలం ఎలా ప్రయాణించాయో
నాలోని మర్మ విచక్షణ భావాలు విశ్వాన్నే తిలకిస్తున్నాయి
ఏ విశ్వ విజ్ఞానాన్ని అన్వేషిస్తున్నదో మర్మ విచక్షణకే ఎరుక

కాలమే లేని కాలంలో నా మర్మ భావన

కాలమే లేని కాలంలో నా మర్మ భావన శూన్యంగా జన్మించినదేమో
ఆ తర్వాతే విశ్వ కాలంగా క్షణం ఆరంభమై సాగుతూ వస్తున్నదేమో
కాలమే లేని కాలంలో మర్మ కాలం మహా శూన్య భావ రహస్యమే
విశ్వ భావాలను పరిశోధించిన కాలం మర్మ కాలమేనని నా భావన
శూన్య భావాలు తెలియు వారికి మర్మ కాల భావాలు తెలియును

ఇల్లు కూడా మేధస్సైతే అశుభ్రత

ఇల్లు కూడా మేధస్సైతే అశుభ్రత ఉండదేమో
దైవం కన్నా గొప్పగా పరిశుద్ధతతో ఉంచెదరేమో
మలినం లేని మేధస్సుగా గృహాన్ని ఉంచగలిగితే
మేధస్సులో అనంత విశ్వ లోకాలు దర్శనమిస్తాయి

జీవ శక్తితో జీవన కాల జీవితం

జీవ శక్తితో జీవన కాల జీవితం సాగుతున్నది
శక్తి కోసమే ఆహారం అలాగే వివిధ కార్య జీవితం
జీవితం జీవ విచక్షణ భావ కార్య చలన జీవనం
కార్య జీవనమే విజ్ఞాన అనుభవ జీవిత సిద్ధాంతం
జీవ జీవ సమక్య భావమే విజ్ఞాన జీవన జీవితం

Thursday, April 21, 2011

మేధస్సును ఎవరు లిఖిస్తూ

మేధస్సును ఎవరు లిఖిస్తూ జీవ కణాలకు అందిస్తున్నారు
కాల ప్రభావాలకు ఎదిగే జీవ విచక్షణతో ఎలా జీవిస్తున్నది
ప్రతి జీవి జీవించుటలో మేధస్సులో కలిగే కాల జ్ఞానమేది
ఎక్కడ ఎప్పుడు ఏ విధమైన ఆలోచన కార్యాలతో జీవించాలో
ఆత్మ స్వభావ ప్రవర్తనతో కలిగే ఆలోచన భావ జ్ఞాన తత్వమే
ఒకరిగా జీవించినా గుంపులతో కలిసినా జీవించే మేధస్సును
ఎవరు లిఖిస్తున్నారో విశ్వ సృష్టికే మహా రహస్య మర్మ క్షేత్రం

మేధస్సులో విశ్వ విచక్షణ వర్ణ భావాలు

మేధస్సులో విశ్వ విచక్షణ వర్ణ భావాలు ఎన్నో
విశ్వ సృష్టిలో సృష్టించిన రూపాలకే తెలియును
విచక్షణ కణ భావ గుణ తత్వ స్వభావాలేవో
ఆలోచనల ప్రవర్తనలో కలిగే కాల ప్రభావాలే
మేధస్సులో ఉన్న మహా గుణ ఆలోచనలు
విశ్వ విజ్ఞాన కాల జ్ఞాన ఆత్మ వేద భావాలు

మేధస్సుకు నిద్ర లేక సరైన

మేధస్సుకు నిద్ర లేక సరైన కార్య స్థితులు లేక కాల జీవనం సాగుతున్నది

మరల రాని జీవితాన్ని మరచిపోతేనే

మరల రాని జీవితాన్ని మరచిపోతేనే దుఃఖమా
మరణిస్తే మరల రాని ఆలోచన విషాదకరమా
మరల రాని అవకాశం కాలంతో సాగే కఠినమా
గతమే గుర్తు లేని మేధస్సుకు ఏదైనా సమ భావమా
గుర్తుకొచ్చే భావాలతో మేధస్సు ఎప్పుడూ సతమతమే
విజ్ఞానంగా జీవిస్తూ అన్ని విధాలా అన్నింటిని సరిచేసుకో

నేను జీవమే నీవు జీవమే జీవించుటకు

నేను జీవమే నీవు జీవమే జీవించుటకు భేదమే
నీకు విశ్వమే నాకు విశ్వమే జీవించుటలో వ్యత్యాసమే
నీలో శ్వాసయే నాలో శ్వాసయే జీవించుటలో విరోధమే
నీకు కాలమే నాకు కాలమే జీవించుటలో అజ్ఞానమే
ఏదేమైనా మరణించుటలో ఎవరైనా సమ భావమే

మేలు కోరే జీవమా నిద్రనే మేల్కొల్పవా

మేలు కోరే జీవమా నిద్రనే మేల్కొల్పవా
మేధస్సులో విచక్షణ కణాలనే మేల్కొల్పవా
విజ్ఞాన ఆలోచనలనే విచక్షణతో మేల్కొల్పవా
ఆలోచన భావాలతో మేధస్సునే మేల్కొల్పవా

జీవమే లోకమై మేధస్సులో ఎదుగుతూ

జీవమే లోకమై మేధస్సులో ఎదుగుతూ జ్ఞానంతో జీవిస్తున్నది
విశ్వం కన్నా మహా గొప్ప లోకంగా మేధస్సే బ్రంహాండమై జీవిస్తున్నది

విశ్వ సృష్టికి తెలియని శూన్య లోకం

విశ్వ సృష్టికి తెలియని శూన్య లోకం నా మేధస్సు భావాలలో ఉన్నది

విశ్వ శూన్యం నా స్థానం విశ్వ మర్మం

విశ్వ శూన్యం నా స్థానం విశ్వ మర్మం నా జ్ఞాన క్షేత్రం

Wednesday, April 20, 2011

నీ మేధస్సులో మహా దివ్య విచక్షణ

నీ మేధస్సులో మహా దివ్య విచక్షణ భావాలు నిద్రిస్తున్నాయి
సూర్య కిరణాలతో నీ విశ్వ గుణ విచక్షణాలను మేల్కొల్పలేవా
అద్వైత భావాలను నీ విశ్వ విచక్షణ కణాలకు వినిపించలేవా
మహాత్ముల విశ్వ వేద భావాలకు నీ మేధస్సు ఆలోచించుటలేదా
సూర్య తేజాన్ని భ్రుకుటిపై ఉంచి మహా వేగంతో ప్రయాణించలేవా
నీ విశ్వ శక్తి విశ్వ విజ్ఞానమేనని మేధస్సులోని విచక్షణకు కలిగించు

కర్మనే కోరినట్లు భాధలనే ఇష్టంగా

కర్మనే కోరినట్లు భాధలనే ఇష్టంగా కలిగిస్తున్నావు

జీవమే ధ్యాసగా జీవిస్తుంటే మేధస్సు

జీవమే ధ్యాసగా జీవిస్తుంటే మేధస్సు ఏ ధ్యాసతో జీవిస్తుందో

విశ్వమే నా మేధస్సులో రత్నమై

విశ్వమే నా మేధస్సులో రత్నమై మెరుస్తున్నది
నక్షత్ర తేజస్సులే మేధస్సులో ప్రకాశిస్తున్నాయి
గ్రహాలే వర్ణ వజ్రాలై మిరుమిట్లు గొలుపుతున్నాయి
లోకాలుగా విశ్వ మేధస్సు విచక్షణ కాంతులతో వెలుగుతున్నది

విశ్వ నాధుడు చెవిలో తెలిపిన

విశ్వ నాధుడు చెవిలో తెలిపిన రహస్యం తెలుసా
దేహాన్ని దాచే మర్మ విజ్ఞాన రహస్యం తెలుసా
మేధస్సులో అమర్చిన ఆత్మ జ్ఞాన రహస్యం తెలుసా
విచక్షణ కణంలో దాగిన విశ్వ నిర్మాణ రహస్యం తెలుసా

విశ్వ మేధస్సులో మరో ధ్యాసతో

విశ్వ మేధస్సులో మరో ధ్యాసతో ధ్యానించాలని పర ధ్యాసతో జీవిస్తున్నా

ఏ లోకాలకు వెళ్లిపోతానో గాని మరణం

ఏ లోకాలకు వెళ్లిపోతానో గాని మరణం ఈ లోకమే కోరుకున్నది

విశ్వమా! నేను దేనిని ఎలా పూజించాలో

విశ్వమా! నేను దేనిని ఎలా పూజించాలో నిర్ణయించుకోలేక పోతున్నా
ఏది ఎప్పుడు ఎంతటి పరిశుద్ధతతో పూజించాలో కాలమే తెలుపునా
నీవే నన్ను పూజిస్తూ నీలోనే నేను జీవించనా విశ్వ పరిశుద్ధ శ్వాసగా
విశ్వ పవిత్రతకు నా స్థానం ఎంతటి పరిశుద్ధమైనదో నీవే నిర్ణయించు

నాలో ఉన్న పంచ భూతాలకు ఏమి

నాలో ఉన్న పంచ భూతాలకు ఏమి కావాలో జీవించుటలో తెలియుట లేదు
జీవించుటకు ఏది నిత్యమో నిర్ణయించు కొనుటకు అన్వేషణయే చేస్తున్నా

కాలం కన్నా గొప్ప మంత్రం గాని

కాలం కన్నా గొప్ప మంత్రం గాని మహా తంత్రం గాని లేనే లేదు
విశ్వ కాలం సాగిపోవుటలో విశ్వ చలనం జరుగుతున్నది
విశ్వ కార్యాలతో సాగిపోయే విశ్వ జీవులకు కాలమే గొప్పది
కాలమే లేని కార్యాలకు జీవ బంధాలు లేవని తెలుస్తున్నది

సూక్ష్మ జీవ కణంలోనే మేధస్సు

సూక్ష్మ జీవ కణంలోనే మేధస్సు ఉన్నదని విచక్షణ తెలుపుతున్నది
జీవ కణంలోనే బ్రంహాండం ఉన్నదని మహా మేధస్సు తెలుపుతున్నది
విశ్వ విజ్ఞానమంతా జీవ కణం లోనే ఉన్నట్లు విచక్షణ గ్రహిస్తున్నది
విచక్షణ కణమైనా జీవ కణంలోనే ఉద్భవిస్తుందని మేధస్సు గ్రహిస్తున్నది

Saturday, April 16, 2011

ఆశలేని ధ్యాసతో స్వప్నంలోనే శిలనై

ఆశలేని ధ్యాసతో స్వప్నంలోనే శిలనై నిలిచిపోయాను
మెలకువ లేని నిద్రలో మరణమై పర ధ్యాసతో సాగినది
విశ్వ జీవులలో ఎన్ని మర్మ పర ధ్యాసలో ధ్యానించినా తెలియవే
శిలగా మారినా నా అన్వేషణ పర లోకాన విశ్వ విజ్ఞాన భావాలతోనే

విశ్వ దివ్య రూపం సూర్య కాంతి తేజం

విశ్వ దివ్య రూపం సూర్య కాంతి తేజం
విశ్వ విజ్ఞాన భావం ఆత్మ జ్ఞాన ధ్యానం
రూప భావ తేజం జీవ మేధస్సు జీవితం
జీవన విజ్ఞాన కిరణం జీవ యోగ తత్వం

ఏ గ్రహంలో ఏ జీవి జీవించుట లేదని

ఏ గ్రహంలో ఏ జీవి జీవించుట లేదని మానవ మేధస్సు గ్రహించునా
మానవుని కన్నా గొప్పగా విజ్ఞాన మేధస్సు ఏ గ్రహ జీవికి కలుగును
భూమి కన్నా గొప్పగా పంచ భూతాలు ఏ గ్రహంలో వెలిసియున్నాయి
సూర్యుని వెలుగు భూమిపై కంటే ఇతర గ్రహంలో ఎక్కువగా ప్రకాశిస్తుందా
మరో గ్రహాలలో ఏ జీవి జన్మించినా జీవిత విజ్ఞాన కాల ప్రభావాలు తక్కువయే

మేధస్సుకు నిద్ర రాదని పర ధ్యాస

మేధస్సుకు నిద్ర రాదని పర ధ్యాస ఆలోచనలే కలుగునా
పర ధ్యాసకై మహా విశ్వ విజ్ఞాన ఆలోచనలే తెలుపునా

యోగ భాస్కరుడు ఉదయిస్తూ

యోగ భాస్కరుడు ఉదయిస్తూ విశ్వ భాస్కరుడు మేల్కొంటాడు

ఆలోచనను వదులుకోవద్దు నిద్రలో

ఆలోచనను వదులుకోవద్దు నిద్రలో జారిపోవద్దు
మహా ధ్యాసను మరచిపోవద్దు విజ్ఞానాన్ని మార్చుకోవద్దు
నిత్య సత్య ధ్యాసలో చిరంజీవిగా జీవించడాన్ని వదులుకోవద్దు
మర్మ విజ్ఞాన రహస్యాలు నీ ఆత్మ మేధస్సులోనే కలుగుతాయి

విశ్వ యోగత్వ పర బ్రంహ్మా

విశ్వ యోగత్వ పర బ్రంహ్మా ఆత్మ యోగత్వ పర ధర్మ

Friday, April 15, 2011

విశ్వాన్ని తెలుసుకో విజ్ఞాన మేధస్సును

విశ్వాన్ని తెలుసుకో విజ్ఞాన మేధస్సును తెలుపుకో
విశ్వ విజ్ఞానాన్ని మరో మేధస్సులతో పరీక్షించుకో

అర చేతిలో రాజ యోగం

అర చేతిలో రాజ యోగం మర్మ మేధస్సులో విశ్వ విజ్ఞాన యోగం

నా రూపం అతనిదే నాలో అతని భావాలే

నా రూపం అతనిదే నాలో అతని భావాలే అతని ఆశయాలతోనే జీవిస్తున్నానేమో

అవతారాలు ఏవైనా జీవించుటలో

అవతారాలు ఏవైనా జీవించుటలో జీవించే విధానం మారదు
రూపానికి తగ్గ భావాలు విచక్షణ లక్షణాలు కలుగుతుంటాయి
ఏ రూపానికి ఆ రూప భావ సామర్థ్యాలే అవతార లక్షణాలు
రూపానికి తగ్గ జ్ఞానం ఆకారానికి తగ్గ జీవన కాలమే జీవితం

ఎవరికి ఏది వ్రాశారో తెలుసుకోకుండా

ఎవరికి ఏది వ్రాశారో తెలుసుకోకుండా తీసుకోవద్దు
ఎవరికి లేదంటే నిన్నెవరు ప్రశ్నించ లేదంటే ఆలోచించు
వృధా చేయని దానిని మహా గొప్పగా ఉపయోగించు
నీకు దక్కేది మహా గుణత్వాన్ని కలిగి ఉండాలని భావించు

విశ్వానికి మహా అవకాశం

విశ్వానికి మహా అవకాశం కాల భావాలను సాగించడం
విశ్వ జీవికి ఒక గొప్ప అవకాశం మేధస్సుతో జీవించడం

ఎవరో ఎక్కడో ఎందుకో విశ్వ ధ్యానం

ఎవరో ఎక్కడో ఎందుకో విశ్వ ధ్యానం చేస్తున్నారు
ఎప్పుడో ఎవరో భోధించారు విశ్వ విజ్ఞాన భావాలను
తన మేధస్సుకే తెలియని మహా అన్వేషణతో జీవిస్తూనే
విశ్వ లోకాలలో పర ధ్యానాన్ని పరమాత్మగా సాగిస్తున్నారు

నీవు ఆలయాన్ని దర్శించిన సంగతి

నీవు ఆలయాన్ని దర్శించిన సంగతి ఆలయ విగ్రహానికి తెలుసా

మర్మ మేధస్సులో ఆకలి లేదు

మర్మ మేధస్సులో ఆకలి లేదు పర ధ్యాసలో నిద్రైనా లేదు

ఏ మేధస్సుకు లేని విశ్వ ధ్యాస

ఏ మేధస్సుకు లేని విశ్వ ధ్యాస నా మేధస్సులో ఉందని నా విచక్షణ

విశ్వ విజ్ఞానం ఎక్కడ లభిస్తుందో తెలిస్తే

విశ్వ విజ్ఞానం ఎక్కడ లభిస్తుందో తెలిస్తే యుగాలైనా ఆలోచన భావాలు ప్రయాణిస్తాయి

మళ్ళీ మళ్ళీ రానిదే ఈ మహా విశ్వ

మళ్ళీ మళ్ళీ రానిదే ఈ మహా విశ్వ విజ్ఞాన వేదాంతం
అద్వైత భావాల అనంత విశ్వ నిర్మాణ వేద ప్రజ్ఞానం
మేధస్సుకు అందని మహాత్ముల మర్మ విజ్ఞాన సారాంశం
రహస్యాలు ఎన్నున్నా అంతులేని జీవిత విజ్ఞాన సోపానం
యుగాలుగా సాగే అన్వేషణలో మేధస్సే పర ధ్యాస ప్రయాణం
ఒక్క సారి మర్మాలోచన కలిగితే ధ్యాస పర లోకానికి వెళ్ళిపోతుంది

Thursday, April 14, 2011

నా భావాలతో జీవించే వారికి విశ్వం

నా భావాలతో జీవించే వారికి విశ్వం ఎల్లప్పుడు మహోత్తరంగా ఉంటుంది

ప్రతి జీవి మేధస్సులో కలిగే ప్రతి

ప్రతి జీవి మేధస్సులో కలిగే ప్రతి ఆలోచన నా విశ్వ భావానిదే

ఎన్ని యుగాలైనా శ్రామికులు ఇంకా

ఎన్ని యుగాలైనా శ్రామికులు ఇంకా మట్టిలోనే జీవిస్తున్నారు
మట్టిలోనే జీవిస్తూ మట్టితోనే పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు
మట్టిలోనే జన్మిస్తూ మట్టితోనే జీవిస్తూ మట్టిలోనే మరణిస్తున్నారు
మట్టిలో మాణిక్యం ఉన్నట్లు మట్టిలోనే మహత్యం ఉందంటారు

Saturday, April 2, 2011

విశ్వ ధ్యాస నా మేధస్సుకు

విశ్వ ధ్యాస నా మేధస్సుకు ఉన్నందుకు నాలో భావ విజ్ఞానమే

విశ్వ విజ్ఞానంతో కలిగే భావాలు

విశ్వ విజ్ఞానంతో కలిగే భావాలు ఎంతటి విచక్షణీయమైనవో మేధస్సుకే అద్భుతం

శాస్త్రీయ సిద్ధాంతాలు కారణ కార్యాలైనా

శాస్త్రీయ సిద్ధాంతాలు కారణ కార్యాలైనా జీవించుటకు ప్రతి క్షణం అనుభవమే

మరో ప్రపంచం మేధస్సులోనే ఉన్నదని

మరో ప్రపంచం మేధస్సులోనే ఉన్నదని తెలిసినప్పుడే విశ్వ విజ్ఞానం
మరో జీవి మన ధ్యాసతోనే మన మేధస్సులోనే జీవిస్తున్నాడని తెలుసుకో
నీ ఆలోచనలు ఏ జీవిని తలచినా తన జీవిత స్వభావాలు నీ మేధస్సులోనే
నీవు దేనిని తలచినా దాని భావ స్వభావాలు నీ మేధస్సులోనే జీవిస్తాయి
విశ్వంలో నీవు ఉన్నట్లుగా నీలో విశ్వం ఉన్నదని మరో ప్రపంచపు ఆలోచన
విశ్వాన్ని తలచుటయే విశ్వ విజ్ఞాన లోకంగా నీ మేధస్సులో మరో ప్రపంచం

కరుణించే విశ్వ మూర్తి కంటికి

కరుణించే విశ్వ మూర్తి కంటికి కనిపిస్తున్నా పలకరించని స్వప్నం
మేధస్సులో ఎందరో విశ్వ విజ్ఞానులు ఉన్నా జీవిత సమాజాన్ని మార్చలేరు
నీకు నీవు శ్రమించినా విశ్వ విజ్ఞాన ప్రణాళికతో సమాజాన్ని మార్చగలవా
నీ విజ్ఞాన ఆలోచనల భావ స్వభావాలు ఎవరికీ అర్థం కాని మర్మ సిద్ధాంతమే

దారి తప్పిన జీవులను సక్రమమైన

దారి తప్పిన జీవులను సక్రమమైన మార్గంలో నడిపించాలనే మహాత్ముల మేధస్సులో అన్వేషణ -
జీవుల సక్రమ జీవితానికై విశ్వ విజ్ఞానంతో విశ్వ లోకాన్ని పరిశుద్ధంగా ఉంచాలనే వారి తపన -
మహాత్ముల జీవితాలు మహా యోగత్వ ఆత్మ జ్ఞాన పర ధ్యాస విశ్వ స్థితులతో సాగిపోతుంటాయి -
ప్రతి జీవిని విశ్వ చైతన్యం చేయాలనే విశ్వ విజ్ఞాన అన్వేషణ చేస్తూ ఆత్మ పర ధ్యాసతో ధ్యానిస్తారు -

Friday, April 1, 2011

శరీరం భూలోకంలో జీవిస్తున్నా ఆత్మ

శరీరం భూలోకంలో జీవిస్తున్నా ఆత్మ ధ్యాస విశ్వ ప్రయాణం చేస్తున్నది
మేధస్సులో కలిగే ఆలోచనలు వివిధ రకాలుగా విశ్వంలో జీవిస్తుంటాయి
నా ఆలోచనలు విశ్వమున ప్రయాణిస్తూ విజ్ఞానాన్ని అన్వేషిస్తుంటాయి
నా ధ్యాస విశ్వ స్థితితో జీవిస్తూ ఆలోచన భావాలు ఆత్మ స్థితితో జీవిస్తాయి

మరవలేని స్థానమే మర్మయోగి విచక్షణ

మరవలేని స్థానమే మర్మయోగి విచక్షణ
ధ్యాసలేని కాలమే మేధస్సులో విశ్వ విచక్షణ
మహా యోగి ధ్యానమే పర ధ్యాస విచక్షణ
మహా మౌనమే విశ్వ విజ్ఞాన యోగ విచక్షణ

నా ఆలోచన ఓ సూర్య కణాన్ని

నా ఆలోచన ఓ సూర్య కణాన్ని సృస్టించగలిగితే మరో లోకాన్ని నిర్మించవచ్చు
నా ఆలోచనలలో సూర్య శక్తి ఉంటే మరో లోకంలో ఎందరో జీవించవచ్చు
నా ఆలోచనలలో మహా శక్తులు ఉంటే మరో లోకాన్ని విజ్ఞానంగా మార్చవచ్చు
నా ఆలోచనలలో మహా గుణాలు ఉంటే లోకం విశ్వ విజ్ఞానంతో వెలుగుతుంది

పదాలకు అర్థాలే కాదు భావాలు కూడా

పదాలకు అర్థాలే కాదు భావాలు కూడా తెలియకపోతున్నాయి
విషయ తాత్పర్యాలు తెలియక మహా విజ్ఞానం అర్థం కాకున్నది
విచక్షణ భావ స్వభావాలకు పదాలు మహా వర్ణ గుణాతీతములు
విశ్వ విజ్ఞానంలో పదాలే జీవమై మహా విజ్ఞానాన్ని తెలుపుతాయి

విశ్వానికి బహు దూరమే ఉన్నా

విశ్వానికి బహు దూరమే ఉన్నా ఆకాశానికి బహు దగ్గరగా ఉన్నట్లున్నది
విశ్వ లోకాలను చూడలేకున్నా ఆకాశం ప్రతి క్షణం కనిపిస్తూనే ఉన్నది
విశ్వ గ్రహాలు ఏ లోకంలో ఎక్కడ ఎలా ఎన్ని ఉన్నాయో తెలియకపోయినా
ఆకాశంలో కనిపించేవన్నింటిని ప్రతి రోజు తిలకిస్తూనే తెలుసుకుంటున్నా
విశ్వ దూరాన్ని నా ఆలోచనల అనుభవంతో మేధస్సుకు దగ్గర చేసుకుంటున్నా
ఆకాశం నా శిరస్సుపై ఉన్నా విశ్వం నా మేధస్సులోనే ఉంటుంది

మహా తత్వ ఆత్మ యోగుల పరిశుద్ధ

మహా తత్వ ఆత్మ యోగుల పరిశుద్ధ విచక్షణలు ఎక్కడున్నాయి
ఏ విజ్ఞాన మహాత్ములు నేటి సమాజమున కనబడుతున్నారు
ఆత్మ తత్వ భావాలతో జీవించే మహానుభావులు తరిగిపోతున్నారు
విశ్వ విజ్ఞాన మహర్షులు సృష్టిలో లేకపోతే జీవితం అజ్ఞానమే

ఒకరి ఆనందం మరొకరికి దుఃఖాన్నిస్తే

ఒకరి ఆనందం మరొకరికి దుఃఖాన్నిస్తే జీవితం ఎలా ఉంటుంది
ఒకరి ఆనందానికి మరొకరి దుఃఖం లేదంటే జీవితం సంతోషమేగా
ఆనందం శ్రమించుటలో కలిగితే మరొకరికి సంతోషమే కలుగును
స్వార్థంతో ఆనందపడితే మరొకరి ఆవేదన దుఃఖంగా మారును
అతిగా ఆశ లేక స్వార్థం లేక శ్రమిస్తూ జీవించుటలో అందరికి ఆనందమే

విశ్వ బ్రంహాణులు జీవించే కాలం

విశ్వ బ్రంహాణులు జీవించే కాలం వెళ్ళిపోతున్నది
విశ్వ తత్వ యోగ సిద్ధ గుణములు తరిగిపోతున్నాయి
పరిశుద్ధ పరిపూర్ణ ప్రజ్ఞాన పవిత్రతలు తగ్గిపోతున్నాయి
మహా సిద్ధాంతాలు మారిపోతూ మరో పద్దతులు వస్తున్నాయి
ఆనాటి మహా గుణా తీతములు నేడు కనిపిస్తున్నా ఆకారానికే
మహా తత్వ ఆత్మ యోగుల పరిశుద్ధ విచక్షణలు ఎక్కడున్నాయి

ఈ భూమి నాదే ఈ విశ్వ నేస్తాన్ని నేనే

ఈ భూమి నాదే ఈ విశ్వ నేస్తాన్ని నేనే
విశ్వ భావాలతో జీవించే స్వభావాన్ని నేనే
విశ్వ స్థితుల ప్రభావాలకై వేచిన వాడిని నేనే
విశ్వ భూమితో జీవించే అనంత రూపాన్ని నేనే

ఒక మనిషికి ఎన్ని సమస్యలో

ఒక మనిషికి ఎన్ని సమస్యలో మరొకరి తెలియవు అర్థం కావు
సమస్యల ఆలోచనలు అనంతమైన అర్థాన్ని తెలిపేవే ఆవేదనలు
జీవితపు ఆలోచనలలో ఏవి ఎందుకో అర్థంకాని పరిస్థితులుగా
తమ జీవితాన్ని అర్థం చేసుకుంటే ఇంకొకరి సమస్యలు అర్థమవుతాయి
ఆలోచనల అర్థాలను గ్రహించడమే విశ్వ విజ్ఞాన సమాజ జీవితం

ఏ జీవిని వదలను ప్రతి జీవి అనుభవ

ఏ జీవిని వదలను ప్రతి జీవి అనుభవ రహస్యాలు నాకు కావాలి
ఆత్మగా తెలిపే మీ అనుభవ రహస్యాలు భవిష్య విశ్వానికి అవసరమే
విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించే మేధస్సులో ఎన్నో తెలియని అనుభవాలు
బ్రంహాండాన్ని విశ్వ విజ్ఞానంగా మార్చేందుకే ప్రతి జీవి జీవిత చరిత్ర పుటలు
విశ్వ కాల మేధస్సులో ప్రతి జీవి విజ్ఞాన అనుభవ రహస్యాలు లిఖించబడుతాయి

మరణించి రాగలవా మర్మ రహస్యాన్ని

మరణించి రాగలవా మర్మ రహస్యాన్ని తెలిపెదవా
నీ విశ్వ విజ్ఞాన రహస్యాలను ఆత్మగా తెలుపగలవా
నీ మేధస్సున ఎన్నో అనుభవాలను దాచుకున్నావు
జీవిత కాలంలో తెలుపలేని రహస్యాలు నీలోనే ఉన్నాయి
విశ్వానికి అందించే మర్మ రహాస్యాలను మేధస్సు లేకున్నా
ఆత్మగా తెలుపగలవని నా సూక్ష్మ శరీరం ఎదురుచూస్తున్నది

మరణం క్షణ కాలం కాదు

మరణం క్షణ కాలం కాదు జీవిత కాలమే
నీ మరణం నీ జీవితం అంచున ఉన్నది
విజ్ఞానంగా జీవిస్తే జీవిత కాలం దూరమే
అజ్ఞానమైతే జీవితపు అంచులు దగ్గరగా
కాల ప్రభావాల జీవితపు అంచులు దగ్గరగానే
క్షణ కాల జీవితాన్ని నీవు నిర్ణయించుకోలేవు
సాగే కాలాన్ని విజ్ఞాన జీవితంగా మార్చుకో

మరో జన్మ లేక మరో భావన లేక

మరో జన్మ లేక మరో భావన లేక మహాత్మ రూపమే నిలిచిందా
విశ్వ విజ్ఞానంతో ముగిసిన జన్మకు మరో జన్మ లేక నిలిచావు
నీలోని భావాలను నిలిపి విశ్వానికి మహాత్మ రూపంగా నిలిచావు
మహాత్మ రూపమే మానవులకు విజ్ఞాన ఆలోచనల భావ స్వభావాలు

విశ్వ పరీక్షకు నేను సమ్మతమే

విశ్వ పరీక్షకు నేను సమ్మతమే దైవమా
విధి వైపరిత్య కాల ప్రభావాలకు అనుచరుడనే
విశ్వ భావ స్వభావాల కాల స్థితికి కృతజ్ఞున్ని
మరో జన్మలో విధి వెంటాడినా నీ ఆధీనంలోనే
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా నా జీవితం ఆవేదనతోనే
మహాత్ముల విజ్ఞాన చరిత్రలు చదివినా అనుకూలత లేదే
విశ్వ విజ్ఞానులు ఎందరో ఉన్నా సమాజంలో సమస్యలే
విశ్వ కార్య ప్రణాళికకు విజ్ఞానం ఉన్నా ఆర్ధిక లోపమే

నీ మేధస్సు యందే విశ్వ లోకాలు

నీ మేధస్సు యందే విశ్వ లోకాలు ఉన్నాయి
నీ ఆలోచనల ప్రయాణమే నీ విశ్వ దర్శనము
ఆలోచనల అన్వేషణతో విశ్వాన్ని తిలకించవచ్చు
ప్రయాణంతో దూర తీరాలు దగ్గరకు వచ్చేస్తాయి
ఓ సారి విశ్వాన్ని చుట్టేస్తే అనుభవం నీ మేధస్సులోనే
అనుభవమైన ఆలోచనలతో విశ్వ లోకాలు నీ యందే

నీ మేధస్సులోనే విశ్వ కార్యాలు

నీ మేధస్సులోనే విశ్వ కార్యాలు జరిగిపోతున్నాయి
కొన్ని తెలుస్తున్నా తెలియక జరిగేవి ఎన్నో ఉన్నాయి
ఒక్కసారి ఆలోచిస్తే జరిగిపోయినవి తెలుస్తాయి
అన్ని ఆలోచిస్తేనే తెలిస్తే ఆలోచించకుండ తెలిసేదెలా
మేధస్సును విశ్వ ధ్యాసలో ఉంచితే అన్నీ తెలుస్తాయి
అన్ని కార్యాలు నీ మేధస్సులోనే జరిగిపోతుంటాయి