Showing posts with label ప్రగతి. Show all posts
Showing posts with label ప్రగతి. Show all posts

Tuesday, December 27, 2016

ఏ బంధాలు లేకుండా మహాభారత కురుక్షేత్ర ధర్మ యుద్ధం జరిగిందా

ఏ బంధాలు లేకుండా మహాభారత కురుక్షేత్ర ధర్మ యుద్ధం జరిగిందా
బంధాలన్నీ అశాశ్వితమైన జీవన పరిణామాలేనని రణ రంగం సాగిందా
రంగ స్థలమైనా రణ రంగమైనా విజయమే మహా లక్ష్యమంటూ సాగిందా
మరణం భయమని తెలియకుండానే ఎన్నో రాజ్యాల పోరాటం సాగిందా
ఎవరికి వారు గొప్పవారంటూ ఇరు రాజ్యాల శతృత్వం యుద్దమై సాగిందా
ముగింపు తెలియని రాజ్యాల పరిపాలన భవిష్య ప్రగతికై రణమే సాగిందా
విభేదాల ప్రసక్తి ప్రచారాల ప్రభావమై దేశ ప్రదేశాలకై రణరంగం సాగిందా 

Monday, August 15, 2016

దేశం అంటే మన దేశమే ధైర్యాన్ని ఇచ్చేను మన కోసమే

దేశం అంటే మన దేశమే ధైర్యాన్ని ఇచ్చేను మన కోసమే
దేశంలో ప్రతి జీవికి ప్రశాంతమైన స్వేచ్ఛను కలిగించేను
దేశానికి ప్రతి దేశం గౌరవంతమైన గుర్తింపులెన్నో ఇచ్చేను
దేశంతో ప్రతి దేశం స్నేహాన్ని సమకూర్చేను ఎందరికోసమో
దేశానికి శాంతియుత భావాలు అవసరమయ్యేను ఎప్పటికైనా
దేశం విదేశానికి విశ్వమే రక్షణ ఇచ్చేను శాంతంగా ఉన్నప్పుడే
దేశం ఒక విజ్ఞాన ప్రగతిగా మార్గదర్శకమయ్యేను ఎన్నో దేశాలకు

Saturday, December 26, 2009

ప్రేమే దేశం ప్రాణమే త్యాగం

ప్రేమే దేశం ప్రాణమే త్యాగం అమర జీవులు సాధించినదే కీర్తి ఖ్యాతి స్వాతంత్య్రం
మనదే దేశం మనదే రాజ్యం మనం చాటుకున్నమానవ రూప భావమే మానవత్వం
మనదే దేశం మనలో స్నేహం మనం గౌరవించుకున్నదే మహా జన్మ భూమి భావం
మనదే జగతి మనలో ప్రగతి మనలోని విశ్వ విజ్ఞానమే ప్రపంచానికి ప్రశాంతి స్తూపం