Friday, October 29, 2021

వేదమా తెలుపవా నీ ప్రదేశం

వేదమా తెలుపవా నీ ప్రదేశం 
వేదమా కలుపవా నీ ప్రవాహం 

వేదమా సాగించవా నీ ప్రయాణం 
వేదమా సాధించవా నీ ప్రయత్నం 

వేదమా స్మరించవా నీ ప్రజ్ఞానం 
వేదమా తపించవా నీ ప్రభూతం 

విశ్వానికే తెలియని భావాలతో ఎక్కడెక్కడో విహారిస్తున్నావులే 
జగానికే తెలుపని తత్త్వాలతో ఎప్పుడెప్పుడో పలికిస్తున్నావులే 

నీ వేదం వేదాలకు వేదాంత సిద్ధాంతమై శుద్ధత్త్వంతో ప్రసిద్ధమవునులే   || వేదమా || 

నా భావమే బంగారం అయ్యేనా

నా భావమే బంగారం అయ్యేనా 
నా తత్త్వమే అమరం అయ్యేనా

నా రూపమే ఆనందం అయ్యేనా 
నా వేదమే ప్రశాంతం అయ్యేనా 

నాలో కలిగే ఆలోచనలే పరిశుద్ధం అయ్యేనా 
నాలో వెలిగే స్వభావాలే పరికృతం అయ్యేనా

నాలో ఎదిగే చరణాలే పర్యావరణం అయ్యేనా 
నాలో ఒదిగే కారణాలే పత్రహరితం అయ్యేనా   || నా భావమే || 

Thursday, October 28, 2021

A Good person made a mistake, the people are considered as bad.

A Good person made a mistake, the people are considered as bad.
A Bad person did a good thing, the people are considered as well.

Real / Reason:
A good person made a mistake by bad person (people don't know).
A bad person did a good thing by good person (people don't know).
Bad is spreading any ways and quickly, but good spreads only one way and it's slow because no one can talk truth whenever required.
Who knows the truth, those are not speaking real because they becomes bad about their mistake.

Note:
According to situation real thing is not realized and no one can discuss. 
Good people are losing their lives because of one bad person enter into their life.

Truth:
Evevryone life is important and everyone should be hard work in their life goal.

Monday, October 11, 2021

చిరంజీవిలా జీవించు

చిరంజీవిలా జీవించు 
చిరంజీవినే ప్రేమించు 

చిరంజీవివై సాధించు 
చిరంజీవితో సాగించు 

చిరంజీవిగా జ్ఞానించు 
చిరంజీవిచే స్మరించు 

చిరంజీవిలో శ్వాసించు 
చిరంజీవికై ధ్యానించు 

చిరంజీవిపై శోధించు 
చిరంజీవికే బోధించు 

విశ్వమంతా నే చిరంజీవినై విజ్ఞానంతో చిరస్మరణీయమై వర్ధిల్లెదెను 
జగమంతా నే చిరంజీవిగా వినయంతో చిదంబరణీయమై విలసిల్లెదెను   || చిరంజీవిలా || 

చిరంజీవిలా శ్రమించు
చిరంజీవినే జయించు  

చిరంజీవివై మెప్పించు  
చిరంజీవితో దీవించు   

చిరంజీవిగా గుర్తించు  
చిరంజీవిచే కీర్తించు

చిరంజీవిలో శృతించు  
చిరంజీవికై స్పందించు 

చిరంజీవిపై వీక్షించు 
చిరంజీవికే శాంతించు    ||

చిరంజీవిలా పఠించు 
చిరంజీవినే స్నేహించు

చిరంజీవివై ఊహించు 
చిరంజీవితో పాటించు 

చిరంజీవిగా యోచించు 
చిరంజీవిచే అందించు 

చిరంజీవిలో గ్రహించు 
చిరంజీవికై అర్పించు 

చిరంజీవిపై వర్ణించు 
చిరంజీవికే జోడించు 

Tuesday, October 5, 2021

విశ్వానికి నేను ఒక రూపం

విశ్వానికి నేను ఒక రూపం 
నా రూపానికి ఏదో ఒక భావం 

నా భావాలకు ఒక తత్త్వం 
ఆ తత్త్వాలకు ఒక స్థైర్యం

నా స్థైర్యానికి ఒక లక్ష్యం 
ఆ లక్ష్యానికి ఒక మోక్షం 

నా మోక్షానికి ఒక మార్గం 
ఆ మార్గానికి ఒక వేదం 

నా వేదానికి ఒక జ్ఞానం 
ఆ జ్ఞానానికి ఒక అర్థం 

నా అర్థానికి ఒక హితం 
ఆ హితానికి ఒక అంశం

నా అర్థానికి ఒక పరమార్థం 
ఆ అంశానికి ఒక పరమాత్మం   || విశ్వానికి || 

ప్రతి రూపానికి ఏదో ఒక భావం 
భావంతో ఎదిగే విజ్ఞానమే ఒక కార్యం 

కార్యాలే జీవితానికి ఎదో ఒక మార్గం 
మార్గంతో సాగే విజయమే ఒక లక్ష్యం 

లక్ష్యాలే బంధానికి ఎదో ఒక స్థైర్యం 
స్థైర్యంతో కలిగే సహనమే ఒక ధైర్యం 

ధైర్యాలే సత్యానికి ఏదో ఒక ధర్మం 
ధర్మంతో ఒదిగే వినయమే ఒక తత్త్వం   || విశ్వానికి || 

ప్రతి జీవికి ఏదో ఒక ఉత్తేజం 
ఉత్తేజంతో ఎదిగే సుగుణమే ఒక సూత్రం

సూత్రాలే జీవనానికి ఏదో ఒక ఆచరణం 
ఆచరణతో సాగే పరిశోధనమే ఒక శాస్త్రం 

శాస్త్రాలే జీవులకు ఏదో ఒక చరణం
చరణంతో కలిగే సంతోషమే ఒక నిలయం 

నిలయాలే జీవితానికి ఏదో ఒక సంస్కారం
సంస్కారంతో ఒదిగే విషయమే ఒక సంపూర్ణం   || విశ్వానికి ||

ఫలితమే లేని విజయాన్ని ఎవరైనా గుర్తించారా

ఫలితమే లేని విజయాన్ని ఎవరైనా గుర్తించారా 
చరితమే లేని భరితాన్ని ఎప్పుడైనా చర్చించారా 

ఆచరణ లేని ఆశ్రయాన్ని ఎలాగైనా మళ్ళించారా 
ఆలాపన లేని ఆనందాన్ని ఎక్కడైనా సాధించారా  

ఆనందమే లేని జీవితాన్ని ఎవరైనా ప్రోత్సహించారా 
ఆశయమే లేని సహనాన్ని ఎప్పుడైనా ప్రదర్శించారా

రక్షణయే లేని సమయాన్ని ఎవరితోనైనా విచారించారా 
లక్షణమే లేని సహాయాన్ని ఎవరితోనైనా నిర్బంధించారా

Friday, October 1, 2021

విశ్వమా నీవు ఆగలేవా

విశ్వమా నీవు ఆగలేవా 
ఆగవని తెలిసినా నేను ఆగిపోతున్నా 

కాలమా నీవు ఆగలేవా 
ఆగవని తెలిసినా నేను ఆగిపోతున్నా 

వేదమా నీవు ఆగలేవా 
ఆగవని తెలిసినా నేను ఆగిపోతున్నా

సహనమే నీవని తెలిసినా సాధనయే నీతో సాగిపోవునా 
సమయమే నీవని తెలిసినా సమస్తమే నీతో సాగిపోవునా 

ఆశయంతో సాగే జీవుల విజ్ఞానం ఆశించలేని నీ సహనానికి స్వభావమే సమర్థమైనదా   || విశ్వమా || 

సాగుతున్న సాధనకు సమయమే వేదమైతే సహనం సామర్థ్యమై శ్రమించునా 
సాగుతున్న వేదనకు వినయమే విశ్వమైతే సమయం సదృశ్యమై సహించునా 

ఎదుగుతున్న కాలానికి విజ్ఞానమే విశాలమైతే విజయం విస్తృతమై విరాజితమగునా 
ఎదుగుతున్న లోకానికి స్వరాగమే ప్రధానమైతే ప్రదేశం ప్రభాతమై ప్రభావితమగునా 

ఆగలేని అనంత భావాలకు స్వభావాలు సుభాషితమై సుమిత్ర కార్యాలతో సాగిపోవునా  || విశ్వమా || 

కలుగుతున్న యోచనకు సమయమే సమర్థమైతే సంభవం సుగుణమై సహకరించునా 
కలుగుతున్న భావనకు సమీక్షయే సహితమైతే సంపూర్ణం సుధారమై సంభాషించునా 

వెలుగుతున్న లక్షణకు సాధనయే సంయుక్తమైతే సందర్భం సంభావనమై విశ్వసించునా 
వెలుగుతున్న వీక్షణకు వేదనయే సంకీర్తనమైతే సందర్శనం సంభూతమై విన్నవించునా 

ఆగలేని అనంత భావాలకు స్వభావాలు సుభాషితమై సుమిత్ర కార్యాలతో సాగిపోవునా  || విశ్వమా ||