Showing posts with label సుఖనం. Show all posts
Showing posts with label సుఖనం. Show all posts

Monday, March 13, 2017

జీవము నీవే ప్రాణము నీవే వేదము నీవే జ్ఞానము నీవే

జీవము నీవే ప్రాణము నీవే వేదము నీవే జ్ఞానము నీవే
విశ్వము నీవే జగము నీవే లోకము నీవే బ్రంహము నీవే
దైవము నీవే దేహము నీవే రూపము నీవే ఆకారము నీవే
సత్యము నీవే నిత్యము నీవే ధర్మము నీవే మర్మము నీవే

శూన్యం నీవే గమ్యం నీవే చిత్రం నీవే చైత్రం నీవే
జననం నీవే శరణం నీవే మరణం నీవే మౌనం నీవే
హాస్యం నీవే భాస్పం నీవే దుఃఖం నీవే సుఖనం నీవే
మననం నీవే గమనం నీవే చరణం నీవే తరుణం నీవే

కాలం నీవే కావ్యం నీవే భావం నీవే తత్వం నీవే
సర్వం నీవే శాంతం నీవే గానం నీవే గాత్రం నీవే
ప్రకృతి నీవే ఆకృతి నీవే దేశం నీవే ప్రదేశం నీవే
తేజం నీవే ప్రకాశం నీవే కిరణం నీవే కాంతం నీవే

కంఠం నీవే శంఖం నీవే శ్లోకం నీవే శోభితం నీవే
పత్రం నీవే పుష్పం నీవే పద్మం నీవే బిల్వం నీవే
నేత్రం నీవే స్నేహం నీవే వచనం నీవే ప్రవచనం నీవే
మధురం నీవే సంతోషం నీవే ఆనందం నీవే ఆకాశం నీవే

జలం నీవే జయం నీవే వర్షం నీవే మేఘం నీవే
వనం నీవే నివాసం నీవే వరం నీవే వసంతం నీవే
మార్గం నీవే ప్రయాణం నీవే స్థానం నీవే స్థైర్యం నీవే
ఆరంభం నీవే ఆద్యంతం నీవే అంతం నీవే అనంతం నీవే