Showing posts with label జాగ్రత్త. Show all posts
Showing posts with label జాగ్రత్త. Show all posts

Wednesday, October 26, 2016

ఎగిరిపో నేస్తమా చేరుకో మిత్రమా నీ దేశంలో కుశలమా

ఎగిరిపో నేస్తమా చేరుకో మిత్రమా నీ దేశంలో కుశలమా
నీ దేశమే ప్రశాంతమా నీవు జీవించే స్థానమే పరవశమా
జన్మించిన ఒడిలోనే ఉండిపో హాయిగా సాగిపో హితమా  || ఎగిరిపో ||

కలతలే లేనట్లు కలవరమే పడనట్లు కష్టాలే పూర్తిగా తొలగేనా
నష్టాలే రానట్లు  తడబడుట లేనట్లు కార్యాలే విజయమై సాగేనా

ఆనందమే నీకు వారధిగా అవధులే లేనట్లు ఆకాశంలో ఎగిరిపో
సంతోషమే నీకు వాహనగా అలసట లేనట్లు ఎక్కడికైనా వెళ్ళిపో  || ఎగిరిపో ||

ఎక్కడ ఉన్నా నీవు నిశ్చలంగా స్థిరపడిపో క్షేమముగా
ఎలా ఉన్నా నీవు రక్షణ దృక్పధంతో ఉండిపో జాగ్రత్తగా

ఎదురయ్యే సమస్యలు ఏవైనా నీకు నీవే పరిష్కారమా
ఎదురయ్యే ప్రకంపనలు ఏవైనా నీకు నీవే పరిశోధనమా  || ఎగిరిపో || 

Thursday, October 6, 2016

అనారోగ్యం కలగక ముందే ఆరోగ్యంతో జాగ్రత్త వహించు

అనారోగ్యం కలగక ముందే ఆరోగ్యంతో జాగ్రత్త వహించు
కాలం వృధా కాకముందే సమయాన్ని సద్వినియోగించు
ధనం అత్యధిక ఖర్చులతో సాగక ముందే సంపాదించు
విశ్వమందు నీవు ఎచట ఎలా ఉన్నా నేను నీ మేధస్సులోనే మిత్రమా!