Showing posts with label శృతిలయ. Show all posts
Showing posts with label శృతిలయ. Show all posts

Friday, June 16, 2017

శృతిలయలో శృతులను పలికించవా శివా!

శృతిలయలో శృతులను పలికించవా శివా!
శృతిలయలో శృతులను పులకించవా శివా!
శృతిలయ గానమున సుస్వరాలను శృంగారించవా మహా శివా!

శృతి స్వరమున శృతి భావమున లయ వేదములెన్నో
శృతి గానమున శృతి జీవమున నీ లయ గాత్రములెన్నో    || శృతిలయలో ||

శృతి స్వర గానం శృతి లయ గీతం
శృతి పర సంగీతం శృతి పర సంతోషం

శృతి దరహాసం శృతి ఇతిహాసం
శృతి లయహాసం శృతి నవహాసం

శృతి స్వర జ్ఞానం శృతి స్వర వేదం
శృతి స్వర జీవం శృతి స్వర దైవం    || శృతిలయలో ||

శృతి జీవన ఆధారం శృతి జీవన ఆరంభం
శృతి జీవిత అధ్యాయం శృతి జీవిత ఆదర్శం

శృతిలో శత భావాలైనా మోహానికి భువనం
శృతిలో దశ భావాలైన దేహానికి సంభోగం

శృతికై జీవం ఆరాటం మౌనం ఆర్భాటం
శృతికై వేదం వేదాంతం జ్ఞానం విజ్ఞానం   || శృతిలయలో ||