Showing posts with label ప్రశాంతం. Show all posts
Showing posts with label ప్రశాంతం. Show all posts

Thursday, August 10, 2017

జగమే నీవని ఉదయిస్తున్నావా

జగమే నీవని ఉదయిస్తున్నావా
విశ్వమే నీవని ప్రజ్వలిస్తున్నావా
లోకమే నీవని అస్తమిస్తున్నావా
సర్వమే నీవని ప్రకాశిస్తున్నావా

ఓ సూర్య దేవా మహా తేజ రూపా
ఉదయించుటలో శాంతం నీవే
అస్తమించుటలో ప్రశాంతం నీవే  || జగమే ||

ప్రతి ఉదయం మేధస్సుకు నవోదయ భావాల కార్యాల తేజోదయం
ప్రతి సాయంత్రం ఆలోచనలకు విశ్రాంతి భావాల ఆనందమయం

ప్రకృతిలోనే వేదాలను పరిశోధిస్తూ అనంత భావాలను తెలిపెదవు
జీవులలోనే భావాలను పరిశీలిస్తూ అనంత స్వభావాలను చూపెదవు  || జగమే ||

వెలిగే గుణముతో ప్రకాశిస్తున్నా నిత్యం ప్రజ్వలించే భావంతో జగమంతా ఉదయిస్తూ జీవిస్తున్నావు
జ్వలించే భావంతో వెలుగుతున్నా సర్వం కాలచర్యగా విశ్వమంతా ప్రకాశిస్తూనే పరిశోధిస్తున్నావు

నీవు లేని లోకానికే ప్రతి స్పర్శ లేదని జీవుల జీవన ప్రభావం కలగదని అంతరిక్షమే తెలిపేను
నీవు లేని కాలానికి ప్రతి చలన లేదని గ్రహాల జీవిత ప్రభావం మారదని భవిష్య జ్ఞానమే తెలిపేను  || జగమే ||

Thursday, July 6, 2017

దేశమే ప్రదేశం

దేశమే ప్రదేశం
ప్రదేశమే ప్రపంచం
ప్రపంచమే ప్రముఖం
ప్రముఖమే ప్రకటితం
ప్రకటితమే పరిశోధనం
పరిశోధనమే ప్రజ్ఞానం
ప్రజ్ఞానమే ప్రభంజనం
ప్రభంజనమే పరమావధీయం
పరమావధీయమే ప్రకృతం
ప్రకృతమే ప్రభాతం
ప్రభాతమే ప్రణామం
ప్రణామమే ప్రశాంతం
ప్రశాంతమే ప్రదేశం
ప్రదేశమే దేశం ప్రాంతం
ప్రాంతమే ప్రాణత్వం 

Wednesday, March 29, 2017

దేశమంటే ప్రదేశం

దేశమంటే ప్రదేశం
ప్రదేశమంటే ప్రపంచం
ప్రపంచమంటే ప్రశాంతం
ప్రశాంతమంటే ప్రధానం
ప్రధానమంటే ప్రమేయం
ప్రమేయమంటే ప్రక్షాళనం
ప్రక్షాళనమంటే పరిశుద్ధం
పరిశుద్ధమంటే దేశ ప్రదేశం 

Sunday, November 13, 2016

జ్యోతి స్వరూపం ప్రజ్వలం మహా మంగళం మధురం శుభదాయకం

జ్యోతి స్వరూపం ప్రజ్వలం మహా మంగళం మధురం శుభదాయకం
కాంతి స్వరూపం ప్రకాశం మహా మంగళం మధురం మహూదాయకం 
శాంతి స్వరూపం ప్రశాంతం మహా మంగళం మధురం సర్వదాయకం
ఖ్యాతి స్వరూపం ప్రదేశం మహా మంగళం మధురం నవనీతదాయకం

Monday, November 7, 2016

ఎవరో నీవు ఎవరో అనుకున్నా మనమంతా జనతా ఈ జగమంతా

ఎవరో నీవు ఎవరో అనుకున్నా మనమంతా జనతా ఈ జగమంతా
ఎవరో మనమెవరో అనుకున్నా మనమంతా జనతా ఈ జగమంతా  || ఎవరో ||

నీవే ఓ ప్రణామం తెలుపవా ప్రకృతిలో జీవిస్తున్నందుకు
నీవే ప్రభోదం గ్రహించవా జగతిలో విజ్ఞానాన్ని పొందుటకు
నీవే ప్రమాణం చేసుకోవా మన సృష్టిని మనమే రక్షించుటకు
నీవే సమస్తం తెలుసుకోవా ఎప్పటికైనా సమాప్తం అయ్యేందుకు
నీవే పరిశోధనం చేయవా విశ్వంలో ఉన్న ప్రజ్ఞానాన్ని పంచేందుకు

నీవు నేను మనమే జగతికి ప్రసిద్ధం ప్రపూర్ణం ప్రయోజనం          || ఎవరో ||

నీవే ప్రయాణం చేస్తూనే కాలంతో జరిగే ప్రమేయం ఎందుకో తెలుసుకోవాలి
నీవే ప్రణామం స్వీకరిస్తూనే జరుగుతున్న ప్రయోగం ఎందుకో తెలుపుకోవాలి
నీవే ప్రపంచం వీక్షిస్తూనే జరగబోయే పరిశోధనం ఎందుకో తెలియజేయాలి
నీవే సంకల్పం వహిస్తూనే జరగాలన్న మహా సంభోగం ఎందుకో తెలుపుకోవాలి
నీవే ప్రభావం చూపిస్తూనే జరిగిన కాలంతో ప్రశాంతం ఎందుకో తపించిపోవాలి

నీవు నేను మనమే జగతికి పరిశుద్ధం పరిపూర్ణం పరిమళం          || ఎవరో ||  

Monday, October 17, 2016

శాంతం ప్రశాంతం మనస్సే ఏకాంతం

శాంతం ప్రశాంతం మనస్సే ఏకాంతం
భావం ప్రభావం వయస్సే సుఖాంతం
లోకం పర లోకం మనిషికే వేదాంతం  || శాంతం ||

ఏనాటికో మనకు ఏకాంతము ఎవరితో మనకు సుఖాంతము
ఎప్పటికో మనకు సర్వాంతము ఎందుకో మనకు వేదాంతము

ఏకాంతమే ఏకాగ్రతమై విజ్ఞానమే ప్రజ్ఞానమయ్యేను
భావాంతమే స్వభావమై ఊహత్వమే వేదాంతమయ్యేను
సుఖాంతమే సంపూర్ణమై సర్వత్వమే సమాప్తమయ్యేను   || శాంతం ||

కాలమే మనకు కార్య గమనమై సమయమే సాగిపోవును
నాదమే మనకు వేద వచనమై విజ్ఞానమే వెలిగిపోవును

విశ్వాంతమే జీవత్వమై దేహమే ఉదయించేను
ప్రశాంతమే ఏకత్వమై దైవమే ప్రజ్వలించేను
సర్వాంతమే సమాప్తమై ధర్మమే అస్తమించేను  || శాంతం ||

Tuesday, September 13, 2016

ప్రశాంతం ప్రశాంతం ప్రశాంతం మనతోనే కలిగేను ప్రశాంతం

ప్రశాంతం ప్రశాంతం ప్రశాంతం మనతోనే కలిగేను ప్రశాంతం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం మనతోనే సాగేను ప్రయాణం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం మనతోనే వచ్చేను ప్రమోదం   || ప్రశాంతం ||

ప్రశాంతం ప్రమేయం మనకే ప్రయాణం ప్రయోగం మనదే ప్రమోదం ప్రసాదం మనమే
ప్రభాతం ప్రణామం మనకే ప్రతాపం ప్రకారం మనదే ప్రభావం ప్రసంగం మనమే
ప్రపంచం ప్రఖ్యాతం మనకే ప్రసిద్ధం ప్రమాణం మనదే ప్రదర్శనం ప్రత్యక్షం మనమే
పరిశీలనం పరిశోధనం మనకే పర్యవేక్షణం పరిశుద్ధం మనదే ప్రకృతం పరియావరణం మనమే || ప్రశాంతం ||

సమస్తం సంకల్పం మనకే సహస్త్రం సమాప్తం మనమే
సమీపం సంయుక్తం మనకే సంయోగం సంభోగం మనమే
సంగ్రామం సమూహం మనకే సంకేతం సంకీర్తం మనమే
సర్వస్వం సర్వేశ్వరం మనకే సర్వాంతరం సంఘర్షణం మనమే || ప్రశాంతం ||

Wednesday, September 7, 2016

ప్రకృతిలో జీవించు ప్రకృతినే ప్రేమించు

ప్రకృతిలో జీవించు ప్రకృతినే ప్రేమించు
ప్రకృతినే పెంచేసి ప్రకృతినే మెప్పించు
ప్రకృతియే జగతికి ప్రాణ వాయువుగా నిలిచేను ప్రతి జీవిలో  || ప్రకృతిలో ||

ప్రకృతి మనకే ప్రమోదం ప్రకృతియే మన ఆరోగ్యానికి ప్రశాంతం
ప్రకృతియే మన లోకం ప్రకృతియే మన దేహానికి మహా ప్రసాదం

ప్రకృతి నుండే మన జీవితం ఆరంభం ప్రకృతిలోనే మన జననం
ప్రకృతి నుండే మన జీవనం ప్రారంభం ప్రకృతిలోనే మన కాలం  || ప్రకృతిలో ||

ప్రకృతిలోనే వెలిశారు ఎందరో మహానుభావులు మహాత్ములుగా అవతరించారు
ప్రకృతిలోనే నిలిచారు ఎందరో మహర్షులు మాధవులుగా ఎంతో అధిరోహించారు

ప్రకృతిలోనే పరమాత్మ ప్రకృతిలోనే పరబ్రంహ పకృతితోనే ప్రతి సృష్టి
ప్రకృతిలోనే దేవాత్మ ప్రకృతిలోనే విశ్వాత్మ ప్రకృతిలోనే ప్రతి జీవి రూపం  || ప్రకృతిలో || 

Tuesday, June 14, 2016

ఓం నమో విశ్వ విజ్ఞాన విజ్ఞేశ్వర

ఓం నమో విశ్వ విజ్ఞాన విజ్ఞేశ్వర
ఓం నమో జగన్మాత సరస్వతి దేవి
ఓం నమో లోక భావ భాగ్యలక్ష్మి
ఓం నమో సృష్టి స్వరూపిణి సంతోషి మాత
ఓం నమో త్రివిజ్ఞాన లక్ష్మి సరస్వతి గణపతి
ఓం నమో విజ్ఞాన ఆరోగ్య సంతోష జీవన సంతోషిని
ఓం నమో శాంతి శాంతి శాంతిహి శాంతం ప్రశాంతం