Monday, January 31, 2011

నేను మరణిస్తే నాతో పాటే నా విశ్వ

నేను మరణిస్తే నాతో పాటే నా విశ్వ విజ్ఞాన భావాలు మరణించాలి
నా విశ్వ భావాలు నా స్వభావాలకు మాత్రమే అర్థమవుతాయి
ఇతరులకు అర్థం కాని నా విశ్వ భావాలు నాతోనే మరణించాలి
నాతో నా భావాలు మరణించి విశ్వ చైతన్యం కావాలి అదే నా అర్థం

నేటి సమాజంలో అప్పు ఇచ్చి

నేటి సమాజంలో అప్పు ఇచ్చి మోసపోవటం దేహాన్ని కాల్చుకోవటమే
అప్పు తిరిగి ఇవ్వకపోతే మనలో ఉత్తేజ భావాలు తగ్గి దిగ్బ్రాంతిని కలిగిస్తాయి
మన కష్టాలు తీరక మనం అభివృద్ధి చెందక ఇలాగే జీవితమంతా మోసపోవటమే
మనలో ఎందుకు ఇచ్చాడో సహాయం చేసే గుణం జీవితాన్ని నాశనం చేస్తున్నది
మోసపోవుటలో కర్మ తగ్గుతుందంటే అందరూ మోసపోతారా ఆలోచించండి
సహాయం చేయకపోతే మనిషి కాదంటారు మోసపోయి అభివృద్ధి లేకపోతే అజ్ఞాని అంటారు
ఇది కాల ప్రభావమో కర్మ భావమో విధి వెంటాడే జీవన విధానమో ఏ గ్రంధంలో లేదనుకుంటా

మనషికి జీవించడం తెలియకపోతేనే

మనషికి జీవించడం తెలియకపోతేనే మోసగిస్తారు జాగ్రత్త సుమా
తీసుకునేటప్పుడు మాయా మాటల విషం కప్పి అమృత ఆశా భావాలను కల్పిస్తారు
ఇచ్చేందుకు ఇస్తారని వెళ్ళితే అసలు విషయాన్ని కప్పి విషాన్ని తాగిస్తారు ఎందరో
సమాజంలో ఎందరో ఇలాగే జీవిస్తున్నారు మోసమే జీవితమని అనుకుంటున్నారు
మోసగించే వారి కర్మ సిద్ధాంతాన్ని తెలిపితే మళ్ళీ మరో మాట రాకూడదు వారి నోట
అనవసరమైన ఖర్చులు ధ్యాసలేని మితి మీరిన భావాలు అతి తెలివి చేష్టలు అలవాట్లు
స్నేహితులకే సహాయం చేస్తాం స్నేహితులతోనే మోసపోతున్నాము
స్నేహితులే శత్రువులవుతారు స్నేహానికే అర్థం లేకుండా పోతుంది
నీవు ఎవరికైనా ఏదైనా ఎంతటిదైనా ఏ ధ్యాసలోనైనా ఎలాగైనా ఇస్తే
మళ్ళీ నీకు తిరిగి రావాలని కోరుకోవద్దు కోరుకుంటే మోసపోతావు
నీ దగ్గర ఎప్పుడూ ఏదీ లేదనే జీవించు ఉందనే ఆశను కల్పించవద్దు
విజ్ఞానాన్ని లేదా కాస్త పనిని మాత్రమే సహాయంగా కోరుకోండి లేదంటే భేదాభిప్రాయాలే

నాలో కర్మ నశించిపోతే నా భావాలు

నాలో కర్మ నశించిపోతే నా భావాలు విశ్వ పరంపరలలో జీవిస్తాయి

కర్మ చావని కఠిన సమస్యలు నాకు

కర్మ చావని కఠిన సమస్యలు నాకు కలుగుతున్నాయేమో
ఇంకా మహా కర్మను అనుభవించే శక్తి నాలో ఉందేమో
నాలో ఉన్న ఆత్మ కర్మ స్వభావాలను తెలుసుకోవాలేమో
కర్మ తత్వం నా ఆత్మకు కలిగేలా నేను జీవించాలేమో
కాల ప్రభావాలే నా విశ్వ విజ్ఞాన ఆత్మ భావ స్వభావాలు

నేడు ఓ మహాత్మ నీ కోసం ఎక్కడి

నేడు ఓ మహాత్మ నీ కోసం ఎక్కడి నుండో వచ్చి వేచి ఉంటే వదిలిపోతావా
ఎప్పుడూ అక్కడే ఉండే మరో మహాత్మ కోసం తనను విడిచి వెళ్ళిపోతావా
తానూ మహాత్మయే ఇతనూ మహాత్మయే నీ కోసం వచ్చిన వారిని దర్శించు
ఎవరికి స్పందించాలో తెలియకపోతే తెలుసుకోలేవా కాస్త పలకరించి వెళ్ళవా

ఏ మనిషి ఐతేనేమి ఏ జీవి ఐతేనేమి

ఏ మనిషి ఐతేనేమి ఏ జీవి ఐతేనేమి ప్రతి రోజు ఆహారం నిద్ర అవసరమే
ఆహార నిద్రలు అవసరం లేదంటే చెప్పండి మహా గొప్పగా ఆలోచిద్దాము
ప్రతి ఒక్కరు సమానమే ఈ రోజు కొందరికి కొన్ని హోదాలు సౌకర్యాలు
రేపు మరి కొందరికి మరిన్ని హోదాలు మరెన్నో సౌకర్యాలు కలుగుతాయి
నేడు ఈర్ష పడవద్దు రేపటికి స్వార్థంగా ఆలోచించవద్దు అనుభవంతో సాగిపో
నేడు జీవించుటలో హిత భావాలు గల విజ్ఞానం ఉండాలి అదుంటే చాలు
అజ్ఞానం కలవారు విజ్ఞానంగా మారేందుకు ప్రయత్నించాలి మార్పు వస్తుంది
నేడు కొందరు అజ్ఞానులు విజ్ఞానంగా మారుతుంటే చాలా గొప్పగా ఉంది
మరికొందరు విజ్ఞానులు అజ్ఞానంగా మారుతుంటే చాలా విచారంగా ఉంది
ఏమిటో ఈ మేధస్సు ప్రభావం కాల జ్ఞానంలో కర్మ భావమేమో తెలియదు
నిర్దిష్టమైన సంకల్ప సిద్ధి స్వయం కృషి పట్టుదల హిత గుణాలు లేవేమో
విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించే వారికే మహా దివ్య భావాలు కలుగుతాయి

ఓ ప్రధాన వ్యక్తిగా విశ్వ విజ్ఞానం నీకు

ఓ ప్రధాన వ్యక్తిగా విశ్వ విజ్ఞానం నీకు తెలియకపోయినా దేశ భవిష్యత్ నీ విజ్ఞానమే
ఓ ముఖ్య వ్యక్తిగా దేశ విజ్ఞానం నీకు తెలియకపోయినా రాష్ట్ర భవిష్యత్ నీ విజ్ఞానమే

అరిగిపోయే అజ్ఞాన మేధస్సుకు

అరిగిపోయే అజ్ఞాన మేధస్సుకు మరణమైతే సరి
విశ్వ విజ్ఞాన మేధస్సుకు మరణమైతే మహా క్షోభయే
విశ్వానికే మహా క్షోభగా మహా విజ్ఞానం కరిగిపోతుంది
విశ్వార్థాన్ని తెలిపే భావ స్వభావాలు అంతరించిపోతాయి
మళ్ళీ ఓ మహాత్మ ఉదయించాలంటే కొన్ని వేల యుగాలే
విశ్వ విజ్ఞాన మేధస్సు కలవారిని జాగ్రత్తగా చూసుకోండి

యుగాలు గడిచినా విశ్వ విజ్ఞానం లేని

యుగాలు గడిచినా విశ్వ విజ్ఞానం లేని జన్మ ఎందుకో
ప్రతి జన్మలో యదార్థపు సామాన్య మానవుని జీవితమేనా
కర్త కర్మ క్రియల వాటితోనే జీవించుట ఆత్మ లక్ష్య భావమా
ఆత్మ జ్ఞానంతో విశ్వ విజ్ఞాన అన్వేషణగా నేటి జీవితాన్ని సాగించనా

నా భావన నన్ను చూడకుండానే నన్ను

నా భావన నన్ను చూడకుండానే నన్ను విడిచిపోతున్నది నాకు తెలుపలేక
నా ఆత్మకు లేని భావ తత్వములు నా మేధస్సు నుండి తొలగిపోతున్నాయి

ఆత్మను వెలిగించుకొని విశ్వ విజ్ఞాన

ఆత్మను వెలిగించుకొని విశ్వ విజ్ఞాన జ్యోతిగా నిలిచిపోనా
విశ్వానికి ఓ ఆత్మ జ్యోతి విజ్ఞాన వెలుగులు అవసరమేగా
ప్రతి జీవికి విజ్ఞానమే జీవిత జీవన భావ స్వభావ తత్వములు
విజ్ఞాన భావాలతో జీవించేందుకే నా ఆత్మను జ్యోతిగా వెలిగించనా
నా ఆత్మను విశ్వ విజ్ఞాన అన్వేషణగా ప్రయాణిమ్పజేయనా

ప్రతి రోజు మనిషి ఎన్నో సాధిస్తున్నా

ప్రతి రోజు మనిషి ఎన్నో సాధిస్తున్నా ఎలా జీవిస్తున్నా మళ్ళీ ఆహార నిద్రలే
ఏ విజయాలు లేకున్నా ఆహార నిద్రలు తప్పక ఉండాలి లేదంటే అనారోగ్యమే

సమస్యలు తక్కువగా ఉంటేనే మనిషి

సమస్యలు తక్కువగా ఉంటేనే మనిషి ఎన్నో విజయాలను సాధించగలడు
ఇతర అలవాట్లుంటే ఏ విజయాలు లేకుండా ఎన్నో లోపాలతో జీవించగలరు

ఏక దశావతారమే నా ముఖ బింభము

ఏక దశావతారమే నా ముఖ బింభము నాలో దశములే ప్రతి రూపములు
దశ గుణములే దైవ భావములు దేహముననే దివ్య తత్వ స్వభావములు

యుగాలుగా ఎన్నో జన్మలు పొందుటలో

యుగాలుగా ఎన్నో జన్మలు పొందుటలో ప్రతి జన్మ జీవితం వృధా అవుతున్నది
ఆత్మ జ్ఞానం లేక ప్రతి జన్మలో ఆత్మ లక్ష్యం కూడా నెరవేరక పోతున్నది

పంచ భూతములు పంచ ముఖములై

పంచ భూతములు పంచ ముఖములై ఆరు ఋతువులు ఆలోచనలై
విశ్వ భావాలు కాల ప్రభావాలు నీలో దివ్య గుణాల విశ్వ విజ్ఞానమై
అద్వైత వేదములు జగతికి మూలమై శూన్య మర్మము నీ మేధస్సులోనే
భావనగా జన్మిస్తూ దశావతారములు లోకానికే త్రి బంధమై వెలుగును
కర్త కర్మ క్రియలే కాల ధర్మమై సత్యమే నీ ఆత్మ జ్ఞానమున నిలయమగును

ఓ మహాత్మా నీకు పంచ భూతములు

ఓ మహాత్మా నీకు పంచ భూతములు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి
శరీర నిర్మాణం పంచభూతాలదైనా మరో ఐదుగురు మహాత్ములు నీకోసమే
నీ లక్ష్య సాధనకు విశ్వ కార్యానికి తోడుగా మహా శక్తిని అందిస్తూ ఉంటారు
మహాత్ముల దివ్య శక్తితో జగతిని విశ్వ విజ్ఞానంగా మార్చేందుకు ప్రయత్నించు

కనిపించే ఆశలో ఆతృతలో విజ్ఞానం

కనిపించే ఆశలో ఆతృతలో విజ్ఞానం ఉండదు
ఓ భవిష్య లక్ష్య సాధనలోనే విజ్ఞానం ఉంటుంది
ఆశలో సద్గుణ తత్వం లేకపోతే ఆతృతలో అజ్ఞానమే
ప్రతి కార్యాన్ని ఆలోచించి మంచి భావాలతో చేయాలి
విజ్ఞాన కృషికి ఆశలు అతిశయోక్తి భావాలు ఉండరాదు
గౌరవమైన లక్ష్య సాధనయే మన జీవిత కర్తవ్యం

నాకు నుదిటి రాత ఉందో లేదో గాని

నాకు నుదిటి రాత ఉందో లేదో గాని కాలపు విధి రాత మాత్రం ఖచ్చితంగా ఉంది

అమరాచిపోయే భావాలు మళ్ళీ గుర్తుకు

అమరాచిపోయే భావాలు మళ్ళీ గుర్తుకు రావు కనుక వ్రాసుకో నేస్తమా

ఆధ్యాత్మకంగా ఎంత ముందుకు

ఆధ్యాత్మకంగా ఎంత ముందుకు వెళ్ళుతున్నా కాలం వెనుకకు నెట్టేస్తుంది
కాలానికి ప్రపంచ విజ్ఞానమే ముఖ్యంగా అందరిలో ఇవే భావాలే ఉన్నాయి
ఆధ్యాత్మకంగా మనలో ఎంత విశ్వ విజ్ఞానం ఉన్నా మాటల వరకే వింటారు
ఆధ్యాత్మ జీవితాన్ని సాగించడానికి ఎవరు ముందుకు రాలేరని తెలుస్తుంది
నేటి సాంకేతిక విజ్ఞానంతోనే కాలం సాగుతున్నది ఇక ఆధ్యాత్మకం ఎంత వరకు
ఎవరికి వారు తమలో తామే ఆధ్యాత్మ జీవితాన్ని సాగిస్తూ ఉండటమే మంచిది
మీ ఆధ్యాత్మ జీవితాన్ని వదులుకోవద్దండి భవిష్య కాలానికి చాలా అవసరం
కాలం ఎలా ఉన్నా మన ఆధ్యాత్మ భావాలు మన విశ్వ విజ్ఞానమే ముఖ్యం
విశ్వ సురక్షితకు ఆధ్యాత్మ జీవితం దివ్య భావాలు గల ప్రశాంతతను ఇస్తాయి

ఫిబ్రవరి 1 - 2011 ఉదయం 5 గం|| ల

ఫిబ్రవరి 1 - 2011 ఉదయం 5 గం|| ల 40 నిమిషాలకు
రంజాన్ పండుగకు ముందు రోజు సంధ్యా వేళ పడమర దిక్కున
చంద్రుడు ఎలా కనిపిస్తాడో అదే విధంగా ఈనాడు తూర్పున దర్శనమిచ్చాడు
ఇలాంటి అరుదైన భావాలు దర్శించుట తోనే మహా గొప్పగా కలుగుతాయి
మేధస్సును మెప్పించేలా అజ్ఞానాన్ని తొలగించేలా విశ్వ భావాలు కలుగుతాయి
యుగాలకు కలగని భావాలు ఇలాంటి అద్భుతమైన దర్శనంతో కలుగుతాయి
మహా దివ్య భావాలకై విశ్వాన్ని తిలకిస్తూ జీవించండి జీవితమే దివ్యత్వమవుతుంది

విశ్వమున సూక్ష్మ జీవుల పరిస్థితి

విశ్వమున సూక్ష్మ జీవుల పరిస్థితి ఎవరికి తెలియును
ఎవరైనా గ్రహించారా తెలుసుకున్నారా స్పందించారా
క్షణానికి ఎన్ని ఎలా జన్మిస్తాయో ఎలా ఎన్ని మరణిస్తాయో
జీవించుటలో కలిగే విశ్వ ప్రభావాలకు ఎన్ని ఇబ్బందులో
మానవుడు సృష్టించే కాలుష్యానికి ఎన్ని ఎలా ఎప్పుడు మరణిస్తాయో
సూక్ష్మ జీవుల భాధలలో ఓ భావన నైనా గ్రహించావా
నీ ఆత్మ తత్వానికి తెలియుట లేదా ఆత్మీయ జీవత్వము
నేను కూడా అందులో ఒక భాగ స్వామిగా ఆలోచిస్తున్నా
నేను గొప్పవాడిని కాదు నేను మీలాగే ఆలోచిస్తుంటే తెలిసింది
సూక్ష్మ జీవులు కూడా మనకు చాలా ఉపయోగపడుతాయి
ప్రాణ వాయువును కలిగించేవి సుగంధాన్ని ఇచ్చేవి ఉంటాయి
కాలుష్యాన్ని ప్రాణవాయుగా మార్చేవి కూడా సూక్ష్మ జీవులే
గాలిలో ఉన్న అణువులే సూక్ష్మ జీవులుగా జీవిస్తున్నాయి
మనకు కనిపించే చిన్న జీవులు కూడా విజ్ఞానాన్ని అందిస్తాయి
విజ్ఞానంలో ఎన్నో భావ స్వభావాలు విశ్వ తత్వాలు ఉంటాయి
ప్రతి జీవి ఎందుకు జీవిస్తుందో చరిత్రగా తెలుసుకుంటే ఎన్నో ఉపయోగాలు
ప్రతి జీవి జీవిత చరిత్రలో విశ్వ విజ్ఞానం ఎంతో ఉంటుంది
సూక్ష్మంగా ఆలోచిస్తే తప్ప సూక్ష్మ జీవుల విజ్ఞానం తెలియదు
అన్ని జీవులను మానవుడే చూసుకోవాలి భవిష్య విజ్ఞానానికి
అన్నింటిని విశ్వ విజ్ఞానంతో విశ్వ భావ తత్వాలతో గ్రహించండి
జీవితాన్ని విశ్వ విజ్ఞానం వైపు ప్రయాణాన్ని సాగిద్దాం

నీలో కలిగే ఏ భావనైనా నా భావనగా

నీలో కలిగే ఏ భావనైనా నా భావనగా విజ్ఞానంతో అర్థాన్ని గ్రహించు
నా భావాలకు యదార్థ భావనార్థం సూక్ష్మంగా ఆలోచిస్తే తెలుస్తుంది
భావాల అర్థాలతో జీవించే వారికి ఆలోచన జ్ఞానం పరిపూర్ణమవుతుంది
భావాలే ఆత్మ తత్వాలను విశ్వ స్వభావాలను విజ్ఞానాన్ని తెలుపుతాయి

Sunday, January 30, 2011

ఎన్నో యుగాలుగా మహాత్ములు

ఎన్నో యుగాలుగా మహాత్ములు అన్వేషించి ఓ దివ్య ఆలోచనను గ్రహించారు
వారి ఆలోచనలకు చరిత్ర రూపంగా మహా దివ్య పవిత్ర క్షేత్రాలను నిర్మించారు
ఎన్నో భావ స్వభావాలతో విజ్ఞాన నైపుణ్య శైలితో ఎన్నో ఏళ్ళుగా నిర్మించారు
నేడు సమాజంలో వీటిని వివిధ రకాలుగా అజ్ఞానంతో నాశనం చేస్తున్నారు
నేటి అంతస్తుల నిర్మాణములను వివిధ ప్రేలులతో కూల్చేస్తున్నారు
విశ్వ విజ్ఞాన భావాల శ్రమా జీవితాల మేధాశక్తిని నాశనం చేస్తున్నారు
అజ్ఞానులుగా ఎందుకు జీవిస్తున్నారో మీ ఆహార శక్తి భావాలలో లేవా
మహా కట్టడాలను వినాశనం చేయకండి మళ్ళీ వాటిని నిర్మించలేము

ఇంకా ఏదో కావాలనే ఆశతోనే

ఇంకా ఏదో కావాలనే ఆశతోనే జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నాము
ఎటు వైపు ఎలా ఎంతవరకు ఏ దిక్కున ప్రయాణిస్తామో కాలమే చూపునా
విజ్ఞానమా విశ్వ భావాల దివ్యత్వమా సాగిపోయే మేధస్సుకు అన్వేషణగా
మరణ భావాన్ని మరచిపోయి ఆశా భావాలతోనే జీవితాన్ని సాగిస్తున్నాము
ఇంకా ఏదో కావాలనే భావాలతో విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించి సాగిపో
నీ ప్రయాణం విశ్వ విజ్ఞానమైతే ఆత్మ భావాలతో శూన్యాన్ని చేరుకుంటావు

మరచిపోలేనంత వరకు నేర్చుకో

మరచిపోలేనంత వరకు నేర్చుకో ఇక నీలో మరుపు రాదు

ప్రతి జీవి జీవించడానికి కావలిసినది శక్తి

ప్రతి జీవి జీవించడానికి కావలిసినది శక్తి
ఆహారంతో కలిగే శక్తియే అన్నింటికీ ఆధారం
భావనకు ఆలోచనకు విజ్ఞానమునకు కార్యార్థమునకు శక్తియే
శక్తితోనే మహా కార్యాలు సాగుతాయి మహా లక్ష్యాలు నెరవేరుతాయి
ఆహారమే రుచించకపోతే శక్తి లేక ఏ కార్యం చేయలేక నిద్ర రాక అవస్థలే
ఆహారం సరిగ్గా లేకపోతే అనారోగ్యం కలిగి మేధస్సు ఉత్తేజాన్ని కోల్పోతాము
పౌష్టిక ఆహారంతో మహోన్నత శక్తితో మహా విజ్ఞాన కార్యాలను సాగించండి

ఆధ్యాత్మ పరబ్రంహ ఎవరు

ఆధ్యాత్మ పరబ్రంహ ఎవరు ఎక్కడున్నారు
ఆధ్యాత్మ భావాలతో జీవించే వారు పరబ్రంహులు
విశ్వంలో దైవ భావాలు ఉన్నచోట ఆధ్యాత్మికులు ఉంటారు
పరమాత్మ కూడా ఆధ్యాత్మ పరబ్రంహాయే

నీవు మరణించే లోగ నీ విజ్ఞానాన్ని

నీవు మరణించే లోగ నీ విజ్ఞానాన్ని ఎవరికైనా తెలిపి వెళ్ళిపో
నీ విజ్ఞానంతో జీవించే వారు ఎందరో ఉండవచ్చు అవసరం ఏర్పడవచ్చు
నీ విజ్ఞాన కార్యాలు ఏవైనా మిగిలి ఉంటే వాటిని వీరు సాగించవచ్చు
నీ విజ్ఞానం ద్వారా ఎందరికో జీవనాధారం కావచ్చు కనుక తెలుపవా

విశ్వ విజ్ఞాన అన్వేషణలో నీ మేధస్సు

విశ్వ విజ్ఞాన అన్వేషణలో నీ మేధస్సు లభించినది మహాత్మా
నీ మేధస్సును విశ్వ మేధస్సుగా మహర్షులు నిర్ణయించారు
యుగాల అన్వేషణలో శూన్య భావ స్వభావాలు నీలోనే ఉండిపోయాయి
శూన్య భావన ఎవరికి తెలియక నీ మేధస్సుకై అన్వేషించారు
దిక్కులు లేని విధంగా ధ్యానిస్తూ మర్మ కాలాన్ని నీలోనే దాచుకున్నావు
నీ విజ్ఞానం లేక విశ్వ స్థితి ఎన్నో మార్పులతో కాల ప్రభావాలతో సాగుతున్నది
నీ భావ స్వభావాలను ఆత్మ స్థితి తత్వాలను నేటి సకల జీవరాసులకు అందించు
పర ధ్యాసలో ఉన్న విశ్వ స్థితిని దివ్య ధ్యాసగా విశ్వ విజ్ఞానం వైపు జగతిని నడిపించు

Saturday, January 29, 2011

శూన్య స్థితి కోసమే విశ్వ స్థితిని

శూన్య స్థితి కోసమే విశ్వ స్థితిని గమనించాలి
ఆత్మ స్థితి విశ్వ స్థితిగా శూన్య స్థితిలో చేరుతుంది
శూన్య స్థితిని చేరుకున్న వారు మహా తత్వాలచే జీవిస్తారు
మహర్షులుగా విశ్వ విజ్ఞానులుగా యోగ భావాలతో జీవిస్తారు
శూన్య స్థితి ఎన్నో కోట్ల జీవులలో చాల అరుదుగా ఎన్నో యుగాలకు ఒకరికి లభిస్తుంది
ఒకరి కంటే ఎక్కువగా లభిస్తే విశ్వమున ఎందరో మహర్షులు జీవిస్తున్నారనే నా భావన
శూన్య స్థితి కలగకున్నా విశ్వ స్థితితో విశ్వ విజ్ఞానంగా జీవించాలనే నా దివ్య భావాలోచన

ఏమిటి విజ్ఞాన వింత అన్వేషిస్తుంటే

ఏమిటి విజ్ఞాన వింత అన్వేషిస్తుంటే తరగని ఆలోచనల భావ స్వభావాలు
విశ్వ విజ్ఞానంగా సాగిపోతూనే ఎంతో కాలం ఎన్నో జీవులకు ఆధారమవుతున్నది

నేటి మేధస్సును గొప్ప వారితో

నేటి మేధస్సును గొప్ప వారితో పోల్చుకుంటే దేనికి సమము కాదే
నేటి విజ్ఞానం అనంతంగా మారుతూ వివిధ రంగాలలో ఎందరో విజ్ఞానులున్నారు
మహా విజ్ఞానులతో నేడు జీవించే వారి విజ్ఞానం చాలా తక్కువగా కనిపిస్తుంది
ప్రతి రోజు విజ్ఞానం తక్కువ వస్తున్నట్లు విజ్ఞాన అన్వేషణ జరుగుతూనే ఉన్నది
ఏ మేధస్సు ఏ దిక్కున అన్వేషిస్తున్నదో వారి మేధస్సుకే తెలియక భారమవుతున్నది
ఏ విజ్ఞానాన్ని సేకరించాలో తెలియని సూక్ష్మ విజ్ఞానం నేడు ఉద్భవిస్తున్నది
ప్రతి రోజు కొత్త కొత్త భావాలతో విజ్ఞాన అన్వేషణతో సూక్ష్మ విజ్ఞానం ఉద్భవిస్తున్నది
ప్రస్తుతం ఎన్ని రంగాలు ఉన్నాయో సూక్ష్మంగా ఆలోచిస్తే ఏ మహాత్మకు తెలియవు
విజ్ఞాన కొరత ఎలా ఉన్నదో ఉద్యోగ అన్వేషణ చేసే వారికి బాగా తెలుస్తుంది
విజ్ఞాన మరుపు ఎలా ఉన్నదో ఎంత అజ్ఞానం ఉన్నదో వారికే తెలుస్తుంది
ఇక కార్యాలకై సాగిపోతుంటే మోసపోయే వారు లేదా ఆలస్యం చేసేవారు ఎందరో
జీవితం శ్రమా జీవితమైనా మాయగా తెలియని విజ్ఞాన అన్వేషనగా ఉంటుంది
తెలియనిది తెలిసినట్లు తెలుసుకుంటూనే విజ్ఞాన అన్వేషణ జరుగుతూనే ఉన్నది
అంతా ఆహార నిద్రలకే సాగుతూ విలాసవంతమైన జీవితానికి ప్రయాణం తీస్తుంది
భవిష్యత్ ను ఊహా భావాలతో ఒకరితో చూసుకుంటూ మరొకరితో పోల్చుకుంటూ
మనకు రేపటికి ఎన్నో దక్కుతాయనే ఆశాలోచన కలుగుతున్నది కనుక జీవిస్తున్నాం

మరో దీవిలో నిన్ను చూశాను మళ్ళీ

మరో దీవిలో నిన్ను చూశాను మళ్ళీ నిన్నే ఈ దీవిలో చూస్తున్నాను
ఇంకో దీవికి వెళ్ళినా నిన్నే చూస్తానని నీవే కనిపిస్తావని నా భావన
మహాత్ములు ఎక్కడికి వెళ్ళినా వేద మహర్షులకు దర్శన మిస్తారు
విశ్వ విజ్ఞానులు ఎక్కడ ఉన్నా మహర్షులు మహాత్ములు అక్కడే ఉంటారు
నేడు జీవించే వారిలో ఎందరో మహాత్ములు మహర్షులు ఉన్నారు
అందరిని గమనిస్తూ జీవించండి అందరితో మీరు మహర్షులవుతారు

కోట్ల జనం కోట్ల భావాలతో ఒకే కార్యానికై

కోట్ల జనం కోట్ల భావాలతో ఒకే కార్యానికై సాగితే మహా కార్యం సాగుతుంది
అద్భుతం కూడా జరగాలంటే కోట్ల జన భావాలు ఒకే కార్య లక్ష్యంతో సాగాలి
జనుల భావ స్వభావాల గుణాలు కార్య పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి
కోట్ల జనాభాను ఓ నిర్దిష్ట భావంతో నడిపించే శక్తి సామర్థ్యాలు చాలా కావాలి
మహోన్నతమైన ధైర్యం వీర సాహస నైపుణ్యం మాట చాతుర్యం ఉండాలి
ఒకరితో కోట్ల రాజ్యం కూలిపోరాదు అందరితో ఓ మహా కార్యాన్ని సాగించాలి
విశ్వ కార్యాన్ని నడిపించేందుకు కోట్ల జనుల సహకారం కావాలని నా భావన
నాలో ఎన్నో మహా గొప్ప విశ్వ కార్యాలు ఉన్నా కాలంతో సాగేవాడినే నేను
అందరి భావాలను అర్థం చేసుకోవాలి అందరు అందరిని అర్థం చేసుకోవాలి
సహాయ గుణాలు సమయ స్పూర్తి ఉండి కనీస అవసరాలను తీర్చగలగాలి
ఏనాటికైనా నా మహా కార్యం సాగుతుందని గొప్ప ప్రణాళికతో ఎదురుచూస్తున్నా
విశ్వ విజ్ఞానానికే మన జీవితం మన తర తరాల వారికే నేటి విశ్వ కార్యం

ప్రతిరోజు ఎన్నో చూస్తున్నావు ఎన్నో

ప్రతిరోజు ఎన్నో చూస్తున్నావు ఎన్నో తెలుసుకుంటున్నావు ఎన్నో గ్రహిస్తున్నావు
ప్రతి రోజు విజ్ఞానాన్ని అనుభవంగా జ్ఞాపకంతో మేధస్సులోనే దాచుకుంటున్నావా
భవిష్య కార్యాలకు మళ్ళీ నీ మేధస్సు నుండే నీ అనుభవాన్ని స్వీకరిస్తున్నావా
నీ అనుభవం చాలకపోతే ఇంకా నీ మేధస్సులో ఎన్నో గ్రహిస్తూ దాచుకోవాలి
ఓ సారి మహా విశ్వ విజ్ఞానాన్ని దాచుకో అందులోనే అన్ని నిక్షిప్తమై ఉంటాయి
నీ మేధస్సును త్రీలోక జ్ఞానంగా మార్చుకో ప్రతి కార్యం నీ నుండే జరిగిపోతుంది
విశ్వ జీవులకు నీవే భావాలోచనవై అందరికి ఎన్నో కలిగిస్తూ నిలిచిపోతావు

ఏ రోజైనా విశ్వము చీకటి లేక సూర్య

ఏ రోజైనా విశ్వము చీకటి లేక సూర్య తేజస్సుతోనే సాగినదా
సూర్యుడు పడమర అస్తమించేలోగా మరలా తెల్లవారి పోయిందా
ఇలాంటి భావన ఊహకు కూడా కలగని వారు ఎందరో ఉన్నారు
మేధస్సును చీకటి లేకుండా విశ్వ విజ్ఞానంతో ప్రకాశింపజేసుకోవాలనే
సూర్యుని యొక్క భ్రమణం ఖచ్చితంగా ప్రతి రోజు ఒకేలా సాగుతుంది

నా శక్తిని విశ్వమే గ్రహిస్తున్నది

నా శక్తిని విశ్వమే గ్రహిస్తున్నది నా శ్వాసను విశ్వమే గమనిస్తున్నది
నా భావ తత్వాలలో విశ్వ స్వభావ గుణాలు ఎన్నో అనంతమై ఉన్నాయి
ప్రకృతికి కావలసిన భావ స్వబహవాలు నా శ్వాసలో ఉదయిస్తున్నాయి
విశ్వ పోషకాలను జీవ భావాలతో సూక్ష్మంగా నా శ్వాసలో ఉత్ప్రేరణ చేస్తున్నా
నా శ్వాస విశ్వ స్థితితో జీవిస్తూ నా భావ స్వభావాలు ప్రకృతిలో కలుగుతున్నాయి

రేపటి స్వప్నం నిజమైతే అది స్వప్నం

రేపటి స్వప్నం నిజమైతే అది స్వప్నం కాదేమో ప్రతి రూపంగా కలిగినదేమో
రేపటి కార్య భావాలు నీలో నేడు అలాగే స్వప్నంలో ప్రతి రూపంగా కలిగాయి
నీలో ఆత్మ తత్వాలు రేపటి కార్యాలోచనలను జీర్ణించుకొని ప్రతి రూపానిచ్చాయి
నీ ఆలోచనల ఆవేదనలు ఆత్మ స్వభావాలు స్వీకరిస్తూ ఓ దృశ్యాన్ని చూపాయి
నీలో భావాల గమనాలోచన మహా దివ్యంగా ఎరుకతో ఉంటే రేపటి కార్యాలు స్వప్నంలో
స్వప్నంలో కలిగేవి నిజమైతే నీ భవిష్యత్ ఉజ్జ్వలమై మహా విజ్ఞానంగా సాగుతుంది

విశ్వానికి ఆదర్శంగా నిలిచిపోయే

విశ్వానికి ఆదర్శంగా నిలిచిపోయే భావాలు నాలో ఎన్నో
సమయ స్పూర్తికి కలిగే భావాలే వినయ విధేయత విజ్ఞానం

విశ్వ పితామహుడు విశ్వ విజ్ఞాన

విశ్వ పితామహుడు విశ్వ విజ్ఞాన వేదాంత ప్రజ్ఞావంతుడే
నీవు విశ్వ విధాతగా ఎదిగే మహాత్ముడవే నని గ్రహించు
నీకు కలిగే భావాలను సముద్రపు నీటి బిందువులుగా ఆలోచించు
అనంతమైన ఆలోచనలలో విశ్వ భావాల మహా విజ్ఞానాన్ని సేకరించు
నీటి బిందువులుగా కొన్ని ఆవిరై వర్షంతో మరలా కొత్త బిందువులు చేరుతాయి
అలాగే నీలో ఆలోచనలు కొన్ని వెళ్ళిపోతూ మరో కొత్త ఆలోచనలు కలుగుతాయి
కాలం విశ్వాన్ని తటస్థంగా ఉంచదు అలాగే విశ్వంలో ఉన్న అణువులను ఉంచదు
ప్రతీది మార్పు కలుగుతూ విశ్వాన్ని విజ్ఞానంగా నడిపిస్తూనే కాల ప్రభావాలు సాగుతాయి
కాల ప్రభావాలతో నీవు మారుతూ విశ్వ విజ్ఞాన వేదాంత మహాత్ముడిలా ఎదగాలనే

అంతర్ముఖాన్ని అద్దంలో చూసుకోలేవు

అంతర్ముఖాన్ని అద్దంలో చూసుకోలేవు మరో లోకంలో దాచుకోలేవు
నీ రూప భావాలతో నీ మేధస్సులోనే మనస్సుతో కప్పబడి ఉంటుంది

మనిషిలోని మౌనమే మనస్సు

మనిషిలోని మౌనమే మనస్సు తెలుసుకొనే విజ్ఞానం ఆలోచించే జ్ఞానార్థం
విజ్ఞాన అన్వేషణను మనస్సు సాగించే అంతర్ముఖమే విజ్ఞాన భావ లోకం

మనిషి ఎన్ని సాధిస్తున్నా ఎలా

మనిషి ఎన్ని సాధిస్తున్నా ఎలా జీవిస్తున్నా ఆహార నిద్ర భావాలే సుఖాన్ని ఇస్తాయి
రుచికర ఆహారం నిద్ర మత్తు లేకుండా మేల్కొనటం చాలా ఉత్తేజ కార్య శక్తిని ఇస్తాయి
గొప్ప భావాల ఆలోచనలతో వివేకవంతమైన తెలివి తేటలతో కార్య అనుభవం కలుగుతుంది
మనిషికి ఎన్నో కార్యాలు విజయవంతమైతేనే జీవితానికి జీవించడానికి ఆశ కలుగుతుంది
నిరాశలు ఎక్కువైతే జీవితం భారమై జీవనం సవ్యంగా సాగని ఎదగని విధంగా ఉంటుంది
వీలైనంత వరకు శ్రమిస్తూ తగిన ఆహార నిద్రలతో జీవితాన్ని సుఖ భావాలతో సాగించు

ఏ లోకము నుండి వస్తున్నావు

ఏ లోకము నుండి వస్తున్నావు ఏ విజ్ఞానాన్ని తీసుకువస్తున్నావు
ఎవరికి ఏ విజ్ఞానం కావాలో ఆ విజ్ఞానాన్నే నీవు అందిస్తున్నావా
నీ ఆత్మ భావాలలో దాగిన విజ్ఞానం విశ్వ విజ్ఞానంగానే ఉంటుంది
విశ్వ విజ్ఞానాన్ని అందించుటకు అన్ని లోకాల నుండి నీవే వస్తున్నావు

కాలం ఎప్పుడూ నీకు నీవుగా ఎదగాలనే

కాలం ఎప్పుడూ నీకు నీవుగా ఎదగాలనే సూచిస్తుంది అనుభవంతో తెలుసుకో
ఆనాడు ప్రోత్సాహంతో సాహయం చేసి సహకరించిన వారు ఎందరో ఉండవచ్చు
నేడు ప్రస్తుత పరిస్థితులలో తాత్కాలికంగా సలహాలే గాని సహాయాలు లేవు
ఎవరి జీవితం వారిది ఎవరి ఆలోచన వారివి ఎవరి సంతోషాలు కష్టాలు వారివే
నీకు తెలిసిన విధంగానే నీకున్న విజ్ఞానంతో సాగిపో కాలం ఎప్పటికైనా సహకరిస్తుంది
నిరాశ చెందకు ఆశతో ఇంకొకరి అద్భుతాలకు ఉప్పొంగిపోవద్దు అనుభవమే గుణపాఠం
నీకు నా భావనయే మహాత్మగా తోడుగా ఉంటుంది విజ్ఞానంగా స్వయంకృషితో సాగిపో

బహు దూరంగా ఉన్న భావాలనే మళ్ళీ

బహు దూరంగా ఉన్న భావాలనే మళ్ళీ బహు దగ్గరగా చేసుకోవాలనే స్వభావాలు
కాలం గడిచిపోతుంటే జ్ఞాపకాలలో మళ్ళీ ఆనాటి భావాలే కావాలని ఆలోచనలలో
ఎందరితో ఎన్నో విధాల సుఖ సంతోషాల బంధాలతో జీవించిన క్షణాలు మన కోసమే
ఆనాటి మన క్షణాలు మరల ఆనాటి సంతోషాలుగా కలగాలనే జీవిత ఆనందము
నేటి భావాలలో ఎన్ని గుణాలున్నా ఆనాటి భావాలలో స్వచ్ఛత మధురమైనది

ప్రపంచానికి ఆదేశ సూత్రాలు అవసరమే

ప్రపంచానికి ఆదేశ సూత్రాలు అవసరమే ఏ దేశానికి ఆ దేశ సూత్రాలు చాలా అవసరం
దేశ పరిస్థితుల కోసం నవ సమాజ విధానం కోసం ఆదర్శవంతమైన సూత్రాలు కావాలి
ఆదేశ సూత్రాలు దేశ సంరక్షణకు ఆదర్శ భావాలతో జీవిత ముఖ్యాంశాలుగా ఉండాలి
సమాజంలో జీవించేందుకు కావలసిన సౌకర్య వసతులు విజ్ఞానం ప్రకృతి రక్షణ ఉండాలి
దేశాన్ని ఓ విజ్ఞానం వైపు నడిపించే మార్గమే ఆదేశ సూత్రాల ముఖ్య జీవన సారాంశము
ప్రతి దేశముతో స్నేహ సంబంధాలు కలిగి కావలసినంత వరకు సహాయ కార్యాలు సాగాలి
దేశ సంపదయే నేడు భవిష్య విజ్ఞాన జీవిత సోపానంగా జీవితానికి ఉపయోగకరంగా ఉండాలి
సహజ వనరుల సరిహద్దులు మన దేశ ప్రగతిని చాటే ఖనిజాలు గుణ గణాలు ధైర్య సహాసాలు

ఒకేసారి జన్మించావు ఒకేసారి

ఒకేసారి జన్మించావు ఒకేసారి మరణిస్తున్నావు ఒకేసారి తెలుసుకోవా
యుగాలుగా జన్మిస్తూ మరణించుటలో ప్రతి జన్మకు తెలియుటలేదు
విశ్వ విజ్ఞానం లేనందున జీవితం ఎందుకో తెలుసుకోవాలనే అన్వేషణ లేదు
నేటి జన్మను ఒకేసారి తలచి విశ్వ విజ్ఞానంతో యుగాలుగా నిలిచిపో
విశ్వ విజ్ఞానాన్ని మహా గుణ ఆలోచనలతో ఆకాశాన అన్వేషించు
విశ్వ భావ స్వభావాలను విశ్వ తత్వాలను విశ్వ స్థితులను తెలుసుకో
లోకాలను దాటుతూ విశ్వ పరం పరలను అధిగమిస్తూ విజ్ఞాంగా సాగిపో
ఇలాంటి జన్మ నీకు మరల రాదు ఇక ఏ జన్మకు విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోలేవు

విశ్వ విజ్ఞానమున నీవు ఎక్కడ

విశ్వ విజ్ఞానమున నీవు ఎక్కడ ఉన్నావు రేపు మళ్ళీ అక్కడే ఉంటున్నావా
ప్రతి రోజు కాస్త ముందుకు వెళ్ళుతుంటే నీలో మహా దివ్య గుణాలు కలుగుతాయి
ప్రతి క్షణములో కలిగే విశ్వ విజ్ఞానం ఎన్నో అద్భుతాలతో ఎన్నో విధాల ఉంటుంది
ప్రతి అద్భుతాన్ని విజ్ఞానాన్ని భావ స్వభావాలను మేధస్సున సేకరిస్తూనే ఉండాలి
ఎన్నో లోకాలలో ఎన్నో అద్భుతాలు ఎన్నో దివ్య కార్యాలు జరిగిపోతూనే ఉంటాయి
నా మేధస్సులో ప్రతి క్షణ విశ్వ భావన చేరుతూనే నేడు నేను ప్రస్తుత క్షణమున ఉన్నాను
నీవు మహా విశ్వ విజ్ఞానంతో ప్రస్తుత క్షణములో జీవించుటకు శూన్యాన్ని అన్వేషించు

నేడు అనుకున్న కార్యాలకు

నేడు అనుకున్న కార్యాలకు రేపు జరిగేలా కార్య శక్తి సమయాన్ని అందించు
నేటి నిద్రలో నా గ్రహ స్థితి ప్రభావాలు రేపటికి గొప్ప దిశలలో ప్రయాణించాలి
అద్భుత క్షణాలలో ఎన్నో మహా కార్యాలు సాగిపోయేలా దివ్య శక్తి కలగాలి
కాలం వృధా ఐన సమయం లేక మహా వేగంగా విశ్వ కార్యాలు సాగిపోవాలి
నా నిద్ర మహా విశ్వ భావాలతో దివ్య స్థితి తత్వాలతో సాగేలా అనుకరించు
నా కార్యాలను సాగనిచ్చే వారు విశ్వానికి మహాత్ములుగా సాగిపోగలరు

సముద్ర తీరం నుండి సముద్రం వైపు

సముద్ర తీరం నుండి సముద్రం వైపు ఎంత దూరం నడవగలవు
అటు వైపు ఉన్న సముద్ర తీరాన్ని చేరుకునే శక్తి నీలో ఉన్నదా
నడక ఈదుటగా మారి అలసిపోయేలా ఆపై నీరసంతో చనిపోయేలా
సముద్ర తీరాలకు జీవితం అడుగులు వేసేవరకే సాగుతుంది

నా విశ్వ స్థితిలో కార్య శక్తి లేకపోవడం

నా విశ్వ స్థితిలో కార్య శక్తి లేకపోవడం ఆత్మకు స్థోమత లేకపోవడమే
ఆత్మలో ఉన్న గుణాలు సామాన్య మానవుని తత్వాలను దాటి వెళ్ళాయి
విశ్వపు భావాలతో ఆత్మ అద్వైత పరం పరలలో యోగత్వమై జీవిస్తున్నది
శ్వాస శూన్య స్థానాన్ని గమనించే విశ్వ స్థితిని గ్రహిస్తూ అన్వేషిస్తున్నది
కార్య శక్తి లేకపోవడం విశ్వ కార్యాలతో జగతికి మహా శక్తిని అందించడమే
విశ్వ కార్యాలు కనిపించే పనులు కావు విశ్వ ప్రకృతిలో దాగిన మార్పులు
విశ్వానికి మహా శక్తిని అందిస్తూ తను శరీర కార్య శక్తి లేక జీవించడమే

చంద్రునితో నక్షత్ర దర్శనం ఉదయం

చంద్రునితో నక్షత్ర దర్శనం ఉదయం 5 గం|| ల 10 నిమిషాలకు (గజం దూరంలోనే)
సంవత్సరానికి ఓ సారి లేదా రెండు సార్లు మాత్రమే ఇలా కనిపిస్తుంది
చాలా అరుదుగా కనిపించే ఈ దివ్య దర్శనం మేధస్సులో ఓ విశ్వ భావన
మేధస్సులో కలిగే విశ్వ భావాలకు ఆకాశమే విశ్వ విజ్ఞాన మహా సోపానం

You have Universal aims

You have Universal aims in your state of Soul

తలచి తలచి చూస్తే

తలచి తలచి చూస్తే నా తల్లి మహాత్మురాలిగా నా మేధస్సులోనే
జగమునే నా తల్లికి ఇచ్చి విశ్వ భావ ఋణ బంధాన్ని పెనవేసుకోనా
నా విశ్వ విజ్ఞాన భావాలకు నా తల్లి తత్వమే నా జన్మ భావ రూపం
నేను ఎదిగే విశ్వమున నా రూపం నా తల్లి భావనతోనే నిలిచిపోతుంది
నేను తలచుకొనే ప్రతి భావనలో నా తల్లి గుణమే నాలో కలుగునని నా అర్థం
బంధాలు ఎంతటివో విశ్వాత్మకే తెలిసిన బహు స్వభావాల ఆత్మ తత్వములే
వీడలేని బంధాలతో కను రెప్పల గుర్తులతో ఎదురు చూసే నీడలే మాతృతత్వం

శూన్యమున ఉదయించిన భావన

శూన్యమున ఉదయించిన భావన స్వభావ కావ్యమే నా ఆలోచనార్థం
నేడు కలిగే భావ స్వభావాలు ఆనాటి కావ్యములో ఉన్న భావార్థాలే
నేటికి ఇంకా ఎన్నో తెలియని భావ స్వభావాలు ఆనాటి కావ్యములోనే
ఆనాటి కావ్యములో ఉన్న వాటినే నేను అన్వేషిస్తూ తెలుపుతున్నాను
ఇంకా ఎవరికి తెలియని భావ స్వభావాలు యుగాలుగా సాగుతాయి
ఆనాటి కావ్యాన్ని నేను నా మేధస్సులో విశ్వ విజ్ఞానంతో అన్వేషిస్తున్నా
ప్రతి భావన నా అన్వేషణలో కలుగుతూనే ఉంటుందని నా విశ్వ స్వభావం

సమాజంలో ఎక్కడ ఏ విజ్ఞానం ఉందో

సమాజంలో ఎక్కడ ఏ విజ్ఞానం ఉందో తెలుసుకో
మనకు కావలసిన విజ్ఞానం ఎక్కడ ఉందో తెలుసుకో
మనకు ఏ విజ్ఞానం కావాలో తెలియకపోతే ఎక్కడని వెతికెదవు
కావలసిన విజ్ఞానం కోసం ఖచ్చితమైన సరైన ప్రదేశాన్ని ఎంచుకో
నేటి సమాజంలో కావలసినది ఏదో సరిగ్గా తెలుసుకోలేక ఎవరూ తెలుపలేక
అనుకున్నది ఎక్కడో సమాజమున తెలియలేక తెలిసినవారు అందుబాటులో లేక
ఏ విజ్ఞానమైనా ఎక్కడైనా నీకు నీవుగా సరిగ్గా తెలుసుకొని నీవే మహాత్మగా ఎదిగిపో

ప్రతి రోజు ఇంటికి వెళ్ళాలనే గమ్యంతో

ప్రతి రోజు ఇంటికి వెళ్ళాలనే గమ్యంతో ప్రయాణిస్తున్నావు
విశ్వమే జీవిత గమ్యమని ఏనాడు ప్రయాణిస్తావో తెలుసుకో
విశ్వ ప్రయాణం ఆధ్యాత్మ విజ్ఞాన ఆలోచన గల భావాన్వేషణయే
ఆత్మతో ప్రయాణించు విశ్వాన్ని తిలకించు విజ్ఞానాన్ని సేకరించు

ఆశ ఓ ఆకర్షణ మాత్రమే మహా విజ్ఞాన

ఆశ ఓ ఆకర్షణ మాత్రమే మహా విజ్ఞాన ఆలోచనయే ఓ విశ్వ కార్యం

ఆరిపోయే జ్యోతిని ఆగిపోయే జ్ఞానాన్ని

ఆరిపోయే జ్యోతిని ఆగిపోయే జ్ఞానాన్ని ఎంతవరకు అభ్యసిస్తారు
ఎన్ని జన్మలైనా ఇలాగే మీ జ్ఞానం మీ మరణంతో ఆగిపోతుంది
ఎన్ని జన్మలైనా మరణించినా మీతో కలిగే విజ్ఞానాన్ని అభ్యసించండి
మీ ఆత్మ భావాలతో విశ్వ విజ్ఞానాన్ని అధ్యాయనం చేస్తూ అభ్యసించండి
విశ్వ విజ్ఞానానికి మరణం లేదు ఆధ్యాత్మకంగా సాగే మహా విజ్ఞాన వేదం

నా మేధస్సులో ప్రతి కణం

నా మేధస్సులో ప్రతి కణం ఓ మహా నక్షత్రమై ప్రకాశిస్తున్నది
ప్రతి కణం ఓ సూర్య కిరణంలా విశ్వపు అంచును తాకుతున్నది
ప్రతి రోజు కనిపించే వెలుగులో నా మేధస్సు భావన దాగి ఉన్నది
మేధస్సును విశ్వ విజ్ఞానంగా వెలిగించాలనే నా స్వభావ భావన

ఏ ఆహారంతో ఏ రుచితో ఏ విధమైన

ఏ ఆహారంతో ఏ రుచితో ఏ విధమైన ఆలోచన కలుగుతుంది
ఏ ఆహార శక్తితో ఏ ఆలోచనతో ఏ మహా కార్యాన్ని చేస్తున్నావు
ఏ భావ స్వభావాలతో ఏ విజ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటున్నావు
నీ ఆలోచనలలో ఆత్మ విజ్ఞాన అన్వేషణ కలిగితే విశ్వమున సాగిపో

నేడు జరిగిన సంఘటనలు రేపటికి

నేడు జరిగిన సంఘటనలు రేపటికి అనుభవాలే
కాల పరిస్థితుల గమనంలో మానవుల భావ స్వభావాలే వివిధ సంఘటనాలుగా
రేపటి పరిస్థితులకు కాలం వివిధ అనుభవాలను వివిధ రకాలుగా తెలుపుతుంటుంది
మన పరిస్థితులకు మనమే కారణం మనమే భాద్యులం మనమే పరిష్కారులం
ప్రతి సంఘటనను గమనిస్తూ వివిధ కార్యాలతో వివిధ అనుభవాలతో సాగిపో
జీవితాన్ని సమస్యల బాటగా కాకుండా పరిష్కార మార్గంలో నడిపిస్తూ వెళ్ళిపో

ఈ సంతోష భావాలకు కొన్ని దుఃఖ

ఈ సంతోష భావాలకు కొన్ని దుఃఖ భావాలు తోడవుతాయి
దుఃఖ భావాలతోపాటు కొన్ని విచారకర భావాలు తోడవుతాయి
అనారోగ్య భావాలు ఇతర సంఘటనల భావాలు తోడవుతుంటాయి
జీవితంలో ఎన్ని భావాలో సుఖ దుఃఖాల పరిధిని దాటి వెళ్ళుతుంటాయి
సుఖ దుఃఖాలకు కూడా తెలియని భావాలు ఆత్మ స్వభావ తత్వాలలో దాగి ఉంటాయి
ఎప్పడు ఎలా కలుగుతాయో మన తీరును ఎలా మారుస్తాయో భావ స్వభావాలకే ఎరుక

Friday, January 28, 2011

రేపు కలుసుకుందాం ఆత్మ భావాలతో

రేపు కలుసుకుందాం ఆత్మ భావాలతో విజ్ఞానాన్ని పంచుకుందాం విశ్వ స్వభావాలతో
మళ్ళీ కలుసుకొనుటలో విశ్వ పరిస్థితులలో కలిగే కొత్త భావాలను వివరించుకుందాం
మహర్షుల సహకారంతో విశ్వ విజ్ఞానంతో విశ్వాన్ని మహా జగత్తుగా మార్చుకుందాం
విశ్వం ఓ విజ్ఞాన దీవి మహర్షుల మహా గ్రంధాలయం ఆత్మ జీవులకు జీవిత సోపానం

నేటి విశ్వ పరిస్థితికై విశ్వ స్థితిని

నేటి విశ్వ పరిస్థితికై విశ్వ స్థితిని తెలుసుకోండి వీలైతే విశ్వ స్థితిని గ్రహించండి
అనంతమైన బహు సకల జీవరాసుల సంఖ్య ఎన్నో వేల లక్షల కోట్లలోనే కదా
నేటి సమాజ స్థితి నగర పరిశ్రమల స్థితి ఆత్మ గుణ స్థితులు చెల్లా చెదురుగానే
విశ్వ మలినాన్ని పరిశుభ్రతగా మారుస్తూ వాతావరణ పర్యావరణాన్ని కాపాడుదాం

ఆత్మ స్థితిలో ఎన్నో భావాలు ఉన్నా

ఆత్మ స్థితిలో ఎన్నో భావాలు ఉన్నా విశ్వ విజ్ఞాన స్థితికి ప్రయత్నించు
ఎన్నో యుగాలగా ఎన్నో భావాలతో ఆత్మ జీవిస్తున్నా స్వభావాలన్నీ ఒకేలాగ ఉన్నాయి
నేటి జన్మలోనైనా ఆత్మ భావాలను విశ్వ విజ్ఞానంగా మార్చుకోవడానికి ప్రయత్నించు
విశ్వ విజ్ఞానంలో ఆత్మ భావాలు విశ్వ స్థితిని గ్రహిస్తూ అనంతమైన మేధస్సుతో జీవిస్తావు

ఆత్మలో ఉన్న భావాలే మేధస్సులో

ఆత్మలో ఉన్న భావాలే మేధస్సులో చేరుతున్నట్లు విజ్ఞానం చెందవా
మేధస్సులో ఉన్న విజ్ఞానాన్ని శ్వాస ధ్యాసతో ఆత్మ జ్ఞానంగా మార్చుకోవా

చెప్పండి ఏమి వ్రాయాలో మీకు

చెప్పండి ఏమి వ్రాయాలో మీకు కావలసినవే వ్రాయాలనుకుంటున్నా
మీకు కావలిసిన విధంగానే మహా విశ్వ విజ్ఞానాన్ని వ్రాసుకుందాము
ఆత్మ స్థితి తత్వాల విశ్వ స్థితి భావ స్వభావాలను చర్చించుకుందాము
ప్రతి రోజు కాస్త సమయాన్ని మనమే కల్పించుకొని ధ్యానం చేద్దాము
జగతిని విశ్వ విజ్ఞాన ప్రగతిలో నడిపించేందుకు సమాజాన్ని మార్చుకుందాం

Thursday, January 27, 2011

అద్దంలో నీడలేని ఛాయా రూప బింభమే

అద్దంలో నీడలేని ఛాయా రూప బింభమే నా యాదార్థ భావన
ఉన్నది ఉన్నట్లుగా తెలియాలనే కుడి ఎడమైనా నా యదార్థ బింభమే
విశ్వ గుణంలో అద్భుతమైన విచక్షణ స్పర్శ లేని యదార్థ భావన అద్దానిదే
నాలో ఉన్న విశ్వ గుణాలలో అద్దం నా యదార్థ రూప స్వభావమేని దివ్యార్థం

విశ్వ విజ్ఞాన ధర్మాయచా మేధస్సున

విశ్వ విజ్ఞాన ధర్మాయచా మేధస్సున ఆత్మ మర్మాయచా
మనస్సు ఆత్మ మందిరమైతే పరబ్రంహ విశ్వ ధ్యానాయచా

సంగీతంలో పర ధ్యాస మర్మమున్నదని

సంగీతంలో పర ధ్యాస మర్మమున్నదని ఆత్మ స్థితి తెలుపుతున్నది
సంగీతంలో లీనమై మేధస్సు ఆత్మ భావాలతో విశ్వ ప్రయాణం చేస్తున్నది
ఎంత వరకో తెలియని ప్రయాణం దేనిని అన్వేషించునో తెలుసుకో మానవా
నీలో ఆత్మ విశ్వ విజ్ఞానాన్ని అన్వేషిస్తున్నదని జీవిత పరమార్థాన్ని గ్రహించవా

విశ్వాన్ని చూపిస్తే మేల్కొంటావా

విశ్వాన్ని చూపిస్తే మేల్కొంటావా మహాశయ మహానుభావా!
మహాత్మగా నీకు విశ్వ లోకాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి
మేధస్సున అన్వేషణ లేక విశ్వపు ద్వారాలు మూసియున్నాయి
నీవు ఆనాటి విశ్వ విజ్ఞానివే మర్మం తెలియక పరధ్యాలోనే జీవిస్తున్నావు
ఆత్మ జ్ఞానంతో ధ్యానిస్తూ మరలా విశ్వపు ద్వారాలను తెరచి లోకాలను చూడవా
విశ్వ స్థితితో జీవించెందుకే మరల నీవు మహాత్మగానే జన్మించావని తెలుసుకో

Wednesday, January 26, 2011

గంధపు గాలికి విశ్వము కూడా

గంధపు గాలికి విశ్వము కూడా పర ధ్యాసలో ప్రయాణమే
సుగంధాల మత్తులో విశ్వము మర్మముగా పర ధ్యాసలో
ధ్యానము చేయగా నీ ఆత్మైనా పర ధ్యాసలో ప్రయాణమే
ద్యానించుటలో పరమాత్మ ధ్యాస సుగంధపు మర్మమే

నా మనస్సులోని మర్మములను

నా మనస్సులోని మర్మములను తెలుసుకోవాలనే నా మేధస్సు అన్వేషిస్తున్నది
నా అన్వేషణ లోనూ మనస్సు అన్వేషణను మారుస్తూ మరో దానిపై మరలుతుంది
మనస్సు చలించే భావ స్వభావాల విధానంతో సూక్ష్మ ప్రభావాలను గమనిస్తున్నా
మనస్సు తెలుసుకునే విజ్ఞాన అర్థాన్ని తొలగించుకునే అజ్ఞానాన్ని గ్రహిస్తున్నా
ఏది మంచిదో ఏది మంచిది కాదో అర్థమయ్యేలా అన్ని గుణ విచక్షణాలను గ్రహిస్తున్నా
విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించే ఆధ్యాత్మ భావాలను సూక్ష్మంగా ఆలోచిస్తూ అన్వేషిస్తున్నా

విశ్వ విజ్ఞాన మహాత్ములందరూ

విశ్వ విజ్ఞాన మహాత్ములందరూ విశ్వ మిత్రులే
విశ్వ విజ్ఞానాన్ని అందించేందుకు విశ్వసిస్తున్నారు
ఆత్మ జ్ఞానము గలవారికి విశ్వ విజ్ఞానాన్ని బోధిస్తున్నారు
ధ్యానించే వారిలో పర ధ్యాసలో కలిగే ప్రభావాలే విశ్వ విజ్ఞానం

హిమాలయాలలో ఓ సూక్ష్మ విశ్వ కేంద్ర

హిమాలయాలలో ఓ సూక్ష్మ విశ్వ కేంద్ర రంధ్రములో మరో ఆత్మగా ధ్యానిస్తున్నా
ధ్యానించుటలో విశ్వ స్థితితో జీవత్వమై యోగ పర ధ్యాసలో నిమగ్నమై ఉన్నా
పర ధ్యాసలో ఆత్మ పరమాత్మ తత్వం దైవ భావనతో విశ్వ స్థితిగా కలుగుతుంది
విశ్వ స్థితి కలుగుటకే హిమాలయమున విశ్వ నాభిలో ఆత్మగా ధ్యానిస్తూనే ఉన్నా

విశ్వ స్థితి తత్వాయ పర బ్రంహ

విశ్వ స్థితి తత్వాయ పర బ్రంహ జీవత్వహా
అమృతం అమర యోగ విశ్వ స్థితి తత్వహా
ఆత్మే కర్మ వినాశ విశ్వ విజ్ఞాన స్థితి ధ్యానహా
పరమాత్మ స్వరూపాయ ఆత్మ జ్ఞాన స్థితహా

ఇంకా విశ్వ స్థితి ఎవరికి కలగలేదేమో

ఇంకా విశ్వ స్థితి ఎవరికి కలగలేదేమో ఏ మహాత్ములకు వరించలేదేమో
అందుకేనేమో ఇంకా హిమాలయాలలో ఎందరో యోగులు ధ్యానిస్తున్నారు
విశ్వ స్థితి హిమములో చాలా ఉంటుంది కనుక హిమాలయమున ధ్యానం
విశ్వ స్థితికై ఎందరో ఎన్నో యుగాల నుండి ఎన్నో జన్మలతో ప్రయత్నిస్తున్నారు
పూర్వ జన్మ సుకృతం ఉంటేనే పాప పరిహార కర్మ దగ్ధమై విశ్వ స్థితి కలుగును
విశ్వ స్థితితో జీవించుట మరణంలేని జీవత్వమే మహా యోగత్వ పర బ్రంహయే

శ్రీనాథుడే శ్రీకాంతుడే శ్రీధరుడే శ్రీశ్రీశ్రీగా

శ్రీనాథుడే శ్రీకాంతుడే శ్రీధరుడే శ్రీశ్రీశ్రీగా ప్రతి ఒక్కరిలో శ్రీ / శ్రీమతిగా
శ్రీ అనేది మహా దివ్య స్వభావ గుణ భావాన్ని తెలిపే పద అక్షరం
ప్రతి నామమునకు ముందు శ్రీ/శ్రీమతి అని ఉపయోగించుటలో జ్ఞానార్థమే
మనిషి ఓ స్థాయికి చేరుకున్న తర్వాత ఉన్నతమైన గౌరవార్థాన్ని తెలుపుతుంది

బ్రంహర్షి విజ్ఞానం ఆనాటి పత్రాలలోనే

బ్రంహర్షి విజ్ఞానం ఆనాటి పత్రాలలోనే ఇమిడి యున్నది
భావ తత్వాలను జీర్ణించుకునే విశ్వ భావాలు ఎవరికి లేవు
విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించే వారికి కాస్త బ్రంహర్షి జ్ఞానం కలుగును
ఎందరో అన్వేషిస్తేనే కొందరికి బ్రంహర్షి విజ్ఞానం లభించగలదు

జీవ కణం లోనే పాప కర్మ దోషాలు

జీవ కణం లోనే పాప కర్మ దోషాలు దాగి ఉన్నాయేమో
ఎదిగే రూపంలో ఎన్నో లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి
అజ్ఞాన విజ్ఞాన ప్రవర్తనల సమస్యలు మనం చూస్తున్నవే
గ్రహాల స్థితులు కాల ప్రభావాలు జీవించుటలో తెలుస్తున్నాయి

జీవ సృష్టికి అవయవాలవలే యంత్రానికి

జీవ సృష్టికి అవయవాల వలే యంత్రానికి వివిధ వస్తువులను అమర్చుతున్నారు
మనము జీవించడానికి అర్థమయ్యే భాష అలాగే ఆహారం శక్తి పనిచేసే విధానం ఎలాగో
యంత్రానికి మర భాష వచ్చేలా స్పర్శను కలిగిస్తూ తగిన రీతిలో పని చేయించుకుంటున్నాము
ప్రతి యంత్రము ఓ విధమైన మర జీవిగా నిర్జీవమువలే పని చేస్తూ సహాయపడుతుంది
నేటి సాంకేతిక విజ్ఞానము ద్వారా ఎన్నో యంత్రాలు ఎన్నో రకాలుగా జీవులవలే పని చేస్తున్నాయి

పద్మామృత తత్వము కలవారికే పద్మశ్రీ

పద్మామృత తత్వము కలవారికే పద్మశ్రీ పద్మభూషణ పద్మవిభూషణ
పద్మ త్రిభూషణ కూడా మహా పద్మామృత తత్వము కలవారికే కదా
పద్మ భావాలు కలవారు సమాజ శ్రేయస్సును కోరే విధంగా ఉంటారు
శ్రమించే గుణం సేవా భావం విజ్ఞాన తత్వం కలవారే పద్మానుభావులు

నక్షత్రము ప్రకాశిస్తున్నా నీ మేధస్సులో

నక్షత్రము ప్రకాశిస్తున్నా నీ మేధస్సులో విశ్వ విజ్ఞానము కలుగుటలేదు
సూర్యుడు ఉదయిస్తున్నా నీ మేధస్సులో దివ్యమైన ఆలోచన లేదు
చంద్రుడు తగ్గిపోతున్నా నీ మేధస్సులో అజ్ఞానము వదిలిపోవుట లేదు
ఆకాశం నిర్మలమవుతున్నా నీ మేధస్సులో స్వచ్ఛమైన భావాలు లేవు

హిమము కరగని ఆలయమే

హిమము కరగని ఆలయమే హిమాలయ పర్వతం
ఓ మహాశయా తత్వంతో నిలిచిన దివ్య స్థితి క్షేత్రం

మేధస్సులో లేని విజ్ఞానం ఎందుకు

మేధస్సులో లేని విజ్ఞానం ఎందుకు మళ్ళీ మేధస్సులో చేర్చుకునేందుకే

ఆలోచనలో ఉన్న శక్తి కార్యంలో లేకపోతే

ఆలోచనలో ఉన్న శక్తి కార్యంలో లేకపోతే నీ విశ్వ లక్ష్యం నెరవేరదు
కాలం ఎప్పుడూ శక్తిని నశింపజేస్తూ ఆకలి నిద్రను కలిగిస్తుంటుంది

అణువులకే ఆత్మ బంధం రూపాలకే

అణువులకే ఆత్మ బంధం రూపాలకే ఆత్మ సిద్ధాంతం
మానవులకే ఆత్మ జ్ఞానం మహాత్ములకే విశ్వ విజ్ఞానం

మీ మేధస్సులో జ్ఞాన నాడులకు విశ్వ

మీ మేధస్సులో జ్ఞాన నాడులకు విశ్వ విజ్ఞాన ఆలోచనలు కలుగుతున్నాయి
ఏనాడైనా మీ మహా మేధస్సు ఏ ఆలోచన భావాన్నైనా గమనిస్తూ గ్రహించిందా

మరో విశ్వ విజ్ఞానంతో మరో ప్రపంచ

మరో విశ్వ విజ్ఞానంతో మరో ప్రపంచ జీవితాన్ని తెలుసుకో
మరో లోకానికి విజ్ఞాన మహర్షివై మరెన్నో యుగాలు సాగిపో
మరెన్నో లోకాలకు వెళ్ళుతూ మహాత్ములను పరిచయం చేసుకో
లోకాలకే విశ్వ విజ్ఞానిగా నిలిచిపోవాలనే నా ఆధ్యాత్మ భావం

కరుణాకరా కరుణించరా కరుణ లేక

కరుణాకరా కరుణించరా కరుణ లేక కన్నీరు కారిపోతున్నాయి
దయాకరా దయ చూపరా దయ లేక దేహమే దహనమవుతున్నది
మహాత్మా మన్నించవా మనస్సు లేక మేధస్సే మతి లేక మర్మమైనది
విశ్వేశరా వరమియ్యవా వినయం లేక విధి వెంటాడుతున్నది

విశ్వ స్థితి లేకుండా మర్మ స్థితి

విశ్వ స్థితి లేకుండా మర్మ స్థితి నీ ఆత్మలో చేరదు మహాశయా
ఆత్మ స్థితి నీలో ఉన్నా విశ్వ స్థితికి అఖండ ధ్యానమే అవసరం
మేధస్సులో విశ్వమే జీవించేలా నీ శ్వాసనే గమనించు మహాత్మా
మరో స్థితి మహా స్థితి ఏదైనా ఆత్మ స్థితిలో కలిగే కాల ప్రభావాలే
విశ్వ స్థితి చాలురా మోక్షానికి మర్మ స్థితి అవసరం లేదు లేరా

ఆధ్యాత్మ మేధస్సుతో జీవించరా కోట్ల

ఆధ్యాత్మ మేధస్సుతో జీవించరా కోట్ల యుగాలుగా జన్మించే మహాత్మా

కలియుగాంతమున నీ దేహంలో

కలియుగాంతమున నీ దేహంలో ప్రళయాలు సంభవిస్తే నీలో అలజడి కలగదా
ప్రళయంలో మహా సకల జీవరాసులు మరణించుటలో నీలో ఉద్రేకం కలగదా

మనిషి ఎన్నో యుగాలుగా జీవిస్తేనే

మనిషి ఎన్నో యుగాలుగా జీవిస్తేనే తప్ప ఓ గొప్ప మహాలోచన కలగదు
విజ్ఞాన అన్వేషణ ఎన్నో యుగాలుగా సాగిస్తేనే మహా ఆలోచన కలుగును
ఎక్కడ ఏ సంవత్సరం మరచిపోయినా అన్వేషణ ఆగినా ఆ భావన సాగదు
భావాలతోనే యుగాలుగా అన్వేషణ సాగితే నేడు ఓ మహా గొప్ప ఆలోచన నీలో
అన్వేషించరా ఓ మానవా మహాదేవా మహాత్మగా ఆత్మగా నీకే మహాలోచన
ఎవరికి ఏ ప్రాప్తమో ఏ దివ్య క్షణం ఏ మేధస్సుకో విశ్వ స్థితి జీవించరా
నీలో కలిగే అనంతమైన ఆలోచనలలోనే మహా దివ్య గొప్ప ఆలోచన ఉన్నదిరా
మహాలోచనతో నీవు మరో లోకాలనే పాలిస్తూ భావనగా విశ్వ రూపమై నిలిచెదవు

మరణించే శరీరం జన్మించే ఆత్మ నీకు

మరణించే శరీరం జన్మించే ఆత్మ నీకు జీవమై జీవించుటలో నీకు తెలిసినదేమి
యుగాలుగా నీతో వచ్చే శరీరాలెన్నో ఆత్మ ధరించే శరీర రూపాలెన్నో తెలుసుకో
మరణిస్తావని తెలుసు జన్మించావని తెలుసు జీవితమే ఎందుకో తెలుసుకోవు
మానవుడిగా నీకు తెలియకపోయినా మహాత్మగా నీ ఆత్మకు ఎన్నో తెలుసు
నీ ఆత్మయే పరమాత్మగా విశ్వాన్ని సృష్టించి ఎన్నో రూపాలను నిర్మించినది
నీ ఆత్మ ఓ శరీరాన్ని ధరిస్తే నీకు ఏ విషయాలు తెలియకుండా పోతాయి
విశ్వమున ఏమి జరిగినా ఎవరి మేధస్సులో ఏమున్నా నీకు తెలియవులే
శరీరం ఓ అజ్ఞాన మర్మ కవచముగా నీ ఆత్మకు మరుపు గలిగిస్తుంది
అందుకే మానవ జీవిగా మేధస్సు విజ్ఞానంతో ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకో
ఆత్మ జ్ఞానంతో విశ్వ విజ్ఞానిగా నీకు అన్ని విషయాలు తెలుస్తూ వస్తాయి

ఆనాటి మహాత్ములకు మహర్షులకు

ఆనాటి మహాత్ములకు మహర్షులకు యోగులకు ఋషులకు
మర్మ స్థాన విశ్వ స్థితుల ఆత్మ భావాలు ఇంకా తెలియవేమో
యుగాలుగా అన్వేషిస్తూనే హిమాలయ శిఖరాలలో ధ్యానిస్తున్నారే
మర్మ విచక్షణ భావాల విశ్వ స్థితి కణాలు మేధస్సులో నిద్రిస్తూనే
విశ్వ స్థితి కణాలను మేల్కొలిపే మర్మ కాంతి మేధస్సులో ఉదయించాలి
అన్నింటికీ ఆత్మ నిమగ్నమై సహకరించే దీక్ష భావాల మేధస్సు ఉండాలి
యోగులు యుగాలుగా జీవిస్తున్నా వశంకాని విశ్వ స్థితి ఎంతటి శక్తియో
మర్మాన్ని జయించే విశ్వ విజ్ఞానం విశ్వ స్థితిలోనే రహస్యమై ఉన్నదే
మహా శివుని మేధస్సులో త్రినేత్ర భావనతో మర్మముగా రక్షణతో ఉన్నది

మేధస్సులో ఆలోచనలను

మేధస్సులో ఆలోచనలను ప్రయానింపజేస్తే భావనగా అన్ని విషయాలు తెలుస్తాయి

నేను విశ్వ రూపాన్నైతే ప్రతి దేశ

నేను విశ్వ రూపాన్నైతే ప్రతి దేశ ప్రదేశాలలో ప్రతి అణువుకు ఆకాశంగా కనిపిస్తానులే
ప్రతి అణువులో నా విశ్వ రూపం దాగివుంటే ప్రతి ప్రదేశంలో ప్రతి జీవిలో నేను ఉన్నట్లే
అణువులలో నా భావ స్వభావ తత్వాలు ఉన్నట్లయితే విశ్వ రూపాలలోనే నేను ఉంటా
అణువుగా జీవించుటలో నా నేత్రమున విశ్వమంతా ఉన్నట్లయితే నేను విశ్వ రూపాన్నే

చిన్న చిన్న రహదారుల నడి మధ్యలో

చిన్న చిన్న రహదారుల నడి మధ్యలో మురికి కాలువలను నిర్మించుట సరైనదా
వాహనాల బరువులను మోసే శక్తి రహదారికి కాలువల నిర్మాణానికి ఉంటుందా
కాలువలు నిండిపోతే కలుషితమైన మురికి నీరు రహదారులపై పారుతున్నాయి
నడవడానికి కూడా వీలుకాక పిల్లల చక్కని వస్త్రాలు మురికిగా మారుతున్నాయి
పాద రక్షములు మురుకిగా మారి పాటశాలలకు పరిశ్రమలకు అశుభ్రతతోనే
ఎక్కడ ఏవి అవసరమో తగిన కార్య క్రమ నిర్దిష్ట ప్రణాళికలను తయారు చేయండి
విశ్వ విజ్ఞానంతో ఆలోచిస్తూ దేశాన్ని పరి శుభ్రతగా దివ్యత్వంతో మార్చండి

నా మేధస్సులో కలిగే ఆలోచనలు నాలో

నా మేధస్సులో కలిగే ఆలోచనలు నాలో ఉండవు విశ్వాన్ని అన్వేషిస్తూ వెళ్ళిపోతాయి
విశ్వంలో ఎక్కడ ఏ ఆలోచనకు సమాధానం కలుగుతుందో అక్కడికి చేరి పోతాయి
ఏ విశ్వపు అంచుల దాకైనా యుగాలుగా భవిష్య గత కాలానికి వెల్లిపోతుంటాయి
హిమాలయాలు సప్త సముద్రాలు ఎడారులు గుహలు శికరాలను దాటి పోతుంటాయి
ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క అణువును చేరేలా నా భావాలు అన్వేషిస్తూనే ఉంటాయి

స్వచ్ఛమైన తెలుగు పదార్థాలనే

స్వచ్ఛమైన తెలుగు పదార్థాలనే పదాలుగా వాడండి

మహాత్ముల విశ్వ కార్యాలను నాకు

మహాత్ముల విశ్వ కార్యాలను నాకు అప్పగిస్తే నా ఆలోచనలు ఎలా సాగుతాయి

మనస్సులో మరుపు ఉన్నట్లు

మనస్సులో మరుపు ఉన్నట్లు ఆలోచనలలో విజ్ఞానం ఉండదు
ఆలోచనలలో ఎరుక ఉండి ఆశాస్పదం లేనప్పుడు విజ్ఞానం ఉంటుంది
మేధస్సులో ఎన్నో ఆలోచనలు ఎన్నో భావార్థాలతో కలుగుతుంటాయి
ఏ ఆలోచన ఏ విజ్ఞాన అర్థాన్ని తెలుపుతుందో ఏ అజ్ఞానాన్ని కలిగిస్తుందో
ఆలోచనలు ఎక్కువైనప్పుడు ఏకాగ్రత లేనప్పుడు ఎరుక లేక పోతుంది
అలాగే ఆలోచనలలో విజ్ఞానం మరుపుగా మనస్సు ఆశతో అన్వేషిస్తుంది
ఆశతో కార్యాలను సాగిస్తూ పొతే అష్ట కష్టాల నష్టాలే ఎదురవుతాయి
మనస్సును ఎప్పుడు విజ్ఞాన మేధస్సుతో ఆలోచనల ఎరుకతో కేంద్రీకరించాలి

ప్రతి జీవికి జీవించాలనే ఆశే గాని మరో

ప్రతి జీవికి జీవించాలనే ఆశే గాని మరో గొప్ప ఆశ ఉండదు

Tuesday, January 25, 2011

ప్రపంచాన్ని ఓ పద్ధతిగా మార్చాలన్న

ప్రపంచాన్ని ఓ పద్ధతిగా మార్చాలన్న భావన నాలో కలుగుతూనే ఉన్నది
నాలో ఉన్న ప్రణాళికలు ఓ కార్య క్రమ కారణ పద్ధతిలో ఉన్నాయనే నాకు
ఖర్చు ఎంతైనా ఎన్నో యుగాలకు సరైన నిర్దిష్ట ప్రణాళిక ఉంటుందనే నేను
అందరు సుఖంగా జీవిస్తూ విజ్ఞాన భావాలతో శ్రమిస్తూ ఉంటారు
నా ప్రణాళికలో కొంత కాలం తర్వాత ధనం చలామణిలో ఉండదు
ధనం ప్రభుతానికే సంబంధితమై విదేశాల రాకపోకలకు ఎగుమతి దిగుమతులకే
నా ప్రణాళిక ఎవరికైనా వివరణగా కావాలంటే వివరించగలను
సమాజాన్ని మార్చాలన్నా దేశాన్ని ప్రగతి వైపు తీసుకురావాలన్నా ఇదే సరి
ప్రపంచంలో మన దేశమే మొదటి విజ్ఞాన జీవిత ప్రణాళికగా సాగాలని నా భావన
నా ప్రణాళిక సరైనదైతే ప్రపంచమంతా ఇలాగే కావాలని ఇలాగే ఉండాలని
ఇదే సరైన జీవిత విధానమని దీనినే కోరుకుంటారు ఆశ్రయిస్తారు సాధిస్తారు
ఆలస్యమయ్యే కొద్ది మార్పు రావడం ఇంకా ఆలస్యం కష్టంగా మారుతుంది
మనిషిలో మార్పు కలిగి సత్ ప్రవర్తన కలగడానికి ఇదే చాల అవకాశం

విశ్వం నుండి మహర్షులు పంపుతున్న

విశ్వం నుండి మహర్షులు పంపుతున్న సందేశాలు నాకు తెలుస్తున్నాయేమో
నా భావాలు విశ్వ సందేశాలను గ్రహించే విధంగా అన్వేషిస్తూనే ఉంటాయి

ఆత్మ భావాలలోనే అతి విజ్ఞానం

ఆత్మ భావాలలోనే అతి విజ్ఞానం ఉన్నందున మేధస్సులో మితి మీరిన అజ్ఞానం
ఎక్కడ ఏ పని ఎలా చేయాలో విచక్షణ లేక సోమరిగా ఎక్కడంటే అక్కడ అశుభ్రతగా
ఒకరికి తెలిపే విధంగా ఆలోచించక మరొకరికి చీడ పురుగులా తయారవుతున్నావు
వాహానాలలో ఉమ్మేయడం చేతులు కడగడం దురలవాట్ల మందులను వేసుకోవడం
తినుబండరాల చెత్తను వేయడం దుర్వాసనలను కలిగించడం అశుభ్రతగా మార్చడం
ఇంకొకరికి వాంతులు కలగడం ప్రక్కవారికి అనారోగ్యాన్ని అంటు వ్యాదులను కలిగించడం
ఇదేనా మానవ శుభ్రత విచక్షణ తత్వ పరిపూర్ణ విజ్ఞానం పవిత్ర జీవిత విధానం
ఇలాంటి వారు విశ్వ విజ్ఞానాన్ని ఎన్ని జన్మలకైనా తెలుసుకునే అవకాశమే లేదు
వేటిని అరికట్టలేమా జీవిత విధానాన్ని ఇష్ట పూర్వకంగా జీవించేలా చేసుకోలేమా
ఇబ్బందిగానే జీవిస్తూ అశుభ్రతతో సాగుతూ సమాజంలో అనారోగ్య జీవిత ప్రయాణమా
ఒక కార్యాన్ని మంచిగా ఆలోచించలేక సమాజ పరిస్థితుల దుస్థితినే ఆలోచిస్తున్నాం
మనిషి ప్రగతికి లోటుపాట్లు సమాజపు అశుభ్రత సమస్యలే ఎక్కువ కారణం
ఏకాగ్రత కలగని ప్రాంతం ప్రదేశం జీవించేందుకు విజ్ఞాన ఆలోచనలను కలిగించలేవు
ఇంకా ఎలా చెబితే అర్థమవుతుందో మీరే నిర్ణయించుకోండి ఆలోచించుకోండి
నాలో మహా ప్రణాళికలు చాలా ఉన్నాయి చర్చించేందుకే ఎదురుచూస్తున్నాను

యదార్థంగా ఉన్న రూపాల ఆకారాలను

యదార్థంగా ఉన్న రూపాల ఆకారాలను చిన్నవిగా లేదా పెద్దవిగా
చూపే యంత్రములు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఉన్నాయి
ఇంకా ఎన్నో విధాల సూక్ష్మ యంత్రాలు వస్తూనే ఉంటాయి
అరచేతి యంత్రాలు దూర దర్శనములు చిత్ర తెరలు గా ఎన్నో వస్తూనే ఉన్నాయి
భావాల ఆలోచనలతో పరికరాల స్పర్శా విజ్ఞానంతో యంత్ర భాషతోనే ఎన్నెన్నో
ఎన్నో విధాల మనిషి ఆలోచనలు సూక్ష్మంగా రోజు రోజుకు పెరుగుతున్నాయి
నేటి సూక్ష్మ విజ్ఞానం మాయా చిత్ర విజ్ఞానంగా తక్షణ సమాచారాలను అందిస్తున్నాయి
కృషి ఒకరిది ఫలితం ఒకరిది ఆలోచనలు ఒకరివి విజ్ఞానం మరొకరిది ఖర్చు ఇంకొకరిది
వస్తువులు ఒకరివి ప్రయోగం ఇంకొకరివి అవకాశం ఒకరిది సదుపాయాలు మరొకరివి
తయారు చేయడం ఒకరు అమ్మడం కొనుక్కోవడం అనుభవించడం మరొకరు ఎందరో
ఎన్నో రకాలుగా ఎన్నో విధాల ప్రపంచమంతా సాంకేతిక విజ్ఞానంతో సాగుతున్నది
అన్ని రంగాలలో ఎన్నో అనుభవ విజ్ఞాన అద్భుతాలు సాగిపోతూనే ఉన్నాయి

నీవేమి మాట్లాడుతున్నావో

నీవేమి మాట్లాడుతున్నావో నీ మేధస్సుకైనా అర్థమవుతున్నదా
నీ ఆవేదనల ప్రవర్తన రీతి చాతుర్యములను విజ్ఞానంగా మార్చుకో
సమాజానికి నీ వివేక గుణ తత్వాల మహా విజ్ఞానాన్ని అందించు
మరో మనిషికి సమాజ విచక్షణతో పదార్థ మాట తీరును కలిగించు
పదార్థము తెలిస్తే పదాల వాడుక ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలియును
పదార్థము తెలియక వివిధ భాషల ప్రాముఖ్యతలు తెలియకుండాపోతున్నాయి
మన భాషలో అన్నింటికీ పదాలు ఉన్నాయనే దాని కన్నా
అన్నీ పదాలను గుణార్థాన్ని ఇచ్చే విధంగా వాడుకోవాలనే విచక్షణ ఉండాలి
అందరికి అర్థమయ్యేలా భాషా ప్రావీణ్యాన్ని అభివృద్ధి చేసుకో
తెలుగు భాషలో తెలుగు తల్లి ఉందనే భావనతో పదాలను పలుకు పలికించు

దేశం నీదే ధైర్యం నీదే పవిత్రమైన పతాకం

దేశం నీదే ధైర్యం నీదే పవిత్రమైన పతాకం నీదే పౌరుడా
మూడు రంగులే కర్త కర్మ క్రియలతో దేశాన్ని నడిపించేను
కాల చక్రమే త్రి వర్ణాలతో సాగుతూ దేశ ప్రగతిని చాటేను
దేశాలలోనే మన దేశాన్ని మహా దేశంగా పలుకుతున్నారు
భారతీయుల భారతమే మహా భారత చరిత్రం మన దేశంలో
మన దేశాన్నే ప్రగతికి ఆదర్శంగా తీసుకో నీ ఉన్నత స్థాయికి
భారత భూమిగా మన దేశమే ప్రపంచమంతా సాగిపోయినది
దేశం నీదే ధైర్యం నీదే పవిత్రమైన పతాకం నీదే పౌరుడా

నా ఆలోచనలు నిన్ను తట్టేస్తున్నాయి

నా ఆలోచనలు నిన్ను తట్టేస్తున్నాయి విజ్ఞానాన్ని అన్వేషించమని
కాలం వృధా ఐతే కాల జ్ఞానమే మారుతూ జీవితాలే మారిపోవును
ఎవరికి ఎప్పుడు ఏ కాల జ్ఞానం కావలెనో మనం నిర్ణయించుకోలేమా
మేధస్సుకు మరుపు రాకముందే నీ ఆలోచనలు అన్వేషించాలి
విశ్వ విజ్ఞానం ఎవరికి లభిస్తుందో ఎలాంటి భావాలు తెలుస్తాయో
విశ్వ స్థితి కోసమే మానవులంతా యుగాలుగా జన్మిస్తూనే ఉన్నారు

మనిషికి తెలియని స్థితియే విశ్వ స్థితిరా

మనిషికి తెలియని స్థితియే విశ్వ స్థితిరా
యోగులు కూడా ఆత్మ తత్వంతో అన్వేషిస్తున్నారురా
యుగాలు గడిచినా లభించనిదే విశ్వ స్థితి యోగత్వమురా
విశ్వ స్థితిని పొందగలిగితే అమృతమైనా అవసరం లేదురా
మానవ జన్మకే విశ్వ స్థితిని పొందగలిగే అవకాశమురా
మర్మము నుండి విశ్వ స్థితి వరకే ఏ విజ్ఞానమైనా
నీకు విశ్వ స్థితి భావన కలగాలంటే ధ్యానించరా

నీ మేధస్సుకు విశ్వ కార్యాలన్నీ తెలుసు

నీ మేధస్సుకు విశ్వ కార్యాలన్నీ తెలుసు ఇక విశ్వ స్థితిని గమనించవా
సూక్ష్మ విజ్ఞాన భావాల యోగత్వం తెలిస్తే నీ మేధస్సులోనే అనంత విశ్వం
విశ్వపు స్థితులలో లేని భావాలు ఎక్కడ లేవని నీ ఆత్మకు తెలుసులే
నీలో మర్మముగా నీ మేధస్సుకు ఎరుక లేక విశ్వ ధ్యాసను మరిచావు
ధ్యానము చేయగా శ్వాసే తెలుపును విశ్వ కార్యాల స్థితి తత్వములెన్నో
తత్వముతో జీవించుట కన్నా గొప్పదైనది ఏదీ లేదని అమృత భావనయే

విశ్వ స్థితి నిన్ను విడిపోతున్నది

విశ్వ స్థితి నిన్ను విడిపోతున్నది ఆత్మ స్థితి నిన్ను వదిలేస్తున్నది
మహర్షుల యోగ తత్వాలు నిన్ను దూరం చేస్తూ వెళ్ళిపోతున్నాయి
విశ్వ విజ్ఞాన విచక్షణ భావాలు శూన్యమై మర్మాన్ని చేరుతున్నాయి
నీ శరీరము కూడా నశిస్తూ పంచ భూతాలతో కలిసి పోతున్నాయి
నీలో విశ్వ ధ్యాస పర ధ్యాసగా మారుతూ అన్నీ వెళ్ళిపోతున్నాయి
ఎరుకతో జీవిస్తేనే అన్ని స్థితులు నీలో నిమగ్నమై నిలిచి ఉంటాయి

మనస్సు మేధస్సు ఆత్మను ఏకం చేస్తే

మనస్సు మేధస్సు ఆత్మను ఏకం చేస్తే విశ్వ స్థితి నీలో చేరును

వయస్సుతో కలిగే విచక్షణ భావాలే

వయస్సుతో కలిగే విచక్షణ భావాలే విజ్ఞానము
కాల భావాలు ఎలా ఉన్నా వయస్సే గమనార్థాన్ని ఇచ్చును
వయస్సుతో పాటే మనస్సు మారుతూ విచక్షణ భావాలు మారేను
వయస్సు మనస్సుతో కాల ప్రభావాల సమాజ జ్ఞానమే ఎదుగుదల
వయస్సుతోనే విచక్షణలో చాలా మార్పు కలుగుతుందని నా భావన

బంధాలు విడిపోతున్నందుకే లక్ష్యాలు

బంధాలు విడిపోతున్నందుకే లక్ష్యాలు నెరవేరకపోతున్నాయి

Monday, January 24, 2011

విశ్వమున అఖండ మైన విజ్ఞాన జ్యోతి

విశ్వమున అఖండ మైన విజ్ఞాన జ్యోతి దివ్య కాంతులతో వెలుగుతున్నది
మహర్షులలో నేను ఓ మహాత్మగా విజ్ఞాన కాంతిని దర్శించాలనుకున్నాను

నా జీవితానికి ఆఖరి రోజున

నా జీవితానికి ఆఖరి రోజున ఏ భావనతో ఎలా మరణిస్తానో

ప్రతి రోజు ప్రతి క్షణం ప్రపంచాన్ని

ప్రతి రోజు ప్రతి క్షణం ప్రపంచాన్ని విశ్వ విజ్ఞానంగా మార్చాలనే ఆలోచన

కర్మను అనుభవించేందుకు ఎదురు

కర్మను అనుభవించేందుకు ఎదురు చూసేవారు ఆత్మ స్థితిని గ్రహించండి
ఆత్మ స్థితిలో ఎలాంటివైనా అనుభవించే శక్తి కలుగుతుందని నా భావన
విశ్వ భావ స్వభావాలతో ఆత్మకు చాలా ఓపిక శక్తి సామర్థ్యం కలుగుతుంది
విశ్వ స్థితితో జీవిస్తే ఇంకా త్వరగా సామర్థ్యంతో కర్మను నశింపజేసుకోవచ్చు

ఎలాంటి మహాత్ములు నన్ను విశ్వానికి

ఎలాంటి మహాత్ములు నన్ను విశ్వానికి పిలుస్తున్నారు
ఏ విశ్వ కార్యాలకై ఏ విజ్ఞానానికై నన్ను పిలుస్తున్నారు
విశ్వ స్థితుల అన్వేషణ మరో లోకంలో సాగించేందుకా
ఆత్మ జ్ఞాన దివ్యత్వాన్ని మహర్షులకు అందించేందుకా

వయసుతో పాటు శక్తి తగ్గిపోతే ఎత్తు

వయసుతో పాటు శక్తి తగ్గిపోతే ఎత్తు కూడా కాస్త తగ్గిపోతుంది
మన అవయవాల బరువుకు అస్థికలు వంగిపోయి ఎత్తును తగ్గిస్తాయి
అస్థికలు వంగిపోతే కాస్త ముసలితనంతో అనారోగ్యం కలుగుతుంది
మరణించే వరకు శక్తి వంతంగా ఉండేందు తగిన ఆహారాన్ని తీసుకోండి

ఆలోచన కలుగుతున్నందుకే నీకు

ఆలోచన కలుగుతున్నందుకే నీకు కార్యంపై ధ్యాస
ఆలోచన కలగకపోతే ఎదుటి దానిపై ధ్యాస వెళ్ళిపోతుంది
మనలో మనం ఆలోచిస్తే మరో ధ్యాసతో అన్వేషణ సాగుతుంది
మన కార్యాలోచనలు ఎలా ఉంటే అలా మన ధ్యాస వెళ్ళుతుంది

విశ్వ ఎక్కడో జీవించే మహర్షులు నాకు

విశ్వ ఎక్కడో జీవించే మహర్షులు నాకు భావనాలోచనలను కలిగిస్తున్నారు
నా మేధస్సులో మహాత్ముల భావాలోచనలను గ్రహించే సూక్ష్మ జ్ఞానం ఉన్నది

నీకు మహాత్ములు అవసరమైతే నీతో

నీకు మహాత్ములు అవసరమైతే నీతో జీవించేందుకు వస్తారు
నీకు విజ్ఞానం కలిగించేందుకైనా శక్తిని ఇవ్వడానికైనా వస్తారు
నీవు చేసే మహా విశ్వ కార్యాలకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు
నీవు నిలకడగా ఉంటే విశ్వ కార్యాలు ఎలాగైనా సాగిపోతాయి

భావాలతో ఆలోచిస్తుంటే వేచిన

భావాలతో ఆలోచిస్తుంటే వేచిన భార సమయం తెలియకుండా పోతుంది
భావాలలో ఆత్మ స్థితి భారాన్ని తేలిక చేసే గుణ తత్వాన్ని కలిగిస్తుంది

విశ్వంలో వయో వృద్దులు ఇంకా బరువు

విశ్వంలో వయో వృద్దులు ఇంకా బరువు మోస్తూ శ్రమిస్తూనే జీవిస్తున్నారు
జీవిత కాల ప్రయాణం మరణించేవరకు శ్రమించడమేనని విశ్వ సిద్ధాంతము

ఆత్మ స్థితిలో విశ్వ స్థితి చేరితే మహా

ఆత్మ స్థితిలో విశ్వ స్థితి చేరితే మహా చైతన్యమే

ఆత్మ స్థితిలో కర్మ శూన్యం కాకపోతే

ఆత్మ స్థితిలో కర్మ శూన్యం కాకపోతే విశ్వ స్థితితో జీవించు
ఆత్మను విశ్వ స్థితిలో ధ్యానింపజేస్తూ నిరంతరం జీవించడం

ఆత్మ స్థితి కన్నా గొప్ప స్థితి విశ్వ

ఆత్మ స్థితి కన్నా గొప్ప స్థితి విశ్వ స్థితియే
విశ్వ స్థితి మహా ఆధ్యాత్మ యోగత్వ స్వభావం
ఆధ్యాత్మ భావన ఉన్నా విశ్వ స్థితి లేదంటే ఇంకా ఆత్మ స్థితిలోనే
ఆత్మ స్థితి నుండి విశ్వ స్థితికి వెళ్ళితే మహా దివ్య విశ్వ తత్వమే

విశ్వ స్థితితో జీవిస్తున్నందుకే నీలో

విశ్వ స్థితితో జీవిస్తున్నందుకే నీలో ఆకలి భావన లేదు
నీలో ఉన్న ఆత్మ విశ్వ గమన ధ్యాసతో జీవిస్తున్నది
ప్రతి అణువు ప్రతి జీవి నీ శ్వాసలో విశ్వ స్థితితో జీవిస్తున్నది
శ్వాసపై ధ్యాస నిరంతరం ఉంటే విశ్వ స్థితి భావన నీలోనే

నీ ఆత్మలో మహాత్మను స్వీకరించు

నీ ఆత్మలో మహాత్మను స్వీకరించు విశ్వ విజ్ఞానాన్ని తెలుపగలడు

నీ విశ్వ విజ్ఞాన భావాలను ఎందరికో

నీ విశ్వ విజ్ఞాన భావాలను ఎందరికో తెలుపు
అవి పుస్తక రూపాలలో మరెందరికో అందుతాయి

విశ్వమే ఇరుకుగా ఉందంటే జీవితం

విశ్వమే ఇరుకుగా ఉందంటే జీవితం ఎంత ఇరుకుగా ఉంటుందో

మహాత్ములతో కలిసి విశ్వ విజ్ఞానంగా

మహాత్ములతో కలిసి విశ్వ విజ్ఞానంగా జీవించు మహర్షిగా ఎదుగుతావు

యుగాలుగా నిద్రిస్తున్న ఆత్మ ఎప్పుడు

యుగాలుగా నిద్రిస్తున్న ఆత్మ ఎప్పుడు ఏ ఆలోచనతో మేల్కొంటుందో

విశ్వ తేజ గుణ స్వభావాన్ని కలిగివున్న

విశ్వ తేజ గుణ స్వభావాన్ని కలిగివున్న చంద్ర కాంతి బింభమా

ఏ మహాత్ములు నీకు తోడు లేకున్నా

ఏ మహాత్ములు నీకు తోడు లేకున్నా విశ్వ కార్యాన్ని గుణాత్మకంగా సాగించు

కాలం వెళ్ళిపోయే కొద్ది రూపం

కాలం వెళ్ళిపోయే కొద్ది రూపం మారుతున్నా ఆధ్యాత్మ భావాలతో జీవించు

ప్రతి జీవికి మహర్షుల విశ్వ విజ్ఞాన

ప్రతి జీవికి మహర్షుల విశ్వ విజ్ఞాన భావాలు అవసరమే

ప్రతి రోజు ఓ మనిషికి నీవేమి

ప్రతి రోజు ఓ మనిషికి నీవేమి కల్పిస్తున్నావు అలాగే ఓ జీవికి నీవేమి కల్పిస్తున్నావు

నీవు ప్రతి రోజు చదువుతున్నప్పుడు

నీవు ప్రతి రోజు చదువుతున్నప్పుడు నీలో విజ్ఞాన కొరత ఉన్నట్లు అనిపిస్తుంది
నీవు చదువుతున్నది అర్థమవుతున్నప్పుడు అంతా తెలుస్తున్నదని తోస్తుంది
విజ్ఞానం ఉందని అలా సాగుతున్నప్పుడు ఓ సారి తప్పు ఎలాగో జరుగుతుంది
మళ్ళీ చేసిన తప్పును చూసుకుంటే నీలో మళ్ళీ విజ్ఞాన కొరత ఉన్నట్లే భావన
నీవు ప్రతి కార్యాన్ని ఎరుకతో కార్య క్రమ కారణంతో సాగించాలనే పరమార్థం

నీవు చేసే ప్రతి కార్యం కాలానికి

నీవు చేసే ప్రతి కార్యం కాలానికి అవసరమో
నీ జీవిత అనుభవానికి అవసరమో తెలుసుకో
కాలానికి అవసరం ఎలా ఉన్నా లేకున్నా
నీవు ప్రతి కార్యాన్ని విజ్ఞానంగా గ్రహిస్తుండాలి
కార్య విజ్ఞాన గమనార్థమే కారణాన్ని తెలుపును
కారణంతో విజ్ఞానంగా సాగితే జీవితం మహా అనుభవమే

నిర్మలమైన ప్రకృతిలో నేను ఓ అణువునే

నిర్మలమైన ప్రకృతిలో నేను ఓ అణువునే
నాలోనూ భావ స్వభావాలు ఎన్నో ఉన్నాయి
నాలోనూ ప్రకృతి తత్వాలు విశ్వ స్థితులు ఉన్నాయి
నేను ఓ విశ్వ రూపాన్నే నాలో ఎన్నో గుణాలున్నాయి
నేనూ కాలంతో సాగే మహా విజ్ఞాన ప్రకృతి జీవిని

కాలం కలిగించే భావాలలో అజ్ఞానం

కాలం కలిగించే భావాలలో అజ్ఞానం ఉన్నా విజ్ఞానంగా సాగిపో
మహాత్ముల భావాలతో ఆత్మ యోగ స్థితి తత్వాలతో సాగిపో

నీ మేధస్సుపై విశ్వ విజ్ఞానాన్ని

నీ మేధస్సుపై విశ్వ విజ్ఞానాన్ని సువర్ణాలతో లిఖించాలని
సప్త మహర్షులు అష్ట దిక్పాలకులు ఎదురు చూస్తున్నారు

ఏ విజ్ఞాన విశ్వ కార్యమైనా మహాత్ముల

ఏ విజ్ఞాన విశ్వ కార్యమైనా మహాత్ముల శక్తితోనే సాగుతుంది

నీవు ఎక్కడున్నా నీ ఆత్మకు

నీవు ఎక్కడున్నా నీ ఆత్మకు మరో మహాత్మ తోడుగా ఉంటాడు
నీవు చేసే విజ్ఞాన కార్యాలకు సహాయంగా శక్తిని అందిస్తాడు

నీ ఆత్మకు మరో మహాత్మ తెలిపే

నీ ఆత్మకు మరో మహాత్మ తెలిపే భావనను గుర్తించగలవా
ఒక భావనైతే తెలియకపోయినా గ్రహించకపోయినా అర్థం కాకున్నా సరే
అనంత భావాలను గ్రహించలేకపోతే తెలుసుకోలేకపోతే పరమార్థం తెలియదే
పరమార్థం తెలియకపోతే జీవితార్థం ఎంతటి గొప్పదో మానవ విజ్ఞానానికి లోపమే

అంతా అణువులలోనే ఎన్నో రకాల ఎన్నో

అంతా అణువులలోనే ఎన్నో రకాల ఎన్నో విధాల భావ స్వభావాలు రూప తత్వాలు
ఘన ద్రవ వాయువులతో పాటు ఇంకా ఎన్నో సూక్ష్మ రకాల విధానాలున్నాయి

నీవు ఏ మహాత్మవో తెలియాలన్నా

నీవు ఏ మహాత్మవో తెలియాలన్నా ఏనాటి మహర్షివో తెలియాలన్నా
విశ్వ తత్వ భావాలచే ఆత్మ గుణ యోగంచే శ్వాసపై ధ్యాసతో ధ్యానించు
నీలో విశ్వ విజ్ఞానం కలగాలన్నా నీ జీవితం విజ్ఞానంగా సాగాలన్నా
మేధస్సును విశ్వ ధ్యాసతో అన్ని వైపులా అన్ని వేళలలో కేంద్రీకరించు

ఎన్నో రకాల పట్టికలలో ఎన్నో రకాలుగా

ఎన్నో రకాల పట్టికలలో ఎన్నో రకాలుగా విజ్ఞానాన్ని వ్రాసి ఉంచారు

జ్ఞానంతో మరో జ్ఞానం అలాగే మరో

జ్ఞానంతో మరో జ్ఞానం అలాగే మరో జ్ఞానంతో ఆత్మ జ్ఞానం
విజ్ఞానంతో మరో విజ్ఞానం అలాగే మరో విజ్ఞానంతో విశ్వ విజ్ఞానం

నీలో ఎంత అజ్ఞానమున్నదో

నీలో ఎంత అజ్ఞానమున్నదో నీ మేధస్సుకే తెలుస్తుంది
నీలో ఎంత అశుభ్రత గుణం ఉన్నదో నీ శరీరానికే తెలుస్తుంది
మేధస్సును ఆత్మ జ్ఞానంతో విజ్ఞాన పరుచుకో
శరీరాన్ని సుగంధాల గుణ ప్రవర్తనతో శుభ్రత చేసుకో

నేను వ్రాసే వేల వాఖ్యాలలో చాల వరకు

నేను వ్రాసే వేల వాఖ్యాలలో చాల వరకు కొన్ని క్షణాలలో వ్రాసినవే
నాలో వాఖ్య ప్రావీణ్యం చాలా వేగంగా కలుగుతూ వస్తూనే ఉంటాయి

ఒక్కొక్క జీవితో కొన్ని వేల యుగాలు

ఒక్కొక్క జీవితో కొన్ని వేల యుగాలు జీవించినా అనుభవం చాలటం లేదు
ఒక్కొక్క అణువుతో కొన్ని వేల యుగాలు జీవించినా విజ్ఞానం అణువంతయే
విశ్వ విజ్ఞానిగా ఎంత నేర్చినా మేధస్సుకు ఎంతో కొరత ఉన్నట్లు కలుగుతుంది
అనంత విశ్వ విజ్ఞానంకై మేధస్సును అణువులుగా సృష్టించి విశ్వానికి అందించు
ప్రతి భావన ప్రతి విజ్ఞానం ప్రతి అనుభవం విశ్వ విజ్ఞానంగా నీ మేధస్సులో చేరుతుంది

నీకు కలిగే ఆలోచన నాకు

నీకు కలిగే ఆలోచన నాకు కలుగుతున్నది నీవు చేసే కార్యం నేను చేస్తున్నాను
నీకు కలిగే నష్టం నాకు కలుగుతున్నది నీకు కలిగే లాభాలే నాకు విజ్ఞాన అనుభవం

సమాజాన్ని మారుస్తూ సమాజంలో

సమాజాన్ని మారుస్తూ సమాజంలో జీవించు
నీవు మారుతూ సమాజాన్ని మార్చుతూ సాగిపో
సమాజంలో మార్పు వస్తూ అందరిలో మార్పు కలుగుతుంది
సమాజం అందరికి ఆదర్శప్రాయంగా ఆదర్శ తత్వంగా ఉండాలి

ఎవరికి ఎవరో సరి జోడి బంధాలను

ఎవరికి ఎవరో సరి జోడి బంధాలను కలిపి సాగిస్తున్నారు జీవితాలను యుగాలుగా

నీవు జీవించే విధానాన్ని చూస్తే

నీవు జీవించే విధానాన్ని చూస్తే నీ ఆత్మకు నిన్ను వదిలిపోవాలనే భావన కలగరాదు
మరణమనే భావన ఏనాటికి ఎప్పుడు ఏ క్షణం కలగరాదంటే ఎలా జీవించాలో తెలుసుకో
ఎంత గొప్పగా ఏ గుణ యోగ విచక్షణ తత్వాలతో విశ్వ విజ్ఞానంగా జీవించాలో నేర్చుకో
నీ శరీరం విశ్వ స్థితితో యుగాలుగా జీవించేలా నీ జీవితం అద్వైత భావాలతోనే సాగిపోవాలి

ఎవరి దారి వారిదే నీవైనా విశ్వ విజ్ఞానం

ఎవరి దారి వారిదే నీవైనా విశ్వ విజ్ఞానం వైపు మేధస్సును మరలించరాదా

శరీరాన్ని ఆత్మను వేరు చేయకు

శరీరాన్ని ఆత్మను వేరు చేయకు దేహాన్ని విడదీయకు
దేహాన్ని విడ దీస్తే నీలో శ్వాస లేక ధ్యానము ఉండదు
విశ్వ విజ్ఞాన ఆత్మ అన్వేషణ తెలియకుండా పోతుంది
విశ్వ గుణ భావ స్వభావ స్థితి యోగత్వములు కలగవు
మరణాన్ని దూరం చేసుకో విజ్ఞానాన్ని దగ్గర చేసుకో

నీలో ఏ నైపుణ్యం ఉన్నా దశాబ్దాలుగా

నీలో ఏ నైపుణ్యం ఉన్నా దశాబ్దాలుగా సాగించు శతాభ్దానికి నిలిచిపోతుంది
కళా విజ్ఞానమైనా కార్య శైలి ఐనా చిత్ర చాతుర్యమైనా దీక్షతో దశాబ్దాలుగా
ఏ నైపుణ్యమైనా అనుభవ శైలి వచ్చే వరకు సాగించుటలో దశాబ్ద కాలం
శతాబ్దాల యుగాలకు నిలిచిపోవాలంటే దశాబ్దాల కృషి దీక్ష అవసరమే

మీ పరీక్షలకు ధైర్యమే విజ్ఞాన

మీ పరీక్షలకు ధైర్యమే విజ్ఞాన సమాధానం
స్వల్ప ప్రశ్నా జ్ఞానమే అర్థాన్ని కలిగించే విజ్ఞాన ఉత్తరం
విషయ పరిజ్ఞానం ప్రశ్నార్థ సమాధానమే
లోక జ్ఞానాన్ని జీర్ణించుకుంటే ఉత్తరాలు ఎన్నో

నీలోని గొప్ప గుణాలు నిన్న మొన్నటివి

నీలోని గొప్ప గుణాలు నిన్న మొన్నటివి కావు ఆనాటి యుగాల నాటివే

Sunday, January 23, 2011

క్షణం ఆలస్యమైతే అమృతం విషమైనట్లు

క్షణం ఆలస్యమైతే అమృతం విషమైనట్లు నీవు చేసిన వృధా కాలమెంత

కాలం నీకు తోడుగా ఉన్నా

కాలం నీకు తోడుగా ఉన్నా మహా కార్యాలు నీలో అలాగే నిలిచిపోయాయి

నీ స్వభావానికి విచక్షణ భావాలు

నీ స్వభావానికి విచక్షణ భావాలు ఏ విధంగా చలిస్తున్నాయి

విశ్వ గురువు మెచ్చిన నీ దివ్య భావన

విశ్వ గురువు మెచ్చిన నీ దివ్య భావన ఏది
విశ్వ మహాత్ములకు తెలియని నా విజ్ఞాన భావన ఏది
ఇంకా నీ భావాన్ని ఎవరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు
నీ భావనతో ఎవరు నిన్ను దర్శించాలని నీకై రాబోతున్నారు
నీలో ఉన్న విశ్వ భావన స్వభావ స్థితి ఏ తత్వానిది

పరతత్వ భావాలు పరమాత్మునిలో

పరతత్వ భావాలు పరమాత్మునిలో ఉన్నా విశ్వ తత్వ భావాలు నీ ఆత్మ స్థితిలో ఉన్నాయి

విశ్వంలో పర బ్రంహా ధ్యానిస్తున్నాడు

విశ్వంలో పర బ్రంహా ధ్యానిస్తున్నాడు కనుక నీవు ఈ క్షణం మౌనమే

నీకు ఏ భావన నచ్చకున్నా కాలానికి

నీకు ఏ భావన నచ్చకున్నా కాలానికి నీ భావన నచ్చిందేమో
అందుకే కాల భావన నీలో నీ విచక్షణ భావాలకు కలుగుతున్నది
ఏ భావన కలిగిన తప్పు లేదు భావాన్ని విజ్ఞానంగా గ్రహించుటలోనే పరమార్థం
నీవు అజ్ఞాన భావాలతో అలాగే సాగిపోతావో లేదా విజ్ఞాన భావాన్ని గ్రహిస్తావో
కాలం ఎప్పుడు మర్మంగా అజ్ఞాన విజ్ఞాన భావాలను కలిగిస్తూనే ఉంటుంది
మన మేధస్సుకు మన కర్మ గ్రహ ప్రభావాలకు జీవన పరిక్షయే విశ్వ విజ్ఞానం

మంచిని చెడును అన్నింటిని త్వరగా

మంచిని చెడును అన్నింటిని త్వరగా విజ్ఞానంగా గ్రహించినవాడే మహాత్మ

విశ్వ విజ్ఞానంతో జీవించు ఆత్మగా నీకు

విశ్వ విజ్ఞానంతో జీవించు ఆత్మగా నీకు నేను ఎల్లప్పుడూ తోడుంటా

నేడు జన్మించిన మహాత్మ చిన్నవాడే

నేడు జన్మించిన మహాత్మ చిన్నవాడే రేపటికి వయో వృద్ధ మహర్షియే

నీ గురించి నీవు చెప్పడం కాదు

నీ గురించి నీవు చెప్పడం కాదు నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఒకేలా చెప్పగలగాలి
నా గురించి నేను చెప్పడం కాదు నా గురించి సంపూర్ణంగా తెలిసినవారే చెప్పాలి
నా భావాలను గ్రహించిన వారు నా తత్వాలను తెలిసిన వారు ఒకేలా చెప్పగలగాలి
ఎవరు ఎలా చెప్పినా నా గురించి నా విశ్వ తత్వ భావాలు నాకు తెలుసు
మీ విశ్వ విజ్ఞాన భావాలు మీకు తెలుసు అందరికి అన్నీ తెలియకపోవచ్చు
తప్పులను గుర్తించడం కాదు విశ్వ గుణ తత్వాన్ని గురించి ఉపయోగాన్ని తెలుపడం
ఒకరి గురించి చెప్పడమే కాదు తెలియని మహా విషయాలను తెలుసుకోగలగాలి
అన్నీ విశ్వ విజ్ఞానంగా ఎదగడానికే అందరికి సంపూర్ణ విజ్ఞానం కలగడానికే
ఏది ఎప్పుడు ఎవరికి ఎలా చెప్పాలో తెలుసుకోవటమే గుణ విజ్ఞాన విచక్షణ ప్రవర్తన

ఓ మహా విజ్ఞాన నక్షత్రమా! నీ విశ్వ

ఓ మహా విజ్ఞాన నక్షత్రమా! నీ విశ్వ తత్వాన్ని నాకు తెలుపవా
నా మేధస్సు నీ తత్వాన్ని గ్రహించకున్నను నా ఆత్మ తెలుసుకోగలదు
నీ విశ్వ స్థితితో నేను నీలా దివ్య విజ్ఞాన కాంతి వలే జీవించాలని నా భావన
నీలో ఉన్న ప్రకాశవంతమైన తేజస్సే నా మేధస్సును పరి పూర్ణం చేస్తున్నది

ఎందరు ఎందరికి విశ్వ విజ్ఞానాన్ని ఎలా

ఎందరు ఎందరికి విశ్వ విజ్ఞానాన్ని ఎలా పరిచయం చేస్తున్నారు
ఎందరిలో విజ్ఞానం చేరి అజ్ఞానం తొలగి మంచి భావాలు కలుగుతున్నాయి
ఎందరు సమాజంలో విజ్ఞానంగా మంచి గుణ ప్రవర్తన భావాలతో జీవిస్తున్నారు
సమాజాన్ని మార్చేందుకు విశ్వ విజ్ఞానం చాలా అవసరమేనని నా విశ్వ భావన

కాల వేగాన్ని నీవు అధిగమించలేవు

కాల వేగాన్ని నీవు అధిగమించలేవు కాల ప్రభావాన్ని తప్పించుకోలేవు
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎన్నో విధాల క్షణాలలో మరుపు కలుగుతుంది
మరుపుతో ఎన్నో నష్టాలు అవస్థలు భాదలు దుఃఖాలు ఎదురవుతాయి
అజ్ఞానాన్ని కూడా గ్రహించలేనంతగా అలాగే సాగిపోతూ జీవుస్తుంటావు
వాహానాన్ని ఎంత వేగంగా నడుపుతున్నా ప్రమాదాన్ని తప్పించుకోలేవు
ప్రమాదాన్ని తప్పించుకోలేనంతగా వాహనాన్ని వేగంగా నడుపుతున్నావు
నీ ఆలోచనలలో సాగిన వేగం కాల వేగాన్ని తప్పించుకోలేక ప్రమాదాలెన్నో
కాల వేగంలో నీవు నీ వేగాన్ని నా భావాల ఆవేదనను తగ్గించుకోలేవు
వాహనాన్ని అదుపు చేయలేని వేగం మనకు మన విచక్షణకు సరికాదు
విజ్ఞాన వేగంతో మన మేధస్సును నిర్దిష్ట భావాలతో సాగిస్తూ ప్రయాణించాలి
కాలం ఎప్పుడు అజ్ఞానంగా మన విజ్ఞానంతో పోరాడుతూ ఉంటుంది

నీ ఆత్మకు ద్వేషం కోప తాపాలు

నీ ఆత్మకు ద్వేషం కోప తాపాలు ఎందుకు అన్నీ తాత్కాలికమే
మహాత్మగా జీవించు అది శాశ్వితంగా విశ్వమున నిలుస్తుంది
ఎలా నిలిచిపోతుందని తలచవద్దు విజ్ఞాన గుణాలు ఆదర్శమే
శ్వాస గమనంలో ఉన్నాయి అనంత విశ్వ హిత గుణ విచక్షణాలు
మేధస్సును విశ్వ విజ్ఞాన పరుచు ఆ విజ్ఞానమే నీకు శాశ్వితం

నీకు తెలియకుండానే నీలోని ఆత్మకు

నీకు తెలియకుండానే నీలోని ఆత్మకు త్యాగ గుణాలున్నాయి
నీ ఆత్మ ఎందరినో కరుణా దయ గుణ భావాలతో ప్రేమిస్తున్నది
ఎందరికో విజ్ఞానాన్ని అందిస్తూ మరెందరికో సహాయం చేస్తున్నది
సమాజాన్ని విశ్వ విజ్ఞానంగా తీర్చి దిద్దాలనే ఆత్మ త్యాగ లక్షణం

ఎన్నో వేల కోట్ల యుగాలుగా ఎందరో

ఎన్నో వేల కోట్ల యుగాలుగా ఎందరో విశ్వ గురువులు నీకు భోదిస్తున్నారు
ఎంతో విశ్వ విజ్ఞానం నీ ఆత్మలోనే ఉన్నది ఇప్పుడు నీకు కాస్త తెలిసినట్లుందా

నీ కోసం నీవారే మహాత్ములుగా

నీ కోసం నీవారే మహాత్ములుగా మారుతూ నీ ఉత్తమ కార్యాలను సాగిస్తారు

నీవు చదివే విజ్ఞానం నీకు

నీవు చదివే విజ్ఞానం నీకు ఉపయోగపడుతుందా గమనించు
ఎంత వరకు ఏ విజ్ఞానాన్ని తెలుసుకోవాలి ఎలా గ్రహించాలి

నీవు చదువుతున్నప్పుడు నీలో కలిగే

నీవు చదువుతున్నప్పుడు నీలో కలిగే భావాలను వదులుకోవద్దు
నీ భావాలను వ్రాసుకో అర్థాన్ని తెలుసుకో విజ్ఞానాన్ని గ్రహించు
విశ్వ విజ్ఞానాన్ని తెలిపే అందరికి తెలిసే విశ్వ కార్యాన్ని సాగించు
కనీసం సమాజంలో గొప్ప మార్పు కలగడం కోసమైనా ప్రయత్నించు

నిదానమే ప్రధానమైనప్పుడు ఆలస్యం

నిదానమే ప్రధానమైనప్పుడు ఆలస్యం అమృతం విషం కాదు
మన భావాలే విషమవుతాయి గాని అమృతం విషం కాదు
ఏ నష్టం జరిగినా క్షణాలలో ఎవరు గెలిచినా వాహానాలు వెళ్ళిపోయినా
ఆహారం చల్లారినా మన భావాలు ఓడి పోయాయని మనం అనుకుంటాం
కాలానికి ఎలా ఇష్టమైతే అలా మనం సాగిపోతాం ఇది కాల క్షేమ ప్రభావాలే
మనం విజ్ఞానంగా జాగ్రత్తగా సాగుతున్నంతవరకు ప్రతి కార్యం మంచి కోసమే
మనం చేసే పనిని గౌరవించుకుంటే అన్నీ సకాలంలో విశ్వ కాలంతో సాగిపోతాయి
అమృతం విషమైనట్లు జన్మ మరణమేనని యదార్థ భావన నిదానంగా తెలిసినా ప్రధానమైనదే

ఒక భావనతో ఓ వ్యక్తిని ద్వేషించడం

ఒక భావనతో ఓ వ్యక్తిని ద్వేషించడం మరల మరో భావనతో అతనిని ప్రేమించడం
కొన్ని క్షణాలలో మారే భావాలకు మన విచక్షణ కాల ప్రభావాలకు మారుతుంటుంది
మనలో ఉండే ఆవేదనలే వివిధ కార్యాలలో వివిధ రకాలుగా విచక్షణ మారుతుంది
సమన్వయ భావాలు ఎక్కువగా లేక ఆలోచనల అర్థాలను త్వరగా గ్రహించలేకనే ఇలా
ఎందరినో ద్వేషిస్తాం మరెందరినో ప్రేమిస్తాం ఎందరితోనో స్నేహ శత్రు భావాలను సాగిస్తాం
అందరితో స్నేహ భావాలతో వివిధ విజ్ఞాన కార్యాలతో సమన్వయ సహాయాలతో సాగుదాం
ప్రతి ఆలోచనను గ్రహిస్తున్నప్పుడే మనలో మహా విశిష్ట గుణ విచక్షణ భావాలు ఉద్భవిస్తాయి

నీలో ఎన్నో వేల లక్షల కోట్ల ఆత్మలు

నీలో ఎన్నో వేల లక్షల కోట్ల ఆత్మలు జీవిస్తున్నాయి
నీవు నిద్రపోతే ఏ ఆత్మకు ఏ విజ్ఞాన కార్యాలు ఉండవు
నీలో ప్రతి ఆత్మ విశ్వ కార్యాన్ని సాగించుటకు ఎదురుచూస్తున్నది
ప్రతి ఆత్మ శక్తి ఓ మహాత్ముని విశ్వ కాంతి మహా తేజస్సు తత్వమే

మనం చూడలేనంతగా మానవుల

మనం చూడలేనంతగా మానవుల వికృత రూపాలు ఎన్నో ఉన్నాయి
రహదారి ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ఇతర ప్రమాదాలు
అనారోగ్య పరిస్థితులు కాల ప్రభావాలు జన్మించుటలో లోపాలు
సరైన ఆహారం లేక తగిన శక్తి లేక విచిత్ర రూపాలతో జీవిస్తున్నారు
అవయవాల లోపాలతో అంగ వైకల్యంతో ఎందరో అవస్థలతో నేటి సమాజమున
అన్నింటికి సరైన పరిష్కారాలను గమనిస్తూ రాబోయే కాలానికి జాగ్రత్త వహించాలి
ముఖ ఛాయలు సరిలేకపోతే వర్ణాలలో రూప భావాలు చూడలేనంతగా ఉన్నాయి

నేను విశ్వ కాలంతో ప్రయాణిస్తూ

నేను విశ్వ కాలంతో ప్రయాణిస్తూ జీవిస్తున్నాను
నా గ్రహ స్థితులు కూడా విశ్వ కాల ప్రభావాలే
నా ఆలోచన భావాలు విశ్వ కాలానికే చెందినవే
నేను విశ్వ కాలాన్నే నేను గమనించేది విశ్వాన్నే

ఓ మహాశయ చంద్రమా! నీ రూప

ఓ మహాశయ చంద్రమా! నీ రూప స్థితిని తెలిపితే నేను నీలా జీవిస్తాను
నీ విశ్వ స్థితి రూప జ్యోత్స్న భావాలకు నా మేధస్సులో కాంతులు చేరాయి

విశ్వ మార్గంలో మహాత్ములు మర్షులు

విశ్వ మార్గంలో మహాత్ములు మర్షులు నాయందే ప్రయాణిస్తున్నారు
ఎందరో నీతో ప్రయాణించాలనుకుంటే నీవు విశ్వ విజ్ఞాన ప్రయాణముననే
విశ్వ గుణ ఆత్మ తత్వాలతో మహా విజ్ఞాన భావాలతో జీవితాన్ని సాగించు
ప్రతి భావనను విజ్ఞానంగా స్వీకరిస్తూ విశ్వ మేధస్సు విజ్ఞానంతో జీవించు
నీ జీవితాన్ని విశ్వ విజ్ఞానంగా సాగించుటలో నీ భావాలు విశ్వమున ప్రయాణిస్తాయి

ప్రతి ఆత్మకు నీ రూపం తెలుసు

ప్రతి ఆత్మకు నీ రూపం తెలుసు నీ మేధస్సుకే తెలియకున్నది
నేటి నుండి ఆత్మ భావాలతో జీవిస్తే నీ మేధస్సులో ప్రతి రూపమే

ప్రతి జీవిలో ప్రతి రూపంలో ప్రతి

ప్రతి జీవిలో ప్రతి రూపంలో ప్రతి అణువులో ఆత్మగా ఎవరున్నారు
నా ఆత్మ భావాలు ప్రతి అణువులో జీవించాలనే భావన కలుగుతున్నది

విశ్వమున నాకే విశ్వ విజ్ఞాన

విశ్వమున నాకే విశ్వ విజ్ఞాన ఆలోచనలు కలుగుట ఓ దివ్య విజ్ఞానార్థమే
మరెందరికో కలిగినా వారిలోనూ మహా దివ్య ఆలోచనల గుణ విజ్ఞానార్థమే
ఎవరికి ఏ విజ్ఞానం కలిగినా అందరికి తెలిపేలా విశ్వ గుణ భావన ఉండాలి
మహర్షి ఐనా మహాత్మ ఐనా విశ్వ గుణ భావాలతో విశ్వ విజ్ఞానాన్ని అందించాలి

ఓ యోగాత్మ నీతో నీ భావన తెలుపవా

ఓ యోగాత్మ నీతో నీ భావన తెలుపవా నీ విజ్ఞానాన్ని విశ్వానికి తెలుపుతా
నీ గుణ తత్వాలను మరో లోకాలకు అందిస్తూ విశ్వ విజ్ఞానంలో లిఖిస్తాను

ఆనాడు మహాత్ములు ఆత్మ స్థితితో

ఆనాడు మహాత్ములు ఆత్మ స్థితితో జీవించేవారు
నేడు విశ్వ స్థితి జీవించాలని ఆత్మ విజ్ఞాన భావన

ప్రతి జీవిలో మార్పు రావాలని

ప్రతి జీవిలో మార్పు రావాలని ప్రతి ఆత్మలో విజ్ఞానం కలగాలని
సమాజంలో విజ్ఞాన భావాలు సమముగా సంతోష భరితం కావాలని
ప్రతి కార్యాన్ని చైతన్య వంతంగా మహా గుణ విజ్ఞాన భావాలతో చేసుకోవాలని
విశ్వ జీవులు సకాల జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ మరణించాలి

ప్రతి రోజు ఎందరినో చూస్తున్నావు

ప్రతి రోజు ఎందరినో చూస్తున్నావు కొందరినే పలకరిస్తున్నావు

నిన్ను మార్చే విజ్ఞానం నీ ఆత్మ

నిన్ను మార్చే విజ్ఞానం నీ ఆత్మ మేధస్సులోనే ఉన్నది
నీ మేధస్సుకే తెలియని విశ్వ విజ్ఞానం నీ ఆత్మలోనే ఉన్నది

నాలోనే శక్తి ఉన్నది నీలోనే మహా శక్తి

నాలోనే శక్తి ఉన్నది నీలోనే మహా శక్తి ఉన్నది ఇద్దరమే ఎందరికో పరా శక్తిని కలిగించాలి
విజ్ఞాన భావాలతో మనిషిలోని సామర్థ్యాన్ని పెంచాలి దివ్య విచక్షణ గుణాలను కలిగించాలి

ఆత్మగానే రావాలి మహాత్మగానే మారాలి

ఆత్మగానే రావాలి మహాత్మగానే మారాలి మహర్షిగానే విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోవాలి

ఆనాటి ఆత్మ బంధమే నేడు మహర్షిగా

ఆనాటి ఆత్మ బంధమే నేడు మహర్షిగా నీతో కలిసి జీవిస్తున్నాడు

శివ ధ్యానం కాదు శివ శంకరుని ధ్యానం

శివ ధ్యానం కాదు శివ శంకరుని ధ్యానం కాదు
కైలాసంలో కాదు హిమాలయ పర్వతాలలో కాదు
నీ జీవిత విజ్ఞానమునకై నీ ఆత్మ ధ్యానమే ఇది
నీలో విజ్ఞాన ఏకాగ్రత భావాలు కలగాలనే ధ్యానం

అన్ని దారుల నుండి అన్ని మార్గాల

అన్ని దారుల నుండి అన్ని మార్గాల నుండి నన్ను కలుసుకోవచ్చు
ఎప్పుడు ఏ దారిన ఎలా కలుసుకుంటామో కాలమే నిర్ణయిస్తుంది
ఎవరు కలిసినా విజ్ఞాన భావాల మహా కార్యాల సమాజ జీవితానికే
అన్ని దారులను విజ్ఞాన పరిచి అన్ని మార్గాలను శుభ్రత పరచాలి

విశ్వ స్థితితో జీవిస్తే ఆత్మ ఆవేదనలు

విశ్వ స్థితితో జీవిస్తే ఆత్మ ఆవేదనలు తగ్గిపోతాయి
విశ్వ స్థితి కలుగుటకు శ్వాస ధ్యాసను గమనించు
ఆత్మలో మహా భావన కలిగి ఆవేదన తగ్గిపోతుంది
మంచి భావాలతో అనారోగ్యం కూడా తగ్గిపోతుంది
ఆత్మ స్థితి కూడా శ్వాసపై ధ్యాసగల దివ్య గుణ భావన
దివ్య గుణ భావాలు ఉంటే ఏవైనా మన విజ్ఞాన ఆరోగ్యం

ఆనాటి యుగాలుగా వస్తున్నా

ఆనాటి యుగాలుగా వస్తున్నా విశ్వ విజ్ఞానం ఇంకా తెలుసుకోలేదా
ఎవరికి తెలియదా తెలుసుకొనుటకు ప్రయత్నించలేదా అర్థమగుట లేదా

ఎన్ని కార్యాలు చేస్తున్నా ఆహార నిద్రల

ఎన్ని కార్యాలు చేస్తున్నా ఆహార నిద్రల కోసమే ఎదురు చూస్తాము
మంచి ఆహారం ప్రశాంతమైన నిద్ర ఉంటే మరెన్నో కార్యాలు చేస్తాము
శరీర శక్తి మేధస్సు శక్తి ఉంటేనే కార్యాలు త్వరగా విజ్ఞానంగా సాగుతాయి
అన్ని సమపాలలో ఉంటేనే అన్ని కార్యాలు సంపూర్ణంగా సాగిపోతాయి

నీ విజ్ఞాన భావాలనే ప్రపంచ జనాభాకు

నీ విజ్ఞాన భావాలనే ప్రపంచ జనాభాకు అందించు
నీలోని విచక్షణ గుణాలనే విశ్వ జీవులకు అందించు
నీ గుణాలతోనే మరి కొన్ని యుగాలు విజ్ఞానంగా జీవిస్తారు
నీ గుణ తత్వాలతోనే మరెందరో విశ్వానికి ఆదర్శులవుతారు

నీ యొక్క అద్భుత ఆలోచనలను

నీ యొక్క అద్భుత ఆలోచనలను నీలోనే దాచుకుంటే
మరో లోకానికి నీ విశ్వ విజ్ఞానా భావాలు ఎలా చేరుతాయి

వందల యుగాల క్రితం నీతో జీవించిన

వందల యుగాల క్రితం నీతో జీవించిన వ్యక్తి నేడు మహాత్మగా దర్శనమిస్తున్నాడు
ఆత్మ బంధాల గ్రంధంలో నీ విశ్వ విజ్ఞాన భావాలు అతనితో ఏకమవుతున్నాయి

నీ ఆలోచన భావాలను మహా

నీ ఆలోచన భావాలను మహా విజ్ఞానమునకై దేశ విదేశాలకు తరలించు
కాలమే నీకు మరో విశ్వ లోకాల నుండి అద్భుత విజ్ఞానాన్ని కల్పిస్తుంది

యుగాలుగా జన్మించే నీకు

యుగాలుగా జన్మించే నీకు విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకునే సమయం ఇదే
నేడు నీలో ఉద్భవించే మహా విజ్ఞాన విశ్వ అన్వేషణ కాల జ్ఞాన సమయం

నాలో ఎన్నో ఉన్నాయి ఎందరికో ఎన్నో

నాలో ఎన్నో ఉన్నాయి ఎందరికో ఎన్నో తెలుపాలని కలుగుతున్నాయి
ఎందరికో ఎన్నో తెలుపుతున్నా ఇంకా ఎందరికో మరెన్నో తెలపాలని
విశ్వ విజ్ఞాన భావాలు మహా కార్య ప్రణాళికలు అద్భుతాలు విజయాలు
ఎన్నో తెలిపేందుకే ఎన్నో విజ్ఞాన భావాలను ఇంకా గ్రహిస్తూనే ఉన్నా

నీలో విశ్వ విజ్ఞాన అన్వేషణ లేనందుకే

నీలో విశ్వ విజ్ఞాన అన్వేషణ లేనందుకే ఇంకా నీలో సూక్ష్మ కణాలు నిద్రావస్థలో ఉన్నాయి

స్థితి అంటే పరిస్థితి కాదు

స్థితి అంటే పరిస్థితి కాదు
పరిస్థితిలో ఉన్న గుణ స్థితిని గ్రహించాలి
నేడు విశ్వ స్థితి మేఘ మలినముల ప్రభావాన్ని కలిగి ఉన్నది
మేఘ మలినముల ద్వారా విశ్వమున సామర్థ్యం తగ్గిపోతున్నది
కాల ప్రభావాలు మారుతూ ఎన్నో విధాల ఋతు పవనాలు మారుతున్నాయి
ఆహార శక్తి జీవుల జీవిత కాలాలు తగ్గిపోతూ విశ్వ జీవుల స్థితి మారుతున్నది
మన ఆత్మ స్థితి కూడా విజ్ఞానంగా లేక శరీర స్థితులు మారుతూ ఉన్నాయి
ప్రతి అణువు యొక్క స్థితి తెలుసుకుంటే ప్రతి దానిని విజ్ఞానంగా గ్రహించవచ్చు
దేనిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో మేధస్సుకు క్షుణ్ణంగా తెలుస్తుంది
వాతావరణాన్ని పరి రక్షిస్తూ మానవ గుణాలతో సమాజాన్ని సరిచేసుకోవాలి

మనం సమాజాన్ని మార్చుకోలేకపోతే

మనం సమాజాన్ని మార్చుకోలేకపోతే ఏ జీవి మార్చగలదు
ఏ జీవికి సమాజ విజ్ఞానం తెలుసు ఏ భాషలో మనకు తెలుపగలదు
వాటి భావాలకు మన విజ్ఞానమే గ్రహించే విశ్వాన్ని మార్చుకోవాలి
నేటి విశ్వ స్థితి పరిస్థితులకు సామాజాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి

మాట్లాడటం తెలియుట ముఖ్యం కాదు

మాట్లాడటం తెలియుట ముఖ్యం కాదు ఏం మాట్లాడాలో తెలియుటయే ముఖ్యం

Saturday, January 22, 2011

సమాజంలో ఎందరో గొప్ప వ్యక్తులు

సమాజంలో ఎందరో గొప్ప వ్యక్తులు వస్తుంటారు ఎన్నో మహా కార్యాలు చేస్తూ వెళ్ళిపోతారు
ఓ నిర్దిష్టమైన మహా ప్రణాళికతో విశ్వ విజ్ఞానంతో చేసే కార్యాలు చాలా అరదుగా కనిపిస్తాయి

మనం దైవాంశ సంభూతములని

మనం దైవాంశ సంభూతములని మనకు తెలిస్తే మనం విజ్ఞానమునకై మారగలమా
మన విశ్వాన్ని విజ్ఞాన లోకంగా మార్చగలమా ఇంకా విశ్వ విజ్ఞానాన్ని అన్వేషిస్తామా
మనం మహాత్ములని ఎవరైనా తెలిపితే మనలో మహా చెడు గుణాలు వెళ్లి పోతాయా
మనం జగతకే ఓ విజ్ఞాన మార్పును తీసుకువస్తూ సమాజాన్ని గొప్పగా మార్చగలమా

మన మేధస్సులో మార్పు లేకపోతే

మన మేధస్సులో మార్పు లేకపోతే ఎంత విజ్ఞాన అనుభవాన్ని కోల్పోతామో
ఎంతో కాలం ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నా మార్పులేని మేధస్సు ఎందుకు

సమాజాన్ని సమాజం కోసం

సమాజాన్ని సమాజం కోసం మార్చగలవని సమాజమే ఎదురు చూస్తున్నది
సమాజంలో మార్పు రావాలని సమాజం యుగాలుగా ఎదురుచూస్తూనే ఉన్నది
సమాజంలో ఎందరో నాయకులు ఉన్నా మహా విజ్ఞాన సమాజం కావాలంటుంది
సమాజంలో ఎన్నో మార్పులు జరుగుతున్నా ఇంకా మహా మార్పు కావాలంటుంది
సమాజంలో ఏ జీవి జీవిస్తున్నా మానవుడే సమాజాన్ని మార్చగలడని నమ్మక జ్ఞానం

నీలో ఎన్నో విధాల ఎన్నో భావాల జీవుల

నీలో ఎన్నో విధాల ఎన్నో భావాల జీవుల ఆత్మ భావాలు ఉన్నాయి
ఎన్నో జన్మలుగా ఎన్నో జీవులుగా జన్మిస్తూనే మానవ జన్మ నేడు
నీలో ప్రతి జీవి విజ్ఞానం ఉన్నది నాలో మహా విజ్ఞాన శక్తి ఉన్నది
నీలో ఆత్మ జ్ఞాన విశ్వ విజ్ఞానం ఉన్నది నీ మేధస్సు మహా లోకమే

నీలో ఒకే ఆత్మ ఉన్నా నీ ఆత్మలో ఎన్నో

నీలో ఒకే ఆత్మ ఉన్నా నీ ఆత్మలో ఎన్నో మహాత్ముల విజ్ఞానం ఉన్నది

ఈ విశ్వ జ్ఞానం ఎందరితో నీ మేధస్సుకు

ఈ విశ్వ జ్ఞానం ఎందరితో నీ మేధస్సుకు విజ్ఞానంగా మారుతున్నది

మనం ఎంత ఎదిగినా ఎన్ని సాధించినా

మనం ఎంత ఎదిగినా ఎన్ని సాధించినా మనలో ఇంకా ఉద్రేకత కలుగుతుంది
తీరికగా ఆలోచిస్తే మనలో ఉన్న ఉద్రేకత భావాలకు ఇంకా ఎన్నో సాధించాలనుకుంటాం
మేధస్సులో ఇంకా కొత్త కొత్త భావాల విజ్ఞానం ఉన్నప్పుడు ఇంకా ఎన్నో సాధించాలనే
మేధస్సులో విశ్వ విజ్ఞాన అన్వేషణ ఉన్నప్పుడు ప్రపంచాన్ని మార్చాలనే మహా లక్ష్యం
మనలో సామర్థ్యం మహా విజ్ఞానం ఉన్నప్పుడు ఇంకా ఎన్నో ఎందరికో సాధించి పెట్టాలి
జీవితాన్ని ఓ విజ్ఞాన దశగా సమాజాన్ని తగిన దశలో విజ్ఞానులే తీసుకు వెళ్ళాలి
ఉద్రేకత అన్నది ఓ లక్ష్య సాధనకు మహా ప్రోత్సాహమే మహా గుణమే
ప్రతి భావన గుణాన్ని అరిషడ్వర్గాలను మంచి కార్యాలకు కూడా ఉపయోగించుకోవచ్చు
దేనినైనా మంచిగా గ్రహిస్తే విశ్వ విజ్ఞాన భావాలు ప్రపంచానికి చాల ఉపయోగపడుతాయి
నేటి ప్రపంచమున విచక్షణ యొక్క భావాల పరమార్థం తెలియక సమాజంలో ఎన్నో సమస్యలు
ఎందరో ఎన్నో రకాలుగా వివిధ సమస్యలతో జీవించుటలో భావార్థాలు తెలియకపోవటమే

విశ్వ విజ్ఞాన భావన మీలో కలిగినప్పుడు

విశ్వ విజ్ఞాన భావన మీలో కలిగినప్పుడు గుర్తించ గలిగితే అదే మధుర క్షణం

Wednesday, January 19, 2011

ఏ జీవి ఐతే నేమి ఏ రూపమైతే నేమి

ఏ జీవి ఐతే నేమి ఏ రూపమైతే నేమి విశ్వమున జీవించుటకు ప్రవేశించారు
ఎవరు ఎలా జీవిస్తున్నా ఎవరి కోసమైనా ఎందుకైనా అంతా ఎవరికి వారే
ఎవరికి వారు ఎలా జీవించాలో తమ నిర్ణయం కాల పరిస్థితుల ప్రభావం
ఆహారం కోసమే సౌకర్యాల కోసమే సుఖ సంతోషాల కోసమే జీవుల తపన
విశ్వమున జీవుల విజ్ఞానమే జీవనంతో సాగే విశ్వ ప్రయాణ కార్య కాలం

నీవు ఎవరు? - ఎలా తెలిపితే విశ్వార్థం

నీవు ఎవరు? - ఎలా తెలిపితే విశ్వార్థం కలుగును
నీవు ఎవరని నీకు నీ భాషలో నీకు తెలిసేలా తెలపాలనే నా భావన
జీవిగా ఉదయించే ప్రతి జీవి ఒక జీవి నుండి జన్మించుటయే కదా
ఒక జీవిగా జన్మించుటలో ఆత్మగా నేను ఒక విశ్వ శక్తిని
నా ఆత్మకు ఓ గుర్తింపుగా నాకు ఓ రూపం కావాలని నాకొక జన్మ
నా ఆత్మ భావాలకు తగిన శరీర రూప జన్మయే వివిధ జీవులలో ఒక జీవిగా
ఒక జీవిగా నేను ఏ రూపంలోనైనా ఏ విధమైన జీవిలోనైనా ఆత్మగా ప్రవేశిస్తాను
ఆత్మగా నేను ఒక మానవ జన్మగా జన్మించినప్పుడే నాకు ఓ విజ్ఞాన గుర్తింపు వస్తుంది
ఆత్మలో ఎన్ని జన్మల జీవ భావాలున్నా మానవ జన్మయే నీవు ఎవరని తెలుపుతుంది
మానవ విజ్ఞానమున ప్రతి ఒకరికి ఓ నామము గుర్తింపుగా ఉంటుంది
నీవు ఎవరంటే పలాన తల్లి తండ్రుల కుమారుడని తెలుపవచ్చు
నీ నామమును ఓ గుర్తింపుగా తెలుపుకొని పరిచయం చేసుకోవచ్చు
'ఎన్ని ఎలా చెప్పుకున్నా నీ నామమే నీకు గుర్తింపు నిస్తుంది'
నేను సమాజంలో జీవించే ఒక మానవుడిని
నన్ను సమాజంలో గుర్తించడానికి నాకు ఒక నామము కలదు
నేను ఎవరని ఇంకా వివరణగా తెలియాలంటే నా తల్లి తండ్రుల నామములు అవసరం
నేను పలాన కళాశాలలో చదువుతున్న విద్యార్థిని
నేను పలాన పరిశ్రమలో పనిచేస్తున్న వాడిని
నేను సమాజంలో ఓ విజ్ఞానిగా ఎదుగుతున్న వ్యక్తిని

యోగ నిద్రలో మహాత్మకు

యోగ నిద్రలో మహాత్మకు తెలియకుండానే ఆత్మ వెళ్ళిపోయింది
పర ధ్యాసలో ఆత్మ చంచల భావాలకు తనను వదిలి వెళ్ళిపోతుంది
తనను వదిలి వెళ్లేందుకు యోగ నిద్రలో ఎరుకకు మరుపు కలిగిస్తుంది
ఆత్మ యొక్క శక్తి భావాలు మేధస్సుకు కూడా మర్మమేనని విజ్ఞానార్థము
మరుపుకు మర్మం కూడా వశమై క్షణాలలో విజ్ఞానం అజ్ఞానమై పోతుంది
మహాత్ముల మహా ఎరుకనైనా మరిపించే శక్తి ఆత్మ భావాలకే ఉంటుంది
నిద్ర మహా మహమ్మారి మర్మమైనా మరుపు కలుగుటకు పర ధ్యాస నిద్రయే

నా శరీరంలో ఇంకా విశ్వ స్థితి

నా శరీరంలో ఇంకా విశ్వ స్థితి కలగలేదేమో
నా శరీర కణాలకు విశ్వ స్థితి కలిగితేనే యోగత్వం
నా ఆత్మలో విశ్వ స్థితి కలిగితే శరీరం విశ్వ తత్వంగా మారుతుంది
శరీరం విశ్వ స్థితితో జీవిస్తే ప్రకృతి స్వభావాలు నా ఆత్మకు కలుగుతాయి
ప్రకృతిలోని శక్తి భావాలు నా ఆత్మలో చేరితే ఆకలి భావాలు శూన్యమే
విశ్వ స్థితితో జీవిస్తూ ఆత్మ తత్వంతో యోగాత్మగా శూన్యమైపోవా

మహా ఋషుల మంత్ర గ్రంధం కాదు

మహా ఋషుల మంత్ర గ్రంధం కాదు మహాత్ముల శ్లోక గీతం కాదు
మహా కవుల వేద కావ్యం కాదు విజ్ఞానుల అద్వైత భావ కీర్తన కాదు
విశ్వ విజ్ఞాన భావ స్వభావ ఆత్మ స్థితి తత్వ యోగ విశ్వ భాషా ప్రజ్ఞానం
మహా సూక్ష్మ కార్య క్రమ కారణ మర్మ రహస్యాల అన్వేషణ కారుడకే ప్రజ్ఞానం
శాస్త్రీయ సిద్ధాంత అద్వైత వేద గుణ విచక్షణ గలవారు మహా శూన్య ఆది మూర్తులు

మాయ చేసి మంత్రం వేసి తంత్రం చూపి

మాయ చేసి మంత్రం వేసి తంత్రం చూపి యంత్రాన్ని సృష్టించారు
యంత్రాన్ని కనిపెట్టేందుకు మానవుడు ఎన్నో రకాలుగా శ్రమిస్తున్నాడు
ఎన్నో విధాలుగా ప్రయోగాలతో విఫలమవుతూ విజయాలను సాధిస్తున్నాడు
ఒకప్పుడు మాయగా చెప్పుకునేవి నేడు యంత్రాలతో అద్భుతాలు కనిపిస్తున్నాయి
మానవ మేధస్సుకు సాధ్యమనే భావనయేగాని అసాధ్యమనే మాటే లేదనిపిస్తుంది

కనిపించే విశ్వం కళ్ళ ముందున్నా

కనిపించే విశ్వం కళ్ళ ముందున్నా కనిపించని విశ్వం మేధస్సులోనే
కనిపించే విశ్వం నుండి కనిపించని విశ్వాన్ని ప్రయాణిస్తూ చూడండి
ఆలోచనలతో విశ్వాన్ని తిలకిస్తూ విజ్ఞాన భావాలతో ప్రయాణించండి
విశ్వ విజ్ఞానాన్ని మేధస్సులో సేకరిస్తూ విశ్వ రూపాలను చూడండి

ఇప్పటికి ప్రతి రోజు మానవులనే

ఇప్పటికి ప్రతి రోజు మానవులనే పలకరిస్తున్నావు
ఇతర జీవులను పలకరించే సమయం లేకున్నది
చిన్నప్పుడు కొన్ని జీవులతో ఆడుకున్నావు
ప్రస్తుతం సమస్యలతో వివిధ కార్యాలతో జీవిస్తున్నావు
ఇతర జీవులకు ఉల్లాసం సంతోషం తగ్గిపోయాయి
మానవుల స్నేహ బంధాలు చాలా వరకు తరిగాయి
జంతువులతో పక్షులతో జీవించే విధానం తగ్గిపోయింది
ఇతర జీవులకు కాస్త ఆహారాన్నైనా అందించండి
ఆనాడు నీతో జీవించిన జీవులు నేడు ఎక్కడో
ఎన్నో ఆనాటి నీ స్నేహ జీవులు మరణించాయి
జ్ఞాపకాల జీవితం కూడా మానవ మేధస్సుకు లేదే

Tuesday, January 18, 2011

My way of thoughts having

My way of thoughts having Supreme vibrations
The Thought of intent having truth of Universal waves
Thought Waves reveals the moral stability of Human behavior
The Stability behavior is the Universal truth of natural things

ఆకాశం ఆరు భాగాలుగా ఆరు రంగులతో

ఆకాశం ఆరు భాగాలుగా ఆరు రంగులతో విడిపోయినట్లు కనిపిస్తున్నది
పరమార వైపు క్రింద భాగం నల్లని రంగు దానిపై ఊదా రంగు కనిపిస్తూ
ఆపైన సూర్య కిరణాలతో పసుపు రంగు ఆ తర్వాత మేఘాలలో ఎరుపు
ఆపైన మేఘాలతో తెలుపు రంగు ఆ తర్వాత తూర్పు వైపున నీలాకాశం
అక్కడక్కడ మసక మసక రంగులతో ఉత్తర దక్షిణ భాగాలు ఉన్నాయి
ఆకాశంలో ఎప్పుడు ఎక్కడ ఏ అద్భుత వర్ణ చిత్రాలు కనిపిస్తాయో క్షణాలకే లెక్క
ఆకాశంలో ప్రతి వర్ణ భావన కనిపిస్తుందని నా నేత్ర ఆకాశ చిత్రాలే నిదర్శనం
నాలో దాగిన సూర్యోదయ సూర్యాస్తమయ కిరణ మేఘ వర్ణాలు మహా అద్భుతమే

ఆశను మరచిపోయి ప్రస్తుత కార్యం

ఆశను మరచిపోయి ప్రస్తుత కార్యం విజయం కావాలని సాగించు

జగత్ ప్రళయాలకు మెరిసే ఉరుములకు

జగత్ ప్రళయాలకు మెరిసే ఉరుములకు జ్ఞానేంద్రియాలు తటస్థమవుతాయి
కాల భయంకరాలను ఆత్మ కూడా ఓర్చుకోలేనంతగా జీవరాసులు ఆవహించిపోతాయి

నా ఆత్మకు కన్నా నా మేధస్సుకే విశ్వ

నా ఆత్మకు కన్నా నా మేధస్సుకే విశ్వ విజ్ఞాన విచక్షణ కలగాలి
కాల జ్ఞాన పాప పరిహార కర్మ విమోచన తక్షణమే కలగాలి
అజ్ఞాన కాలం తొలగి విజ్ఞాన భావాలు మహాద్భుతంగా కలగాలి
నలుగురికి కన్నా అందరికి ఉపయోగపడే కాల జ్ఞానం కలగాలి

నా మేధస్సుకు దివ్య స్థితి ఎప్పుడు

నా మేధస్సుకు దివ్య స్థితి ఎప్పుడు కలుగుతుంది

నాకు కలిగిన నష్టానికి పరమార్థ

నాకు కలిగిన నష్టానికి పరమార్థ మేమిటో విశ్వ స్థితికి తెలియునా
నా ఆత్మ స్థితి నష్టాల భావాలను ఓర్చు కుంటుందా సహిస్తుందా
కాలం కలిగించే ఏ భావాలకైనా నా ఆత్మ విధిగా భావిస్తూ సాగుతుందా
కష్టానికి ఫలితం లేకపోయినా శరీరం నశిస్తున్నా ఓర్పుతోనే జీవిస్తుందా

మహా భావాల ఊహలు మేధస్సులోనే

మహా భావాల ఊహలు మేధస్సులోనే అద్వితీయం
కొన్ని క్షణాలు దివ్య భావాలతో మేధస్సు కలలు కంటుంది
కొన్ని కలలు నిజం కావాలని కొన్ని నిజమవుతాయని భవిష్య ఆలోచన
ఏదేమైనా విజ్ఞాన అర్థాన్ని గ్రహించుటలో కూడా అంతర్ముఖ ఊహా చిత్రమే

మనిషి ఎలాంటి వాడైనా ఉరి తీసే

మనిషి ఎలాంటి వాడైనా ఉరి తీసే ముందు కరుణించు
చనిపోయేటప్పుడు హృదయ దయా గుణాలతో ఆదరించు
తన ఆత్మ శాంతికి మనః శాంతి భావాలను కలిగించు
విశ్వ భావాలతో మనిషిని ప్రేమిస్తే ఉరి తీయుట అసాధ్యం

శక్తితో శ్రమించుట శ్రమతో అలసిపోవుట

శక్తితో శ్రమించుట శ్రమతో అలసిపోవుట
అలసిపోవుటతో ఆకలి ఆకలికై ఆహారం
ఆహారంతో శక్తి శక్తితో శ్రమించుట
శ్రమిస్తూనే ఆహారాన్ని పండిస్తూ ఎన్నో కార్యాలను చేసుకుంటున్నాము
నిత్యావసరాలు కనీస సౌకర్యాలు విలాసమైన జీవితాలు ప్రయాణాలు ఎన్నో
అద్భుతాలు మధుర భావాలు మహా కార్యాలు జనన మరణాలు కాలంతోనే

నాకు పృథ్వియే ఆధారం - గాలియే శక్తి

నాకు పృథ్వియే ఆధారం - గాలియే శక్తి
ఆకాశమే గురువు - సూర్య చంద్రులే మిత్రులు
కాలమే గుణం - ఋతు పవనాలే విచక్షణ
నక్షత్రాలే ఇస్వర్యం - గ్రహాలే బంధువులు
ప్రయాణమే జీవితం - రూపమే విశ్వం
ఇలా నాకున్న వారంతా ఇలాంటి భావాలతోనే సమానమని అర్థం

విశ్వ భావాలతో కర్మ దగ్ధం కావాలనే

విశ్వ భావాలతో కర్మ దగ్ధం కావాలనే నా భవిష్యత్ ను లిఖించుకుంటున్నా
నా ఆత్మ నిర్ణయం కాల జ్ఞానమై విశ్వ స్థితి కరుణ భావాలతో సహకరించాలి
నా విశ్వ విజ్ఞాన భావాలు పంచ భూతాలుగా కర్మను శూన్యానికి తరిమేయాలి
నా భావాలలో ఉన్న విశ్వ శక్తి శూన్యానికి మహా చైతన్యాన్ని కలిగించాలి

ఆలోచనలలో ఉన్న విజ్ఞానం ఆశా

ఆలోచనలలో ఉన్న విజ్ఞానం ఆశా భావాలలో ఉండదు

నీ విజ్ఞాన కార్యాలకు నష్టం కలిగినా

నీ విజ్ఞాన కార్యాలకు నష్టం కలిగినా కర్మ లేదని భావిస్తూ సాగిపో

నాకు ఏది ఉన్నా లేకున్నా కర్మ

నాకు ఏది ఉన్నా లేకున్నా కర్మ లేదంటేనే మహా సంతోషం మహా విజ్ఞానం

విశ్వ విజ్ఞానమునకు కాల జ్ఞానం లేక

విశ్వ విజ్ఞానమునకు కాల జ్ఞానం లేక మరుపు మర్మంవలే సంభవిస్తు తాండవిస్తున్నది
అష్టకష్టాల నష్టాలతో ఆత్మ కృంగిపోయేలా మరుపు మేధస్సును అసమర్ధతగా చేస్తున్నది
శరీరానికి కార్య శక్తిని యుగాల నాటి ఓపిక పట్టుదలను తగ్గిస్తూ అజ్ఞానాన్ని కలిగిస్తున్నది
అనారోగ్యం కూడా సంభవించి కాల ప్రభావాలకు మర్మ విజ్ఞాన భావాలను మరిపిస్తున్నది

Monday, January 17, 2011

నా పదంలో పదార్థ భావన అమృతార్థమే

నా పదంలో పదార్థ భావన అమృతార్థమే
విశ్వ పదార్థాలలో నా పద స్వభావం సుగంధమే
నా పదాలు జీవమై పద్మ తత్వాన్ని తెలుపుతున్నాయి
నా పదాలకు సంగీత పలుకుల భావ సమ్మేళనమున్నది

నా నుదిటి రాతను ఆనాటి నుండి

నా నుదిటి రాతను ఆనాటి నుండి యుగాలుగా లిఖిస్తూనే ఉన్నారు
ఇంకా జన్మ జన్మల నుండి కర్మ భావాలనే మరవకుండా కొనసాగిస్తున్నారు
విశ్వ విజ్ఞాన భావాలను తెలుసుకున్నా ఆత్మకున్న కార్య కర్మ నశించుట లేదు
కాల జ్ఞానంతో కర్మ నశించే వరకు ఆత్మ శరీర బంధాలు విడిపోవని నా విజ్ఞానం

నా ఆత్మ గమనంలో కలిగిన భావాలే

నా ఆత్మ గమనంలో కలిగిన భావాలే విశ్వ విజ్ఞాన స్వభావాలు
ఆత్మ ధ్యాన శ్వాస స్థితి తత్వాలలో కలిగే వేద భావాలే స్వభావాలు

నా రూపాన్ని విశ్వ లోకంలో అచ్చు

నాలాంటి రూపాన్ని విశ్వ లోకంలో అచ్చు వేశారు విశ్వ విజ్ఞాన భావాలకు గుర్తుగా
విశ్వ భావాలను మరచిపోగలరని అద్వైత వేద విజ్ఞానులతో అచ్చు వేయించారు

నా ఆత్మకు విశ్వపు ద్వారాలు

నా ఆత్మకు విశ్వపు ద్వారాలు తెరుచుకున్నాయి
విశ్వాత్మయే నాకు ద్వారమున స్వాగతం తెలుపుతున్నాడు
విశ్వ స్థితి నాలో చేరుటయే విశ్వ ద్వారానికి ఆహ్వానం
శూన్య స్థితిని చేరుకోవటానికి విశ్వపు ద్వారాలే ఆత్మ స్థానం

సత్య పీఠం మీద విశ్వ విజ్ఞానియే

సత్య పీఠం మీద విశ్వ విజ్ఞానియే కూర్చోవాలని ఇంకా ఖాళీగానే ఉన్నది
నేను విశ్వానికి వెళ్ళిపోతే సత్య పీఠాన్ని అధిష్టించి సత్యాత్మగా నిలువాలనుకున్నా
నా విశ్వ విజ్ఞానంలో కాల జ్ఞానం ఉంటే సత్యం ధర్మ భావాలతో కలుగుతుంది
నిత్యం సత్యాన్వేషణ భావాలు కల విశ్వ విజ్ఞానులే సత్య పీఠాన్ని అధిష్టించగలరు

శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదా

శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదా
నా నష్టానికి కూడా శివుని ఆజ్ఞయే కారణమా
నా విజ్ఞానానికి మరుపు కలిగించినది శివుడేనా
నాలో దివ్య కాలమున్నదో లేదో శివునికే తెలుసేమో

చీమకు పలానా రోగమున్నదని

చీమకు పలానా రోగమున్నదని ఏ శాస్త్రీయమున తెలిపారు
నాలోని సూక్ష్మ శాస్త్రీయం చీమకు కలిగే రోగాన్ని గుర్తించునా
అనారోగ్య స్థితి భావాలు శ్రమించుటలో కలిగే కాల భావ రోగాలే
చీమ రోగానికి వైద్య శాస్త్రీయం కాల భావాల ఆహారమే సూచిస్తుంది

ఉన్నవాడు లేనివారికి సహాయం

ఉన్నవాడు లేనివారికి సహాయం చేయుటలో లెక్కలు వ్రాసుకోవడం
లేనివారు ఉన్నవారిని మరచిపోగలరని ఉన్నవాడి లెక్కల గుణ లక్షణం
అవసరమైతే తనకు మరో సహాయం లేనివారు అందిస్తారని చిన్న ఆశ
కాల ప్రభావాలలో ఎవరికి ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగపడుతారో

నా భావాలతో ఇంకా జీవిస్తున్నావా

నా భావాలతో ఇంకా జీవిస్తున్నావా మీరూ నా భావాలతోనే జీవిస్తున్నారా
యుగాలుగా నా భావాలతో జీవించుటలో మీ ఆత్మ భావాలు ఎలాంటివి
మీలో ఉన్న నా భావాల విశ్వ స్థితులు ఏ స్వభావాలను కలిగిస్తున్నాయి
నా భావాల జీవ విజ్ఞానం యోగుల ఆత్మ స్థితి తత్వాల జీవిత బంధాలే

క్షణాల సమయమే కార్య కాలంగా

క్షణాల సమయమే కార్య కాలంగా సాగుతుంది
క్షణాలను లెక్కించలేవు ప్రతి క్షణాన్ని గమనించలేవు

నీ విజ్ఞానం అతనికి తెలియకపోతే రేపు

నీ విజ్ఞానం అతనికి తెలియకపోతే రేపు అతను తెలుసుకుంటాడు
అలాగే నీకు నేడు తెలియని విజ్ఞానం రేపు తెలుసుకుంటావు
ఒకరికి విజ్ఞానం లేనంత మాత్రాన అజ్ఞానిగా భావించనవసరం లేదు
రేపటికి అతను మహా విజ్ఞానిగా మారే కాల ప్రభావం వస్తుంది

ఇంకా ఈ విశ్వ శాస్త్రీయాన్ని ఎన్నాళ్ళుగా

ఇంకా ఈ విశ్వ శాస్త్రీయాన్ని ఎన్నాళ్ళుగా నేర్చుకోవాలి
మరో లోక శాస్త్రీయ విజ్ఞానాన్ని ఎప్పడు నేర్చుకోవాలి

నా నుదుటి రాతను ఎందుకు వ్రాశావో

నా నుదుటి రాతను ఎందుకు వ్రాశావో నేను మార్చుకోలేక పోతున్నా
ఏ అంకుశంతో ఏ ఆత్మ స్థితిలో ఏ ధ్యాసతో ఎవరు ఎలా ఎందుకు వ్రాశారో

ఎంత విజ్ఞానం ఉన్నా కాల జ్ఞానం

ఎంత విజ్ఞానం ఉన్నా కాల జ్ఞానం లేకపోతే జీవించడం విచారమే
ప్రతి క్షణం ఆందోళనగా దుఃఖ భావాలతో అవస్థతో సాగుతుంది
విజ్ఞానంలో మరుపు కలుగునట్లు కాల జ్ఞాన ఎరుకలో ఉండదు
మరుపు వలనే నష్టం అజ్ఞానం దుఃఖ భావాలు కలుగుతాయి
ఎరుకతో విశ్వ విజ్ఞానిగా కాల జ్ఞానంతో మహా గొప్పగా జీవించు

ఏ ఆశ లేదంటే ఆత్మ స్థితితో జీవించు

ఏ ఆశ లేదంటే ఆత్మ స్థితితో జీవించు నీ శ్వాసకు తోడుగా నే జీవిస్తా

ఓ మహాత్మా! నీ భావాన్ని తెలుపవా

ఓ మహాత్మా! నీ భావాన్ని తెలుపవా నీ తత్వాన్ని విశ్వానికి తెలుపుతా

నిద్రలోనే మహా ఆలోచనలున్నాయి

నిద్రలోనే మహా ఆలోచనలున్నాయి నిద్రలోనే మహా కార్యాలున్నాయి
నిద్రలోనే మహా కార్య శక్తి భావాలున్నాయి నిద్రలోనే ఊహా భావాలున్నాయి
మహా విజ్ఞాన ప్రణాళికలున్నాయి మహా అద్భుత స్వభావాలున్నాయి
మహా జీవిత ఆశయాలున్నాయి మహా మంత్ర తంత్ర యంత్రాలున్నాయి
మహా యోగుల విశ్వ రూపాలు మహాత్ముల తత్వ భావాలున్నాయి
మహా విశ్వ లోకాలు మహా గుణ విచక్షణ భవిష్య కాల జ్ఞాన భావాలున్నాయి

ఓ విశ్వ జీవి నీవు జీవించుటలో

ఓ విశ్వ జీవి నీవు జీవించుటలో ఏ యోగత్వమున్నదో
అవసరమైన అవయవాలు సరిగ్గా లేక దీర్ఘ కాల అనారోగ్యమే
నీవు జీవించుటలో ఆరోగ్యమే ఓ లక్ష్య సాధన ఐనా జీవిత కర్తవ్యమేమో
నీలా ఎందరో విశ్వమున జీవించు వారికి నా విశ్వ స్థితి ప్రకృతి మూలికం

శునకమా! ఏమిటి ఈ విశ్వ జీవ

శునకమా! ఏమిటి ఈ విశ్వ జీవ తత్వము
నీకు ఓ చెయ్యి ఓ కాళు విరిగిపోవుట భారమే
నీ జీవితం ఓ మహా లక్ష్య సాధనతో సాగుతుంది
ప్రతి రోజు ఓ లక్ష్యంతో విశ్వ తత్వంతో జీవిస్తున్నావు
నీ జీవితానికి ప్రతి క్షణం ప్రతి భావనకు నేను కృతజ్ఞున్నీ

అర్థమయ్యేలా ఉందా జీవితం

అర్థమయ్యేలా ఉందా జీవితం ప్రతి సమస్య తీరుతున్నదా
నీ మేధస్సులో అన్నింటికి పరిష్కార మార్గాలు ఉన్నాయా

ప్రకృతి తత్వం ఇంకా నా ఆత్మ స్థితిలో

ప్రకృతి తత్వం ఇంకా నా ఆత్మ స్థితిలో కలవటం లేదేమో
నా ఆత్మకు ఇంకా సూక్ష్మ విశ్వ స్వభావ తత్వాలు కావాలేమో

ఎవరి మేధస్సుకు ఏ విజ్ఞానం ఎప్పుడు

ఎవరి మేధస్సుకు ఏ విజ్ఞానం ఎప్పుడు ఎలా చేరుతుందో
ఎవరికి ఎప్పుడు ఎలా ఏ విజ్ఞానం ఉపయోగపడుతుందో

నీ మేధస్సును ఇక్కడే గమనిస్తూ

నీ మేధస్సును ఇక్కడే గమనిస్తూ నీ కోసమే ఆలోచిస్తున్నావు
నీ గురించే నీ సమస్యల గురించే నీ వారి గురించే ఆలోచిస్తున్నావు
ప్రక్కవారి గురించి సమాజం గురించి ఆలోచించే సమయం లేదా
విశ్వం ఎలా సాగుతున్నా మన గురించే ఆలోచిస్తూ జీవిస్తున్నాము
ఓ నిమిషం విశ్వాన్ని తలచుకోండి ఏ విషయాలు ఏ పరిస్థితులు తెలుస్తాయో

మీరు వేసే సంక్రాంతి ముగ్గులను నేను

మీరు వేసే సంక్రాంతి ముగ్గులను నేను తిలకిస్తున్నా
మీరు ఉదయానే లేచి రంగుల ముగ్గులు వేయడం
శ్రమించే విధానం ఆట పాటలు అన్నీ సంతోష భరితమే
అన్ని పండుగలకు నా ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి

మేఘముల మధ్య నిలిచి చూస్తే కదా

మేఘముల మధ్య నిలిచి చూస్తే కదా ఆకాశం ఎంత విశాలమో తెలియును
విశ్వపు అంచులు కూడా కానరాక అన్ని దిక్కులు అన్ని వైపుల దూరంగానే

నేటి నష్టాన్ని మరలా లాభం

నేటి నష్టాన్ని మరలా లాభం చేసుకోవాలనే తపనయే నిన్ను జీవింపజేస్తుంది
నేటి నుండి నీలో ఆశయాలు మొదలై ఆశలు అతిశయోక్తిగా పరుగులు తీస్తాయి

విశ్వ విజ్ఞాన కళాశాలలో నీవు ఏ తరగతి

విశ్వ విజ్ఞాన కళాశాలలో నీవు ఏ తరగతి చదువుతున్నావు

ఆత్మ స్థితి తెలియకపోతే విశ్వ గమనం

ఆత్మ స్థితి తెలియకపోతే విశ్వ గమనం నీకు అర్థం కాదేమో

విశ్వ విజ్ఞానం అర్థం కాకపోతే మళ్ళీ

విశ్వ విజ్ఞానం అర్థం కాకపోతే మళ్ళీ జన్మించడమే ఆత్మ సిద్ధాంతం
మళ్ళీ కష్టపడుతు ఎదుగుతూనే విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోవాలి
తెలుసుకోలేకపోతే మళ్ళీ యుగాలుగా తర తరాలుగా జన్మించాలి
ఆత్మ చైతన్య విశ్వ విజ్ఞానమే జన్మకు మోక్షమని నా ధ్యాన భావన

ఎక్కడ చూసినా వేల జన సంఖ్యల

ఎక్కడ చూసినా వేల జన సంఖ్యల గందర గోలమే
సమాజం ఇరుకుగా అవస్థగా అశుభ్రతగా కాలుష్యంగా
సమస్యలతో కిటకిట లాడుతున్నట్లు ఎవరి దారి వారిదే
ఎవరి ఆలోచన ఎవరి పని వారిదే ఎవరి తీరు వారిదే
వాహానాల మోత మానసిక ఆవేదన ఆలోచనకు అలజడి