ఆత్మ భావాలలోనే అతి విజ్ఞానం ఉన్నందున మేధస్సులో మితి మీరిన అజ్ఞానం
ఎక్కడ ఏ పని ఎలా చేయాలో విచక్షణ లేక సోమరిగా ఎక్కడంటే అక్కడ అశుభ్రతగా
ఒకరికి తెలిపే విధంగా ఆలోచించక మరొకరికి చీడ పురుగులా తయారవుతున్నావు
వాహానాలలో ఉమ్మేయడం చేతులు కడగడం దురలవాట్ల మందులను వేసుకోవడం
తినుబండరాల చెత్తను వేయడం దుర్వాసనలను కలిగించడం అశుభ్రతగా మార్చడం
ఇంకొకరికి వాంతులు కలగడం ప్రక్కవారికి అనారోగ్యాన్ని అంటు వ్యాదులను కలిగించడం
ఇదేనా మానవ శుభ్రత విచక్షణ తత్వ పరిపూర్ణ విజ్ఞానం పవిత్ర జీవిత విధానం
ఇలాంటి వారు విశ్వ విజ్ఞానాన్ని ఎన్ని జన్మలకైనా తెలుసుకునే అవకాశమే లేదు
వేటిని అరికట్టలేమా జీవిత విధానాన్ని ఇష్ట పూర్వకంగా జీవించేలా చేసుకోలేమా
ఇబ్బందిగానే జీవిస్తూ అశుభ్రతతో సాగుతూ సమాజంలో అనారోగ్య జీవిత ప్రయాణమా
ఒక కార్యాన్ని మంచిగా ఆలోచించలేక సమాజ పరిస్థితుల దుస్థితినే ఆలోచిస్తున్నాం
మనిషి ప్రగతికి లోటుపాట్లు సమాజపు అశుభ్రత సమస్యలే ఎక్కువ కారణం
ఏకాగ్రత కలగని ప్రాంతం ప్రదేశం జీవించేందుకు విజ్ఞాన ఆలోచనలను కలిగించలేవు
ఇంకా ఎలా చెబితే అర్థమవుతుందో మీరే నిర్ణయించుకోండి ఆలోచించుకోండి
నాలో మహా ప్రణాళికలు చాలా ఉన్నాయి చర్చించేందుకే ఎదురుచూస్తున్నాను
No comments:
Post a Comment