Monday, January 31, 2011

మనషికి జీవించడం తెలియకపోతేనే

మనషికి జీవించడం తెలియకపోతేనే మోసగిస్తారు జాగ్రత్త సుమా
తీసుకునేటప్పుడు మాయా మాటల విషం కప్పి అమృత ఆశా భావాలను కల్పిస్తారు
ఇచ్చేందుకు ఇస్తారని వెళ్ళితే అసలు విషయాన్ని కప్పి విషాన్ని తాగిస్తారు ఎందరో
సమాజంలో ఎందరో ఇలాగే జీవిస్తున్నారు మోసమే జీవితమని అనుకుంటున్నారు
మోసగించే వారి కర్మ సిద్ధాంతాన్ని తెలిపితే మళ్ళీ మరో మాట రాకూడదు వారి నోట
అనవసరమైన ఖర్చులు ధ్యాసలేని మితి మీరిన భావాలు అతి తెలివి చేష్టలు అలవాట్లు
స్నేహితులకే సహాయం చేస్తాం స్నేహితులతోనే మోసపోతున్నాము
స్నేహితులే శత్రువులవుతారు స్నేహానికే అర్థం లేకుండా పోతుంది
నీవు ఎవరికైనా ఏదైనా ఎంతటిదైనా ఏ ధ్యాసలోనైనా ఎలాగైనా ఇస్తే
మళ్ళీ నీకు తిరిగి రావాలని కోరుకోవద్దు కోరుకుంటే మోసపోతావు
నీ దగ్గర ఎప్పుడూ ఏదీ లేదనే జీవించు ఉందనే ఆశను కల్పించవద్దు
విజ్ఞానాన్ని లేదా కాస్త పనిని మాత్రమే సహాయంగా కోరుకోండి లేదంటే భేదాభిప్రాయాలే

No comments:

Post a Comment