నేటి మేధస్సును గొప్ప వారితో పోల్చుకుంటే దేనికి సమము కాదే
నేటి విజ్ఞానం అనంతంగా మారుతూ వివిధ రంగాలలో ఎందరో విజ్ఞానులున్నారు
మహా విజ్ఞానులతో నేడు జీవించే వారి విజ్ఞానం చాలా తక్కువగా కనిపిస్తుంది
ప్రతి రోజు విజ్ఞానం తక్కువ వస్తున్నట్లు విజ్ఞాన అన్వేషణ జరుగుతూనే ఉన్నది
ఏ మేధస్సు ఏ దిక్కున అన్వేషిస్తున్నదో వారి మేధస్సుకే తెలియక భారమవుతున్నది
ఏ విజ్ఞానాన్ని సేకరించాలో తెలియని సూక్ష్మ విజ్ఞానం నేడు ఉద్భవిస్తున్నది
ప్రతి రోజు కొత్త కొత్త భావాలతో విజ్ఞాన అన్వేషణతో సూక్ష్మ విజ్ఞానం ఉద్భవిస్తున్నది
ప్రస్తుతం ఎన్ని రంగాలు ఉన్నాయో సూక్ష్మంగా ఆలోచిస్తే ఏ మహాత్మకు తెలియవు
విజ్ఞాన కొరత ఎలా ఉన్నదో ఉద్యోగ అన్వేషణ చేసే వారికి బాగా తెలుస్తుంది
విజ్ఞాన మరుపు ఎలా ఉన్నదో ఎంత అజ్ఞానం ఉన్నదో వారికే తెలుస్తుంది
ఇక కార్యాలకై సాగిపోతుంటే మోసపోయే వారు లేదా ఆలస్యం చేసేవారు ఎందరో
జీవితం శ్రమా జీవితమైనా మాయగా తెలియని విజ్ఞాన అన్వేషనగా ఉంటుంది
తెలియనిది తెలిసినట్లు తెలుసుకుంటూనే విజ్ఞాన అన్వేషణ జరుగుతూనే ఉన్నది
అంతా ఆహార నిద్రలకే సాగుతూ విలాసవంతమైన జీవితానికి ప్రయాణం తీస్తుంది
భవిష్యత్ ను ఊహా భావాలతో ఒకరితో చూసుకుంటూ మరొకరితో పోల్చుకుంటూ
మనకు రేపటికి ఎన్నో దక్కుతాయనే ఆశాలోచన కలుగుతున్నది కనుక జీవిస్తున్నాం
No comments:
Post a Comment