ఇంకా ఏదో కావాలనే ఆశతోనే జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నాము
ఎటు వైపు ఎలా ఎంతవరకు ఏ దిక్కున ప్రయాణిస్తామో కాలమే చూపునా
విజ్ఞానమా విశ్వ భావాల దివ్యత్వమా సాగిపోయే మేధస్సుకు అన్వేషణగా
మరణ భావాన్ని మరచిపోయి ఆశా భావాలతోనే జీవితాన్ని సాగిస్తున్నాము
ఇంకా ఏదో కావాలనే భావాలతో విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించి సాగిపో
నీ ప్రయాణం విశ్వ విజ్ఞానమైతే ఆత్మ భావాలతో శూన్యాన్ని చేరుకుంటావు
No comments:
Post a Comment