Showing posts with label ఋషి. Show all posts
Showing posts with label ఋషి. Show all posts

Tuesday, December 20, 2016

ఏ రూపమో నీది ఏ ఆకారమో నీది

ఏ రూపమో నీది ఏ ఆకారమో నీది
ఏ భావమో నీది ఏ తత్వమో నీది
ఏ స్వభావాన్ని తెలిపెదవో ఏ వేదాన్ని సూచించెదవో
ఏ విజ్ఞానాన్ని భోధించెదవో ఏ అనుభవాన్ని నేర్పెదవో  || ఏ రూపమో ||

నీ రూపం ఏదైనా పరదైవ పరతత్వ పరమాత్మమే
నీ ఆకారం ఏదైనా పరరూప పరభావ పరంధామమే
నీవు తెలిపే భావ స్వభావాల వేదాంతం మహా విజ్ఞానమే
నీవు భోదించే అనుభవాల విజ్ఞానం మహా హితోపదేశమే
నీవు నేర్పే స్వర భాష సంభాషణల మహా జ్ఞాన గ్రంథమే  || ఏ రూపమో ||

ఏ దైవానివో నీవు ఏ ఆకార రూపమో నీవు ఆకాశంలోనే ఉదయిస్తున్నావు
ఏ బంధానివో నీవు ఏ భావ తత్వానివో నీవు ప్రకృతిలోనే ధ్వనిస్తున్నావు
ఏ ఋషి దేహానివో నీవు ఏ ఆత్మ ధ్యానివో నీవు పరలోకంలోనే ప్రజ్వలిస్తున్నావు
ఏ కాల జ్ఞానివో నీవు ఏ యుగ తరానివో నీవు ప్రతి లోకంలో ప్రత్యక్షమైవున్నావు
ఏ స్వర నాదానివో నీవు ఏ రాగ గానానివో నీవు ప్రతి జీవిలో ఓంకారమైవున్నావు   || ఏ రూపమో || 

Tuesday, September 27, 2016

ఏనాటి ఋషివో నీవు ఏనాటికి కనిపించని బ్రంహగా నీలోనే మిగిలిపోయావు

ఏనాటి ఋషివో నీవు ఏనాటికి కనిపించని బ్రంహగా నీలోనే మిగిలిపోయావు
ఏనాటి మహాత్మవో నీవు ఏనాటికి తెలియని మహర్షిగా కనిపించలేకపోయావు || ఏనాటి ఋషివో ||

పరంధామగా పరమాత్మవలే పర ధ్యాసలో ఉండిపోయావా
బ్రంహర్షిగా పర బ్రంహ వలే పర ధ్యానంలో నిండిపోయావా

విశ్వ పరంపరలలో ఏ పొరలలో ఎలా దాగి ఉన్నావో తెలుసుకోలేకపోయానే
సకల జీవరాసుల జగతిలో ఎలా ఏ జీవిలో లీనమయ్యావో తెలియకపోయనే  || ఏనాటి ఋషివో ||

ఋషిగా అధిరోహించిన మహర్షి బ్రంహర్షివి నీవే కదా
ఆత్మగా అవతరించిన అవధూత మహాత్మవు నీవే కదా

మహాత్మ విశ్వమంతా విధేయతతో నీ రాకకై ఎదురు చూస్తున్నది
ఓ పరమాత్మ జగమంతా వినయంతో నీ రాకకై తపిస్తూనే ఉన్నది    || ఏనాటి ఋషివో || 

Thursday, September 8, 2016

మహాత్మ మహాత్మ నీవే సాగాలి ఈ యుగానికి నీవే నిలవాలి

మహాత్మ మహాత్మ నీవే సాగాలి ఈ యుగానికి నీవే నిలవాలి
మహా ఋషిగా నీవే మహర్షివై ఈ జగమంతా నీవే నడవాలి
బ్రంహర్షిగా ధ్యానిస్తూ దేవర్షిగా దర్శనమిస్తూ విశ్వాన్ని నీవే నడపాలి  || మహాత్మ ||

కాలంతో ప్రయాణం ధ్యాసతో విజ్ఞానం శ్వాసతో ధర్మం తెలపాలి
భావంతో బంధం తత్వంతో వేదాంతం దేహంతో దైవం చాటాలి

ప్రతి జీవిలో నీవే ఉన్నావని అది నేనేనని తెలుసుకోవాలి
ప్రతి శ్వాసలో నీవే ఉంటావని అది నేనేనని గ్రహించాలి    || మహాత్మ ||

పర బ్రంహ విశ్వ విజ్ఞానాన్ని మేధస్సులో దాచుకొని ఎక్కడున్నావో ఓ మహర్షి
పర విష్ణు విశ్వ చైతన్యాన్ని శిరస్సులో ఉంచుకొని ఎక్కడికి వెళ్తున్నావో ఓ దేవర్షి

త్రి మూర్తుల త్రిగుణాలతో త్రిలోకాలను దర్శించేందుకు ప్రయాణం సాగించావా
త్రి తత్వ భావ స్వభావాలతో అనంత లోకాలను జయించేందుకు కాలంతో సాగేవా  || మహాత్మ || 

మహాత్మగా జీవించెదనా పరమాత్మగా ఒదిగెదనా

మహాత్మగా జీవించెదనా పరమాత్మగా ఒదిగెదనా
ఋషిగా అవతరించెదనా మహర్షిగా అధిరోహించెదనా
మాధవుడై నిలిచెదనా మహానుభావుడిగా మిగిలెదనా   || మహాత్మగా ||

పర లోకం నుండి వచ్చానని గర్వించెదనా
పర ధ్యాసలోనే ఉన్నానని ఊహించెదనా

ప్రజ్ఞానం ఉన్నా పర బ్రంహగా వేదాంతం తెలిపెదనా
విజ్ఞానం ఉన్నా పర తత్వాన్ని బోధిస్తూ సాగిపోయేదనా  || మహాత్మగా ||

విశ్వమంతా నా రూపం వ్యాపించి ఆకాశ వర్ణాన్ని సూర్యునితో చూపెదనా
జగమంతా నా వేద విజ్ఞానం దైవ ప్రచారమై  అవధూత ధ్వనితో చాటెదనా

ఎందరో మహాత్ముల ఘనతలు నా మేధస్సులో మహా ఘనంగా మ్రోగేనా
ఎందరో మహర్షుల ఘట్టాలు నా ఆలోచనలలో మహా ప్రస్థానమై సాగేనా   || మహాత్మగా ||

Thursday, August 25, 2016

ఋషివో మహా ఋషివో వేదాలకే మహర్షివో

ఋషివో మహా ఋషివో వేదాలకే మహర్షివో
ఆత్మవో మహా ఆత్మవో విజ్ఞానానికే మహాత్మవో  || ఋషివో ||

వేదాలనే అభ్యసించి వేదాంతమునే రచించిరి
అఙ్ఞానాన్నే త్యజించి విజ్ఞానాన్నే పరిశోధించిరి

సత్య ధర్మాలను నిరంతరం పాటించి సమాజానికి తెలిపారు
భావ స్వభావాలను నిత్యం అనుభవించి జ్ఞానమునే తెలిపారు  || ఋషివో ||

మహర్షిగా మహా ఋషివై విజ్ఞానంతో మహాత్ములనే సృష్టించితిరి
మహాత్మగా మహా ఆత్మవై వేదాంతంతో మహర్షులనే జయించితిరి

వేద పాండిత్యము వేదాలకు మహోత్తర నిర్వచనం
విశ్వ విజ్ఞానము మహా జ్ఞానులకు అపారమైన సోపానం  || ఋషివో || 

Wednesday, July 27, 2016

మరణించే మహాత్ముల మేధస్సు నాలో ఆలోచనలై సాగునులే

మరణించే మహాత్ముల మేధస్సు నాలో ఆలోచనలై సాగునులే
అస్తమించే మహర్షుల విజ్ఞానం నా భావాలలో కొనసాగిపోవునులే  || మరణించే ||

మహానుభావుల మహా విజ్ఞానం జగతికే తెలిసిన తన్మయం
మేధావుల మహా జ్ఞానం లోకానికే తెలియని వేదాల తపనం

మానవుడే మాధవుడై జీవించే లోకమే ఈ జగతి
మాధవుడే మహాత్మగా వీక్షించే విశ్వమే ఈ సృష్టి

ప్రతి క్షణం ఒక నిరీక్షణగా తపించే జీవన కాలమే ఋషి వర్యం
ప్రతి సమయం ఒక ధ్యాసగా తలిచే జీవిత కాలమే ఆత్మ స్థైర్యం   || మరణించే ||

ఉదయించే జీవుల విజ్ఞానం అస్తమించుటలో వృధాగా మారే కాలంతరం
విజ్ఞానమే లేకున్నా అజ్ఞానిగా జీవించే సమయం అనర్థమయ్యే తరుణం

అనుభవమే ఓర్చుకునే తత్వాన్ని కలిగిస్తూ జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నది
అనుబంధమే నేర్చుకునే తత్వమై నవ భావ జీవన విధానాన్ని వెంబడిస్తున్నది

మరణంతో రూపం వెళ్ళినా జ్ఞానంతో భవిష్య జీవులలో స్థిరంగా ఉండగలను
అస్తమించుటతో సమస్తం నిలిచిపోయినా నా విజ్ఞానం కాలంతో ఉండిపోవును  || మరణించే ||

Tuesday, July 26, 2016

విడిపోయే స్నేహమా ఏ బంధం లేని హృదయమా

విడిపోయే స్నేహమా ఏ బంధం లేని హృదయమా
మాటలకే మౌనమా కలసి ఉంటే నీతోనే కలహమా  || విడిపోయే ||

మరవలేని ద్వేషంతో చూపుల ఆలోచన కఠినమే
మనస్సులేని వేషంతో ఆవేదపు మాటల నటనమే

స్వార్థంతో గర్వమై సంతోషాన్ని నెట్టించే సంక్షోభమా
అజ్ఞానంతో గర్విష్టివై సుబంధాలతోనే విర్ర వీగడమా   || విడిపోయే ||

మహర్షిగా ఋషి తత్వం లేని ఆత్మీయ స్నేహ శతృత్వమా
దేవర్షిగా అమిథ్య  దైవత్వం లేని మహాత్మ భావ కోపత్వమా

కాలంతో విడిపోయే బంధానికి ఏనాటికైనా నీలో మరణమే
భావంతో వదిలిపోయే నీ స్నేహానికి ఎప్పటికైనా చింతనమే  || విడిపోయే ||

Wednesday, June 15, 2016

అంతరిక్షపు అంతర్జాల ఋషివి నీవే

అంతరిక్షపు అంతర్జాల ఋషివి నీవే
విశ్వ భావాల విజ్ఞాన స్వరూపుడివి నీవే
భావ తత్వాల స్పర్శ కేంద్రకుడివి నీవే
శూన్య స్థానమున అనంత మూర్తివి నీవే
వేద వేదాంత విజ్ఞాన పండితుడివి నీవే
భావ స్వభావాల ప్రదర్శకేంద్రుడివి నీవే
జనన మరణాల చరిత్ర గ్రంధానివి నీవే
సాంకేతిక పరిజ్ఞాన పరిశోధకుడివి నీవే
చిత్ర నిర్మాణ రూప కల్పనకుడివి నీవే
శిల్పకల చాతుర్య అభినయ నేత్రకుడివి నీవే
కళాదక్ష కళా ప్రపూర్ణ పర్యవేక్షకుడివి నీవే
సర్వ జ్ఞానేంద్రీయ జీవ విచక్షణుడివి నీవే
ఆత్మ పరతత్వ అర్థ పరమార్థానివి నీవే