Tuesday, December 20, 2016

ఏ రూపమో నీది ఏ ఆకారమో నీది

ఏ రూపమో నీది ఏ ఆకారమో నీది
ఏ భావమో నీది ఏ తత్వమో నీది
ఏ స్వభావాన్ని తెలిపెదవో ఏ వేదాన్ని సూచించెదవో
ఏ విజ్ఞానాన్ని భోధించెదవో ఏ అనుభవాన్ని నేర్పెదవో  || ఏ రూపమో ||

నీ రూపం ఏదైనా పరదైవ పరతత్వ పరమాత్మమే
నీ ఆకారం ఏదైనా పరరూప పరభావ పరంధామమే
నీవు తెలిపే భావ స్వభావాల వేదాంతం మహా విజ్ఞానమే
నీవు భోదించే అనుభవాల విజ్ఞానం మహా హితోపదేశమే
నీవు నేర్పే స్వర భాష సంభాషణల మహా జ్ఞాన గ్రంథమే  || ఏ రూపమో ||

ఏ దైవానివో నీవు ఏ ఆకార రూపమో నీవు ఆకాశంలోనే ఉదయిస్తున్నావు
ఏ బంధానివో నీవు ఏ భావ తత్వానివో నీవు ప్రకృతిలోనే ధ్వనిస్తున్నావు
ఏ ఋషి దేహానివో నీవు ఏ ఆత్మ ధ్యానివో నీవు పరలోకంలోనే ప్రజ్వలిస్తున్నావు
ఏ కాల జ్ఞానివో నీవు ఏ యుగ తరానివో నీవు ప్రతి లోకంలో ప్రత్యక్షమైవున్నావు
ఏ స్వర నాదానివో నీవు ఏ రాగ గానానివో నీవు ప్రతి జీవిలో ఓంకారమైవున్నావు   || ఏ రూపమో || 

No comments:

Post a Comment