Friday, December 23, 2016

ఓ భావమా ఓ తత్వమా

ఓ భావమా ఓ తత్వమా
విశ్వానికే తెలియని మహా భావమా
జగతికే కలగని మహోన్నత తత్వమా
మహా వేదాన్ని తెలిపే వేదాంత విజ్ఞానమా   || ఓ భావమా ||

జగమంతా ఉదయించే సూర్యోదయ సువర్ణ భావమా
విశ్వమంతా ఆవరించే మహోదయ కిరణ తేజత్వమా
బ్రహ్మాండమంతా వెలసిన అంతరిక్ష నిర్మాణ అద్భుతమా
ప్రపంచమంతా ఎదిగిన మహా జీవుల జీవన విధాన విజ్ఞానమా

లోకంలో విరిసిన మహా ప్రకృతి రూపమా
సృష్టిలో పరిచిన సహజ వనరుల ప్రదేశమా  || ఓ భావమా ||

ఏ ప్రభావం లేకుండా చలనం లేని దివ్యత్వమా
ఏ ప్రతాపశక్తితో ధ్వనించే భూగోళ పరిభ్రమణమా
ఏ సంఘటన లేనిదే మార్పు చెందని పరిణామమా
ఏ ఆకారమైన సంపూర్ణంగా కనిపించని రూప దృశ్యమా
ఏ రూపమైన అంతర్భావం చూడని సూక్ష్మ రూపాంతరమా
ఏ జీవమైన స్వాభావిక స్థితిని గమనించలేని పరిశోధనమా  || ఓ భావమా || 

No comments:

Post a Comment