Friday, December 9, 2016

ఓ సూర్య దేవా! నీ కిరణం లేక విశ్వానికి వెలుగు భావన లేదే

ఓ సూర్య దేవా! నీ కిరణం లేక విశ్వానికి వెలుగు భావన లేదే
ఓ సూర్య దేవా! నీ తేజము లేక జగతికి మెలకువ భావన రాదే  || ఓ సూర్య దేవా! ||

ప్రజ్వలమై ప్రసరించే నీ కిరణాల తేజములు లోకానికే వెలుగులు
ప్రకాశమై ఉద్భవించే ఆకాశ మేఘాల వర్ణాలే లోకానికి ఉత్తేజములు

చూపేలేని జీవులకు ఉత్తేజాన్ని కలిగించే మర్మ లోక భావన నీ చలన కార్యమే
చలనమే లేని వృద్దులకు శ్వాసను సాగించే కాల స్వభావన నీ ధ్యాన గమనమే  || ఓ సూర్య దేవా! ||

సువర్ణమువలే ప్రకాశించే నీ కిరణాల కాంతులు నేత్ర విజ్ఞాన మేధస్సులో మెలకువలు
అసంఖ్యాక వర్ణములచే ప్రజ్వలించే నీ రూప భావాలు ఉత్తేజ ప్రేరణల కార్య కలాపాలు

విశ్వమై వెలిగే నీ రూపం దేశమై ఉదయించి విదేశమై అస్తమించేను
జగమై జ్వలించే నీ దేహ భావం కాలంతో ప్రయాణమై ప్రజ్వలించేను  || ఓ సూర్య దేవా! ||

No comments:

Post a Comment