Showing posts with label నిలయం. Show all posts
Showing posts with label నిలయం. Show all posts

Tuesday, March 28, 2017

ఈ లోకం ఒక ఆలయం ఈ భువనం ఒక మందిరం

ఈ లోకం ఒక ఆలయం ఈ భువనం ఒక మందిరం
జగమంతా ఓ శరణాలయం విశ్వమే ఓ దేవాలయం
కాలమే ఒక వేదాలయం సమయమే ఓ దైవాలయం  || ఈ లోకం ||

ప్రతి జీవికి తన దేహమే మహోన్నత దేహాలయం
ప్రతి శ్వాసకు తమ ధ్యాసే మహోదయ ఆలయం

ప్రతి రోజు మన లోకం మేధస్సుకే మహా ఆలయం
ప్రతి క్షణం మన విశ్వం ఆలోచనకే మహా మందిరం  

భావాలతో సాగే ప్రతి జీవికి తమ తత్వమే దేహానికి నిలయం
స్వభావాలతో ఎదిగే ప్రతి జీవికి తమ శ్వాసే దేహానికి నివాసం  || ఈ లోకం ||

కాలం తెలిపే అనుభవాల వేదాలకు దేహమే స్వరాలయం
సమయం చూపే కార్య మార్గాలకు సూర్య తేజమే మార్గాలయం

విజ్ఞానంతో ఎదిగే మహా మేధస్సుకు మహోదయ భావాలే క్షేత్రాలయం
వినయంతో సాగే ఆలోచనకు మహోన్నత స్వభావాలే ప్రశాంతాలయం  

ఉత్తేజంతో సాగే మేధస్సులో సూర్య కిరణాల తేజమే కార్యాలకు స్వర్ణాలయం
ఆలోచనలతో సాగే సూక్ష్మ పరిశోధన భావాలకు విజ్ఞాన సోపానాలే తత్వాలయం  || ఈ లోకం ||

Thursday, December 8, 2016

వేదంలోనే లీనమైపోయా భావంతోనే నిలిచిపోయా

వేదంలోనే లీనమైపోయా భావంతోనే నిలిచిపోయా
రూపంతోనే ఉండిపోయా వర్ణంలోనే ఒదిగిపోయా
దైవంలోనే ఆగిపోయా తత్వంతోనే మరచిపోయా  
బంధంతోనే సాగిపోయా దేహంతోనే వెళ్ళిపోయా   || వేదంలోనే ||

జీవత్వమైనా దైవత్వమైనా మన దేహంలోని దాగివుంది
అద్వైత్వమైనా పరతత్వమైనా మన జీవంలోని దాగివుంది

వేదత్వమైనా భావత్వమైనా మన మేధస్సులోనే దాగివుంది
గుణత్వమైన వర్ణత్వమైనా మన ఆలోచనలలోనే దాగివుంది  || వేదంలోనే ||

పరతత్వ భావం  రూపం
పరభావ తత్వం పరమాత్మ దేహం

పరరూప వేదం పరజీవ తత్వం
పరదేహ మోహం పరధాత భావం

జీవం నిలయం దేహం ఆలయం
కాలం శాంతం సమయం క్షేత్రం

విశ్వంలోనే వేద సత్యం జగంలోనే వేదాంత ధర్మం
మౌనంలోనే మోహ బంధం శూన్యంలోనే సర్వ శాంతం  || వేదంలోనే ||

Tuesday, August 16, 2016

ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో తెలియని నీ రూపం నాలో చిత్రమై ఉన్నది

ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో తెలియని నీ రూపం నాలో చిత్రమై ఉన్నది
ఎప్పుడు వస్తావో ఎలా వస్తావో తెలుపని నీ సమయం నాలో అన్వేషణ ఐనది  || ఎక్కడ ||

ఎవరికి కనిపిస్తావో ఎవరికి వినిపిస్తావో నీలో నీవే ఉండిపోతావో తెలియుట లేదు
ఎవరిలో ఉన్నావో ఎందరిలో ఉన్నావో నీవే నిర్ణయించుకుంటావో తోచటం లేదు

మహా విజ్ఞానులు ఎందరున్నా నీవు ఉండే స్థానం మహా నిలయం
మహాత్ములు ఎక్కడ ఉన్నా నీవు తెలిపే వేదార్థం మహా విజ్ఞానం   || ఎక్కడ ||

కనిపించే నీ రూపం సూర్యోదయమై విశ్వానికి వెలుగునిస్తున్నది
వినిపించే నీ ప్రతి ధ్వని జీవోదయమై దేహానికి మహా ప్రాణమైనది

ఎవరిని తలిచినా నీ నామ ధ్యాన స్వరూపంలోనే మహత్యం దాగున్నది
ఎందరినో దర్శించినా నీ రూప దర్శనం కలగాలని నేత్రం తపిస్తున్నది || ఎక్కడ || 

Wednesday, June 15, 2016

ఆకాశం సృష్టికి నిలయం

ఆకాశం సృష్టికి నిలయం
ఆకాశం జగతికి సంపూర్ణం
ఆకాశం లోకానికి మందిరం
ఆకాశం మేధస్సుకే ఉత్తేజం
ఆకాశం విశ్వానికి సంయోగం
ఆకాశం మేఘానికి రూప వర్ణం
ఆకాశం సూర్యునికి మహా తేజం
ఆకాశం కిరణానికి దివ్య దర్శనం
ఆకాశం ఇంద్రధనస్సుకే పదిలం