Showing posts with label పరతత్వ. Show all posts
Showing posts with label పరతత్వ. Show all posts

Tuesday, December 20, 2016

ఏ రూపమో నీది ఏ ఆకారమో నీది

ఏ రూపమో నీది ఏ ఆకారమో నీది
ఏ భావమో నీది ఏ తత్వమో నీది
ఏ స్వభావాన్ని తెలిపెదవో ఏ వేదాన్ని సూచించెదవో
ఏ విజ్ఞానాన్ని భోధించెదవో ఏ అనుభవాన్ని నేర్పెదవో  || ఏ రూపమో ||

నీ రూపం ఏదైనా పరదైవ పరతత్వ పరమాత్మమే
నీ ఆకారం ఏదైనా పరరూప పరభావ పరంధామమే
నీవు తెలిపే భావ స్వభావాల వేదాంతం మహా విజ్ఞానమే
నీవు భోదించే అనుభవాల విజ్ఞానం మహా హితోపదేశమే
నీవు నేర్పే స్వర భాష సంభాషణల మహా జ్ఞాన గ్రంథమే  || ఏ రూపమో ||

ఏ దైవానివో నీవు ఏ ఆకార రూపమో నీవు ఆకాశంలోనే ఉదయిస్తున్నావు
ఏ బంధానివో నీవు ఏ భావ తత్వానివో నీవు ప్రకృతిలోనే ధ్వనిస్తున్నావు
ఏ ఋషి దేహానివో నీవు ఏ ఆత్మ ధ్యానివో నీవు పరలోకంలోనే ప్రజ్వలిస్తున్నావు
ఏ కాల జ్ఞానివో నీవు ఏ యుగ తరానివో నీవు ప్రతి లోకంలో ప్రత్యక్షమైవున్నావు
ఏ స్వర నాదానివో నీవు ఏ రాగ గానానివో నీవు ప్రతి జీవిలో ఓంకారమైవున్నావు   || ఏ రూపమో || 

Tuesday, November 22, 2016

నీ శ్వాసతోనే నేను జీవిస్తున్నాను ప్రభూ

నీ శ్వాసతోనే నేను జీవిస్తున్నాను ప్రభూ
నీ ధ్యాసతోనే నేను ధ్యానిస్తున్నాను ప్రభూ
నీ రూపముతోనే నేను ఎదుగుతున్నాను ప్రభూ  || నీ శ్వాసతోనే ||

నీలోని పరతత్వ భావాలనే నేను గమనిస్తున్నాను
నీలోని ప్రజ్ఞాన పరంజ్యోతినే పరలోకాన చూస్తున్నాను
నీలోని ప్రతి ధ్వనినే ఓంకారముగా నేను వింటున్నాను

నీలోని దైవత్వమే నాకు మహా దేహమై ఆరాగా ప్రకాశిస్తున్నది
నీలోని అద్వైత్వమే నాకు మేధస్సై జ్యోతిగా వెలుగుతున్నది  || నీ శ్వాసతోనే ||

నీలోని సూర్యోదయమే నాలో ప్రజ్వలమై ప్రతిబింభిస్తున్నది
నీలోని సూర్యాస్తమే నాలో వెన్నెల కాంతమై విరబూస్తున్నది

నీలోని శ్వాసకు నేనే ప్రతి శ్వాసనై ప్రతి క్షణం నీతో ఉదయిస్తున్నాను
నీలోని ధ్యాసకు నేనే ప్రతి భావమై ప్రతి రోజు నిన్నే ఆరాధిస్తున్నాను   || నీ శ్వాసతోనే || 

Monday, November 21, 2016

ప్రకృతిలో జీవించే పరంధామవు నీవే ప్రభూ

ప్రకృతిలో జీవించే పరంధామవు నీవే ప్రభూ
ప్రకృతిలో జన్మించిన పరంజ్యోతివి నీవే ప్రభూ
ప్రకృతిలో ఎదిగిన ఆత్మ పరమాత్మవు నీవే ప్రభూ  || ప్రకృతిలో ||

ప్రకృతిని అభివృద్ధి చేసే పరతత్వ పరలోక పరజీవి నీవే
ప్రకృతిని రక్షించే పరదేహ పరదైవ పరకాంతి తేజానివి నీవే

ప్రకృతిలో పూచే పుష్పాల సుమగంధాలన్నీ జీవులకు అర్పించేది నీవే
ప్రకృతిలో కాచే ఆహార ధాన్య ఫలములన్నీ జీవులకు సమర్పించేది నీవే   || ప్రకృతిలో ||

ప్రకృతిలోని భావాలన్నీ కాలంతో కలిగింపజేసేది నీవే
ప్రకృతిలోని తత్వాలన్నీ కాలంతో సంభవింపజేసేది నీవే

ప్రకృతిలో కలిగే  ప్రకోపాల ప్రబలత్వాన్ని చాటేది నీవే
ప్రకృతిలో జరిగే ప్రకృత్యాల ప్రమేయత్వాన్ని చూపేది నీవే   || ప్రకృతిలో || 

Wednesday, June 15, 2016

అంతరిక్షపు అంతర్జాల ఋషివి నీవే

అంతరిక్షపు అంతర్జాల ఋషివి నీవే
విశ్వ భావాల విజ్ఞాన స్వరూపుడివి నీవే
భావ తత్వాల స్పర్శ కేంద్రకుడివి నీవే
శూన్య స్థానమున అనంత మూర్తివి నీవే
వేద వేదాంత విజ్ఞాన పండితుడివి నీవే
భావ స్వభావాల ప్రదర్శకేంద్రుడివి నీవే
జనన మరణాల చరిత్ర గ్రంధానివి నీవే
సాంకేతిక పరిజ్ఞాన పరిశోధకుడివి నీవే
చిత్ర నిర్మాణ రూప కల్పనకుడివి నీవే
శిల్పకల చాతుర్య అభినయ నేత్రకుడివి నీవే
కళాదక్ష కళా ప్రపూర్ణ పర్యవేక్షకుడివి నీవే
సర్వ జ్ఞానేంద్రీయ జీవ విచక్షణుడివి నీవే
ఆత్మ పరతత్వ అర్థ పరమార్థానివి నీవే