Showing posts with label అద్భుతం. Show all posts
Showing posts with label అద్భుతం. Show all posts

Thursday, August 17, 2017

మరవలేను జ్ఞాపకాలలో నీ మహోత్సవం

మరవలేను జ్ఞాపకాలలో నీ మహోత్సవం
మరచిపోలేను గమనాలలో నీ వైభవోత్సవం
అంగరంగ వైభోగమే నీ కళ్యాణ బ్రంహోత్సవం

జగతికి మహా ఉత్సవం విశ్వతికి మహా దైవోత్సవం
ప్రకృతికి మహా సంతోషం జనతికి మహా ఆనందం  || మరవలేను ||

గమనించలేదు నీ భావాలను ఇంతకు ముందెన్నడు
తపించలేదు నీ స్వభావాలను ఇంతకు ముందెన్నడు

వినిపించలేదు నీ స్వరాలు ఇంతకు ముందెన్నడు
కనిపించలేదు నీ తత్వాలు ఇంతకు ముందెన్నడు  || మరవలేను ||

భవిష్య కాలాన ఏమున్నదో ఇంతకన్నా మహా గొప్పదనం
రాబోయే కాలాన ఏమున్నదో ఇంతకన్నా మహా అద్భుతం

తరతరాలుగా సాగే కళ్యాణ రథోత్సవ ఉత్సవం విశ్వతికి మహా బ్రంహోత్సవం
యుగయుగాలుగా సాగే వైభోగ మహోత్సవ సర్వోత్సవం జగతికి మహా శుభోత్సవం  || మరవలేను || 

Monday, January 23, 2017

ఏనాటి ఋషివయ్యా నీవూ ... విశ్వ ప్రకృతినే విడిచిపోయావా

ఏనాటి ఋషివయ్యా నీవూ ... విశ్వ ప్రకృతినే విడిచిపోయావా
ఏనాటి మహర్షివయ్యా నీవూ ... జగతి లోకాలనే వద్దనుకున్నావా
ఆత్మ పరమాత్మగా గా విశ్వ జ్ఞాన భావాలనే మరచిపోయావా
పర బ్రంహ పరంధామగా జగతి తత్వాలనే వదులుకున్నావా  || ఏనాటి ఋషివయ్యా ||

చూడవా ఈ విశ్వాన్ని విజ్ఞాన ప్రకృతి సంపదగా నీ మేధస్సులో అన్వేషణతో
చూస్తూనే ఉన్నావా ఈ జగతిని మహా వనరులుగా నీ నేత్రములో పర్యేషణతో  

ప్రతి నిర్మాణం ఓ అద్భుతం ప్రతి ఖనిజము ఓ వింత ఆశ్చర్యం
ప్రతి వృక్షం ఓ మహా విశేషం ప్రతి ఫలము ఓ గొప్ప ప్రయోజనం  

ప్రతి అణువు ఒక ఆత్మ స్వభావం ప్రతి పరమాణువు ఓ పరమాత్మ తత్వం
ప్రతి రూపం ఒక మహాత్మ భావం ప్రతి ఆకారం ఓ గొప్ప మహర్షి అద్వైత్వం  || ఏనాటి ఋషివయ్యా ||

ప్రతి రూపాన్ని పరిశీలిస్తే ఎన్నో అనేక అద్భుతాలు తెలిసేను
ప్రతి భావాన్ని పరిశోధిస్తే ఎన్నో అసంఖ్యాక ఆశ్చర్యాలు కలిగేను

ప్రతి ఆకారాన్ని గొప్పగా ఆలోచిస్తూ చూస్తేనే ఎన్నో విషయాలు తెలిసేను
ప్రతి తత్వాన్ని మహాత్మగా అనుభవిస్తూ వస్తేనే ఎన్నో సంగతులు తెలిసేను  

విశ్వ ప్రకృతి స్వభావాలలోనే అనేక బహు బంధాలు మిళితమై జీవులకు ఎంతో ఉపయోగపడును
జగతి తత్వాల రూపాలలోనే ఎన్నో సంబంధాలు మిశ్రమమై జ్ఞానులకు ఎంతో ప్రయోజనమగును  || ఏనాటి ఋషివయ్యా ||