Showing posts with label అంతర్ముఖము. Show all posts
Showing posts with label అంతర్ముఖము. Show all posts

Monday, October 17, 2016

అంతర్యామి అలసితి సొలసితి

అంతర్యామి అలసితి సొలసితి
అవధూతగా నిన్నే కొలిచితి పిలిచితి
ఆత్మ పరమాత్మగా నీకై నేనే మిగిలితి  || అంతర్యామి ||

నా అంతర్భావాలలో నీవే నా అంతరాత్మవు
నా అంతర్భాగములో నీవే నా అవధూతవు
నా అంతర్ముఖములో నీవే నా పరమాత్మవు

నా భారాన్ని ఏనాటి వరకు మోసితివి
నా మోక్షాన్ని ఏనాటి వరకు దాచితివి
నా మరణాన్ని ఏనాటి వరకు పెంచితివి  || అంతర్యామి ||

నీ దర్శనముకై నీ సప్త ద్వారముల యందే నిలిచితి
నీ రూపమునకై నీ అంతస్తుల అడుగులనే కొలిచితి
నీ వరమునకై నీ దూరముల ప్రయాణమునే నడిచితి

నీవే నాకు దిక్కుగా నేనే నీకు మోక్కుగా సాగితిని
నీవే నాకు దైవంగా నేనే నీకు దేహంగా ఉండితిని
నీవే నాకు ధర్మంగా నేనే నీకు సత్యమై పలికితిని  || అంతర్యామి ||