Showing posts with label ధనాశత్వము. Show all posts
Showing posts with label ధనాశత్వము. Show all posts

Friday, July 29, 2016

అమ్మగా జీవాన్ని పోశావు తల్లిగా నీ రూపాన్ని పెంచావు

అమ్మగా జీవాన్ని పోశావు తల్లిగా నీ రూపాన్ని పెంచావు
విశ్వంతో బంధాన్ని కలిపించి జగతికే పరిచయించావు  || అమ్మగా ||

నీ కోసమే నేను జీవిస్తూ నిత్యం తపిస్తూ జీవనాన్ని సాగిస్తున్నా
కష్టాల నష్టాలు దుఃఖాలుగా ఎన్ని ఎదురైనా వెనుకడుగే లేదే

విజ్ఞానముకై లోకాన్నే సంచరించా అనుభవముకై సందేశాన్ని సేకరించా
జీవన విధానముల సమస్యలతో ఒదిగిపోయి పరిస్థితులతోనే ఓర్చుకున్నా

నేటి జీవన విధానమున సమస్యలు ఎన్నో సరికాని కార్యాలు ఎన్నెన్నో
నేటి కాల జీవితం వృధాగా సాగే శ్రమ శూన్యమయ్యే ఫలితం మరణంలా  || అమ్మగా ||

ఎదగాలని ఉన్నా ఎన్నో పరిస్థితులు అడ్డంకులుగా దరిచేరుతున్నాయి
ఎంత కాలం వేచివున్నా సరైన పరిపాలక వ్యవస్థ రాలేని ధనాశత్వము

మరణం వరకు నాలో విజ్ఞానాన్ని పెంచుకుంటూ చరిత్రకు సూచనగా మిగిలిపోతా
విశ్వమే నిలిచే వరకు నా భావాలతో కాల జ్ఞానంగా జగతికి మార్గదర్శంగా సాగిపోతా

ఉదయించే సూర్యునితోనే నా విజ్ఞానాన్ని ఆకాశానికి మేఘ వర్ణాలతో తెలుపుకుంటాను
అస్తమించే సమయంతోనే నా భావ తత్వాలను సృష్టికి నిర్వచనముగా మిగిలిపోతాను  || అమ్మగా ||