Showing posts with label మేధాశక్తి. Show all posts
Showing posts with label మేధాశక్తి. Show all posts

Thursday, December 22, 2016

మరణం లేదనుకో అసాధ్యం లేదనుకో

మరణం లేదనుకో అసాధ్యం లేదనుకో
సాధనతో సాధించే ప్రయత్నం చేసుకో

తెలిసినదే జ్ఞాపకం చేసుకో తెలియనిదే గమనంతో తెలుసుకో
తెలియకపోతే తెలిసిన వారితో చర్చిస్తూ ఓపికతో ఎంతో నేర్చుకో  || మరణం ||

నీ మేధస్సులో ఎంతో విజ్ఞాన ప్రదేశం ఖాళీగా ఉందని తెలుసుకో
నీ మేధస్సులో ఎంతో ఆలోచనల ప్రవాహం సాగునని తెలుపుకో

నీ  మేధస్సులో ఉన్న అపారమైన విజ్ఞానాన్ని జ్ఞాపకంగా దాచుకో
నీ మేధస్సులో దాగిన విజ్ఞానాన్ని ఉత్తేజమైన మేధాశక్తిగా చేసుకో

నీ మేధస్సులో అన్వేషణ మొదలైతే విశ్వ భావ జీవ రహస్యాలెన్నో చేర్చుకో
నీ మేధస్సులో వేదాంతం ప్రారంభమైతే లోక జ్ఞాన వేదత్వాలెన్నో లెక్కించుకో  || మరణం ||

నీలో జీవించే ప్రాణ శక్తిని స్వధ్యానంతో దీర్ఘాయుస్సుగా మార్చుకో
నీలో ధ్వనించే జీవ శక్తిని స్వర నాదంతో దీర్ఘ కాలంగా సాగించుకో

నీవే మహా వేదమై మహాత్మగా ఎదుగుతూ పరలోకాన్ని అర్థం చేసుకో
నీవే మహా తత్వమై మహర్షిగా ఒదుగుతూ పరమార్థాన్ని గ్రహించుకో

నీవే అణువై ఓ పరమాణువుగా పరిశోధించి సూక్ష్మ జ్ఞానాన్ని పెనవేసుకో
నీవే పరమాణువై మహా అణువుగా పర్యవేక్షించి విజ్ఞానాన్ని పెకలించుకో  || మరణం || 

Tuesday, December 20, 2016

ప్రకృతిలోనే ఉదయించా ప్రకృతిలోనే జీవించా

ప్రకృతిలోనే ఉదయించా ప్రకృతిలోనే జీవించా
ప్రకృతిలోనే ఎదుగుతూ ప్రకృతిలోనే ఒదుగుతున్నా  || ప్రకృతిలోనే ||

ప్రకృతియే పర భావం ప్రకృతియే పర తత్వం
ప్రకృతియే పర జ్ఞానం ప్రకృతియే పర వేదం

ప్రకృతియే పరమాత్మం ప్రకృతియే పరంధామం
ప్రకృతియే పరిశోధనం ప్రకృతియే ప్రయోగాత్మం

ప్రకృతిలో కలిగే నవ ఋతువుల మార్పులు మనలో పటిష్టం
ప్రకృతిలో కలిగే కాల ప్రభావాల మార్పులు మనలో పరివర్తనం  || ప్రకృతిలోనే ||

ప్రకృతినే జయించు ప్రకృతినే పరిశుద్ధంగా పరిశీలించు
ప్రకృతినే సాగించు ప్రకృతినే మహా కేంద్రంగా నడిపించు

ప్రకృతికై జీవితాన్నే శ్రమించు నీలోని ప్రజ్ఞానాన్నే ఉపయోగించు
ప్రకృతికై జీవనమే సాగించు నీలోని అపార మేధాశక్తినే ప్రయోగించు

ప్రకృతి పర్యావరణమే తరతరాల యుగాల సంపదల ప్రాణాధార ఆహారం
ప్రకృతి వాతావరణ పరిసరాల సమతుల్యత శతాల దశాల జీవులకు కుటీరం  || ప్రకృతిలోనే ||

Friday, December 16, 2016

ఏనాటి కాలానిదో మేధస్సు విజ్ఞానముకై సృష్టించబడి ఉన్నది

ఏనాటి కాలానిదో మేధస్సు విజ్ఞానముకై సృష్టించబడి ఉన్నది
ఏ విశ్వ భావానిదో మేధస్సు రూప కల్పన బహు నిర్దిష్టమైనది  

భావ స్వభావాలతో ఆలోచించేలా ఆలోచనలతో పనిచేస్తున్నది
జ్ఞాపకాల తత్వాలతో బంధాలనే దాచుకుంటూ ఆలోచిస్తున్నది   || ఏనాటి ||

ఎవరు సృష్టించారో ఎలా ఆలోచించారో ఏనాడు ఎలా ఎవరికి తోచినదో
ఎంతకాలం పరిశోధించారో ఎన్ని జీవుల మేధస్సులను పరిశీలించారో

మనిషే లేని కాలం ముందే జీవమే లేని కాలం ముందే దేని భావనయే
ప్రకృతిలో కలిగే అనంతమైన సూక్ష్మ మార్పుల ప్రక్రియ పరిశోధనమేనా

ఏ ప్రకృతి ప్రభావాలతో ఏర్పడినదో అనంత భావ స్వభావాల మేధస్సు
ఏ ప్రకృతి తత్వాలతో కేంద్రీకృతమైనదో శిరస్సులో పొదిగిన మేధస్సు  

మేధస్సు ఎంత గొప్పదో ఎంతని మేధస్సే వివరించలేని అనిర్వచనం
మేధస్సు ఎంత విలువైనదో కాలానికే తెలియని మహా మేధాశక్తి తత్వం  || ఏనాటి ||

మేధస్సులతోనే చలనం కదలికల ప్రభావం స్వతహాగా ఆలోచించే భావ తత్వం
ఆలోచనల ఎరుక ప్రభావంతో అర్థాల స్వభావాలతో విజ్ఞానాన్ని గమనించి నేర్చుకోవడం

జ్ఞాపకాలతోనే కార్యాలను సాగిస్తూ ఎన్నో పనిముట్లుగా యంత్రాలుగా ఎన్నో రూపకల్పనలు చేసుకోవడం
కార్యా విషయాలను సూచనల సైగలను చిత్ర లిపి ద్వారా సాగిస్తూ భాషను అర్థంగా వ్యాకరణించుకోవడం

సూది నుండి ఉపగ్రహం దాక ఎన్నో యంత్ర పరికరాల భాషా విజ్ఞానాన్ని పరిశోధిస్తూనే కాలంతో సాగిపోవడం
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నో రకాలుగా మార్పులు చేస్తూ మనిషికి సులువుగా ఉండేలా యంత్రాలతో పనిచేసుకోవడం

మేధస్సులో జ్ఞాపక ధారణ శక్తి ఎంతో అంతులేని విధంగా అనంత విజ్ఞానాన్ని తర తరాలుగా దాచుకోవడం
మేధస్సులో కలిగే లోపాలనను శరీరంలో కలిగే లోపాలను ఎన్నో సూక్ష్మ యంత్రాలతో చికిత్స చేసుకోవడం  || ఏనాటి ||