Monday, April 16, 2018

ఏ సమయం అద్భుతం ఏ సమయం ఆనందం

ఏ సమయం అద్భుతం ఏ సమయం ఆనందం
ఏ సమయం ఆశ్చర్యం ఏ సమయం ఆరాటం

కాలంతో సాగే జీవితంలో ఎన్నో అనుభవాలు
సమయంతో సాగే జీవనంలో ఎన్నో అభిరుచులు  || ఏ సమయం ||

సుఖదుఃఖాలన్నీ కలసినట్లుగా లాభనష్టాలన్నీ ఇమిడిపోతాయి
శుభం లాభంలా శ్రీరస్తూ శుభమస్తూ సుకాలంతో కలిసిపోతాయి

శుభ ముహూర్తం శుభ మంగళం మహా కల్యాణంతో జరిగిపోతాయి
సూర్యోదయం సూర్యాస్తమయం చీకటి వెలుగులతో వచ్చిపోతాయి  || ఏ సమయం ||

ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు జనన మరణంలా కలిగిపోతాయి
అజ్ఞాన విజ్ఞానాలు వేదాల పాఠాలుగా సాగిపోతాయి

అల్పము అధికములు అసంతృప్తి అతిశయోక్తిలా వెళ్ళిపోతాయి
ఆకాశము ధరణి సృష్టించడం నశించడంతో కొనసాగిపోతాయి     || ఏ సమయం ||

Saturday, April 14, 2018

ఏ శ్వాసతో ఉన్నావని తలిచెదను నిన్ను

ఏ శ్వాసతో ఉన్నావని తలిచెదను నిన్ను
ఏ ధ్యాసతో ఉన్నావని పలికించెదను నిన్ను

ఏ భావంతో ఉంటావని తపించెదను నిన్ను
ఏ తత్వంతో ఉంటావని స్మరించెదను నిన్ను  || ఏ శ్వాసతో ||

ఏ శ్వాస ధ్యాసతో ఉన్నా నా దేహంలో నీ ప్రాణమే 
ఏ భావ తత్వంతో ఉన్నా నా రూపంలో నీ జీవమే

ఏ బంధమైన నాలో నీ స్వరూపం సంతోషమే
ఏ ప్రదేశమైన నాలో నీ స్వదేహం సౌభాగ్యమే  || ఏ శ్వాసతో ||

ఏ శ్వాస నిన్ను పలికించినా నా రూపం నీలో వేదమే
ఏ ధ్యాస నిన్ను మళ్ళించినా నా దేహం నీలో దైవమే

ఏ భావం నిన్ను దర్శించినా నా జీవం నీలో స్పందనమే
ఏ తత్వం నిన్ను ధరించినా నా మౌనం నీలో మోహనమే  || ఏ శ్వాసతో ||

మేధస్సులోనే గమనం మేధస్సులోనే చలనం

మేధస్సులోనే గమనం మేధస్సులోనే చలనం
మేధస్సులోనే మననం మేధస్సులోనే తపనం

మేధస్సులోనే మహా ఆలోచనల పరంపరం
మేధస్సులోనే అనంత జ్ఞాపకాల పరిశోధనం  || మేధస్సులోనే ||

తెలిసినది తెలియనిది తెలిపేదే మేధస్సులోని జ్ఞాపకం
జరిగినది జరగనిది ఆలోచించేదే మేధస్సులోని ఎరుకం

అవగాహనాలతో ఆలోచించే ఊహల కథలు మేధస్సులోనే అనేకం
అనుభవాలతో ఆలోచించే ఉపాయాల కలలు మేధస్సులోనే తపనం  || మేధస్సులోనే ||

మేధస్సుకే మౌనం నిరంతర కార్యం నిమగ్నమైన స్వభావం
మేధస్సుకే సర్వం ఆలోచనల వరం స్పందించే స్వతత్త్వం

మేధస్సుకే రూపాంతర భావాల సమయోచిత చలనం 
మేధస్సుకే గ్రహాంతర తత్వాల సమన్వయ తపనం     || మేధస్సులోనే || 

రంగస్థలం రంగస్థలం వేదికగా సాగే నటులకు సభాజన స్థలం

రంగస్థలం రంగస్థలం వేదికగా సాగే నటులకు సభాజన స్థలం
రంగస్థలం రంగస్థలం ఆకర్షణగా సాగే కార్యాలకు సంస్థాన స్థలం

బహు జనులకు అనుమతించే విశాలమైన సౌఖ్యమైన ప్రదేశమే రంగస్థలం 
ఎంతటివారైనా ఎక్కడివారైనా అనుభవాలను ప్రదర్శించే స్థానమే రంగస్థలం  || రంగస్థలం ||

జన చాతుర్యాలతో సాగే ప్రతిభలను తిలకించే ప్రతిష్ఠానమే రంగస్థలం
జన విజ్ఞానాలతో సాగే సమావేశాలను నిర్వర్తించే మైదానమే రంగస్థలం
జన సమూహాలతో సాగే మహా కార్యాలను నడిపించే ప్రదేశమే రంగస్థలం
జన సంబంధాలతో సాగే అనురాగాలను వీక్షించే సత్సంగమే రంగస్థలం
జన ఉత్సాహాలతో సాగే సంభరాలను కొనసాగించే సంస్థానమే రంగస్థలం  || రంగస్థలం ||

జన ప్రభావాలతో సాగే వివాదాలను విమర్శించే సమ్మేళనమే రంగస్థలం
జన పరిస్థితులతో సాగే వ్యవహారాలను సమీక్షించే సందిగ్ధమే రంగస్థలం
జన సంతోషాలతో సాగే అభిప్రాయాలను పలికించే ఔన్నత్యమే రంగస్థలం 
జన వేషాధారణలతో సాగే నాట్యములను నిరీక్షించే ప్రదర్శనమే రంగస్థలం
జన స్నేహత్వాలతో సాగే వేదాంతాలను విశదీకరించే సందర్శనమే రంగస్థలం  || రంగస్థలం || 

Friday, April 13, 2018

సమస్తం విజ్ఞానం మేధస్సులోనే చేరేను

సమస్తం విజ్ఞానం మేధస్సులోనే చేరేను
సమస్తం వేదాంతం మేధస్సుకే అందేను

నిత్యం జీవన వేదం ఆలోచనకే తెలిసేను
నిత్యం జీవిత సత్యం ఆలోచనలకే తోచేను

సర్వం సమస్తమంతా మేధస్సుకే ఆలోచన వేదం
నిత్యం సమస్తమంతా మేధస్సుకే ఆలోచన జ్ఞానం   || సమస్తం ||

కార్యంతోనే చలనం వేదంతోనే జ్ఞానం మేధస్సుకే గమనం
కాలంతోనే తపనం భావంతోనే తత్త్వం మేధస్సుకే మననం

ఆలోచనల గమనం మేధస్సులో చలనం విజ్ఞాన వేదం
ఆలోచనల మననం మేధస్సులో తపనం భావన తత్త్వం   || సమస్తం ||

విశ్వంలోనే జ్ఞానం ప్రకృతిలోనే వేదం కలిగించును జీవన భావన యోగం
లోకంలోనే బంధం ఆకృతిలోనే వర్ణం ఆవహించును జీవిత తత్వన భోగం 

మేధస్సులోని చలనం విజ్ఞానంతో సాగే ఆలోచనకే అలసటలేని గమనం
మేధస్సులోని తపనం వేదాంతంతో సాగే ఆలోచనకే విశ్రమణలేని మననం    || సమస్తం ||

Wednesday, April 11, 2018

ప్రకృతియే నాలో మాతృ జీవమై జీవిస్తున్నది

ప్రకృతియే నాలో మాతృ జీవమై జీవిస్తున్నది 
ప్రకృతియే నాలో పితృ దైవమై ఉదయిస్తున్నది

ప్రకృతియే నాలో ఆచార్య భావమై ప్రకాశిస్తున్నది   
ప్రకృతియే నాలో ఆరాధ్య తత్వమై ప్రజ్వలిస్తున్నది

ప్రకృతియే నాలో విశ్వ సంభూతమై అధిరోహిస్తున్నది   || ప్రకృతియే ||

ప్రకృతియే నాలో సర్వం జీవిస్తూ ఉదయిస్తున్నది
ప్రకృతియే నాలో నిత్యం ధ్యానిస్తూ ప్రకాశిస్తున్నది

పకృతియే నాలో వేదం విజ్ఞానమై వికసిస్తున్నది  
ప్రకృతియే నాలో బంధం ధర్మమై నడిపిస్తున్నది    || ప్రకృతియే ||

ప్రకృతియే నాలో జీవం పరిశోధనమై బోధిస్తున్నది
ప్రకృతియే నాలో రూపం అన్వేషణమై కీర్తిస్తున్నది

ప్రకృతియే నాలో దేహం సంయోగమై వర్ణిస్తున్నది
ప్రకృతియే నాలో దైవం సంభోగమై విహరిస్తున్నది    || ప్రకృతియే ||

Monday, April 9, 2018

తల్లీ! అమృతమే నీవు అమరమే నీవు

తల్లీ! అమృతమే నీవు అమరమే నీవు 
దేవి! అద్భుతమే నీవు ఆనందమే నీవు
మాత! ఆశ్చర్యమే నీవు ఆరాధ్యమే నీవు
ధాత్రి! ఆద్యంతమే నీవు అద్వైత్వమే నీవు 

నీవే లేని అణువు అదృశ్యం నీవే లేని పరమాణువు అనిత్యం   || తల్లీ! ||

విశ్వ జగతికి రూపమే నీవు విశ్వ జ్ఞానికి వేదమే నీవు
విశ్వ జ్యోతికి తేజమే నీవు విశ్వ కార్యానికి కాలమే నీవు

సర్వం వేదాలకు భావమే నీవు నిత్యం జీవులకు తత్వమే నీవు
సత్యం జ్ఞానులకు ధర్మమే నీవు శాంతం మహాత్ములకు అర్థమే నీవు   || తల్లీ! ||

అనంత బంధాలకే దేహం నీవు జీవ రాగాలకే స్వరం నీవు
సర్వాంత రూపాలకే ప్రాణం నీవు నిత్య క్షణాలకే కాలం నీవు

పరిశోధనకే పరమాత్మం నీవు పరిశుద్ధతకే ప్రకృతం నీవు
పరమాణువుకే పర్యావరణం నీవు పరంజ్యోతికే ప్రతేజం నీవు   || తల్లీ! ||

Thursday, April 5, 2018

ఎక్కడ ఉన్నా నిన్నే తలిచెదను మాతా

ఎక్కడ ఉన్నా నిన్నే తలిచెదను మాతా
ఎలాగ ఉన్నా నిన్నే స్మరించెదను ఓ పరమాత్మ

ఏ క్షణమైనా నిన్నే పలికించెదను మాతా
ఏ కాలమైనా నిన్నే గమనించెదను ఓ పరమాత్మ

నీ శ్వాసలో నేనే ఎదిగాను నీ ధ్యాసలో నేనే ఒదిగాను
నీ భావంతో నేనే ఎదిగాను నీ తత్వంతో నేనే ఒదిగాను   || ఎక్కడ ||

ఏమని తలిచినా ఎంతని తపించినా తీరని తపనం నీ భావం
ఏదని తలిచినా ఎలాగని తపించినా తరగని తపనం నీ తత్త్వం

ప్రతి రూపంలో నీవే ప్రతి దేహంలో నీవే చలనం
ప్రతి ఉచ్చ్వాసలో నీవే ప్రతి ధ్యాసలో నీవే గమనం   || ఎక్కడ ||

నీలో నేనే ఆత్మగా ఒదిగినా నాలో నేనే మహాత్మగా ఎదిగాను
నీలో నేనే ఋషిగా ఒదిగినా నాలో నేనే మహర్షిగా ఎదిగాను

నీలో నేనే శ్వాసనై జీవిస్తున్నా నాలో నేనే ధ్యాసనై స్మరిస్తున్నా
నీలో నేనే భావమై జీవిస్తున్నా నాలో నేనే తత్వమై స్మరిస్తున్నా    || ఎక్కడ || 

ఓ దేవా! ఏనాటి ఆత్మతో ఉదయిస్తున్నావు

ఓ దేవా! ఏనాటి ఆత్మతో ఉదయిస్తున్నావు
ఓ దేవా! ఏనాటి స్వరూపంతో జన్మిస్తున్నావు

యోధుడై ఉదయించిన నీవు ఏనాడైనా మరణించెదవు 
అమరుడై జన్మించిన నీవు ఎప్పటికైనా అస్తమించెదవు 

కాలంతో ప్రయాణించే నీ ప్రతి రూపం యుగాలకు సాగని అనిత్య దేహం   || ఓ దేవా! ||

జీవితమే ఒక వేదం అది అందని అనుభవ విజ్ఞానం
జీవనమే ఒక బంధం అది చెదరని అనురాగ భావనం

జరిగినవన్నీ తలచని భావాల తలుపులకు తోరణాలు
జరిగేవన్నీ తపించని తత్వాల ఆలోచనలకు ఆనవాలు  

మహాత్ముడై ఎదిగినా మహర్షివై ఒదిగినా కాలమే గమనం   || ఓ దేవా! ||

ఎంతటి సాధన ఎంతటి ఆపేక్షణ అది అందని ఒక స్థానం
ఎంతటి వేదన ఎంతటి తాపత్రణ అది చెదరని ఒక కథనం

జీవిత కాలంలో కలిగేవన్నీ కర్పూర కాంతులు
జీవన సమయంలో వచ్చేవన్నీ మెరిసే మెరుపులు 

ధీరుడవై ఎదిగినా వీరుడవై ఒదిగినా సమయమే మననం   || ఓ దేవా! ||

తల్లీ! నీవే నా దైవం నీవే నా దేహం

తల్లీ! నీవే నా దైవం నీవే నా దేహం
తల్లీ! నీవే నా జీవం నీవే నా రూపం

నీ శ్వాసే నా గమనం నీ ధ్యాసే నా మననం   || తల్లీ! ||

నీవే నా వేదం నీవే జ్ఞానం
నీవే నా భావం నీవే నా తత్త్వం

నీవే నా సర్వం నీవే నా సత్యం 
నీవే నా నిత్యం నీవే నా శాంతం

జన్మకు నీవే మాతృదేవోభవ యోగం  
జన్మకు నీవే ఆచార్యదేవోభవ వేదం   || తల్లీ! ||

నీవే నా లోకం నీవే నా విశ్వం
నీవే నా ప్రాణం నీవే నా బంధం

నీవే నా రాగం నీవే నా గీతం
నీవే నా చరణం నీవే నా తరుణం 

జన్మకు నీవే పితృదేవోభవ భోగం 
జన్మకు నీవే ఆరాధ్యదేవభవ విజ్ఞానం   || తల్లీ! ||